Search
  • Follow NativePlanet
Share
» »ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే మన భారతీయ సంప్రదాయాలు తెలుసుకోవచ్చు

ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే మన భారతీయ సంప్రదాయాలు తెలుసుకోవచ్చు

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క ప్రాంతం సంస్కృతి సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా వాటికవే ప్రత్యేకం. ఇక ఆయా నగరాలు ఆయా ప్రాంతాల ప్రత్యేకతను కేవలం కట్టడాల్లోనే కాకుండా ప్రజల నడవడికలోనూ, అక్కడ దొరికే ఆహార పదార్థాల్లోనూ మనం చూడవచ్చు. ఇలా భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే విభిన్న నగరాలు అక్కడి పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం...

అమృత్ సర్

అమృత్ సర్

P.C: You Tube

సిక్కుల సంస్కృతి సంప్రదాయాలకు హృదయంలాంటిది అమృత్ సర్. ఈ పట్టణాన్ని గురు రామ్ దాస్ క్రీస్తుశకం 1574లో నిర్మించాడని చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సరస్సులోని నీరు అత్యంత పవిత్రమైనదని చెబుతారు.

ఇవన్నీ చూడవచ్చు

ఇవన్నీ చూడవచ్చు

P.C: You Tube

చూడదగిన ప్రాంతాల్లో గోల్డన్ టెంపుల్ ముఖ్యమైనది. దీనిని హర్ మందిర్ సాహేబ్ అని అంటారు. అదే విధంగా జలియన్ వాలా భాగ్, వాఘా సరిహద్దు కూడా చూడదగినదే. ఇక ఇక్కడ ఆహార పదార్థాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి సిక్కుల సంప్రదాయాలకు అద్దం పడుతాయి. ఉదాహరణకు అమృత్ సర్ కుల్చా, లస్సీ, చోలే బటూరా, అమృత్ సర్ ఫిష్ ముఖ్యమైనవి

రాజస్థాన్

రాజస్థాన్

P.C: You Tube

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో రాజస్థాన్ ది ప్రత్యేకమైన స్థానం. ఇక్కడి కోటలు, ప్యాలెస్ లు భారతీయ చరిత్రను మన కళ్లెదుట నిలబడేటట్టు చేస్తాయి. దాదాపు 5వేల ఏళ్లనాటి భారతీయ సంప్రదాయాలను కూడా ఈ రాజస్థాన్ లో మనం చూడవచ్చు.

ఏదో ఒక ఉత్సవం

ఏదో ఒక ఉత్సవం

P.C: You Tube

ఇక్కడ ప్రజల జీవన విధానం కూడా మనకు చరిత్రను తెలియజేస్తుందనడంలో ఆతిశయోక్తిలేదు. అమీర్ కోట, జైసల్మీర్ కోట, ఉదయ్ పూర్ సరస్సు, ఇవన్నీ చూడదగినవే. ఇక ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో ప్రతీ రోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ అక్కడి ప్రజల జీవన విధానంతో పాటు భారతీయ సంప్రదాయాలను తెలియజేస్తుంది.

ఖజురహో

ఖజురహో

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని ఖజురహో శిల్పాలు భారతీయ శిల్పకళాసౌదర్యాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా కామసూత్రాలను ఇప్పటి తరానికి తెలియజేయడానికి ఈ శిల్పాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇక్కడ మాదవ దేవాలయం, పార్శ్వనాథ్ దేవాలయం, దేవి జగదాంబ, వామన, చిత్రగుప్త, తదితర దేవాలయాను చూడాల్సిందే.

లేజర్ షో

లేజర్ షో

P.C: You Tube

అంతేకాకుండా ఇక్కడ ప్రతి రోజు సాయంకాలం జరిగే లేజర్ షోను తప్పకుండా చూడాల్సిందే. అజయ్ ఘర్ కోట, పురావస్తుశాఖ పరిశోధనాలయం తదితర ప్రదేశాలన్నింటినీ ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ భారతీయ చరిత్రకు అద్దం పట్టేవే.

కలకత్తా

కలకత్తా

P.C: You Tube

కలకత్తాను అప్పట్లో భారతీయ విద్యా రంగ రాజుగా చెప్పేవారు. ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ తన కేంద్ర కార్యాలయాన్ని కలకత్తాలో ప్రారంభించిన తర్వాత ఇక్కడి సంప్రదాయాల్లో కొంత పాశ్చాత్య శైలి మనకు కనిపిస్తుంది. ఇక ఇక్కడ విక్టోరియా మెమోరియల్, ఇండియన్ మ్యూజియం, సెయింట్ పాల్ కెథడ్రాల్ ఇవన్నీ చూడాల్సిందే.

విభిన్న ఆహార పదార్థాలు

విభిన్న ఆహార పదార్థాలు

P.C: You Tube

ఇక ఇక్కడి ఆహార పదార్థాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. ఇక కలకత్తాలో దొరికే ఆహారపదార్థాలు బెంగాలీల సంప్రదాయాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా రసగుల్లాలు, చేపల కూరలు ఇవన్నీ అక్కడి ప్రత్యేకతను తెలియజేస్తాయి.

హైదరాబాద్

హైదరాబాద్

P.C: You Tube

హైదరాబాద్ ముస్లీం, హిందూ సంప్రదయాల సమ్మిలితమని చెప్పవచ్చు. ఈ నగరాన్ని క్రీస్తుశకం 1591లో సుల్తాన్ మహ్మద్ కులి కుతుబ్ షా నిర్మింపజేశాడు. ఈ నగరం వాస్తుశైలి అటు పర్షియన్ శైలితో పాటు చాళుక్య, కాకతీయ శైలితో కూడుకొన్నది అయి ఉంటుంది.

చూడదగిన ప్రాంతాలు ఎన్నో

చూడదగిన ప్రాంతాలు ఎన్నో

P.C: You Tube

హైదరాబాద్ లో చూడదగిన ప్రాంతాలు కోకొల్లులు. గోల్కొండ కోట, ఛార్మినార్, హుస్సేన్ సాగర్, సాలార్ జంగ్ మ్యూజియం, వంటివి ఎన్నో ఉన్నయి. ఇక హైదరాబాద్ కే ప్రత్యేతక తీసుకువచ్చిన బిర్యానీ, ఇరానీ ఛాయ్ వంటివి ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ వెళ్లిన వారు తప్పకుండా బిర్యానీ తిని, ఇరానీ ఛాయ్ తాగకుండా వెనుదిరగరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X