Search
  • Follow NativePlanet
Share
» »ఊరెళ్ళే రైలు కాదు ... టూరెళ్ళే రైలు !

ఊరెళ్ళే రైలు కాదు ... టూరెళ్ళే రైలు !

చాలా మందికి విమానం ఖరీదు ఎక్కువ అనే అపోహ ఉండటం సహజం. కానీ అందుకు బిన్నంగా ఉండే ఈ రైలు ప్రయాణాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టకమానరు.

చుకుచుకు రైలు వస్తోంది ..
దూరం దూరం జరగండి ....
ఆగినక్క ఎక్కండి .....
జోజో పాప ఏడవాకు లడ్డుమిఠాయి తినిపిస్తా ...

ఇది చిన్నప్పుడు విన్నట్లు ఉంది కదూ ! రైలు ఆట ఆడేటప్పుడు ఈ పాట పాడనిదే రైలు ముందుకు కదిలేది కాదు. అదంతా గతం ఇప్పుడు అన్నీ సెల్ ఫోన్ లు, కంప్యూటర్ గేమ్ లే కదా !

భారతదేశంలో అన్నింటికన్నా చవకైన ప్రయాణం 'రైలు' అని అందరూ భావిస్తుంటారు. కానీ ఇది నాణేనికి ఒకేవైపు మాత్రమే. మరోవైపు మీరు చూడలేదు. తెలిస్తే కాలు కూడా పెట్టరేమో?! చాలా మందికి విమానం ఖరీదు ఎక్కువ అనే అపోహ ఉండటం సహజం. కానీ అందుకు బిన్నంగా ఉండే ఈ రైలు ప్రయాణాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టకమానరు. కేవలం డబ్బున్నోళ్ళు, శ్రీమంతులు మాత్రమే అడుగుపెట్టే ఆ రైళ్లు ఏవో ? ఎలా ఉంటాయో ? ఒకసారి తెలుసుకుందాం పదండి.

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రైలు మ్యూజియంలు !

ప్యాలెస్ ఆన్ వీల్స్

ప్యాలెస్ ఆన్ వీల్స్

ఇండియాలో మొదటి లగ్జరీ ట్రైన్ ఇది. ప్రపంచములోని లగ్జరీ ట్రైన్ ల లిస్ట్ లో దీనిది నాలుగోస్థానం. రాజస్థాన్ రాజపుత్ లు, గుజరాత్ రాజులు, హైదరాబాద్ నవాబులు, బ్రిటీష్ వైస్రాయి లు వాడిన రైలు బోగీల థీమ్ తో ఇంటీరియన్ ను తీర్చిదిద్దారు.

చిత్రకృప : Rainer Haeßner

బుకింగ్

బుకింగ్

రైలు ను రాజస్థాన్ పర్యాటక శాఖ - భారతీయ రైల్వే సంయుక్తంగా నడుపుతున్నది. ఇందులో 14 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీకి రాజస్థాన్లోని 14 సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. బుకింగ్ చేసుకోవాలంటే ఆర్నెల్ల ముందుగానే చేసుకోవాలి. ఈ ట్రైన్ కు విదేశీ పర్యాటకుల తాకిడి అధికం. బోగీలన్నింటికీ ఏసీ సదుపాయం కలదు.

చిత్రకృప : thepalaceonwheels

చూపించే ప్రదేశాలు

చూపించే ప్రదేశాలు

ప్రతి బుధవారం ఢిల్లీ నుండి యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రలో భాగంగా జైపూర్, జైసల్మేర్, జోద్పూర్, ఉదయపూర్, చిత్తోర్ ఘడ్, సవాయి మధోపూర్, రణతంబోర్ నేషనల్ పార్క్, భరత్పూర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా చూడవచ్చు.

చిత్రకృప : thepalaceonwheels.com

ఖర్చు

ఖర్చు

టూర్ ఖర్చు : ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు.

రోజులు : ఎనిమిది రోజుల నుండి 13 రోజుల వరకు.

అక్టోబర్ - మర్చి మధ్యలో ధరలు ఎక్కువ. మే, జూన్, జులై లో ఈ ట్రైన్ బంద్ !

చిత్రకృప : thepalaceonwheels

మహారాజా ఎక్స్ ప్రెస్

మహారాజా ఎక్స్ ప్రెస్

2010 లో ఈ ట్రైన్ ను ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టింది. భారతీయ రైల్వే, గ్లోబల్ ట్రావెల్ కంపెనీ కలిసి ట్రైన్ ను నడిపిస్తున్నారు. రైలు గదులన్నీ మహారాజుల వైభవానికి ఆధునికతను జోడించి రూపకల్పన చేశారు. ఇందులో నాలుగు ప్యాకేజీలు ప్రవేశపెట్టారు.

చిత్రకృప : Jenniferknott

ప్రిన్స్ లీ ఇండియా

ప్రిన్స్ లీ ఇండియా

ప్రతి శనివారం యాత్ర ప్రారంభం

సందర్శించే ప్రదేశాలు : ముంబై - వడోదర - ఉదయపూర్ - జోద్పూర్ - బికనేర్ - జైపూర్ - రణతంబోర్ - ఆగ్రా - ఢిల్లీ

ఖర్చు : ఒక్కొక్కరికి 2. 75 నుండి 10 లక్షల రూపాయల వరకు.

రోజులు : 8 రోజులు/ 7 రాత్రులు

చిత్రకృప : Simon Pielow

రాయల్ ఇండియా

రాయల్ ఇండియా

ప్రతి ఆదివారం యాత్ర ప్రారంభం

సందర్శించే ప్రదేశాలు : ఢిల్లీ - ఆగ్రా - రణతంబోర్ - జైపూర్ - బికనేర్ - జైపూర్ - ఉదయపూర్ - వడోదర - ముంబై

రోజులు : 8 రోజులు / 7 రాత్రులు

ఖర్చు : ఒక్కొక్కరికి 2.75 నుండి 10 లక్షల రూపాయల వరకు.

చిత్రకృప : Jenniferknott

క్లాసిక్ ఇండియా

క్లాసిక్ ఇండియా

ప్రతి ఆదివారం యాత్ర ప్రారంభం

సందర్శించే ప్రదేశాలు : ఢిల్లీ - ఆగ్రా - గ్వాలియర్ - ఖజురహో - భాంధవ్ ఘర్ - వారణాసి - లక్నో - ఢిల్లీ

రోజులు : 8 రోజులు / 9 రాత్రులు

చిత్రకృప : Aswin Krishna Poyil

రాయల్ సోజోర్న్

రాయల్ సోజోర్న్

ప్రతి ఆదివారం యాత్ర ప్రారంభం

సందర్శించే ప్రదేశాలు : ఢిల్లీ - జైపూర్ - కోట - రణతంబోర్ - ఆగ్రా - ఢిల్లీ

రోజులు : 8 రోజులు / 7 రాత్రులు

చిత్రకృప : Simon Pielow

రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్

రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్

దీనిని 2009 లో ప్రారంభించారు. రాజపుత్ ల అంతఃపురం లో కనిపించే ఇంటీరియర్ డిజైన్స్ రైలు గదులలో చూడవచ్చు. దీనిని రాజస్థాన్ పర్యాటక శాఖ నడుపుతున్నది. ఇందులో డీలక్స్ రూమ్ లు, రెసారెంట్లు, బార్ లు, ఫిట్నెస్ సెంటర్, స్పా, సెలూన్ తో పాటు ఉచిత వైఫై సదుపాయం కలదు.

చిత్రకృప : SAGAR PRADHAN

చూపించే ప్రదేశాలు

చూపించే ప్రదేశాలు

సందర్శించే ప్రదేశాలు : ప్రతి ఆదివారం యాత్ర ప్రారంభమవుతుంది.

న్యూ ఢిల్లీ - జోద్పూర్ - ఉదయపూర్ - చిత్తోర్ ఘర్ - సవాయి మధోపూర్ - జైపూర్ - ఖజురహో - వారణాసి - ఆగ్రా - న్యూ ఢిల్లీ

ఖర్చు : ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నుండి 80 వేల రూపాయాల వరకు.

రోజులు : 8 రోజులు/ 7 రాత్రులు

చిత్రకృప : Simon Pielow

ది డెక్కన్ ఒడిస్సి

ది డెక్కన్ ఒడిస్సి

ది డెక్కన్ ఒడిస్సి రైలు దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి లగ్జరీ రైలు. దీనిని మహారాష్ట్ర టూరిజం - భారత రైల్వే సంయుక్తంగా నడుపుతున్నది. ప్రకృతి, చరిత్ర మేళవింపుతో రైలు ప్రయాణం ఉంటుంది. దీనినే ఫైవ్ స్టార్ ఆన్ వీల్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో రెండు ఆఫర్లు ఉన్నాయి.

చిత్రకృప : Simon Pielow

సిల్వర్ టు ప్లాటినం క్లాస్

సిల్వర్ టు ప్లాటినం క్లాస్

సిల్వర్ టు ప్లాటినం క్లాస్ : 7 రాత్రులు / 8 రోజులు

సందర్శించే ప్రదేశాలు : ముంబై - అజంతా ఎల్లోరా గుహలు - ఉదయపూర్ - రణతంబోర్ - జైపూర్ - ఆగ్రా - న్యూ ఢిల్లీ

ఖర్చు : ఒక్కొక్కరికి 3 లక్షల నుండి 8 లక్షల వరకు

చిత్రకృప : Simon Pielow

హెరిటేజ్ ఆఫ్ మహారాష్ట్ర

హెరిటేజ్ ఆఫ్ మహారాష్ట్ర

హెరిటేజ్ ఆఫ్ మహారాష్ట్ర : 7 రాత్రులు / 8 రోజులు

సందర్శించే ప్రదేశాలు : ముంబై - సింధుదుర్గ్ - గోవా - కొల్హాపూర్ - దౌలతాబాద్ - చంద్రపూర్ - అజంతా గుహలు - నాసిక్ - ముంబై

ఖర్చు : ఒక్కొక్కరికి 40 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

చిత్రకృప : Simon Pielow

ది గోల్డెన్ చారియట్

ది గోల్డెన్ చారియట్

ది గోల్డెన్ చారియట్ రైలు కర్ణాటక, గోవా మధ్య నడుస్తుంది. దీనిని 2008 లో కర్ణాటక టూరిజం, ఇండియన్ రైల్వే కలిసి ప్రారంభించారు. ఇది కూడా రెండు ప్యాకేజీలను అందిస్తున్నది.

చిత్రకృప : Simon Pielow

ఆఫర్లు

ఆఫర్లు

ప్రైడ్ ఆఫ్ సౌత్ : బెంగళూరు నుండి యాత్ర ప్రారంభమవుతుంది

సందర్శించే ప్రదేశాలు : బెంగళూరు - మైసూర్ - హంపి - బేలూర్ - కాబిని - బాదామి - గోవా - బెంగళూరు

ఖర్చు : ఒక్కొక్కరికి 25 - 50 వేల రూపాయల వరకు

రోజులు : 7 రాత్రులు / 8 రోజులు

చిత్రకృప : Simon Pielow

ఆఫర్ -2

ఆఫర్ -2

సౌతెర్న్ స్ప్లెండర్ : బెంగళూరు నుండి యాత్ర ప్రారంభం

సందర్శించే ప్రదేశాలు : బెంగళూరు - చెన్నై- మామల్లపురం - పాండిచ్చేరి - తిరుచిరాపల్లి - తంజావూర్ - మధురై - తిరువనంతపురం - పూవర్ - కొచ్చి - కేరళ బ్యాక్ వాటర్స్

ఖర్చు : ఒక్కొక్కరికి 25 - 60 వేల రూపాయల వరకు

రోజులు : 7 రాత్రులు / 8 రోజులు

చిత్రకృప : Simon Pielow

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X