Search
  • Follow NativePlanet
Share
» » కొత్త సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి ?

కొత్త సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి ?

కొత్త సంవత్సరం వస్తోంది అనగానే ఒక పండుగ వాతావరణం వచ్చేస్తుంది. ప్రతి వారు దానికి విభిన్న రీతులలో స్వాగతం చెపుతారు. గత సంవత్సర కష్ట నష్టాలను మరచి పోవాలని చూస్తారు. కొత్త సంవత్సరం అందరూ ఏదో ఒక రీతిలో కొత్తదనంగా ప్రారంభించాలని చూస్తారు. ఇక మరికొందరు, వారికి నచ్చిన ప్రదేశాలకు వెళ్లి అక్కడ ఆ రోజంతా గడిపేస్తారు. మీరు స్టూడెంట్, ఒక ప్రొఫెషనల్, హోం మేకర్ లేదా పని లేని వారైనా సరే, బహుశా మీ కొత్త సంవత్సరం ఎంతో ఆనందంగా వుండాలని కోరతారు. మరి ఈ సమయంలో మీ పర్యటనకు నార్త్ ఇండియా లోని కొన్ని ప్రదేశాలు పరిశీలించండి.
న్యూ ఇయర్ లో నార్త్ ఇండియా టూర్

 సిమ్లా - మంచుతో ఆటలు

సిమ్లా - మంచుతో ఆటలు

సిమ్లా గురించి వినని వారు వుండరు. ఈ సమయంలో ఈ ప్రదేశం అంతా తెల్లని మంచు చే కప్పబడి వుంటుంది. కొత్త సంవత్సరంలో ఇక్కడకు వచ్చి తెల్లని, చల్లని మంచుతో ఆనందించండి. మరి కొత్త సంవత్సరం కొత్తగా మొదలు పెట్టటానికి ఇది బాగుంటుంది. సిమ్లా లో వసతి ఎక్కడ పొందాలి ? అనే దానికి మా హోటల్స్ లింక్ లో వెతకండి .

కుల్లు - మనాలి

కుల్లు - మనాలి

కుల్లు - మనాలి పర్యటనకు మించిన ఆనందం లేదు. ఈ పర్వత ప్రాంతాలు చూస్తె మీరు మానవ నిర్మిత అద్భుతాలు ప్రకృతి అద్భుతాలతో ఏ మాత్రం సరి తూగవని నమ్ముతారు. మంచి శృంగార భరిత ప్రదేశంగా కుల్లు మనాలి సరైన ఎంపిక కాగలదు

Photo Courtesy: little byte of luck

ధనౌల్తి

ధనౌల్తి

మీ లోని ఊహా చిత్రకారుడికి ఇది సరైన ప్రదేశం. మీరు కనుక మీ న్యూ ఇయర్ ను ప్రకృతి దృశ్యాల మధ్య గడపాలనుకుంటే, సిటీ లైఫ్ నుండి దూరంగా ఉండాలనుకుంటే ధనౌల్తి ఒక గొప్ప ఎంపిక. ఉత్తరాఖండ్ లోని మంచు పర్వతాలు మిమ్మల్ని ఊహల్లో విహరింప చేస్తాయి. వాటి అందాలలో మీరు మునిగి పోతారు. ధనౌల్తి లో వివిధ సైట్ సీయింగ్ ప్రదేశాలు చూసి ఆనందించండి.

Photo Courtesy: Ramakrishna Reddy

ఢిల్లీ

ఢిల్లీ

ఇండియా యొక్క ఆనందపు అంచు. మీరు కనుక దేశ సంస్కృతి, వారసత్వం, చారిత్రక గొప్పదనం వంటి భావాలు కలిగి వుంటే, కొత్త సంవత్సరంలో మన సంస్కృతికి అద్దం పట్టే, దేశ రాజధాని ఢిల్లీ కి ప్రయానించండి. మన దేశం యొక్క గొప్పతనం ఈ నగరం ఎలా చాటు తోందో చూసి ఆనందించండి.

కాశ్మీర్

కాశ్మీర్

కాశ్మీర్ చూడగానే కవిత్వం ఉప్పొంగి వస్తుంది. ఎంతో మంది కవులు కాశ్మీర్ ను వర్ణించారు. 'భూమి పైకి దిగి వచ్చిన స్వర్గం' అని అన్నారు. మరి కొత్త సంవత్సరం మొదలు పెట్టటానికి కాశ్మీర్ కంటే గొప్ప ది ఏమీ వుంటుంది. అక్కడి మంచు కొండలు ఎక్కండి. ఎన్నడూ చేయని రీతిలో న్యూ ఇయర్ ఆచరించండి. కాశ్మీర్ లో కొన్ని ప్రదేశాలు చూడండి.

Photo Courtesy: Basharat Alam Shah

నైనిటాల్

నైనిటాల్

అలరించే సరస్సుల నగరం ! నైనిటాల్ ఎన్ని సార్లు చూసినా మరోసారి చూడాలని అనిపిస్తుంది. ఇది ఒక డ్రీం సిటీ. మరి కొత్త సంవత్సరంలో మొదటి రోజుని మొదలు పెట్టటానికి మీ కొత్త మూడ్ కొరకు నైనిటాల్ సందర్శించండి. అద్భుత సరస్సుల అందాలు చూసి ఆనందించండి. ఊహల్లో విహరించండి.

Photo Courtesy: Abhishek Gaur70

కసౌలి

కసౌలి

కసౌలి పట్టణం ఒక ప్రార్థనా స్థలం వలే ప్రశాంతం గా వుంటుంది. హిమాచల్ ప్రదేశ లోని ఒక అందమైన హిల్ స్టేషన్ . మీరు ఊహించని రీతిలో కొత్త సంవత్సర అనుభవాలను మీకు ఈ హిల్ స్టేషన్ అందిస్తుంది. మీరు నగర వాసులైతే, కసౌలి పర్యటన తప్పక చేసి ఆ ప్రదేశం ఇచ్చే ఆనందాలు తప్పక అనుభవించాలి. ఎన్నో ప్రకృతి దృశ్యాలు మరెన్నో ఆనందాలు మీ కొరకు ఈ హిల్ స్టేషన్ లో ఎదురు చూస్తున్నాయి.

Photo Courtesy: Koshy Koshy

మౌంట్ అబూ

మౌంట్ అబూ

కొత్త సంవత్సరం ఆనందంగా గడిపేందుకు ఆరావళి హిల్స్ లోని అత్యధిక ఎత్తు కల శిఖరం అయిన మౌంట్ అబూ సరైన ప్రదేశం. మంత్ర ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలే కాక ఈ ప్రదేశం మీకు అనేక ఆకర్షణలు కూడా అందిస్తుంది. ఎన్నో టెంపుల్స్, శిల్ప కళా అద్భుతాలు ఇక్కడ మీరు చూడవచ్చు.

Photo Courtesy: Selmer Van Alten

జైపూర్

జైపూర్

ఈ పింక్ సిటీ లో మిమ్మల్ని మీరు మరచి పొండి. ఈ సిటీ ని ప్రతి పర్యాటకుడు జీవితంలో ఒక్కసారైనా సరే సందర్సిస్తాడు. ఎన్నో కోటలు, రాజ భవనాలు, స్మారకాలు, మతపర ప్రదేశాలతో జైపూర్ ప్రతిధ్వనిస్తూ వుంటుంది. అబ్బుర పరచే రాజస్తాన్ సంస్కృతి మిమ్మల్ని స్వాగతిస్తుంది. కనుక ఈ కొత్త సంవత్సరంలో జైపూర్ పట్టణం చూడండి.
Photo Courtesy: Xiquinho Silva

ఉదయపూర్

ఉదయపూర్

ఉదయపూర్ ఒక రంగుల చిత్రం వలే వుంటుంది. జైపూర్ పింక్ రంగులో వుంటే, ఉదయపూర్ రంగు రంగులు గా వుంటుంది. రొమాంటిక్ సిటీ గా పేరు పడ్డ ఈ నగర అందాలు మీకు సంవత్సరం అంతా కన్నుల ముందు మెదులుతూనే వుంటాయి. ఎన్నో కోట లు, పాలస్ లు , టెంపుల్స్, సరస్సులు తో ఉదయపూర్ మీ కొత్త సంవత్సర ఆనందాలను రెట్టింపు చేస్తున్దనటం లో సందేహం లేదు.

Photo Courtesy: Arian Zwegers

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X