Search
  • Follow NativePlanet
Share
» »కొల్లం పర్యాటక ప్రదేశాలు

కొల్లం పర్యాటక ప్రదేశాలు

ఈ వర్షాకాలంలో కేరళ లోని కొల్లం బ్యాక్ వాటర్స్ కు వెళ్లి ఒక హౌస్ బోటు లో మీ ప్రియమైన వారితో కలసి విహరిస్తే ఆ అనుభూతులు మరువలేనివిగా వుంటాయి.

కొల్లం ను క్విలాన్ అని కూడా అంటారు. ఇది అష్టముడి సరస్సు యొక్క కోస్తా తీర పట్టణం. కొల్లం పట్టణం పర్యాటకులను స్వాగతించే అందమైన పట్టణమే కాదు. ఇక్కడ నుండి జీడిపప్పు ఎగుమతులు అనేక ప్రపంచ దేశాలకు చేస్తూ వుంటారు. కనుక దీనిని జీడిపప్పు నగరం అని కూడా అంటారు.

కొల్లం బీచ్, తన్గాస్సేరి బీచ్, తిరుముల్లవరం బీచ్, అష్టముడి బ్యాక్ వాటర్స్, మున్రో మొదలైనవి కొన్ని చూడదగిన ప్రదేశాలు. కనుక పూర్తి విశ్రాంతిని ఇచ్చే కొల్లం పట్టణ సందర్శనకు సంసిద్ధం అవండి.

కొల్లం హోటల్ వసతులకు క్లిక్ చేయండి

కొల్లం ఎలా చేరాలి ?

కొల్లం ఎలా చేరాలి ?

కొల్లం లో ఎయిర్ పోర్ట్ లేదు. సమీప విమానాశ్రయం తిరువనంతపురం లో సుమారు 70 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ నుండి అన్ని ప్రధాన నగరాలకు విమాన సేవలు కలవు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లో తేలికగా కొల్లం చేరవచ్చు. కొల్లం రైలు స్టేషన్, బెంగుళూరు, చెన్నై, ముంబై మరియు న్యూ ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు కలుపబడి వుంది. ఇక రోడ్డు మార్గంలో కొల్లం చేరాలంటే, కొల్లం మూడు ప్రధాన నేషనల్ హై వే లతో అనుసంధానించబడి వుంది. ఇరుగు పొరుగు పట్టణాలనుండి బస్సు లు తరచుగా నడుస్తాయి.

Photo Courtesy: Dhruvaraj S

అమృతపురి

అమృతపురి

కొల్లాం కి 30 కి.మి. దూరం లోని వల్లికావు ప్రాంతం లో ఏర్పడ్డ మత పరమైన యాత్రాకేంద్రం అమృతపురి. మాతా అమృతానందమయి జన్మ స్థలమైన వల్లికావు అనేది మత్స్యకారుల తో నిండిన ఒక చిన్న అందమైన గ్రామం. మాతా అమృతానందమయి ఆశ్రమం ఏర్పడ్డాక ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందింది. మాతా అమృతానందమయి కి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. కొల్లాం కి, అమృతపురి కి మధ్య పడవ ప్రయాణం చేస్తూ సందర్శకులు జల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ప్రాంతానికి రావడానికి కొచ్చి, తిరువనంతపురం ల నుంచి బస్సు సౌకర్యం ఉంది. మాతా అమృతానందమయి పేరు మీద ఏర్పడ్డ అమృతపురి క్యాంపస్ లో విద్యా సంస్థలు, రీసెర్చ్ కేంద్రాలు, ఛారిటీ హాస్పిటల్, పోస్టాఫీస్, కేంటీన్, బుక్ షాప్ తదితర సౌకర్యాలు కలిగి కొన్ని ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది.

Photo Courtesy: Mahesh Mahajan

అష్టముడి బ్యాక్ వాటర్స్

అష్టముడి బ్యాక్ వాటర్స్


ప్రకృతి అందాల్ని అతి సమీపం నుంచి సందర్శించే అవకాశాన్ని అష్టముడి సరస్సు పర్యాటకులకి ఇస్తుంది. రాష్ట్రం లోని అతిపెద్ద మంచినీటి సరస్సు అష్టముడి. పరివాహకం లో ఏర్పడ్డ ఈ కయ్యి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ సరస్సు లో విహారం, ఊగిసలాడే కొబ్బరి చెట్ల మధ్య, ఇంపైన తాటి చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

Photo Courtesy: Kerala Tourism

కొల్లం బీచ్

కొల్లం బీచ్

మహాత్మా గాంధి బీచ్ అని కూడా పిలవబడే ఈ బీచ్ ఇసుక తీరాలు చూసి తీరాల్సినవి. కొల్లాం నగర కేంద్రానికి 2 కి.మి దూరం లోని కోచుపిలమూడు దగ్గర ఈ బీచ్ ఉంది. బీచ్ ని ఆనుకుని ఉన్న మహాత్మా గాంధి పార్క్ కూడ సందర్శకులు సేదదీరడానికి అనువైన ప్రదేశంగా ఉంది. సూర్య కిరణాలు తాకుతున్న ఆ తీరాలు, తాటి చెట్లు, మిలమిల మెరిసే ఇసక రేణువులతో కూడిన మనోహరమైన ఈ బీచ్, పార్క్ సందర్శకులుని అకట్టుకుంటాయి. సందర్శుకలు సాయంత్రం వేళ లో ఇక్కడికి వచ్చి పునరుత్తేజం పొందుతారు. ప్రశాంతంగా, నిర్మలంగా ఉండే ఈ బీచ్ పరిసర ప్రాంతాలు ఒక చక్కటి హాలిడే స్పాట్ అవుతాయి. చక్కటి బడ్జెట్ లోనే వచ్చే హోటల్స్, రిసార్ట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. బీచ్ కూడా ఈదటానికీ, స్నానం చేయడానికీ అనువుగానే ఉంటుంది. రోజువారీ అలసట అంతా తీసివేసి శరీరాన్ని చక్కటి శక్తి తో నింపడానికి ఈ బీచ్ లో సాయంత్రం గడపటం పర్యాటకులకి అలవాటు.
Photo Courtesy: jay8085

మయ్యనాడ్

మయ్యనాడ్

కొల్లాం కి 10 కి.మి. దూరం లో ఉన్న చిన్న సుందరమైన గ్రామమిది. కొల్లాం నుంచీ, కొట్టాయం నుంచీ బస్సు సౌకర్యం కలిగిన ఈ చిన్న గ్రామం పరవూర్ సరస్సు దగ్గర్లో ఉంది. ఈ గ్రామంలో అరేబియా సముద్రానికి సమాంతరంగా గల పొడవాటి తీర ప్రాంతం చేపలు పట్టడం వంటి సముద్ర కార్యకలాపాలకి ప్రసిద్ది.

Photo Courtesy: Girish...

మున్రో ద్వీపం

మున్రో ద్వీపం

కొల్లాం కి 27 కి.మి. దూరం లో ఉన్న ఈ ద్వీపానికి రోడ్డు ద్వారా లేక నీటి ద్వార వెళ్ళొచ్చు. స్థానికంగా మున్రో తురు అని పిలుచుకునే ఈ మున్రో ద్వీపం నిజానికి 8 చిన్న ద్వీపాల సముదాయం. ఇక్కడ కాలువలు నిర్మించి, నీటి ప్రయాణానికి వీలుగా కయ్యి నీటిని అనుసంధానం చేసిన కల్నల్ జాన్ మున్రో అనే బ్రిటిష్ అధికారి కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. Photo Courtesy: DhanushSKB

ఒయాచిర

ఒయాచిర

ఒయాచిర, అలప్పుజా మరియు కొల్లం జిల్లాల సరిహద్దులో కల ఈ చిన్న టవున్ లో అనేక పురాతన దేవాలయాలు, చారిత్రక స్మారకాలు కలవు. వీటిలో ఒయాచిర టెంపుల్ ప్రసిద్ధి చెందినది. దీనినే పర బ్రహ్మ టెంపుల్ అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో ఒయాచిర ముస్లిం మసీదు కూడా కలదు. ఈ మసీదు అతి పురాతనమైనది. చారిత్రక విలువలు కూడా కలవు. Photo Courtesy: Fotokannan|Kannanshanmugam

సస్థం కొట్ట సరస్సు

సస్థం కొట్ట సరస్సు

కొల్లాం కి 25 కి.మి. దూరం లో ఉన్న ఈ మంచి నీటి సరస్సు దృశ్య పరమైన సౌందర్యం వల్లా, పడవ ప్రయాణ సౌకర్యాల వల్లా పర్యాటకులని ఆకర్షిస్తోంది. ఈ సరస్సు ఒడ్డున ఉన్న "సాస్థ" దేవుడి గుడి కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. కొల్లాం ప్రాంతానికి త్రాగునీటి వసతిని, మత్స్యకారులకి ఉపాధిని ఈ సరస్సు కల్పిస్తోంది.

తన్గాస్సేరి బీచ్

తన్గాస్సేరి బీచ్

తంగ సేరి బీచ్ కొల్లం కు 5 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ఇసుక బీచ్ లో పోర్చుగీస్ కోట అవశేషాలు కూడా కలవు. పర్యాటకులకు ఈ ప్రదేశం పూర్తి విశారాన్తినిస్తుంది. బీచ్ లో కల లైట్ హౌస్ ఒక ప్రధాన ఆకర్షణ. బీచ్ లో సూరాస్తామయం చాలా అందంగా వుంటుంది. బీచ్ లో అనేక నీటి క్రీడలు ఆచరిన్చవచ్చు .

తిరుముల్లవరం బీచ్

తిరుముల్లవరం బీచ్

కొల్లాం కి 6 కి.మి. దూరం లో వాణిజ్య కార్యకలాపాల గోల ఏమీ లేకుండా ప్రశాంతంగా అందమైన ఇసుక తీరాలతో కూడిన తిరుముల్లవరం బీచ్ లో నీళ్ళు అంత లోతు గా లేకపోవడం వల్ల ఇది ఈదటానికీ, కుటుంబ విహార యాత్రలకి, బాగా అనువైన ప్రదేశం. ప్రత్యేకించి చిన్న పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. సందర్శకులు కూడా ఈ ప్రాంతం లో పరిసరాలని వీక్షిస్తూ చక్కగా ఆనందిస్తారు. ఇతరప్రాంతాలకి దూరంగా ఉన్న ఈ బీచ్ నగరాల్లోని గందరగోళం, రోజువారీ అలసటకి దూరంగా వెళ్ళాలనుకునేవాళ్ళకి సరైన ప్రదేశం. ఈ బీచ్ కి దగ్గర్లోని విష్ణువు గుడి కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. న్యారళ్చ పార అనే ఒక ప్రసిద్ద రాయి ఇక్కడ ఉంది.

Photo Courtesy: Pratheesh Prakash

కొల్లం ఇతర ఆకర్షణలు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X