Search
  • Follow NativePlanet
Share
» »నార్త్ ఇండియా - జూన్ పర్యటన

నార్త్ ఇండియా - జూన్ పర్యటన

ఈ వర్షాకాలం ఎక్కడకు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా ? నార్త్ ఇడియా లో మీర్ రిలాక్స్ అయి లేదా పూర్తిగా ఆనందించే ప్రదేశాలు కొన్ని కలవు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరా ఖండ్ వంటివి ఎన్నో కలవు.

వీటిలో కొన్ని ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు గలవి కాగా మరికొన్ని సాహసిక యువకులకు ట్రెక్కింగ్, మౌన్తైనీరింగ్ వంటివి ఆనందింప చేస్తాయి. వీటి పట్ల ఆసక్తి లేని వారు ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించవచ్చు.

ఈ ప్రదేశాలు జూన్ నెలలో మీకు అద్భుత ఆకర్షణలు గా వుంటాయి. కనుక మీ లగేజ్ సర్దేసి ఉత్తర భారత దేశ పర్యటనకు జూన్ నెలలో రెడీ అవండి.

అనంతనాగ్

అనంతనాగ్

అనంతనాగ్ జిల్లాను &కాశ్మీర్ పట్టణానికి వాణిజ్య రాజధాని గా చెపుతారు. ఈ పట్టణం కాశ్మీర్ కు నైరుతి భాగంలో కలదు. ఈ ప్రదేశం కాశ్మీర్ లో బాగా అభి వృద్ధి చెందిన ప్రదేశం . క్రి. పూ. 5000 సంవత్సరాల నాటికే ఈ ప్రాంతం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన ప్రదేశం గా గుర్తించబడి పట్టణ నాగరికతలు విలసిల్లాయి. ఈ పట్టణం చుట్టూ శ్రీనగర్, కార్గిల్ ,పుల్వామా, దోడ మరియు కిష్టవార్ వంటి వివిధ నగరాలు కలవు.

బారాముల్లా

బారాముల్లా

కాశ్మీరు లో గల 22 జిల్లాలలో బారాముల్లా ఒకటి. 4190 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ జిల్లాని 8 తాలుకాలు 16 పంచాయితీలుగా విభజించారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు యొక్క పశ్చిమ భాగం ఈ జిల్లా కి ఒక సరిహద్దు. ఈ జిల్లాకి తూర్పు దిక్కున శ్రీనగర్, లడఖ్ లున్నాయి. కుప్వార పట్టణానికి దక్షిణాన, పూంచ్ మరియు బడ్గాంకి ఉత్తర దిక్కులో బారాముల్ల ఉంది.ఈ పురాతన నగరం క్రీ.పూ.2306 లో భీంసీన రాజా వారిచే స్థాపించబడినది. ఈ ప్రదేశాన్ని మొఘలు చక్రవర్తి అక్బర్ క్రీ.శ. 1508 లో దర్శించాడు.

Photo Courtesy: Aehsaan

ద్రాస్

ద్రాస్

బింబట్ యుద్ధ స్మృతి చిహ్నం అని కూడా పిలవబడే ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం ద్రాస్ పట్టణ ప్రధాన ఆకర్షణ. నగర కేంద్ర భాగానికి "టైగర్ హిల్" కి మీదుగా 5 కిమీ దూరంలో ఉన్న స్మృతి చిహ్నం, కార్గిల్ యుద్ధ అమరవీరులను జ్ఞప్తికి తెస్తుంది. స్మారక చిహ్నం యొక్క ముఖద్వారం మీద చెక్కబడిన, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తండ్రి, హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన పద్యం, సందర్శకులను పలకరిస్తుంది. స్మృతి చిహ్నం గోడపై చెక్కబడి ఉన్న, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లను సందర్శకులు చదవవచ్చు.

Photo Courtesy: Rohan

గుల్మార్గ్

గుల్మార్గ్

ఒకప్పుడు గుల్మార్గ్ ప్రదేశం రాజులు, మహారాజులకు వేసవి విడిది ప్రదేశంగా వుండేది. అయితే, సుమారుగా 1985 ల నుండి కాశ్మీర్ ప్రాంతంలోని ఈ భూభాగం ఒక పర్యాటక ఆకర్షణగా రూపు దిద్దుకుంటోంది. గుల్మార్గ్ అందాల సందర్శనకు కాశ్మీర్ కు వచ్చే పర్యాటకులు లేకపోలేదు. కొద్ది సంవత్సరాలు గడిచే సరికి సాహస క్రీడలు ఆచరించే వారికి ఇది ఒక ప్రధాన ప్రదేశంగా రూపు దిద్దుకొంది. పెద్దవైన పర్వత శ్రేణుల మధ్య స్కై ఇంగ్ ఒక ప్రధాన క్రీడగా మారింది. ఒక్కసారి హిమాలయాలలోని ఈ మంచు ప్రాంతాలు సందర్శిస్తే, ఇక అక్కడ నుండి దూరం అవటం అసాధ్యం. ప్రపంచం నలుమూలలనుండి, పర్యాటకులు ఈ ప్రదేశానికి వచ్చి, వారి ఆనందాలు అధికం చేసుకుంటారు.
Photo Courtesy: Geetanjali J

హేమీస్

హేమీస్

జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో హేమీస్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. లెహ్ కు ఆగ్నేయం గా ఇది సుమారు 40 కి. మీ. ల దూరంలో కలదు. హేమీస్ మొనాస్టరీ లేదా గొంప ఇక్కడ ఒక గొప్ప ఆకర్షణ. ఈ మొనాస్టరీ లో కల బుద్ధుడి రాగి విగ్రహం బాగా ఆకర్షిస్తుంది. మొనాస్టరీ గోడలపై బౌద్ధ మత సంబంధిత అంశాలు చక్కగా చిత్రీకరించబడ్డాయి.

Photo Courtesy: Michael Douglas Bramwell

కార్గిల్

కార్గిల్

కార్గిల్ , జమ్మూ కాశ్మీర్ ప్రాంహంలోని లడఖ్ లో ఒక జిల్లా. బౌద్ధ మత ఆరామాలకు, బౌద్ధ మత అంశాలకు ప్రసిద్ధి చెందినా పట్టణం. మైత్రేయ బుద్ధ లేదా ఫ్యూచర్ బుద్ధ లేదా లాఫింగ్ బుధ విగ్రహం ఇక్కడ కల ముళ్ బెఖ్ మొనాస్టరీ లో ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ఆరామం ఒక కొండపై కలదు. దీనిలో 9 మీ. ల ఎత్తు కల బుద్ధుడి విగ్రహం ఒక ప్రత్యేకత.

Photo Courtesy: Corto Maltese 1999

కాశ్మీర్

కాశ్మీర్

హిమాలయాల ఒడిలో కల కాశ్మీర్ దేశంలో అందరికి తెలిసిన ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి గాంచినది. స్వచ్చమైన నీలి నీరు, పర్వతాలు, సరస్సులు, ఆహ్లాదక ర వాతావరణం కాశ్మీర్ లోయ యొక్క ప్రధాన అంశాలు. ఇక్కడ ఆపిల్ మరియు చెర్రి తోటలు కలవు. ఈ ప్రదేశంలో షికారా రైడ్ లు, గొందోలా రైడ్ లు, హౌస్ బోటు లు, కాశ్మీరి హస్త కళల వస్తువులు ప్రసిద్ధి.

Photo Courtesy: Sudesh Nayak

 లడఖ్

లడఖ్

సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనికి "ఆఖరి శాంగ్రి లా" ( ది లాస్ట్ శాంగ్రి లా) , " చిట్టి టిబెట్" ( లిటిల్ టిబెట్), " చంద్ర ప్రదేశం" ( ది మూన్ ల్యాండ్), " విరిగిన చంద్రుడు" ( ది బ్రోకెన్ మూన్) అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రధాన నగరం లెహ్ కాకుండా, ఇక్కడికి సమీపంలో అల్చి, నుబ్రా లోయ, హేమిస్, లమయురు, జంస్కర్ లోయ, కార్గిల్, పంగోంగ్ త్సో, త్శో కర్, త్సో మొరిరి లాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు, ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు.

Photo Courtesy: T. R. Shankar Raman

లెహ్

లెహ్

సింధు నది ఒడ్డున, హిమాలయ, కరకోరం పర్వత శ్రేణుల మధ్య నెలకొని వుంది లెహ్ నగరం. ఈ నగరం అందం దేశం నలుమూలల నుంచి యాత్రికులను ఏడాది పొడవునా ఆకర్షిస్తుంది. 16, 17 శతాబ్దాల నాటి మసీదులు, బౌద్ధారామాలతో నగరంలోని ప్రధాన భాగం నిండి వుంటుంది. మధ్య యుగాల నాటి నిర్మాణ శైలిలో నిర్మించబడి నాంగ్యాల్ వంశ రాజు సేంగ్గే నాంగ్యాల్ నివసించిన ప్రాచీన తొమ్మిది అంతస్తుల ప్రాసాదం ఈ నగరంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.

Photo Courtesy: Aman Gupta

పంగోంగ్

పంగోంగ్

పంగోంగ్ సరస్సు హిమాలయ పర్వతాలలో కల ఈ సరస్సు ఎప్పటికి నీరు కలిగి వుంటుంది. ఈ నీటిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయని చెపుతారు. చలికాలం వచ్చిందంటే చాలు, ఈ సరసు నీరు ఘనీభవిస్తుంది.ఈ సరస్సు సముద్ర మట్టానికి 4350 మీ. ల ఎత్తున కలదు.

సర్చు

సర్చు


సర్చు ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ , లడఖ్ లకు ఒక సరిహద్దు ప్రాంతం. జన్స్కార్ ప్రాంతం కు వెళ్ళాలంటే ఇది ఒక ట్రెక్కింగ్ బేస్

Photo Courtesy: Mahuasarkar25

సోనామార్గ

సోనామార్గ


సోనామార్గ్ లో ట్రెక్కింగ్, హైకింగ్ వంటి క్రీడలు ఆచరించవచ్చు. అనేక సరస్సులు, పర్వతాలతో అద్భుతంగా వుంటుంది. అమరనాథ్ వెళ్ళే యాత్రికులకు ఇది బేస్ ప్రదేశం.

Photo Courtesy: Geetanjali J

శ్రీనగర్

శ్రీనగర్


శ్రీనగర్ ను భూమిపై కల స్వర్గం అంటారు. ఇది జీలం నది ఒడ్డున కలదు. అందమైన సరస్సులు, హౌస్ బోటు లు, అనేక మొఘల్ గార్డెన్ లు ఇక్కడ కలవు.

Photo Courtesy: Geetanjali J

బారోగ్

బారోగ్


బారోగ్ హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ జిల్లాలో కలదు. ఇది ప్రసిద్ధి చెందినా పర్యాటక ప్రదేశం. ఇక్కడ దేవాలయాలు, సరస్సులు, ఆరామాలు కలద్వు. ఇక్కడ శోలోని దేవి టెంపుల్ ప్రసిద్ధి.

Photo Courtesy: Fred Hsu

బీర్

బీర్


బీర్ హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక సంస్థలు కలవు. పారా గ్లైడింగ్ కి ప్రసిద్ధి. దీనిని ఇండియా పారా గ్లైడింగ్ రాజధాని అంటారు. ప్రతి సంవత్సరం పారా గ్లైడింగ్ లో పోటీలు నిర్వహిస్తారు.

చైల్

చైల్


చైల్ ఒక అందమైన హిల్ స్టేషన్. హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ జిల్లాలో కలదు. ఇక్కడ వివిధ రకాల జంతువులతో కూడిన ఒక వైల్డ్ లైఫ్ సాన్క్చురి, కలదు. అనేక ఔషధ మొక్కలకు కూడా ఈ ప్రదేశం ప్రసిద్ధి. Photo Courtesy: Vinish K Saini

డల్హౌసీ

డల్హౌసీ


హిమాచల్ ప్రదేశ్ లోని ధౌళాధర్ పర్వత శ్రేణులలో కల డల్హౌసీ ఒక అందమైన హిల్ స్టేషన్. డల్హౌసీ లో అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. Photo Courtesy: Sonusandhu

కల్ప

కల్ప


కల్ప హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో కల ఒక చిన్న విలేజ్. హిమాలయాల సమీపంలో కల సట్లేజ్ నది ఒడ్డున కల ఒక అందమైన గ్రామం. కల్ప లో కిన్నౌర్ కైలాష్ మౌంటెన్ ప్రసిద్ధి. ఇక్కడి శివలింగం సుమారు 70 మీ. ల ఎత్తున ఒక శిఖరం పై వుంది అనేక మంది భక్తులను, పర్యాటకులను సంవత్సరం పొడవునా ఆకర్షిస్తుంది.

Photo Courtesy: snotch

కాంగ్రా

కాంగ్రా


కాంగ్రా ప్రదేశం రెండు నదుల సంగమంలో హిమాచల్ ప్రదేశ్ లో కలదు. ఇక్కడ కరేరి సరస్సు, బాగల్ ముఖి టెంపుల్, కాళేశ్వర్ మహాదేవ టెంపుల్ ప్రసిద్ధి.

Photo Courtesy: Dinakarr

కసౌలి

కసౌలి


హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కసౌలి ఒక హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి సుమారు 1800 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం గురించి రామాయణ కావ్యం లో కూడా పేర్కొనబడింది. పురాణాల మేరకు, హిందువుల అర్రధ్య దైవం హనుమంతుడు ఈ ప్రదేశం పై సంజీవని హిల్ తీసుకు వచ్చేటపుడు మధ్యలో అడుగు పెట్టాడని చెపుతారు. ఈ ప్రదేశానికి ఈ పేరు అక్కడ కల ఒక జలపాతం కారణంగా వచ్చింది. ఈ జలపాతం కౌసల్య అనే పేరు తో జాబలి మరియు కసౌలి ల మధ్య కలదు.

Photo Courtesy: Varun Kutty

కుఫ్రి

కుఫ్రి


కుఫ్రి 2743 మీటర్ల ఎత్తులో ఉండి సిమ్లా నుండి 13 కి.మీ. దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం.ఈ ప్రదేశంనకు స్థానిక భాషలో 'సరస్సు' అనే అర్థం వచ్చే 'కుఫ్ర్' అనే పేరు నుండి వచ్చింది. ఇక్కడ అనేక ఆకర్షణలు ఉండుట వల్ల సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తారు.

కుళ్ళు

కుళ్ళు


దేవతల లోయ' గా పిలువబడే కులు హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన జిల్లా. ఒకప్పుడు దేవీ దేవతలకు, ఆత్మజ్ఞానులకు ఆవాసంగా వుండడం వల్ల ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. బియాస్ నది ఒడ్డున సముద్ర మట్టానికి 1230 మీటర్ల ఎత్తున వుండే ఈ ప్రాంతం చుట్టూ అందమైన ప్రాకృతిక పరిసరాలు వుంటాయి.

‘భూమి మీది చిట్ట చివరి ప్రాంతం' అని అర్ధం వచ్చేలా దీన్ని ‘కుల-అంతి-పీఠం' అనే వారు - దీని ప్రస్తావన మహాభారతం, రామాయణం, విష్ణు పురాణాల్లో కూడా వుంది. త్రిపుర కు చెందిన బెహంగమణి పటేల్ స్థాపించిన ఈ అందమైన పర్వత ప్రాంతానికి 1 వ శతాబ్దం నాటి చరిత్ర వుంది. 1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దాకా ఈ ప్రాంతం చేరుకోవడం కష్టంగా ఉండేదని చెప్తారు.


Photo Courtesy: John Hill

కీలాంగ్

కీలాంగ్

‘ఆశ్రమ భూమి'గా పిలువబడే కీలాంగ్ - హిమాచల్ ప్రదేశ్ లో సముద్ర మట్టానికి 3350 మీటర్ల ఎత్తున నెలకొని వున్న అందమైన పర్యాటక ఆకర్షణ. లాహౌల్-స్పితి జిల్లాకు ప్రధాన కేంద్రం గా వ్యవహరించే కీలాంగ్ లో చాలా పర్యాటక ఆకర్షణలు వున్నాయి. ‘ఖచ్చితంగా ఇక్కడ దేవతలుంటారు - ఇక్కడ మనుషులకు స్థానం లేద'ని ప్రసిద్ధ రచయిత రడ్యార్డ్ కిప్లింగ్ అన్నాడు. ఉల్లాసపరిచే పురాతన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి లోయలు నిజంగా ఉత్కంఠభరితంగా వుంటాయి.
చారిత్రిక ప్రాధాన్యం కలిగి, ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో వుండే బౌద్ధారామాలు చూసే అవకాశం కల్పిస్తుంది కీలాంగ్. కార్దంగ్ విహారం, షసుర్ విహారం ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందాయి. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తున 900 ఏళ్ళ నాడు ఏర్పడింది కార్దంగ్ విహారం. షసుర్ విహారాన్ని భూటాన్ లోని నావంగ్ నాంగ్యాల్ మహారాజు వద్ద పనిచేసే బౌద్ధ గురువు జాన్స్కార్ కు చెందిన లామా దేవా గ్యాత్షో ఈ విహారాన్ని 17వ వ శతాబ్దంలో నిర్మించాడు. గురు ఘంటాల్ విహారం, తాయుల్ విహారం, గేముర్ విహారం ఇక్కడి ఇతర ప్రసిద్ధ విహారాలు.

Photo Courtesy: Peter Krimbacher Moebius1

లాహౌల్

లాహౌల్


ఇండియా కి, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో లాహౌల్ వుంది. లాహౌల్, స్పితి అనే రెండు వేర్వేరు జిల్లాలు, పర్వత ప్రాంతాలు 1960లో కలపబడి లాహౌల్ & స్పితి అనే ఒకే జిల్లాగా ఏర్పడ్డాయి. ఇక్కడి వారు తెల్లటి మేని ఛాయతో, తేనె రంగు కళ్ళతో ఇండో-ఆర్యన్, టిబెటన్ జాతికి చెందిన వారు. ఎక్కువ మంది భౌద్దాన్ని అనుసరిస్తూ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. లడఖ్, టిబెట్ లో లాంటి భాషనే ఇక్కడా మాట్లాడతారు. విహారాలపై రెపరెపలాడే ప్రార్ధనా జండాలు ఈ ప్రాంతానికి ముఖ్య చిహ్నాలు. ఈ విహారాలన్నీ ఇక్కడి ప్రజల ధార్మిక ధోరణిని ప్రతిబింబిస్తాయి.
Photo Courtesy: Nvvchar

మనాలి

మనాలి


సముద్రమట్టం నుండి 1950 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్న మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో నే ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి. కులూ జిల్లాలో భాగమైన మనాలి, రాష్ట్ర రాజధాని షిమ్లా నుండి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది. సృష్టి కర్త బ్రహ్మ దేవుడిచేత నియమింపబడిన ధర్మ శాస్త్ర విధాయకుడు పేరు మను. ఆ పేరు నుండి ఈ ప్రాంతానికి మనాలి అని పేరు వచ్చిందని పురాణాలూ చెబుతున్నాయి. సృష్టి మరియు నాశనం యొక్క ఏడు చక్రాలు పూర్తయిన తరువాత ఈ ప్రాంతానికి మను విచ్చేసాడని నమ్ముతారు. హిందూ మతానికి సంబంధించిన సప్త ఋషులు తల క్రిందులుగా తపస్సు చేసే ప్రాంతంగా మనాలి ప్రసిద్ది.

Photo Courtesy: Iapain

మండి

మండి


మండి ని వారాణాసి కొండలు అని కూడా అంటారు. మండి హిమాచల్ ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన జిల్లా. ఇక్కడ సుమారు 300 కు పైగా రాతి టెంపుల్స్ కలవు. శివ మరియు కాళి టెంపుల్స్ అధికం. పంచవక్త్రా టెంపుల్, అర్ధనారీస్వర్ టెంపుల్, త్రిలోకనాత్ టెంపుల్ ఇక్కడ ప్రసిద్ధి.

Photo Courtesy: Ritpr9

మణికరణ్

మణికరణ్


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు నుంచి 45కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1737 మీటర్ల ఎత్తున వున్న మణికరణ్ హిందువులకు, సిక్కులకు పవిత్ర తీర్థ క్షేత్రం. మణికరణ్ అనేది ఒక అభరణాన్ని సూచిస్తుంది. ఒక ఇతిహాసం ప్రకారం లయకారకుడైన శివుడి భార్య పార్వతి ఒక జలాశయంలో తన విలువైన ఆభరణాన్ని కోల్పోయింది. పార్వతి శివుడిని ఆ నగ వెతికి పెట్టమని అడుగగా, ఆయన ప్రమదగణాలను దాని కోసం వెదకమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు దాన్ని వెదకలేకపోవడంతో ఆగ్రహోదగ్రుడై మూడో కన్ను తెరిచాడు. దీంతో భూమి మీద అల్లకల్లోలం చెలరేగి అసంఖ్యాకమైన రత్నాలు, మణులు ఏర్పడ్డాయి.
Photo Courtesy: Aman Gupta

అల్మోర

అల్మోర

అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తున వుంది చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. క్రి. శ. 15 మరియు 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్ మరియు కాత్యూర్ వంశాలు పరి పాలించాయి.పర్యాటకులు హిమాలయాల యొక్క మంచు తో నిండిన శిఖరాలను అల్మోర కొండలనుండి చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం ప్రపచంత వ్యాప్తంగా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాసర్ దేవి టెంపుల్, నందా దేవి టెంపుల్, చితి టెంపుల్, కాతర్మాల్ సన్ టెంపుల్ వంటివి ఇక్కడ కల కొన్ని మతపర క్షేత్రాలు. .ఇక్కడ కల ప్రాచీనమైన నందా దేవి టెంపుల్ ను కుమావొనీ శిల్ప శైలి లో నిర్మించారు. ఈ టెంపుల్ లో చాంద్ వంశం పూజించిన దేవత కలదు. ప్రతి సంవత్సరం భక్తులతో దేవాలయం కిట కిట లాడుతుంది. ఇక్కడే మరొక టెంపుల్ కాసర్ దేవి టెంపుల్ కూడా అల్మోర కు 5 కి.మీ.ల దూరం లో కలదు. ఈ టెంపుల్ ను 2 వ శతాబ్దం లో నిర్మించారు. స్వామి వివేకానంద తన తపస్సు ను ఇక్కడ చేసారని చెపుతారు.

photo courtesy : solarshakthi

ధనౌల్తి

ధనౌల్తి

ధనౌల్తి సముద్ర మట్టం నుండి 2286 మీటర్ల ఎత్తులో ఉన్న ధనౌల్తి ఉత్తరాఖండ్ లో ని గర్హ్వాల్ జిల్లాలో ఉంది. ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం కలిగిన ఈ ప్రాంతం చంబా నుండి ముసోరి వెళ్ళే మార్గం లో ఉంది. ముస్సొరి కి కేవలం 24 కిలో మీటర్ల దూరం లో ఉన్నందువల్ల ఈ ప్రాంతం పర్యాటకుల లో అమితం గా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతం నుండి మంత్రముగ్ధుల్నిచేసే డూం వాలీ యొక్క అందాలను పర్యాటకులు తిలకించవచ్చు.చుట్టూ దేవదారు వృక్షాలు కలిగిన ఎకో పార్క్ ఈ ధనౌల్తి లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. పర్యాటకులకు బస చేసే అవకాశాన్ని కల్పించే వివిధ ఎకో హట్స్(పర్యావరణ కుటిరాలు) ని ముస్సోరీ ఫారెస్ట్ డిపార్టుమెంటు అభివృద్ధి చేసింది. వీటితో పాటు, ఈ ప్రాంతం బంగాళా దుంప పంట కి ప్రాచుర్యం చెందినది కావడం వల్ల "ఆలూ ఖేట్" గా ప్రసిద్ది చెందింది.

గంగోత్రి,

గంగోత్రి,

గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున ఉన్నది. గంగోత్రి 'చార్ ధామ్' మరియు 'దో ధామ్' ఈ రెండిటి యొక్క పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం, గంగా దేవత భగీరథ రాజు, అతని పూర్వీకుల పాపాలను కడిగివేయటానికి నది రూపంలో వొచ్చింది. దీనినే గంగ నది అని పిలుస్తున్నారు. గంగ యొక్క ప్రవాహవేగ ఒరవడి భూమి కొట్టుకుపోకుండా, శివుడు అతని శిఖలో గంగను బంధించాడు. గంగా నది లేదా గాంజెస్ యొక్క మూలం,గంగోత్రి నుండి 19 కి. మీ. దూరంలో ఉన్న గౌముఖ్ . గంగానది ఆవిర్భవించినప్పుడు, దీనిని 'భగీరథి' అని కూడా పిలిచేవారు. Photo Courtesy: Debapratim Chattopadhyay

గోముఖ్

గోముఖ్


గోముఖ్ గంగోత్రి హిమానీనదం యొక్క ముగింపుకు గుర్తుగా ఉన్న అందమైన ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉంది. ఈ స్థలం కష్టతరమైన ఆరోహణ బాటలకు ప్రసిద్ధి చెందిన శివ లింగం శిఖరం సమీపంలో ఉంది. గంగా నది యొక్క ముఖ్య ఉపనది భాగీరథి నది గోముఖ్ వద్ద పుట్టింది. ఈ స్థలం తపోవనం పచ్చికబయలుకి దగ్గరలో ఉంది. ఇది సందర్శకులను తన సహజ సౌందర్యంతో ముగ్దులను చేస్తుంది.

పర్యాటకులు గోముఖ్ లో అనేక పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు. గంగోత్రి హిమానీనదం వాటిలో ప్రముఖమైనది. ఇది హిమాలయ ప్రాంతం యొక్క అతిపెద్ద హిమానీనదాలలో ఒకటి. ఇది శివ లింగం, తలయ సాగర్, మేరు మరియు భాగీరథి III అనే మంచుతో కప్పబడిన శిఖరాలతో చుట్టబడి ఉంది. హిమానీనదం యొక్క చివరి భాగం ఆవు నోరుని పోలి ఉండటం వల్ల, ఈ స్థలం గోముఖ్ (ఆవు నోరు అని అర్థం) అని పిలవబడుతుంది.

Photo Courtesy: Atarax42

కల్సి

కల్సి

ఉత్తరాకండ్ లోని డెహ్రాడున్ జిల్లా లో సముద్ర మట్టానికి 780 మీ ఎత్తు లో ఉన్న ఒక అందమైన పర్యాటక ప్రదేశం కల్సి. యమునా నది మరియు తొన్స్ నది కలిసే చోట ఉన్నటువంటి జున్సర్ - బావర్ ట్రైబల్ రీజియన్ కి ముఖ ద్వారం గా పనిచేస్తుంది . పురాతన శిధిలాలకు , సాహాస క్రీడలకు మరియు పిక్నిక్ లకు ప్రఖ్యాతి పొందిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. చారిత్రిక ప్రాముఖ్యత గల అశోకుని రాతి శాసనం ఇక్కడి ముఖ్య ఆకర్షనలలో ఒకటి . 253 క్రీ.పూ లో మౌర్య రాజు అయిన అశోకుని 14 వ శాసనం. ప్రాకృత బాష లో పాళీ లిపి లో ఉన్న ఈ శాసనం రాజు యొక్క సంస్కరణలు మరియు సలాహాలను సూచిస్తుంది . 10 అడుగుల ఎత్తు , 8 అడుగుల వెడల్పులో ఈ శాసనం ఉంటుంది .

Photo Courtesy: "Nipun Sohanlal"

కేదార్నాథ్

కేదార్నాథ్

కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది.ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో గర్హ్వాల్ హిమాలయాలలో ఉంది. హిందూమతం వారు పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. కేదార్నాథ్ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైనది. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ పుణ్య క్షేత్రమును శివ ఆశీర్వాదం పొందడం కోసం వేసవిలో ఎక్కువగా పర్యాటకులు వస్తారు. 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం దీర్ఘ చతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. భక్తులు ఈ పుణ్యక్షేత్రం నకు వెళ్ళే మెట్లపై పాలి భాషలో రాసిన శాసనాలు చూడవచ్చు. సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ను చేరుకోవటం అన్ని చార్‌ ధామ్‌ పుణ్యక్షేత్రాల కన్నా కష్టతరమైనది. ఈ ఆలయం కేవలం వేసవిలో 6 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాంతం నివాసానికి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. శీతాకాలంలో భారీ మంచు వర్షం ఉండుట వల్ల ఈ పుణ్యక్షేత్రంను మూసివేస్తారు.

Photo Courtesy: Geetanjali J

ముస్సూరీ

ముస్సూరీ


ముస్సూరీ ని సాధారణంగా 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలుస్తారు.ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు. ఇది గొప్పవైన హిమాలయాల కిందిభాగం లో సముద్ర మట్టానికి సుమారు 1880 మీటర్ల ఎత్తున కలదు. ఈప్రదేశం అక్కడ కల శివాలిక్ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు మరియు దూన్ వాలీ కి ప్రసిద్ధి గాంచినది. మత పర ప్రదేశాలైన యమునోత్రి మరియు గంగోత్రి లకు ముస్సూరీ ఒక గేటు వే గా కూడా చెప్పబడుతోంది. ముస్సూరీ అనే పేరు 'మాన్సూర్ ' అనే ఒక ఔషధ మూలిక నుండి ఏర్పడింది. ఈ ఔషధ మొక్క ఇక్కడ పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడ కల సాధారణ ప్రజలు సాధారణంగా ఈ ప్రదేశాన్ని 'మాన్సూరి' అని అంటారు.

Photo Courtesy: Rameshng

రాణిఖెట్

రాణిఖెట్


రాణిఖెట్ ను ఎక్కువగా 'క్వీన్స్ మేడో' అని పిలుస్తారు. ఇది అల్మోరా నగరంలో ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఒక జానపద కధ ప్రకారం,కుమవోన్ ప్రాంతం యొక్క అందమైన రాణి పద్మిని రాణిఖెట్ సందర్శించి ఈ ప్రాంత సౌందర్యాన్ని చూసి ముగ్డురాలు అయింది. అందువలన, ఆమె భర్త రాజు సుఖేర్దేవ్ ఈ ప్రదేశంలో ప్యాలెస్ నిర్మించి మరియు దానికి 'రాణిఖెట్' అని పేరు పెట్టారు. ఈ ప్యాలెస్ గురించి పురావస్తు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కధలో ఉన్న రాణిఖెట్ ఇప్పటికీ సజీవంగా ఉన్నది.బ్రిటిష్ వారు 1869 లో ఈ స్థలాన్ని తిరిగి కనుగొని మరియు దానిని వేసవి విడిదిగా మార్చారు.
Photo Courtesy: Thetomcruise

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X