Search
  • Follow NativePlanet
Share
» »సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతం - తవాంగ్ !!

సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతం - తవాంగ్ !!

అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య ప్రాంతంలో వున్న తవాంగ్ . బౌద్ధమత ప్రాంతం. ఇక్కడ పడే మంచు హిమపాతం పర్యాటకులకు అద్భుత ఆనందాలు కలిగిస్తుంది. ఈ ప్రదేశానికి టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా వస్తూనే వుంటారు.అరుణాచల్‌ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీంతో ఈ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలకు ఆలవాలంగా వెలుగొందుతోంది.

"త" అంటే గుర్రం అని, "వాంగ్" అంటే ఎంపిక అని అర్ధం. తవాంగ్‌ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్‌లో టిబెటన్ల సంఖ్య ఎక్కువ. టిబెటన్లు ఎప్పుడూ ఇక్కడ ప్రార్ధనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులవుతారు. ప్రశాంతమైన నీటి సరస్సులు, నదులు, ఆకాశంలో నీలంరంగును ప్రతిబింబింప చేసే అనేక ఎత్తైన జలపాతాలు, కొన్నిసార్లు మేఘాలు భార౦గా తేలుతున్నట్లు సందర్శకులకు మంత్రముగ్ధుల్ని చేసే అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతిని ఆనందించాలి అనుకునే నిజమైన ప్రేమికులను ఈ రహస్య స్వర్గం స్వాగతిస్తుంది. ఇక్కడ 27 అడుగుల ఎత్తు కల బంగారు బుద్ధ విగ్రహం కలదు.

తవాంగ్ వసతుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తవాంగ్‌ యుద్ధ స్మారకం...

తవాంగ్‌ యుద్ధ స్మారకం...

భారత-చైనాల మధ్య 1962లో జరిగిన యుద్ధంలో చైనా సైనికులను ఒంటరిగా పోరాడిన భారతీయ సైనికుడి వీరమరణం పొందిన చోట స్మారకాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ స్మారకం సీలా పాస్‌లోని జశ్వంత్‌ఘర్‌లో ఉంది.

Photo Courtesy: Kunaldalui

తవాంగ్‌ ఆశ్రమం...

తవాంగ్‌ ఆశ్రమం...

బౌద్ధమతంలో మహాయాన వర్గం వారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. లాసా తర్వాత అతి ప్రాచీన ఆశ్రమం తవాంగ్‌లో మాత్రమే ఉంది. తవాంగ్‌ ఆశ్రమాన్ని మెరాగ్‌ లామా లోడ్రీ గిమాస్ట్సో నిర్మించారు. ఆశ్రమం పక్కనే బౌద్ధ సన్యాసులు నివసించేందుకు వీలుగా వసతి గృహాలు ఏర్పాటుచేశారు. తవాంగ్‌ ఆశ్రమంలో ప్రాచీన గ్రంధాలయంతో పాటుగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. దాదాపు 500 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించేది తవాంగ్‌ ఆశ్రమం. రాత్రిపూట తవాంగ్‌ ఆశ్రమాన్ని విద్యుదీప కాంతులతో చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆశ్రమంలో లోపల 8 మీటర్లు ఎత్తైన బౌద్ధ విగ్రహం ఉంది. లాసాలోని పోతలా ఆశ్రమం తర్వాత అతిపెద్దది తవాంగ్‌ ఆశ్రమం.

Photo Courtesy: telugu nativeplanet

ఉర్గెలింగ్‌ ఆశ్రమం...

ఉర్గెలింగ్‌ ఆశ్రమం...

ఆరవ దలైలామా ఉర్గెలింగ్‌ ఆశ్రమంలో పుట్టాడని బౌద్ధులు భావిస్తారు. ఈ ఆశ్రమం 14వ శతాబ్దం నుంచి ఉందని బౌద్ధులు అంటుంటారు. తవాంగ్‌ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉర్గెలింగ్‌ ఆశ్రమం ఉంది.

Photo Courtesy: Giridhar Appaji Nag Y

తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం...

తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం...

చైనా సరిహద్దు వద్ద ఉన్నది తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాంగ్‌ బౌద్ధ మఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడే 6వ దలైలామా జన్మించినాడు.

Photo Courtesy: telugu Nativeplanet

తవాంగ్‌ మఠము

తవాంగ్‌ మఠము

ఒకప్పుడు తవాంగ్‌ మఠము ప్రాంతాన్ని ఈశాన్య సరిహద్దు ఏజెన్సీగా పిలిచేవారు. తవాంగ్‌ మఠం సముద్రమట్టానికి 3500 మీటర్లు ఎగువన 400 సంవత్సరాలు క్రితం ఏర్పడింది. దలైలామాకు చెందిన మహాయాన బౌద్ధంలోని గాలుపా వర్గానికి చెందిన అనుబంధం తవాంగ్‌. ఇందులో 700 మంది సన్యాసులు నివశించవచ్చు. ఈ మఠంలో బుద్ధుని అవశేషాలు కూడా ఉన్నాయని ప్రతీతి. మఠానికి అనుబంధంగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. ఇందులో ప్రాచీన తాళపత్ర గ్రంధాలు మరియు విలువైన పురాతన వస్తువులు వంటివి ఉన్నాయి.

Photo Courtesy: Debasish Bouri

ఎలా చేరుకోవాలి...

ఎలా చేరుకోవాలి...

విమాన మార్గం: తేజ్‌పూర్‌ విమానాశ్రయం (320 కి.మీ)

రైలు మార్గం: రంగపార సమీపంలో రైల్వే స్టేషన్‌. ఈ మార్గంలో మీటర్‌ గేజి రైళ్లు రంగియా నుంచి నడుస్తాయి. రంగియా-గౌహతిల మధ్య దూరం 60 కిలోమీటర్లు.

రహదారి మార్గం: తేజ్‌పూర్‌ (320 కి.మీ.), బొమిడిలా (185 కి.మీ.), దిరాంగ్‌ (143 కి.మీ.). తేజ్‌పూర్‌ నుంచి తవాంగ్‌కు చేరుకోవటానికి 13 గంటల సమయం పడుతుంది. తవాంగ్‌కు వెళ్లే మార్గంలో 14వేల అడుగుల ఎత్తున ఉన్న సీలా పాస్‌ అందాలను తనివితీరా చూడవచ్చు.

Photo Courtesy: telugu native planet

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X