Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఆలయాల సంపద ఎంతో తెలుసా ?

ఈ ఆలయాల సంపద ఎంతో తెలుసా ?

ఇండియన్ బిలినియర్స్ కంటే ఎక్కువ డబ్బున్న ఆలయాలు !!

భారతదేశం దేవాలయాలకు పుట్టినిల్లు. ఇక్కడ కుల, మత, జాతి, వర్ణ బేధం లేకుండా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి గొప్ప చరిత్రగల దేశంలో దేవాలయాలకు కొదువలేదు. ఇక్కడున్న అనేక కట్టడాలు, రాజప్రసాదాలు, కోటలు మరియు గత కాలము యొక్క దేవాలయాలు భారతదేశం యొక్క గత వైభవాలను గుర్తుతెస్తుంది. భారతదేశంలో ప్రయాణీకులు గర్వంగా తలెత్తుకొని దేవాలయాలను సందర్శించవచ్చు.

ప్రస్తుతం ఇక్కడ చెబుతున్న ఆలయాలు చాలా పురాతనమైనవి మరియు చారిత్రక రహస్యాలు గలవి. ఇవి అప్పటికాలంలో కట్టించినా కూడా భారతదేశంలో శక్తివంతమైన ఆలయాలుగా మరియు అప్పటి సాంప్రదాయాలు, సంస్కృతులకు గుర్తులుగా ఉన్నాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతి ఆలయం ధనిక ఆలయాలుగా ముద్రపడ్డవి.

Holi Offer: Flat 60% concession on Hotels Booking at Goibibo

శ్రీ పద్మనాభస్వామి దేవాలయం

శ్రీ పద్మనాభస్వామి దేవాలయం

తిరువనంతాపురం యొక్క గుండె అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయం వైష్ణవ ఆలయంగా ప్రశస్తి చెందింది. ఈ ఆలయం నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడైతే వార్తల్లో నిలిచిందో అప్పుడునుంచి ఈ ఆలయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ఆలయాన్ని ట్రావన్ కోర్ వంశస్థులచే నిర్వహించబడుతుంది. ఈ దేవాలయాన్ని ద్రావిడ శైలిలో చాలా అందంగా రూపొందించారు. ఇక్కడ ఆలయంలో పద్మనాభస్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ మందిరం నుండే ఈ నగరానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆలయంలో విష్ణువు పక్కన శ్రీదేవి మరియు భూదేవిలు ఉంటారు. ఈ ఆలయ బంగారు విగ్రహాలు, బంగారు, పురాతన వెండి, వజ్రాలు, పచ్చలు మరియు ఇత్తడి 90,000 కోట్లు విలువ చేస్తాయి. మీరు తిరువంతపురం వద్ద ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తే తప్పనిసరి.

Photo Courtesy: Bijoy Mohan

తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం

తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి. ఈ దేవాలయం దేశంలోకెల్లా ఖరీదైన ఆలయంగా ప్రసిద్ది చెందింది. శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

Photo Courtesy: Ashok Prabhakaran

షిర్డీ సాయిబాబా దేవాలయం

షిర్డీ సాయిబాబా దేవాలయం

ప్రపంచంలో ఉన్న సాయిబాబా దేవాలయాలలో ఈ దేవాలయం చాలా ప్రసిద్ది చెందింది. భారత దేశం లో 1922 వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయం ముంబై కి సుమారుగా 300 కి. మీ. దూరంలో ఉన్నది అంతే కాదు ఇది ఒక అందమైన కట్టడం. మతాలకు , కులాలకు అతీతంగా ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు రోజువారీ సందర్శనకై వస్తుంటారు. మీకు తెలుసా?? ఇది దేశంలో కెల్లా మూడవ సంపన్న ఆలయం. సాయిబాబా ఉన్న ఈ పవిత్ర భూమిని సందర్శించడానికి భక్తులేకాక పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో రావడానికి ఎగబడతారు.

Photo Courtesy: ~Beekeeper~

సిద్దివినాయక దేవాలయం

సిద్దివినాయక దేవాలయం

ఇది ఒక వినాయకుడి మందిరం. సుమారుగా 1900 సంవత్సరం నుండి హిందూ భక్తులు, పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు. ఒకప్పుడు చిన్న ఇటుకల నిర్మాణంగా ఉండే ఈ దేవాలయం, ఇపుడు ముంబై నగరంలో అత్యంత ధనవంతమైన దేవాలయంగా మారింది. ఎంతోమందిని ఆకర్షిస్తోంది. మీరు ఇక్కడకు సరైన రోజులలో, సరైన సమయాలలో చేరాలి. లేదంటే, పొడవాటి క్యూలలో నిలబడి గంటల తరబడి మీ సమయం అంతా ఇక్కడ వెళ్ళబుచ్చాల్సిందే. దేవాలయ శిల్పం తీరు మరియు యాత్రికుల నిర్వహణ వంటివి పేర్కొనదగిన అంశాలు. ముంబై లోని ఇతర ప్రధాన పర్యాటక కేంద్రాలు అయిన వర్లి సీ ఫేస్ మరియు హాజీ ఆలీ జ్యూస్ సెంటర్లకు ఈ మందిరం దగ్గరగానే కలదు.

Photo Courtesy: Borayin Maitreya Larios

గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్ ను శ్రీ హరమందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు దీనిని సందర్శిస్తారు. అమృత్‌సర్ లో కల ఈ ప్రదేశం 16 వ శతాబ్దంలో అయిదవ సిక్కు గురు గురు అర్జన్ దేవ్ జి నిర్మించారు. 19వ శతాబ్దపు మొదటి భాగంలో మహారాజ రంజిత్ సింగ్ గురుద్వారా యొక్క పై అంతస్తులను 400 కేజి ల బంగారుతో పూత వేశారు కనుక దీనిని ఇంగ్లీష్ లో గోల్డెన్ టెంపుల్ అంటారు. ఈ దేవాలయం అమృత్‌సర్ అనబడే సరోవరంలో తేలుతూ వుంటుంది. ఈ టెంపుల్ లో సిక్కుల పవిత్ర గ్రంధం అయిన ఆది గ్రంధం ఉంచుతారు. దీనిని ప్రతి రోజూ ఉదయం చదువుతారు. సరస్సు లోని ఒక వంతెన ద్వారా దీనిని చేరాలి. సాంప్రదాయ దుస్తులు ధరించిన రక్షక భటులు దీనిని కావలి కాస్తూ వుంటారు.

Photo Courtesy: Giridhar Appaji Nag Y

వైష్ణో దేవి ఆలయం

వైష్ణో దేవి ఆలయం

వైష్ణో దేవి ఆలయం కాశ్మీర్‌లో ఉన్నది. ఇది దేశంలో ఉన్న పురాతన ఆలయాలలో ఒకటి. సంవత్సరానికి సుమారుగా 4.5 మిలియన్ల కంటే ఎక్కువగానే యాత్రికులు సందర్శిస్తుంటారు. సంవత్సరానికి ఈ ఆలయ ఆదాయం 500 కోట్లు.

Photo Courtesy: Nikhilchandra81

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X