Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు నుండి అద్భుతమైన రోడ్ ట్రిప్ ప్రయాణాలు !

బెంగళూరు నుండి అద్భుతమైన రోడ్ ట్రిప్ ప్రయాణాలు !

By Mohammad

ఒకప్పటి 'గార్డెన్ ఆఫ్ సిటీ' నేడు 'సిలికాన్ సిటీ' గా మారిపోయింది. అలాగే ఇక్కడి ప్రజల జీవనవిధానమూ ... మారిపోయింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు, పరిశ్రమల పుణ్యమా అని ప్రజలు తమ తమ కార్యక్రమాలలో, పనుల్లో బిజీగా గడుపుతున్నారు. మరి వారికి బ్రేక్ దొరికేది శని, ఆదివారాలే. ఈ రెండు రోజులు వారు వారంలో చేసిన పని ఒత్తిడిల నుండి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఒక ప్రయత్నమే జర్నీలు (రోడ్డు ప్రయాణాలు) !

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి తిరుపతికి రోడ్ ట్రిప్ జర్ని !

బెంగళూరు నగరం చుట్టూ చూసొచ్చే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. మీరు ఈ ప్రదేశాలకు బైక్ లేదా సొంత వాహనాల్లో స్నేహితులతో కలిసి ప్రయాణించవచ్చు. వీటిలో కొన్ని ప్రదేశాలకు బెంగళూరు నగరం నుండి గంట లేదా రెండుగంటల్లో చేరుకోవచ్చు. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నపుడు మీరు వివిధ రకాలుగా వస్తుధారణ కలిగిన ప్రజలను, వారి జీవన స్థితిగతులను, ప్రకృతి అందాలనూ, కొండలను మొదలైనవి చూడవచ్చు. నోరూరించే రుచికరమైన భోజనాలనూ కడుపునిండా తినొచ్చు. ఇక బెంగళూరు నుండి అద్భుతమైన రోడ్ ట్రిప్ ప్రయాణాలు చేస్తూ చూసొచ్చే ఆ ప్రదేశాలు ఒకసారి గమనిస్తే ...

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి హోగెనక్కల్ జలపాతానికి వన్ డే రోడ్ ట్రిప్ !

నంది హిల్స్

నంది హిల్స్

దూరం : 62 కి. మీ.
సందర్శించు సమయం : సంవత్సరంలో ఎప్పుడైనా

ఉదయాన్నే లేచి స్నానం చేసి బెంగళూరు నుండి నంది హిల్స్ కి ప్రయాణం మొదలు పెట్టడం ఒక మధురానుభూతి. నంది హిల్స్ బెంగళూరు సమీపంలోని ఒక హిల్ స్టేషన్. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం వ్యూ లు అద్భుతంగా ఉంటాయి.

రూట్ : బెంగళూరు - దేవనహళ్ళి - నంది హిల్స్

ఇది కూడా చదవండి : బెంగళూరు - నంది హిల్స్ - లేపాక్షి వన్ డే రోడ్ ట్రిప్ జర్ని!

చిత్ర కృప : Rambled musings

మైసూరు

మైసూరు

దూరం : 180 కి.మీ.
సందర్శించు సమయం : సంవత్సరంలో ఎప్పుడైనా

బెంగళూరు నగరం నుండి వారాంతపు విహార స్థలం మైసూరు. ఇక్కడ చూసే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో మైసూర్ మహారాజ ప్యాలెస్, చాముండి దేవాలయం ముఖ్యమైనవి. బెంగళూరు నుండి మైసూర్ వెళ్లేటప్పుడు లేదా వచ్చేటప్పుడు శ్రీరంగపట్నం చూడటం మరిచిపోవద్దు. అలాగే ఒకరోజు గడపాలనుకొనేవారు దగ్గరలోని బృందావనం గార్డెన్ తప్పక చూడండి.

రూట్ : బెంగళూరు - మాండ్య - మైసూరు

ఇది కూడా చదవండి : మైసూర్ లోని మంచి హోటల్ వసతులు !

చిత్ర కృప : Navaneeth KN

బండిపూర్

బండిపూర్

దూరం : 219 కి. మీ.
సందర్శించు సమయం : నవంబర్ - ఫిబ్రవరి మధ్యలో

వైల్డ్ లైఫ్ పర్యాటకం లో ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్క్ బండిపూర్ నేషనల్ పార్క్. బెంగళూరు నుండి బండిపూర్ వరకు చేసే సుందరమైన డ్రైవ్ అక్కడికి చేరుకొనేసరికి ఒక్కసారిగా ఉత్తేజితంగా మారిపోతుంది కారణం అక్కడున్న రిజర్వ్ ఫారెస్ట్. అదే అక్కడి ప్రధాన ఆకర్షణ. బండిపూర్ లో ఒకరోజు గడపాలనుకొనేవారు అక్కడి జంగల్ రిసార్ట్ లలో బస చేయవచ్చు.

రూట్ : బెంగళూరు - మండ్యా - మైసూరు - బండిపూర్

ఇది కూడా చదవండి : బెంగళూరు చుట్టూప్రక్కల గల 25 ట్రెక్కింగ్ ప్రదేశాలు !

చిత్ర కృప : Ravi Jandhyala

స్కందగిరి

స్కందగిరి

దూరం : 65 కి. మీ.
సందర్శించు సమయం : అక్టోబర్ నుండి మార్చి వరకు

స్కందగిరి బెంగళూరు సమీపంలో ఉన్న ఒక ఉత్తమమైన, సూచించదగిన ట్రెక్కింగ్ ప్రదేశం. ఇది చిక్బల్లాపూర్ వద్ద గల ఒక గ్రామంలో ఉన్నది. శిఖరం పై నుండి ప్రదేశ అందాలు, రోడ్డు మలుపులు ఆసక్తిని కలిగిస్తాయి. ఇక్కడ రాత్రిపూట కూడా ట్రెక్కింగ్ చేయవచ్చు.

రూట్ : బెంగళూరు - ఎన్ హెచ్ 7( హైదరాబాద్ - బెంగళూరు హైవే)

చిత్ర కృప : kalyan kanuri

మాసినగుడి

మాసినగుడి

దూరం : 235 కి. మీ.
సందర్శించు సమయం : నవంబర్ నుండి ఫిబ్రవరి

బండిపూర్ మరియు మడుమలై జాతీయ పార్క్ లకు సమీపంలో ఉన్న మరొక నేషనల్ పార్క్ మానసిగుడి వైల్డ్ లైఫ్ రిజర్వ్. బెంగళూరు నుండి మానసిగుడి కి వెళ్లే మార్గం కాస్త కష్టంగా మరియు అడ్వేంచరస్ గా ఉంటుంది. ప్రయాణం మొత్తం మీద 36 హేర్ పిన్ వంపులు ఉన్నాయి. ఇది కూడా బెంగళూరు నుండి చేసే రోడ్డు ప్రయాణాల్లో సూచించదగినది.

రూట్ : బెంగళూరు - మైసూరు - బండిపూర్ - మానసిగుడి

ఇది కూడా చదవండి : కర్ణాటకలో వన్య జంతు అభయారణ్యాలు !

చిత్ర కృప : Alosh Bennett

మేకేదాటు

మేకేదాటు

దూరం : 150 కి. మీ.
సందర్శించు సమయం : అక్టోబర్ నుండి ఫిబ్రవరి

మేకేదాటు రాళ్ళ దిబ్బల ప్రదేశం. కావేరి నది ప్రవాహం ఈ రాళ్ళ వద్ద చీలిపోతుంది. ఇది కూడా బెంగళూరు నుండి సూచించదగిన ఒక వారాంతపు విహారం. సంగమ అనే ప్రదేశం మేకేదాటు కు చేరువలో ఉన్నది. అక్కడ అర్కావతి నది కావేరి నదిలో కలుస్తుంది. శివ సముద్ర జలపాతం కూడా సమీపంలోనే ఉంది.

రూట్ : బెంగళూరు - కనకపుర - మేకేదాటు

ఇది కూడా చదవండి : శివ సముద్రం - కావేరి నది రెండుగా చీలే ప్రదేశం !!

చిత్ర కృప : Nagarjun Kandukuru

కూర్గ్

కూర్గ్

దూరం : 280 కి. మీ.
సందర్శించు సమయం : మాన్సూన్ తప్పనిచ్చి మిగితా అన్ని కాలాల్లో

కూర్గ్ కర్నాటక రాష్ట్రంలో బాగా పాపులరైన హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ హనీమూన్ జంటల కేంద్రంగా ఖ్యాతి గడించింది. పశ్చిమ కనుమలు, జలపాతాలు, కాఫీ తోటలు ఈ ప్రదేశ అందాల్ని మరింత పెంచాయి. బెంగళూరు నుండి కూర్గ్ కి వయా సకలేశ్పూర్ మీదుగా ప్రయాణం సూచించదగినదే ..!

రూట్ : బెంగళూరు - హున్సూర్ - బైలకుప్పే - కుషాల్నగర - కూర్గ్

ఇది కూడా చదవండి : సొంత ఇంటిని తలపించే హోంస్టే : పుష్పాంజలి !!

చిత్ర కృప : kiran kumar

ముత్తతి

ముత్తతి

దూరం : 100 కి. మీ.
సందర్శించు సమయం : నవంబర్ నుండి మార్చి వరకు

ముత్తతి వద్ద కావేరి నది ప్రవాహంలో నావలో ప్రయాణించి చేపలను పట్టడం ఒక అనుభూతి. పట్టిన చేపలను మరలా అక్కడే వదిలేయాలి. ట్రెక్కింగ్ చేసే వారికి ఈ ప్రదేశం స్వర్గంలా అనిపిస్తుంది. దగ్గరిలోని భీమేశ్వరి వరకు ట్రెక్కింగ్ చేయటం సూచించదగినదే ..! భీమేశ్వరి వద్ద ట్రెక్కింగ్ మరియు ఫిషింగ్ వంటి సాహస క్రీడలను, వినోద కార్యక్రమాలను చేపట్టవచ్చు. రాత్రి పూట నది ఒడ్డున గుడారాల్లో బస చేయటం థ్రిల్లింగ్ గా ఉంటుంది.

రూట్ : బెంగళూరు - సతనూరు - ముత్తతి

ఇది కూడా చదవండి : బెంగళూరు సమీపంలోని ఫిషింగ్ మరియు నేచర్ క్యాంప్ లు !

చిత్ర కృప : Ashwin Kumar

ఊటీ

ఊటీ

దూరం : 300 కి. మీ
సందర్శించు సమయం : వర్షాకాలం తప్పనిచ్చి మిగితా అన్ని సమయాల్లో

ఊటీ తమిళనాడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రఖ్యాతి చెందిన హిల్ స్టేషన్. దీని గురించి అందరికీ తెలిసిందే. ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ప్రశాంతతను గడీపేయటమే మీ పని. బెంగళూరు నుండి ఊటీ కి రోడ్డు ప్రయాణం ఆధ్యాంతం ఉల్లసభరితంగా, ఉత్సాహంగా ఉంటుంది.

రూట్ : బెంగళూరు - మైసూరు - మానసిగుడి - ఊటీ

ఇది కూడా చదవండి : బెంగుళూరు నుండి ఊటీ రోడ్డు ప్రయాణంలో...!

చిత్ర కృప : Dibesh Thakuri

బి ఆర్ హిల్స్

బి ఆర్ హిల్స్

దూరం : 190 కి. మీ.
సందర్శించు సమయం : జూన్ - అక్టోబర్

బిలగిరి రంగన్న కొండలు (బి ఆర్ హిల్స్) అక్కడి బిలగిరి రంగనాథ స్వామి ఆలయానికి మరియు వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ కి నిలయంగా ఉంది. ఇది బెంగళూరు నుండి సూచించదగిన ఉత్తమ రోడ్డు మార్గం. ప్రశాంతత కోరుకొనే వారు ఇక్కడి కొండల్లో ట్రెక్కింగ్ లేదా నడక చేసినా సరిపోతుంది. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఒకేసారి ఇక్కడి నుండి చూడవచ్చు.

రూట్ : బెంగళూరు - మాలవల్లి - బి ఆర్ హిల్స్

ఇది కూడా చదవండి : బిఆర్ హిల్స్ - కొండల నడుమ ప్రశాంతత !!

చిత్ర కృప : Vijay S

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

బెంగళూరు నుండి కొడైకెనాల్ రోడ్ ట్రిప్ జర్ని !

బెంగళూరు నుండి గోవా రోడ్ ట్రిప్ జర్ని !

బెంగళూరు నుండి శివగంగ వన్ డే రోడ్ ట్రిప్ జర్ని !

చిత్ర కృప : trip india

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X