Search
  • Follow NativePlanet
Share
» »రుషికేష్ లో ఇలా చేస్తే పాపపు కూపంలో పడుతారు...జాగ్రత్త

రుషికేష్ లో ఇలా చేస్తే పాపపు కూపంలో పడుతారు...జాగ్రత్త

పరమ పవిత్రమైన రుషికేష్ పుణ్యక్షేత్రం గురించి

By Kishore

భారత దేశంలో అనేక పుణ్యక్షేత్రాల్లో రుషికేష్ కూడా ఒకటి. ఉత్తరాఖండ్ లో గంగానది తీరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా చార్ దామ్ సమయంలో ఇక్కడ భక్తులు విపరీతంగా ఉంటారు. ఇది కేవలం ధార్మిక క్షేత్రమే కాకుండా ఉత్తరాఖండ్ లో ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. ఇక్కడ ఇటీవలే రివర్ రాఫ్టింగ్ వంటి సాహస క్రీడలు ఊపందుకొన్నాయి. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి కూడా ఎక్కువ సంఖ్యలో పర్యాటకుల తాకిడి ఈ రుషికేష్ కు ఎక్కువయ్యింది. కారణం ఏమైనా గతంతో పొలిస్తే ఇక్కడ పర్యాటకుల సంఖ్య పెరిగిందన్నది వాస్తవం. ఇక భక్తులు కొన్ని పనులు చేయక పోవడం వల్ల పాపం మూటగట్టకోరని చెబుతారు. అదే అడ్వెంచర్ స్పోర్ట్స్ కోసం వచ్చే పర్యాటకులు కూడా ఇక్కడ కొన్ని పనులు చేయక పోవడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారవుతారని చెబుతుంటారు. ఆ వివరాలన్నీ మీ కోసం

ఇక్కడి దేవత సర్పదోషం నివారించి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది....ఇక్కడి దేవత సర్పదోషం నివారించి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది....

1. మద్యపానం అసలు చేయకూడదు

1. మద్యపానం అసలు చేయకూడదు

Image Source:

ఉత్తరాఖండ్ లోని రుషికేష్ కు దేవభూమి అని పేరు. ఇక్కడ మద్యం పానాన్ని అపవిత్రమైన కార్యంగా భావిస్తారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కూడదు. అంతే కాకుండా రెస్టోరెంట్లలో కూడా మద్యపానం అమ్మకాలు నిషిద్ధం. ఒక వేళ రిషికేష్ లో మద్యపానం చేస్తే పాపం చుట్టు కొంటుందని నమ్మకం. అసలు మద్యపానం అన్నది రాక్షసులు తాగే పదార్థమని పరమ పవిత్రమైన రుషికేష్ లో ఆ పదార్థాన్ని తాగకూడదని ఇక్కడి పూజారులు చెెబుతుంటారు. మద్య పానం అలవాటు ఉన్నవారు కనీసం రుషికేష్ లో ఉన్న సమయంలోనైనా దాని జోలికి వెళ్లకూడదనేది వారి సూచన.

2. మాంసాహార సేవనం కూడదు

2. మాంసాహార సేవనం కూడదు

Image Source:

రుషికేష్ ఒక ధార్మిక ప్రాంతం. ఇక్కడ అనేక మంది బుుషులు, సాధువులు తమస్సు చేసుకొంటుంటారు. అంతేకాకుండా ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ముక్కోటి దేవతలు నివశిస్తూ ఉంటారని చెబుతారు. అందువల్లే ఇక్కడ మాంసాహార సేవనం నిషిద్ధం. ఇక్కడ కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న హోటల్స్ కూడా చాలా వరకూ శాఖాహారాన్ని మాత్రమే అదిస్తాయి.

3. రామలక్ష్మణ వంతెన పై ఆహారం తీసుకెళ్లకండి

3. రామలక్ష్మణ వంతెన పై ఆహారం తీసుకెళ్లకండి

Image Source:

రుషికేష్ ప్రముఖ ధార్మిక ప్రదేశమే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. ఈ పట్టణంలో పర్యాటకులను ప్రధానంగా రామలక్ష్మణ వంతెన కూడా పర్యాటకులను ప్రముఖంగా ఆకర్షిస్తోంది. ఈ వంతన పై నుంచి చూస్తే చుట్టూ ఉన్న తెల్లని మంచుకొండలు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ వంతన పై నడిచి వెళ్లే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిండి పదార్థాలను తీసుకెళ్లకండి. ఎందుకంటే ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. వాటి కంట మీ చేతిలోని తిండి పడితే ఇక అంతే సంగతులు. ఒక్కొక్క సారి అవి గుంపులుగా దాడి చేసి మనుష్యలును గాయపరచడానికి కూడా వెనుకాడబోవు.

4. దానం అడిగితే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి

4. దానం అడిగితే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి

Image Source:

పవిత్ర స్థలమైన రుషికేష్ లో ప్రతి అడుగుకూ అనేక మంది సాధువులు కనిపిస్తుంటారు. అందులో చాలా మంది యోగ, ధాన్యం తదితర ప్రక్రియలతో ఎప్పుడూ ఆ దేవ దేవుడిని స్మరిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ తమకు ఎదురు పడే భక్తులను, పర్యాటకులను యాచించరు. అయితే కొంతమంది మాత్రం దానం ఇవ్వాల్సిందిగా వేదిస్తుంటారు. ఈ పవిత్రమైన స్థలంలో దానం చెయ్యకపోతే నరకానికి పోతారని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకండి. అపాత్ర దానం మంచిది కాదన్న విషయం పెద్దలు ఎప్పుడో చెప్పారు.

5. నకిలీ రాళ్లను ఖరీదు చేయకండి

5. నకిలీ రాళ్లను ఖరీదు చేయకండి

Image Source:

సాధారణంగా జీవితం బాగుండటానికి, ఎప్పుడూ సుఖ, సంతోషాలతో ఉండటానికి కొంతమంది శాంతాలు, హోమాలు చేస్తుంటారు. మరికొంత మంది తమ జన్మనక్షత్రానికి అనుకూలమైన విలువైన రాళ్లను ధరిస్తూ ఉంటారు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పేరు, జన్మనక్షత్రం, పుట్టిన తేది తదితర వివరాలను అడిగి కొంతమంది నకిలీ రాళ్లను అంటగట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని కొనుగోలు చేయకండి.

6. మలినం చేయకండి

6. మలినం చేయకండి

Image Source:

పరమ పవిత్రమైన గంగానది ఒడ్డున రుషికేష్ ఉన్న విషయం తెలిసిందే. ఈ పవిత్రమే ధార్మిక స్థలం ఇటీవల కాలుష్యం భారిన పడుతోంది. విచక్షణ రహితంగా భక్తులు, పర్యాటకులు ప్రవర్తిస్తుండం వల్ల గంగానదితో పాటు రుషికేష్ కూడా చెత్తతో నిండిపోతోంది. ముఖ్యంగా ప్లాస్టీక్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ పరిసరాల్లో ప్లాస్టీక్ వాడకుండా స్వీయ నియంత్రణ విధించుకోండి. అందువల్ల పరిసరాలను కాలుష్యం భారి నుంచి కాపడటమే కాకుండా ఆ భగవంతుడి మెప్పు ను కూడా పొందడానికి వీలవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X