Search
  • Follow NativePlanet
Share
» »మగధ సామ్రాజ్య రాజధాని ‘‘రాజగిరి ’’లో ఆశ్చర్యం కలిగించే విషయాలెన్నో..

మగధ సామ్రాజ్య రాజధాని ‘‘రాజగిరి ’’లో ఆశ్చర్యం కలిగించే విషయాలెన్నో..

రాజగిరి క్రీ.పూ భారతదేశంలో విలసిల్లిన మగధ సామ్రాజ్యమునకు రాజధానిగా వుండేది. మరో ప్రముఖ బౌద్ధ క్షేత్రం భీహార్ లోని నలందకు రాజగిర్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వుంది. రాజగిర్ అంటే 'రాజ గృహం', అంటే రాజు గారిల్లు అని అర్ధం. ఇది జరాసంధ చక్రవర్తి గురించి, అతడు పాండవులతో చేసిన యుద్ధం గురించి తెలియచేస్తుంది. రాజగిరి నగరం మగధ సామ్రాజ్యము యొక్క మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు రాజగృహ, గిరివ్రజం.

కలియుగం పదహారవ శతాబ్దిలో మౌర్య చంద్రగుప్తుడు భారతదేశాన్ని 'గిరివ్రజం' రాజధానిగా పాలించాడు. 'గిరివ్రజం', 'పాటలీపుత్రం' ప్రస్తుతం బిహార్‌లో ఉన్నాయి. కలియుగం నాలుగవ దశాబ్ది వరకు గిరివ్రజం మొత్తం భారతదేశానికి రాజధాని. ఇరవై ఎనిమిదవ శతాబ్దిలో అంటే క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో, సమ్రాట్టులయిన గుప్తు లు రాజధానిని గిరివ్రజం నుంచి పాటలీపుత్రానికి మార్చారు.

రాజగిర్ గౌతమ బుద్ధుడు, మహావీరుడి ప్రయాణాలకు సాక్షి

రాజగిర్ గౌతమ బుద్ధుడు, మహావీరుడి ప్రయాణాలకు సాక్షి

ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి. మహావీర మరియు గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం మరియు జైనమతంలో కూడా గుర్తింపు పొందింది. రాజగిర్ గౌతమ బుద్ధుడు, మహావీరుడి ప్రయాణాలకు సాక్షిగా కూడా వుంది.

ఇది రాతి కొండలు చుట్టుముట్టి ఉన్న ఒక ఆకుపచ్చ లోయలో ఉంది.

ఇది రాతి కొండలు చుట్టుముట్టి ఉన్న ఒక ఆకుపచ్చ లోయలో ఉంది.

ఇది రాతి కొండలు చుట్టుముట్టి ఉన్న ఒక ఆకుపచ్చ లోయలో ఉంది. ఈ లోయలో నెలకొన్న రాజగిర్ అందాలు పర్యాటకులను సూదంటురాయిలా ఆకర్షిస్తాయి. ఈ లోయ పైన మంత్రముగ్ధుల్ని చేసే కొండలు వున్నాయి. బుద్ధుడికి, బౌద్ధానికి సంబంధించిన అసంఖ్యాకమైన కథలులు రాజగిర్ నగరంతో పెనవేసుకున్నాయి.

అజాత శత్రు కోట

అజాత శత్రు కోట

రాజగిరిలో చూడవల్సిన ఇతర పర్యాటక ప్రదేశాలు రాజగిర్ లో పర్యాటకుల జ్ఞానాన్ని పెంపొందించి, ఆశ్చర్య పరిచే చాలా నిర్మాణాలు, ప్రదేశాలు వున్నాయి. అజాత శత్రు కోట, జీవకమేవన్ తోటలు, స్వర్ణ భండారం లాంటివి ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

అక్టోబర్ 24 నుండి 26 వరకు జరిగే కలర్ ఫుల్ డ్యాన్స్ ఫెస్టివల్

అక్టోబర్ 24 నుండి 26 వరకు జరిగే కలర్ ఫుల్ డ్యాన్స్ ఫెస్టివల్

ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 నుండి 26 వరకు జరిగే కలర్ ఫుల్ డ్యాన్స్ ఫెస్టివల్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లో అత్యంత ప్రసిద్ది చెందినది. ఈ డ్యాన్స్ ఫెస్టివల్లో క్లాసికల్ మరియు ఫోక్ డ్యాన్స్ లు ప్రధాన ఆకర్షణలు. అందుకే బీహర్ లో నలంద తర్వాత రాజ్ గిరి ఐడియల్ టూరిస్ట్ స్పాట్ అయింది.

బౌద్ధ, జైన మతాల అభివృద్దిలో ప్రధాన అన్కాలకు రాజగిర్ పర్యాటకం

బౌద్ధ, జైన మతాల అభివృద్దిలో ప్రధాన అన్కాలకు రాజగిర్ పర్యాటకం

జైన్లు, బౌద్ధులు తమ మత స్థాపకులైన మహావీరుడు, గౌతమ బుద్ధుడు తమ జీవితాలలోని ప్రధాన భాగాలను ఇక్కడ గడిపారు కనుక ఈ నగరాన్ని చాలా ప్రేమిస్తారు.

సప్తపర్ణి గుహలు

సప్తపర్ణి గుహలు

బౌద్ధ, జైన మతాల అభివృద్దిలో ప్రధాన అన్కాలకు రాజగిర్ పర్యాటకం ఒక పట్టిక లాంటిది. మొదటి సారిగా జరిగిన బౌద్ధ మండలి సమావేశానికి రాజగిర్ లోని సప్తపర్ణి గుహలు వేదికగా నిలిచాయి. బౌద్ధం వ్యాప్తి, ప్రఖ్యాతి రాజగిర్ బౌద్ధుల కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. రాజగిరి పర్యాటకం మొత్తం బౌద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒక ప్రధాన అంతర్భాగం కావడంతో ఇతర బౌద్ద కేంద్రాలకు కూడా బాగా అనుసంధానం చేయబడి వుంది.

రాజగిర్ పర్యాటకం గొప్ప విశ్రా౦తినిచ్చే పర్యాటక కేంద్రం

రాజగిర్ పర్యాటకం గొప్ప విశ్రా౦తినిచ్చే పర్యాటక కేంద్రం

రాజగిర్ పర్యాటకం గొప్ప విశ్రా౦తినిచ్చే పర్యాటక కేంద్రం. రాజగిర్ నగరం ఒక ప్రత్యేకమైన అలౌకికమైన ఆకర్షణ కలిగి ఆధునిక పోకడల వల్ల పర్యావరణం కాలుష్యం కాలేదు. ధ్యానం చేసి ఆత్మాన్వేషణ చేయడానికి ఇది చక్కటి ప్రాంతం.

గ్రిధకుట:

గ్రిధకుట:

రాబందుల శిఖరంగా పిలువబడే గ్రిధకుట యాత్రికులకు ప్రధాన గమ్యస్థానంగా ఉంది. జపాన్ బుద్ధ సంఘం కొండ పైభాగంలో శాంతి స్థూపం (శాంతి పగోడా) అనే భారీ ఆధునిక స్థూపాన్ని నిర్మించింది. ఒక వంతెన మార్గం కొండ వరకు దారితీస్తుంది కాని గురువారం మినహా ప్రతిరోజూ పనిచేసే కేబుల్ కారులో వెళ్ళడం చాలా సరదాగా ఉంటుంది. వన్ వే రైడ్ సుమారు 10 నిమిషాలు పడుతుంది మరియు కొండల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది.

హాట్ స్ప్రింగ్:

హాట్ స్ప్రింగ్:

హాట్ స్ప్రింగ్స్, బ్రహ్మకుండ్ అని కూడా పిలుస్తారు, రాజగిర్ పర్యాటకంలో ప్రధాన ఆకర్షణ బ్రహ్మకుండ్. అద్భుతమైన ఔషధ విలువలున్న వేడి నీటి బుగ్గలను బ్రహ్మకుండ్ గా పిలుస్తారు – ఇవి అసంఖ్యాకమైన పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది వైభావ కొండల పాదాల వద్ద ఉంది. వేడి నీటి బుగ్గలు పురుషులు మరియు మహిళలకు ప్రత్యేక స్నాన స్థలాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ నీటి బుగ్గలు చర్మ వ్యాధులను నయం చేయడానికి గొప్ప ఔషధ విలువను కలిగి ఉన్నాయి.

సైక్లోపియన్ రాతి నిర్మాణం

సైక్లోపియన్ రాతి నిర్మాణం

రాజధాని నగరం రాజగిర్ ను మరింత ధృడంగా చేసేందుకు ఉద్దేశించింది సైక్లోపియన్ రాతి నిర్మాణం. పెద్ద సున్నపు రాళ్ళ బండలతో నిర్మించిన మైసీనియన్ నిర్మాణాలను గుర్తుకు తెచ్చే పెద్ద రాతి గోడ ఇది. మౌర్యుల కాలానికి పూర్వానికి చెందిన ఈ నిర్మాణం అప్పటి వైభవ౦తో లేదు గానీ, ఆ వైభవ చిహ్నాలు ఇప్పటికీ కనిపిస్తాయి.

అజాతశత్రు కోట:

అజాతశత్రు కోట:

మగధ రాజ్యాన్నేలిన అజాతశత్రువు అజాత శత్రు కోట నిర్మించాడు. తనదైన ప్రత్యేకమైన శైలిలో వుండే ఈ కోటను చూసి తీరాల్సినది.

వేణు వన:

వేణు వన:

వేణు వన అనేది శాంతంగా, ధ్యానం చేసుకోవడానికి వీలుండే కృత్రిమ వనం. బుద్ధుడి కోసం బింబిసార చక్రవర్తి నిర్మించిన అందమైన విడిది ఇది. వేణు వనం లో ఒక ఆశ్రమం కూడా వుంది.

శాంతి స్తూపం

శాంతి స్తూపం

శాంతి గోపురంగా పిలువబడే విశ్వ శాంతి స్తూపం ఒక చారిత్రిక స్థంభం.ఇది రాజగిరి కొండ మీద ఎత్తైన ప్రాంతంలో 400 మీటర్ల ఎత్తులో దివ్యమైన అందంతో అలరారుతోంది. ఈ స్తూపాన్ని ప్రపంచశాంతిని ప్రతిబింబించే తెల్లటి పాలరాతితో నిర్మించారు, దీనిలో బుద్ధుడి నాలుగు స్వర్ణ విగ్రహాలు వున్నాయి. దీన్ని ఒక రోప్ వే ద్వారా చేరుకోవచ్చు.

లక్ష్మీ నారాయణ టెంపుల్:

లక్ష్మీ నారాయణ టెంపుల్:

ఈ దేవాలయంను విష్ణువుకు అంకితం చేయబడినది. ఈ దేవాలయాన్ని ప్రతి రోజూ ఎక్కువ మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఈ దేవాలయంలోని దేవుడిని దర్శించడానికి ముందు భక్తులు బ్రహ్మకుండ్ లో మునిగి దర్శించుకుంటారు. పర్యాటకలు వీటితో పాటు రాజగిరికి దగ్గరలోని నలంద, బీహార్, షరీఫ్ మరియు పావాపురిని కూడా దర్శించుకోవచ్చు. ఈ స్థలం సందర్శించడానికి చాలా సౌకరయంగా ఉంటుంది. నలందా నుండి కేవలం 10కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజగిరి చేరుకోవడానికి రెగ్యులర్ బస్సులు మరియు ఇతర వాహనాలు పర్యాటకుల కోసం సులభంగా అందుబాటులో ఉంటాయి.

రాజ్ గిర్ చేరుకోవడం ఎలా?

రాజ్ గిర్ చేరుకోవడం ఎలా?

విమాన మార్గం: రాజగిర్ కు సుమారు 90కిలోమీటర్ల దూరంలో పాట్నా విమానశ్రం ఉంది. అక్కడి నుండి ఇండియాలోని ప్రధాన నగరాలకు అనుసందానించబడినది.

రోడ్డు మార్గం: బీహార్ లోని ప్రధాన నగరాల నుండి రోడ్డు మార్గంలో రెగ్యులర్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X