Search
  • Follow NativePlanet
Share
» »ప‌ర్యాట‌క పాట్నా.. మిమ్మ‌ల్ని పిలుస్తోంది ప‌దండి!

ప‌ర్యాట‌క పాట్నా.. మిమ్మ‌ల్ని పిలుస్తోంది ప‌దండి!

ప‌ర్యాట‌క పాట్నా.. మిమ్మ‌ల్ని పిలుస్తోంది ప‌దండి!

ఎర్నాకుళం - పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ, భువనేశ్వర్, చిత్తరంజన్ మీదుగా పాట్నా చేరుకున్నాం. అక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు స్టేష‌న్ ద‌గ్గ‌ర‌లోనే విడిది చేసేందుకు అన్ని ర‌కాల హోట‌ల్స్ అందాబాటులో ఉంటాయి. సుమారు 35 కిలోమీటర్ల పొడవు, 18 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్న పాట్నా నగరంలో చెప్పుకోద‌గ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. పాట్నాలోని అలాంటి చారిత్ర‌క నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

బీహార్‌లోని పాట్నా నగరం పేరుకు మూలమైన స‌పఠాన్‌దేవీ మందిర్, స్టేట్ టూరిజం లోగోగా గుర్తించబడ్డ 'పాట్లీ' వృక్షం, అశోకునిచే నిర్మించబడ్డ మాత్రికల విగ్రహాలు, గంగానది తీరాన నిర్మించబడ్డ ప్రభుత్వ కార్యాలయాలు, నాటి ప్రధాన ధాన్యాగారం, ఆడియో వీడియో విజువల్స్ ద్వారా చరిత్రను పరిచయం చేసే గోల్ఫర్ లాంటివి నిత్యం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. 1917లోనే ఇండో ముస్లిం కట్టడ రీతుల్లో ఉన్న 'పాట్నా మ్యూజియం'లో భారతీయ కళాసంపద ముఖ్యంగా పెయింటింగ్స్ రూపంలో లభిస్తాయి. చారిత్రక నేపథ్యం ఉన్న 'ఖుదాబక్ష్ ఓరియంటర్ లైబ్రరీ', సిన్హా, లైబ్రరీలలో వేల కొలదీ పుస్తక సముదాయాన్ని వీక్షించవచ్చు.

మినియేచర్ పెయింటింగ్‌లు

మినియేచర్ పెయింటింగ్‌లు

మ‌రోవైపు కళారంగానికి పట్టుగొమ్మలుగా, భారతీయ నృత్య కళామందిర్, రవీంద్ర పరిషత్, ప్రేమ్‌చంద్ రంగశాల, పాటలీపుత్ర నాట్యమహోత్సవంగా ఖ్యాతిగాంచిన డ్యాన్స్ ఫెస్టివల్ జరిగే కాళిదాస్ రంగాలయం వీటితోపాటుగా 18-20 దశాబ్దాల మధ్యలో విరాజిల్లిన మినియేచర్ పెయింటింగ్‌లు.. నేటికీ ప్రభావాన్ని కోల్పోక.. నగరం నలుమూలలా దర్శనమిస్తాయి.

అలాగే, ఆర్యభట్ట జన్మించి, నడియాడిన నేల కాబట్టి, ఆయన బొమ్మలనే పెయింటింగ్‌లుగా చిత్రించిన దానాపూర్ రైల్వేస్టేషన్ ప్రధానద్వారం, గాంధీ మైదానం, బుద్ధ స్మృతిపార్క్, ఆసియాలోనే అతిపెద్ద రివర్ బ్రిడ్జి అన్నీ సందర్శకులకు కనువిందు చేస్తాయి. కాళిదాసు, వాత్సాయనుడు, చాణక్యుడు సంచరించారని చెప్పబడే ఈ నగరంలో వసతి సౌకర్యం సమస్యే కాదు. రైల్వే ప్రాంగణంలోనే హోలిడే హోమ్స్, రిటైరింగ్ రూమ్స్, హోటళ్లు, స్టేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. స్థానికంగా ఆటోలు, ఇద్దరు మాత్రమే కూర్చోగలిగే రిక్షాలు రవాణాకు సహకరిస్తాయి.

అంతర్జాతీయ విద్యనందించిన నగరం

అంతర్జాతీయ విద్యనందించిన నగరం

బుద్ధుడు నివసించిన ప్రాంతం కాబట్టి ప్రజలు శాఖాహారులు, మాంసం త‌క్కువ‌గా ల‌భిస్తుంది. అలాగే న‌దీప‌రీవాహ‌క ప్రాంతం కాబ‌ట్టి చేప‌లు పుష్క‌లంగా ల‌భిస్తాయి. నలంద, తక్షశిల కాలంలోనే అంతర్జాతీయ విద్యనందించిన ఈ నగరాన్ని చదువులకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పవచ్చు. చూడగానే అతి సామాన్యంగా కనిపించే పాట్నా ప్రజలు బీహార్‌లో ప్రభుత్వం విధించిన మద్యపాన నిషేధాన్ని అమలుపరుస్తూ, కుటుంబాలను ఆర్థికంగా నష్టపోకుండా కాపాడుకుంటున్న వివేకవంతులు.

అందుకే అక్కడి ప్రతి ప్రదేశం ప్రజారోగ్య పరిరక్షణ కేంద్రాలుగా కనిపిస్తాయి. 25 వేల మంది ప్రేక్షకులు పట్టే మెయిన్ ఉల్ల్ స్టేడియం, పాట్నా గోల్ఫ్ క్లబ్, మహిళల తొలి వరల్డ్ కప్ జరిగిన పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలు అక్కడి ప్రజలు ఆటల్లో మునిగి తేలేందుకు ఎంతో తోడ్పడతాయి.

అన్ని సౌక‌ర్యాలూ ఉన్న న‌గ‌రం

అన్ని సౌక‌ర్యాలూ ఉన్న న‌గ‌రం

ఆకాశమార్గాన పాట్నా చేరుకోవాలనుకునేవారికి గమ్యస్థానం లోక్ నాయక్ జయప్రకాశ్ ఎయిర్‌పోర్ట్‌. ఇది పరిమితులున్న అంతర్జాతీయ విమానాశ్రయం. అందుకు కారణం ప్రపంచదేశాల నుంచి పెరుగుతున్న ప్రయాణికులు, మరోవైపు 40 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండే మిలటరీ ఎయిర్ ఫీల్డ్‌! కోల్‌క‌తా తర్వాత అతిపెద్ద నగరంగా ఖ్యాతిగాంచింది పాట్నా రైల్వేస్టేషన్.

దేశంలోనే రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో ఒకటి. మనదేశంలో వ్యాపారానికి సులభంగా, అన్ని సౌకర్యాలున్న రెండవ అతిపెద్ద నగరంగా ప్రపంచబ్యాంకు చేత ప్రశంసించబడ్డ ఈ నగరానికి జలమార్గమూ ముఖ్యమైనదే! ఏడాది పొడవునా ప్రవహించే జీవనదుల్లో ఒకటైన 'గంగ' ప్రధాన స్రవంతి. చారిత్ర‌క విశేషాల‌ను తెలుసుకోవాల‌నే ఔత్సాహికుల‌కు పాట్నా మంచి గ‌మ్య‌స్థానం.

Read more about: patna patna museum
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X