Search
  • Follow NativePlanet
Share
» »మహాసముంద్ పర్యాటక ప్రదేశాలు !!

మహాసముంద్ పర్యాటక ప్రదేశాలు !!

స్వస్తిక్ విహార్ అనేది ఇటీవలే తవ్వకాల లో వెల్లడైన బౌద్ధ నిర్మాణం. బౌద్ధ సన్యాసులు ఇక్కడ తమ ధ్యానాన్ని చేసుకుంటారు. ఈ ప్రదేశం చక్కని దృశ్యాలతో ఆకర్షణీయంగా వుంటుంది.

By Mohammad

ఒకప్పుడు సోమవంశీయ చక్రవర్తులచే పాలించా బడిన మహాసముంద్ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు గా వుంది. మహాసముంద్ చత్తీస్ ఘర్ లో మధ్య తూర్పు భాగంలో కలదు. ఈ ప్రాంతంలో సిర్పూర్ ప్రధాన సాంస్కృతిక కేంద్రం కావటంతో సిర్పూర్ ను పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శిస్తారు. ఈ ప్రదేశం మహానాది నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం అంతా పూర్తిగా, సున్నపు రాయి మరియు గ్రానైట్ కలిగి వుంటుంది.

మహాసముంద్ సంస్కృతి

ఈ ప్రాంతంలో హల్బా, ముందా, సోనార్, సంవారా, పార్ధి, బహాలియా, మొదలైన అటవీ తెగలు కలవు. తెగల సంస్కృతి, జాతరలు, పండుగలు ఈ ప్రాంత దైనందిన జీవనంలో చోటు చేసుకున్నాయి. ఇక్కడి ప్రజల దుస్తుల వేషధారణ చాలా సాంప్రదాయకంగా వుంటుంది. పురుషులు, ధోతి, కుర్తా, టర్బన్ లు ధరించి తోలు చెప్పులు వేసుకుంటారు. మహిళలు చీరలు ధరిస్తారు. అత్కారియా అనేది సాంప్రదాయ చెప్పులు. బిచియా, కర్ధాన్ లేదా వడ్డానం, కాలి పట్టాలు, వెండి చెవి ఆభరణాలు మహిళలు ధరిస్తారు. పండుగలు వారి జీవనంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

మహాసముంద్

చిత్రకృప : Jonoikobangali

మహాసముంద్ లోను చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

మహా సముండ్ లో లక్ష్మణ్ టెంపుల్, ఆనంద్ ప్రభు, కుడి విహార్, శ్వేతా గంగ భంహిని, ఖల్లరిమత టెంపుల్, ఘుదారా , చండి టెంపుల్, చండి టెంపుల్, గుచాపల్లి, స్వస్తిక్ విహార్, గందేస్వర్ టెంపుల్, ఖల్లరి మాత టెంపుల్, వంటివి చూడ దగిన ఆకర్షణలు.

చండి టెంపుల్ (బిర్కొని)

ప్రసిద్ధి గాంచిన చండి టెంపుల్ బిర్కొని విలేజ్ లో కలదు. ఇక్కడి దేవత చండి దేవి. ఇది నేషనల్ హై వే నెం. 6 పై కలదు. ఈ చండి టెంపుల్ లో జరిగే నవరాత్రి ఉత్సవాలకు వేలాది భక్తులు వచ్చి మాత ఆశీర్వాదం పొందుతారు. మహాసముంద్ లో ఇది ప్రసిద్ధ మతపర ప్రదేశం.

మహాసముంద్

చిత్రకృప : Satyajeet Sahu

చండి టెంపుల్ (గుచపాలి)

మహాసముంద్ నుండి 40 కి.మీ. ల దూరం లో కల గుచ్చపల్లి విలేజ్ లో చండి టెంపుల్ కలదు. ప్రతి ఏటా చిత్ర మాసంలో ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ టెంపుల్ లోని చండి విగ్రహం చాలా పెద్దది. ఈ సమయంలో అతి పెద్ద జాతర ఒకటి నిర్వహిస్తారు.

గౌదారా (దళ్డాలి)

గోదార అనేది నిరంతరం ప్రవహించే ఒక నీటి బుగ్గ. దీని సమీపంలో ఒక శివాలయం కూడా కలదు. ప్రతి సంవత్సరం, పుష్య మాసం లో ఒక జాతర జరుగుతుంది. దట్టమైన అడవి లో కల ఈ ప్రదేశానికి జాతరలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆనందిస్తారు.

మహాసముంద్

చిత్రకృప : Ashwini Kesharwani

స్వస్తిక్ విహార్

స్వస్తిక్ విహార్ అనేది ఇటీవలే తవ్వకాల లో వెల్లడైన బౌద్ధ నిర్మాణం. బౌద్ధ సన్యాసులు ఇక్కడ తమ ధ్యానాన్ని చేసుకుంటారు. ఈ ప్రదేశం చక్కని దృశ్యాలతో ఆకర్షణీయంగా వుంటుంది.

స్వీత్ గంగ అఫ్ బహామిని

మహాసముంద్ కు పది కి. మీ. ల దూరంలో కల బహామిని విలేజ్ లో శ్వేతా గంగ క్లాలడు. ఇది ఒక నీటి బుగ్గ నిరంతరం ప్రవహించి నది లో కలుస్తుంది. సమీపంలో శివుడి ఆలయం కలదు. ఇది చాలా పురాతనమైనది. ప్రతి సంవత్సరం శ్రావణం లో జరిగే వేడుకలకు భక్తులు అధిక సంఖ్యా లో వస్తారు. ఈ నీటి తో ఇక్కడి శివ లింగాన్ని అర్చిస్తారు. ఈ భక్తులను కన్వారియాలు అంటారు.

మహాసముంద్

చిత్రకృప : Mohnish1208

ఖల్లారి మాత టెంపుల్

ఖల్లారి మాత దేవాలయం ఖల్లరి విలేజ్ లో దట్టమైన అటవీ ప్రాంతంలో వుంది. ఇక్కడి దేవత ఖల్లరిమాత. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. ప్రతి ఏటా చైత్రమాసం లో ఒక వార్షిక జాతర జరుగుతుంది. ఇతిహాసం మేరకు పాండవులు ఇక్కడ నివసించారని, చెపుతారు. ఇక్కడ కొండపై, భీముని పాద ముద్రలు కూడా చూడవచ్చు.

ఇది కూడా చదవండి : రాజ్ నంద్ గావ్ - సంస్కృతి, సంప్రదాయాల కలయిక !!

మహాసముంద్ ఎలా చేరుకోవాలి ?

  • సమీప విమానాశ్రయం : మహాసముంద్ కు సమీపాన 54 కిలోమీటర్ల దూరంలో రాయ్ పూర్ విమానాశ్రయం కలదు.
  • సమీప రైల్వే స్టేషన్ : మహాసముంద్ కు సమీపాన రాయ్ పూర్ రైల్వే స్టేషన్ కలదు.
  • బస్సు/ రోడ్డు మార్గం : మహాసముంద్ కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X