Search
  • Follow NativePlanet
Share
» »మలప్పురం - కొండల మీద ఉన్న పురం !!

మలప్పురం - కొండల మీద ఉన్న పురం !!

మలయాళంలో మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్థం. జిల్లా కాక మునుపు ఈ ప్రాంతాన్ని ఏర్నాడు, వళ్ళువనాడు అని పిలిచేవారు.

By Mohammad

కేరళ లోని ఉత్తర ప్రాంతపు జిల్లా అయినటువంటి మలప్పురం గొప్ప సంస్కృతికి, చారిత్రిక ప్రాధాన్యతకి, విశిష్టమైన వారసత్వ సంపదకి ప్రసిద్ధి. చిన్న కొండలతో , గుట్టలతో అలంకరించబడిన మలప్పురం ప్రాంతం సార్ధక నామధేయి (మలయాళంలో మలప్పురం అనగా పర్వత శిఖరం).

ప్రాచీన, ఆధునిక సంస్కృతులను కలిపి అల్లిన చరిత్ర కలిగి ఉన్న మలప్పురం ప్రాంతం సంస్కృతికి, మతానికి, ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాక కేరళ పర్యాటక రంగానికి కుడా విస్తృతంగా దోహదపడింది. చలియార్, భరతపుళ, కదలుండి అనే మూడు నదులు ప్రవాహం మలప్పురం నేలని , సంస్కృతిని సుసంపన్నం చేస్తున్నాయి.

కదలుండి పక్షుల అభయారణ్యం

కదలుండి పక్షుల అభయారణ్యం

చిత్రకృప : Dhruvaraj S

కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం

చిన్న చిన్న ద్వీపాల సమూహం తో విస్తరించివున్న కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం మలప్పురం జిల్లా లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ సంరక్షణ కేంద్రం ఉన్న కదలుండి అనే అందమైన పల్లెని రహదారి గుండా చేరుకోవటం అతి సులభం. 200 మీటర్ల ఎత్తు తో , ఎత్తు పల్లాల కొండల మధ్యలోనున్న కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం విహంగ వీక్షకులకు ఒక మరపురాని అనుభూతిని అందిస్తుంది.

కేరళదేశ్ పురం ఆలయం

కేరళదేశ్ పురం ఆలయం దక్షిణ భారత దేశంలోని ప్రాచీన చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఇది తానూర్ పట్టణానికి 3 కి.మీ ల దూరం లో ఉంది. మలప్పురం జిల్లా లోని తీర పట్టణమైన తానూర్ పురాతన పోర్చుగీసు స్థావరం. ఈ ప్రాచీన దేవాలయం లో శ్రీ మహా విష్ణువు పూజలందుకుంటాడు.

ఆద్యాంపర జలపాతం

ఆద్యాంపర జలపాతం

చిత్రకృప : Sidheeq

చరిత్రానుసారం ఈ ఆలయం 16 వ శతాబ్ధం మధ్య భాగం లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సందర్శించాడు. తానూర్ సముద్ర తీర సమీపాన గల ఈ ఆలయం సందర్శకులకు ప్రశాంత వాతావరణం అందిస్తుంది. ఆలయ గోడలపైన ఉన్నఅపురూపమైన కుడ్య చిత్రాలు (మ్యూరల్స్) ఇక్కడి విశిష్టత.

తిరునవయ ఆలయం

"తిరునవయ నవ ముకుంద ఆలయం" అని కూడా పిలవబడే తిరునవయ ఆలయం గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రాచీన దేవాలయం. భరతపుళ నదీ తీరంలో మనోహరంగా ఉండే ఈ గుడి, కేరళ మొత్తం నించి భక్తులను ఆకర్షిస్తుంది.

ప్రసిద్ధ మమంకం ఉత్సవం జరిగే ప్రదేశంగా కేరళ ప్రాచీన చరిత్ర లో భాగం సంపాదించిన ఈ ఆలయం, తిరునవయ అనే చిన్న గ్రామం లో ఉంది. "నవ ముకుందన్" అని పిలవబడే శ్రీ మహా విష్ణువు ఇక్కడి ఆరాధ్య దైవం. ఆలయ ప్రాంగణంలో గణపతి, లక్ష్మి దేవి కి అంకితం చేయబడిన చిన్న గుళ్ళు కనిపిస్తాయి.

కొట్టక్కున్ను

కొట్టక్కున్ను

చిత్రకృప : Dhruvaraj S

ఇతర ఆకర్షణలు : జమా మసీద్, మన్నూర్ శివాలయం, తిరుప్పురంతక దేవాలయం, వెట్ట కోరుమకన్ దేవాలయం వంటి గుళ్ళు, మసీదులు ఇక్కడ కలవు. శాంతి తీరం నదీ తీర ఉద్యానవనం, బియ్యం సరస్సు, కొట్టక్కున్ను పర్వత ఉద్యానవనం పర్యాటకులను అమితంగా ఆకర్షించే మరో కొన్ని స్థలాలు.

ఇది కూడా చదవండి : వాస్కో డ గామా మొట్టమొదట ఇండియాలో కాలు మోపిన ప్రదేశం !!

మలప్పురం ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

కాలికట్ , పాలక్కడ్ లాంటి అన్ని పొరుగు జిల్లా లనించి మలప్పురం కి చక్కటి రోడ్డు మార్గం ఉంది. మలప్పురం చేరుకోటానికి మరియు మలప్పురం నించి బయల్దేరడానికి ఎన్నో కేరళ రాష్ట్ర బస్సులు , ప్రైవేటు బస్సులు ఉన్నాయి.

రైలు మార్గం

మలప్పురం జిల్లా లోఅంగడిపురం, తిరుర్, తానూర్ , కుట్టిప్పురం, పరప్పనంగడి మొదలుకుని అనేక చిన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కేరళ లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలని కలిపే ఎన్నో రైళ్ళు ఈ స్టేషన్ల గుండా వెళ్తాయి.

వాయు మార్గం

మలప్పురం కి అతి సమీపం లోని విమానాశ్రయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం మలప్పురం నడిబొడ్డుకి సుమారు 25 కి.మీ ల దూరంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X