Search
  • Follow NativePlanet
Share
» »మరారికులం - బీచ్ విహారం ... !!

మరారికులం - బీచ్ విహారం ... !!

ఆలప్పుళా నుండి 11 కిలోమీటర్ల దూరంలో మరారికులం కలదు. ఈ గ్రామములో మీరు రిలాక్స్ అయి ఆనందించవచ్చు. నీటి క్రీడలు, వలలు అల్లకం, సముద్రం తీరాన యోగా, ఆయుర్వేద చికిత్సలు, ధ్యానం వంటివి ఇక్కడ చేపట్టవచ్చు.

By Mohammad

మరారికులం ఒక అందమైన గ్రామము. ఇది కేరళలోని అలప్పుజ/ఆలప్పుళా (alappuzha) జిల్లాలో కలదు. బీచ్ విహారానికి ఈ గ్రామము ఎంతో శ్రేయస్కరం. బంగారు వన్నె గల ఇసుక బీచ్ లకు ఇది ప్రసిద్ధి. ఆలప్పుళా నుండి 11 కిలోమీటర్ల దూరంలో మరారికులం కలదు. ఈ గ్రామములో మీరు రిలాక్స్ అయి ఆనందించవచ్చు. చేపలకు వెళ్ళే మత్స్య కారులు, వారి ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను తెలుసుకోవచ్చు. నీటి క్రీడలు, వలలు అల్లకం, సముద్రం తీరాన యోగా, ఆయుర్వేద చికిత్సలు, ధ్యానం వంటివి ఇక్కడ చేపట్టవచ్చు.

అర్థున్కల్ చర్చి

ఆలప్పుళా పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో అర్థున్కల్ గ్రామము కలదు. ఇది హిందువులకు మరియు క్రైస్తవులకు ఒక పుణ్యక్షేత్రం వంటిది. అర్థున్కల్ ను మొదట అర్థున్ కలగ్రా అని పిలిచేవారు. ఆ తర్వాత అర్థున్ కలగ్రా కాస్త అర్థున్కల్ గా మారిపోయింది. ఇక్కడి చర్చిని అర్థున్ సెయింట్ ఫారనే ఫోరెన్స్ చర్చి అని కూడా పిలుస్తారు. దీనిని క్రీస్తు శకం 16 వ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించారు.

అర్థున్ సెయింట్ ఫారనే ఫోరెన్స్ చర్చి

అర్థున్ సెయింట్ ఫారనే ఫోరెన్స్ చర్చి

చిత్రకృప : Challiyil Eswaramangalath Vipin

ఈ చర్చిని 1638 సంవత్సరంలో మరో మారు వికార్ ఫాదర్ జకోమా ఫెనీషియో అనే మహిమకల ఫాదర్ జ్ఞాపకార్ధం పునరుద్ధరించారు. 1647 సంవత్సరంలో మిలన్ లో తయారు చేయించిన సెయింట్ సెబాస్టియన్ విగ్రహాన్ని ఈ చర్చిలో ప్రతిష్టించారు. అలెప్పీలో బేసిలికా హోదా ఇవ్వబడిన పర్శీలలో అర్ధుంకాల్ సెయింటో్ ఫోరేన్ చర్చి మొదటిది. అలెప్పీ డయోసీజ్ లో ఈ చర్చి మొదటిది. రాష్ట్రంలో ఇది ఏడవ బేసిలికా మరియు కేరళలో మూడవ లాటిన్ కేధలిక్ చర్చి.

మరారికులం బీచ్

మరారికులం బీచ్ పరిసరాలు ఎంతో అందంగా ఉంటాయి. తాటిచెట్ల వరుస, నిశబ్ద వాతావరణం, మనసును రంజిపచేసే ప్రకృతి వంటివి అధికంగా ఇక్కడ కనపడతాయి. బీచ్ లో జనాలు అధికంగా కనిపించరు. పర్యాటకులు కాలినడకన బీచ్ మొత్తం ఒక రౌండ్ వేయవచ్చు. సముద్రంలో దిగి ఆనందించవచ్చు.

మరారికులం బీచ్

మరారికులం బీచ్

చిత్రకృప : Almost90's

బీచ్ లోని తెల్లని ఇసుక స్పర్శ మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. బీచ్ వెంబడి ఆయుర్వేద చికిత్స కేంద్రాలు, షాపింగ్ కేంద్రాలు కలవు. వివిధ ఆటలు అంటే పారా సెయిలింగ్, వాలీబాల్, స్విమ్మింగ్ వంటి క్రీడలు చేపట్టవచ్చు.

అర్థున్కల్ బీచ్

అర్థున్కల్ బీచ్ హాయిగా, ప్రశాంతంగా ఉండి సముద్రపు ఒడ్డున సేదతీరాలనుకొనే వారికి ఆనందపరుస్తుంది. ఇది అక్కడి ప్రభత్వం చే గుర్తించబడిన బీచ్. ఒంటరిగా ప్రశాంత మనస్సు తో గడపాలనుకొనేవారికి ఈ బీచ్ ఆనందాన్ని ఇస్తుంది. ఈ బీచ్ ను సాయంత్రం 3 నుండి 5 గంటల మధ్యలో సందర్శిస్తే, నీరెండలో ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

మరారికులం లో ఇతర సందర్శనీయ స్థలాలు

మరారికులంలో గల కొక్కమంగళం చర్చి సెయింట్ థామస్ చే స్థాపించబడింది. ఇది గొప్ప యాత్రా స్థలాలలో ఒకటి. ఈ చర్చిలో వర్జిన్ మేరీ విగ్రహం ప్రధాన ఆకర్షణ. తుంపోలి, శివాలయం, ఆరూర్, అరుధంకాలన్, పుచ్ఛాక్కాల్, పానావళి, వేలోర్ వట్టం, చేర్తాల కార్తికేయిని దేవాలయం, కంచి కుంగ్లారా ప్రధాన దైవం భగవతి మొదలైన ప్రదేశాలను సందర్శించవచ్చు.

మేరిమాత

మేరిమాత

చిత్రకృప : Princebpaul0484

భోజన సదుపాయాలు

బీచ్ ఒడ్డు ప్రదేశం కనుక సముద్ర ఆహారాలు ఇక్కడ దొరుకుతాయి. చేపలు, పీతలు, రొయ్యలతో తయారుచేసిన వంటకాలు రుచికరంగా ఉంటాయి. మటన్, చికెన్ తో చేసిన నాన్-వెజ్ వంటకాలు వీలైతే ట్రై చేయండి.

వసతి

మరారికులం లో రిసార్టులు ఉన్నాయి. వాటిలో ఏసీ, నాన్-ఏసీ గదులు కలవు. దగ్గరలోని అలెప్పి లేదా ఆలప్పుళా లో హోటళ్ళు, రిసార్టులు కలవు.

ఇది కూడా చదవండి : అదూర్ - కేరళ సంప్రదాయ పట్టణం !!

మరారికులం ఎలా చేరుకోవాలి ?

మరారికులం చేరుకోవటానికి విమాన, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

మరారికులం సమీపాన ఉన్న విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 70 కిలోమీటర్ల దూరంలో కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాల ద్వారా మరారికులం చేరుకోవచ్చు.

రైలు మార్గం

మరారికులం లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి కేరళలోని వివిధ ప్రాంతాలనుండి రైళ్ళు వస్తాయి. ఇది ఎర్నాకులం - అలప్పుజా రైలు మార్గంలో కలదు. మరారికులంకు మీకు నేరు ట్రైన్ లేకుంటే, సమీప రైలు స్టేషన్ లో దిగి మరారికులం రైలు స్టేషన్ కు చేరవచ్చు.

రోడ్డు మార్గం

మరారికులం గ్రామం సమీపాన జాతీయ రహదారి 47 వెళుతుంది. ఆలెప్పి, కొచ్చి, కుమారకొమ్ ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X