Search
  • Follow NativePlanet
Share
» »'టెర్రకోట' ఆలయాల నిలయం - బిష్ణుపూర్ !

'టెర్రకోట' ఆలయాల నిలయం - బిష్ణుపూర్ !

By Mohammad

బిష్ణుపూర్ ... టెర్రకోట ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. మట్టి, ఇటుక, సున్నపురాయి ని ఉపయోగించి నిర్మించిన ఈ ఆలయాలు క్రీ.శ. 17- 18 వ శతాబ్దం నాటివని ఆర్కియాలాజికల్ డిపార్టుమెంటు వారి అంచనా. బిష్ణుపూర్, బెంగాల్ యొక్క సాంస్కృతిక, కళా రంగాలకు పుట్టినిల్లు గా గుర్తింపు పొందింది. చరిత్ర పరంగా చూసినట్లయితే పూర్వం ఈ ప్రాంతం 16 జానపదాల్లో ఒకటైన మల్ల రాజ్యంలో భాగంగా ఉండేది. అప్పుడు ఈ ప్రాంతాన్ని 'మల్లభూమ్' అని పిలిచేవారట ..!

ఎక్కడ ఉంది ?

భారతదేశంలో బిష్ణుపూర్ లు రెండు ఉన్నాయి. ఒకటేమో మణిపూర్ లో, మరొకటేమో పశ్చిమ బెంగాల్ లో. ప్రస్తుతం ఇక్కడ మనం చెప్పుకోబోతున్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ గురించి ...

బిష్ణుపూర్ పట్టణం పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లా లో కలదు. కలకత్తా నుండి 200 కి. మి. ల దూరంలో, బంకురా నుండి 36 కి. మి. ల దూరంలో ఈ పట్టణం ఉన్నది. టెర్రఆలయాలకె కాక, ఈ ప్రదేశం పట్టుచీరలకు ఖ్యాతి గడించింది. చీర అంచులపై మహాభారత గాథ లను ఇక్కడి నేతన్నలు నేస్తారు. ఇక్కడ చూడవలసిన, షాపింగ్ చేయవలసిన స్థలాలు ఒకసారి పరిశీలిస్తే ..

ఇది కూడా చదవండి : ప్రత్యేక ఆకర్షణలో వెస్ట్ బెంగాల్ మ్యూజియంలు !

జోరే బంగ్లా ఆలయం

జోరే బంగ్లా ఆలయం

జోరే బంగ్లా ఆలయాన్ని క్రీ.శ. 16 వ శతాబ్దంలో రఘునాథ్ సింగ్ రాజు నిర్మించాడు. సున్నపురాయి, ఇటుక ల సహాయంతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం బెంగాల్ వాస్తు కళలకు నిదర్శనం. ఆలయ గోడలపై ధార్మిక, సాంస్కృతిక కధలు, కధనాలు గమనించవచ్చు.

చిత్ర కృప : telugu native planet

మదన్మోహన్ ఆలయం

మదన్మోహన్ ఆలయం

దుర్జన సింగ్ దేవ్ రాజు క్రీ.శ. 16 వ శతాబ్దం చివరలో నిర్మించిన మదన్మోహన్ ఆలయం, బెంగాల్ వాస్తుకళలో ఏకరత్న శైలిని ప్రతిబింబిస్తుంది. గోడలపై చెక్కిన మహాభారత, రామాయణ కధనాలు మెచ్చుకోక తప్పదు.

చిత్ర కృప : telugu native planet

రస్మంచ

రస్మంచ

అందమైన పిరమిడ్ టవర్ కలిగిఉన్న 'రస్మంచ' టెర్రకోట యొక్క అద్భుతమైన నిర్మాణమనే చెప్పాలి. శ్రీ కృష్ణుని విగ్రహాలు, గ్రంధాలు, ప్రాచీన తాళపత్రాల కు నిలయమైన ఈ టెర్రకోట బిష్ణుపూర్ లోని పురాతన ఇటుక ఆలయం. ఆసక్తి గలవారు స్థానిక షాపింగ్ లలో మునిగి తేలవచ్చు.

చిత్ర కృప : telugu native palent

బిహరినాథ్ హిల్

బిహరినాథ్ హిల్

బిహరినాథ్ హిల్, సంవత్సరం పొడవునా యాత్రికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పరమశివుడికి అంకిత౦ చేసిన ఈ ఆలయం విభిన్న వాతావరణాన్ని కలిగిఉంది. నగర జీవితం నుండి మార్పు కోరుకునే వారికి నిర్మలమైన, ప్రశాంత వాతావరణం ఆహ్వానం పలుకుతుంది.

చిత్ర కృప : Shirshendu Sengupta

శ్యామరాయ్ ఆలయం

శ్యామరాయ్ ఆలయం

శ్యామరాయ్ ఆలయం, ఐదు శిఖరాల ఆలయం. చెప్పాలంటే టెర్రకోట కళను అద్భుతంగా ప్రదర్శిస్తుంది. రఘువీర్ సింగ్ రాజు ఈ ఆలయాన్ని క్రీ.శ. 16 వ శతాబ్దంలో కట్టించినాడు. ఆలయ గోడలపై టెర్రకోట పనితనం ప్రస్తుటంగా కనిపిస్తుంది. రామాయణ, మహాభారత గాధలు, కధనాలు గోడలపై చెక్కినారు.

చిత్ర కృప : telugu native planet

షాపింగ్

షాపింగ్

బిష్ణుపూర్ పట్టుచీరలకు ప్రసిద్ధి. పేరుమోసిన చీరలు ఇక్కడ స్వయంగా తయారుచేస్తుంటారు, అమ్ముతుంటారు ఇక్కడి నేతన్నలు. కల్చూరి, బల్చూరి, వల్చూరి ఇలా రకాల పేర్లతో చీరలు లభిస్తాయి. చీరల అంచుపై రామాయణ, మహాభారత గాధలను అల్లింటారు. వాటినే చూడండి.

చిత్ర కృప : Mom

బిష్ణుపూర్ ఎలా వెళ్ళాలి ?

బిష్ణుపూర్ ఎలా వెళ్ళాలి ?

విమానాశ్రయం

బిష్ణుపూర్ సమీపాన కోల్కత్తా అంతర్జాతీయ విమానాశ్రయం కలదు(200 కి. మీ).

రైల్వే స్టేషన్

ఖరగ్పూర్ - ఆద్రా రైలు మార్గంలో బిష్ణుపూర్ రైల్వే స్టేషన్ కలదు. సమీపంలో ఉన్న మరో రైల్వే స్టేషన్ బంకురా.

రోడ్డు / బస్సు మార్గం

కోల్కత్తా, బంకురా, హుగ్లీ, హౌరా తదితర సమీప పట్టణాల నుండి బిష్ణుపూర్ కు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, కోల్కత్తా స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : indiarailinfo

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X