Search
  • Follow NativePlanet
Share
» »అంబోలి - ఇంద్రియాలకు ఆనందం !!

అంబోలి - ఇంద్రియాలకు ఆనందం !!

చాలా మంది పర్యాటకులు సెలవుల సమయాల్లో హిల్ స్టేషన్ లకు పరుగులు పెడుతుంటారు(ఎండాకాలమైతే మరీను ..!). ఊటీ, కోడైకెనాల్, కూర్గ్, కెమ్మనగుండి, మన రాష్ట్రం విషయానికి వస్తే అరకు వాలీ, హార్సిలీ హిల్స్ ఇలా చూసిన హిల్ స్టేషన్లనే మళ్లీ మళ్లీ చూస్తూ కాలం వెల్లదీస్తుంటారు కొంతమంది పర్యాటకులు ... బోర్ కొట్టదా??

చాలా మందికి హిల్ స్టేషన్ లు తెలుసు కానీ ఎప్పుడూ వినని, చూడని హిల్ స్టేషన్ మన పక్క రాష్ట్రం లోనే ఉన్నదని ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ తెలిసిన విని ఉంటారే కానీ ఎప్పుడు టచ్ చేసి ఉండరు. అసలు ఆ ప్రదేశం ఎక్కడుంది ?? ఆ ప్రదేశ పేరేమిటి ..??

ఇది కూడా చదవండి : అంబోలి ప్రదేశ అద్భుత మాయాజాలం !!

మీకు చెప్పబోయే ప్రదేశం పేరు అంబోలి కొత్తగా ఉంది కదూ ..! పర్యటనలను ఇష్టపడని వారు సైతం ఈ హిల్ స్టేషన్ కి రావటానికి ఆసక్తి కనబరుస్తారు. అంబోలి హిల్ స్టేషన్ మహారాష్ట్ర రాష్ట్రంలోని కొంకణ్ తీర ప్రాంతంలో గల సింధుదూర్గ్ జిల్లాలో ఉన్నది. ఈ హిల్ స్టేషన్ సముద్రమట్టానికి 700 మీటర్ల ఎత్తున ఉండి, తన సహజ అందాలతో యాత్రికులను ఆకర్షిస్తున్నది. బ్రీటీష్ వారు పూర్వం అంబోలి ప్రదేశాన్ని మ్యాప్ లో పెట్టడానికి ఇష్టపడేవారు కాదట. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రదేశ అందాలకు ముగ్ధులై మ్యాప్ లో చేర్చారు. అంతగా ముగ్ధులై పోవడానికి అక్కడ ఏఏ ప్రదేశాలు ఉన్నాయంటే ...!

అంబోలి

అంబోలి

అంబోలి ప్రశాంతతకు మారుపేరు. ప్రశాంతమైన వాతావరణం గడపాలనుకొనే వారికి ఈ ప్రదేశం అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలం, చలికాలం లో అంబోలి సందర్శనకు అనువైనది. ఆ సమయంలో ఉష్ణోగ్రత 20 డిగ్రీ లకు మించదు.

Photo Courtesy: Vivek Sheel Singh

మాధవ్ ఘడ్ కోట, అంబోలి

మాధవ్ ఘడ్ కోట, అంబోలి

మాధవ్ ఘడ్ కోట రోడ్డు మీదనే ఉంది. ఈ కోట చారిత్రక ప్రాధాన్యత కలది. ఈ కోట పూణే లోని కోటకు నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఇది శనివార్ వాడ పేరుతో ప్రసిద్ధి చెందినది.

Photo Courtesy: Elid Fernandes

మాధవ్ ఘడ్ కోట, అంబోలి

మాధవ్ ఘడ్ కోట, అంబోలి

మాధవ్ ఘడ్ కోట పై నుండి చుట్టుప్రక్కల పరిసరాలను చూస్తే ఎంతో అందంగా కనిపిస్తాయి. అరేబియా సముద్రం, కొంకణ తీరం చాలా సుందరంగా కనిపిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమం సమయాల్లో పరిసరాలు ఒక్కసారిగా ప్రకాశవంతంగా మారిపోవడం గమనిస్తారు.

Photo Courtesy: Rohit C

షిర్గాంవ్ కర్, అం బోలి

షిర్గాంవ్ కర్, అం బోలి

షిర్గాంవ్ కర్ అనే ప్రదేశం అం బోలి కి 2 . 5 కి. మీ. దూరంలో ఉన్నది. వర్షాకాలంలో పచ్చగా కనపడే ఈ వినోద ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి.

Photo Courtesy: Roopesh Kohad

షిర్గాంవ్ కర్, అం బోలి

షిర్గాంవ్ కర్, అం బోలి

షిర్గాంవ్ కర్ ప్రదేశానికి వెళ్లే మార్గం కూడా అందమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంటుంది. చుట్టుప్రక్కల పరిసరాలను, అందమైన పక్షులను, వివిధ రకాలైన కీటాకాలను, పుష్పాలను మరియు ఆహాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ఈ వినోద ప్రదేశానికి చేరుకోవచ్చు.

Photo Courtesy: Elroy Serrao

హిరణ్య కేశి ఆలయం, అం బోలి

హిరణ్య కేశి ఆలయం, అం బోలి

అంబోలి లోని హిరణ్య కేశి దేవాలయం యాత్రికులను సంవత్సరం పొడవునా ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ దేవాలయం హిరణ్య కేశి నది ఒడ్డునే కలదు. పార్వతీ దేవిని ఇక్కడ హిరణ్యకేశి అని పిలుస్తారు. దేవాలయానికి కూడా అదే పేరు వచ్చింది.

Photo Courtesy: Anand Gurav

హిరణ్య కేశి ఆలయం, అం బోలి

హిరణ్య కేశి ఆలయం, అం బోలి

హిరణ్యకేశి దేవాలయంలోనే శివ భగవానుడు కూడా దర్శనమిస్తాడు. చక్కటి ప్రశాంతమైన ధ్యానం చేసుకోవడానికి లేదా ఫిషింగ్ పట్ల ఆసక్తి కలవారికి చేపలు పట్టటానికి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. సమీప ప్రదేశాల అందచందాలు మిమ్ములను మైమరపింపచేస్తాయి.

Photo Courtesy: Roopesh Kohad

అంబోలి జలపాతాలు

అంబోలి జలపాతాలు

ఇక జలపాతాల వంతు. హిల్ స్టేషన్ లు అంటేనే జలపాతాలు అవి లేకపోతే ఎలా ? అందునా అంబోలి ప్రదేశం. ఇక్కడ జలపాతాలు లేకుంటే ఎట్లా ? అంబోలి ప్రదేశం లో చిన్నా, పెద్ద జలపాతాలు చాలానే ఉన్నా రెండు మాత్రం తప్పక చూడాలి. అవి అంబోలి జలపాతాలు, నంగర్టాస్ జలపాతాలు.

Photo Courtesy: Kiran Sulebhavi

అంబోలి జలపాతాలు

అంబోలి జలపాతాలు

అంబోలి జలపాతాలను చూడటానికి రెండు కళ్ళు చాలవనుకోండి ..! ఏటా వేల మంది పర్యాటకులను ఆకర్షించే సత్తా ఈ జలపాతాలది. వర్షాకాలంలో అధిక నీటి ప్రవాహంతో ఉరకలేస్తూ, చుట్టుప్రక్కల అందాలను మరింత అందంగా మారుస్తాయి. ఈ జలపాతాలను చూడటానికి ఇదే సరైన సమయం.

Photo Courtesy: telugu native planet

నంగర్టస్ జలపాతాలు

నంగర్టస్ జలపాతాలు

అంబోలి నుండి కేవలం 10 కి.మీ.ల దూరంలో నంగర్టస్ జలపాతాలు కలవు. వర్షాకాలంలో ఈ జలపాతాలు అధిక నీటి ప్రవాహంతో అందంగా ఉంటాయి. నీరు ఒక లోతైన లోయలోకి ఎంతో ఎత్తునుండి పడుతూ జలపాతాల హోరు అంటే శబ్దాన్ని కలిగించి ఆనందపరుస్తుంది.

Photo Courtesy: Roopesh Kohad

నంగర్టస్ జలపాతాలు

నంగర్టస్ జలపాతాలు

వర్షాకాల సమయంలో నంగర్టస్ జలపాతాల వద్ద పర్యావరణం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్నిచ్చి అలరిస్తుంది. లోయపై నిర్మాణం చేయబడిన ఒక బ్రిడ్జి పర్యాటకులకు జలపాతం అతి దగ్గరనుండి చూసేలా చేస్తుంది. బ్రిడ్జి మీద నిలబడినవారికి వారి కింద పూర్తి నీరు తప్ప భూమి కనపడదు.

Photo Courtesy: Roopesh Kohad

సావంత్ వాడి, అంబోలి

సావంత్ వాడి, అంబోలి

కొంకణ తీరంలో దట్టమైన అడవులతో, సుందరమైన సరస్సులతో, ఎత్తైన పర్వత శ్రేణులతో, విలక్షణమైన సంస్కృతి - సాంప్రదాయాలతో పర్యాటకులను ఆనందపరచే పట్టణం సావంత్ వాడి. ఈ ప్రదేశం అంబోలి కి 30 కి. మీ. దూరంలో ఉన్నది.

Photo Courtesy: Nitin Vyas

సావంత్ వాడి, అంబోలి

సావంత్ వాడి, అంబోలి

సావంత్ వాడి ప్రదేశం సహ్యాద్రి కొండల తూర్పు ప్రదేశం నుండి పడమట గల అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రదేశం ఒక కావ్య ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఎన్నో మధురానుభూతులను ఈ ప్రదేశం మీకు అందిస్తుంది. అసలు సిసలైన కొంకణ్ రుచులను సైతం రుచి చూడవచ్చు.

Photo Courtesy: UrbanWanderer

మోతి తలావ్, అం బోలి

మోతి తలావ్, అం బోలి

మోతి తలావ్ సావంత్ వాడి ప్రదేశానికి చేరువలో ఉన్నది. తలావ్ అంటే చెరువు అని అర్థం. కొన్ని రాతి ప్రదేశాల మధ్య చుట్టూ కొండలతో మామిడి, తాటి చెట్ల వసుసల మధ్యలో రాయల్ ప్యాలెస్ ముందు భాగంలో దీనిని నిర్మించారు.

Photo Courtesy: telugu native planet

మోతి తలావ్, అం బోలి

మోతి తలావ్, అం బోలి

సావంత్ వాడి పట్టణ మధ్య భాగంలో కల మోతి తలావ్ ను తప్పక చూసి ఆనందించాలి. ఈ ప్రదేశంలో పర్యాటకులు బోట్ విహారం, నీటి క్రీడలు, జోగింగ్ ట్రాక్ వంటివి కూడా ఆచరించవచ్చు.

Photo Courtesy: telugu native planet

రాయల్ ప్యాలెస్, అం బోలి

రాయల్ ప్యాలెస్, అం బోలి

అంబోలి ప్రధాన పర్యాటక ఆకర్షణ రాయల్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ గోధుమరంగు ఇటుకలతో కట్టడం వలన ఆకర్షణీయంగా కనపడుతుంది.

Photo Courtesy: Roopesh Kohad

రాయల్ ప్యాలెస్, అం బోలి

రాయల్ ప్యాలెస్, అం బోలి

ప్యాలెస్ లోపలి గోడలు చారిత్రక కట్టడ వివరాలను చూపుతూ చిత్రాలు కలిగి ఉంటుంది. అద్భుత కళా చిత్రాలు, చెక్కడాలు, యుద్ధపు ఆయుధాలు, పచ్చటి పరసరాల మధ్య పర్యాటకులు ఈ ప్యాలెస్ సందర్శనను ఆనందించవచ్చు.

Photo Courtesy: Don't just "click" pictures; Shoot Stories!

శిల్పాగ్రామ్, అం బోలి

శిల్పాగ్రామ్, అం బోలి

శిల్పాగ్రామ్ కళలు, చేతి పనులకు ప్రసిద్ధి చెందినది. స్ధానిక తయారీ దారులు వస్తువులను తయారు చేసి విక్రయిస్తారు. పర్యాటకుల కళ్ళముందే వస్తువులు తయారు చేసి కూడా ఇస్తారు. గంజిఫా కార్డులు, గాజులు, జ్యూయలరీ బాక్సులు, మట్టి పాత్రలు, లక్క పాత్రలు, చేతి కుట్టు వస్తువులు వంటివి ఇక్కడ తయారవుతాయి.

Photo Courtesy: telugu native planet

భోజనం, అంబోలి

భోజనం, అంబోలి

సావంత్ వాడిలో భలేరావ్ ఖానావళి ఒక రుచికర పదార్ధాల రెస్టరెంటు. ఇక్కడకు వచ్చిన వారు ఈ రెస్టరెంట్ ఆహారాలు రుచి చూడవలసినదే. ఇది పూర్తిగా సంప్రదాయ కొంకణ్ వంటకాలను అందిస్తుంది. కొంకణి ప్రజలు వారు చేసుకొనే ప్రతి వంటకంలో కొబ్బరి కలిపి చేస్తారు.

Photo Courtesy: Avinashvh1n1

షాపింగ్, అంబోలి

షాపింగ్, అంబోలి

పర్యాటకులు అంబోలి వారు తయారు చేసే హస్త కళలను కొనుగోలు చేసుకోవచ్చు. పర్యాటకులు ఈ ప్రదేశంలో చెక్కబొమ్మలు, రాజుల కాలం నాటి వస్తువులను కొనవచ్చు. పెయింటింగ్ పై ఆసక్తి గలవారు అప్పుడే వేసి ఇచ్చే పెయింటింగ్ బొమ్మలను సైతం కొనుక్కోవచ్చు.

Photo Courtesy: Rakeshmallick27

బస

బస

అంబోలి లో వసతి విషయమై చింతించాల్సిన అవసరం లేదు. సరసమైన ధరకే హోటళ్లు, రిశార్ట్ లు మరియు హోంస్టే లు లభిస్తాయి. ఇవి అందంగా మలచబడి పర్యాటకుల హృదయాలను దోచుకుంటాయి.

Photo Courtesy: Niranjan Patil

అంబోలి ఎలా చేరుకోవాలి ??

అంబోలి ఎలా చేరుకోవాలి ??

విమాన ప్రయాణం

అంబోలికి 67 కి.మీ. ల దూరంలో గల గోవాలో స్ధానిక విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మరియు మహా రాష్ట్రలోని ప్రధాన పట్టణాలకు ప్రతిరోజూ రాకపోకలు కలిగి ఉంది. ముంబై లోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనికి సుమారు 492 కి.మీ.ల దూరంలో కలదు.

రైలు ప్రయాణం

అంబోలికి 52 కి.మీ. దూరంలో సావంత్ వాడి రైలు స్టేషన్ కలదు. ఇక్కడి నుండి అంబోలి చేరాలంటే టాక్సీ ధర రూ. 350 గా ఉంటుంది. తేలికగా చేరవచ్చు.

రోడ్డు ప్రయాణం

అంబోలి పట్టణం పాణజిం, కొల్హాపూర్, బెల్గాం వంటి ప్రధాన నగరాలతో రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడింది. ముంబై షుమారు 490 కి.మీ. దూరం కాగా పూనే మరింత దగ్గరగా 343 కి.మీ.ల దూరంలో కలదు. ఈ నగరాలనుండి అంబోలి పట్టణానికి ప్రభుత్వ మరియు ప్రయివేటు వాహనాలు ఎన్నో నడుస్తూంటాయి.

Photo Courtesy: Ajai Singh

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X