Search
  • Follow NativePlanet
Share
» »గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం సమీప పర్యాటక ప్రదేశాలు !

గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం సమీప పర్యాటక ప్రదేశాలు !

By Mohammad

గుండ్ల బ్రహ్మేశ్వరం కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో నల్లమల అడవుల్లో కలదు. ఈ ప్రాంతంలో వివిధ రకాల అడవి చెట్లు, వన్య జంతువులు కనిపిస్తాయి. కర్నూలు, ప్రకాశం జిల్లాల మధ్యన నంద్యాల కు 30 కిలోమీటర్ల దూరంలో సుమారు 1194 చ.కి. మీ. విస్తరించి ఉన్నది ఈ గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాంతం. ఈ దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో గుండ్లకమ్మ అనే చిన్న నది పామువలే మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంటుంది.

గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి, మహాభారతానికి ఒక లింక్ ఉంది. అదేమిటంటే ద్రోణాచార్యుడు (కౌరవుల,పాండవుల గురువు) కుమారుడు అశ్వత్ధామ అక్కడ సంచరిస్తుంటాడని, అక్కడే ఉన్న ఒక ఆలయంలో స్వయాన అతనే శివలింగాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి.

ఇది కూడా చదవండి : ఆంధ్రప్రదేశ్ లోని వన్యమృగ అభయారణ్యాలు !

గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం సమీప పర్యాటక ప్రదేశాలు

గుండ్ల బ్రహ్మేశ్వరంలో చూడదగిన స్థలాలు : ఆలయం, అశ్వత్ధామ ప్రతిష్టించినట్లు చెప్పబడుతున్న శివలింగం, అశ్వత్ధామ విగ్రహం, రెండు చిన్న కోనేరులు, గుండ్లకమ్మ నది, ఆలయం వెలుపల కొన్ని ప్రాచీన విగ్రహాలు. వీటితో పాటు అబ్బురపరిచే ప్రకృతి సౌందర్యం, పక్షుల కిలకిలరావాలు, అభయారణ్యం, అటవీ వృక్షాలు మొదలగునవి గమనించవచ్చు.

గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాంతంలో కనిపించే అడవి చెట్లు

గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాంతంలో కనిపించే అడవి చెట్లు

గుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతం కనుక దుర్భేధ్యమైన వృక్షాలు కలిగి ఉన్నది. అందులో కొన్ని ఔషద చెట్లు, మరికొన్ని వాణిజ్య చెట్లు ఉన్నాయి. టేకు, ఏగిస, తపసి మరియు వెదురు రకాలకు చెందిన వృక్షాలు ఈ అడవుల్లోనే ఉన్నాయి. ఔషద గుణాలు కలిగిన మొక్కల ఆకులనే గిరిజనులు పసరుగా ఉపయోగిస్తారు.

చిత్ర కృప : Dejan Hudoletnjak

గుండ్ల బ్రహ్మేశ్వర వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

గుండ్ల బ్రహ్మేశ్వర వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

దేశంలో మరెక్కడా లేని విధంగా జంతు సంపద గుండ్ల బ్రహ్మేశ్వర వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ లో కలదు. నల్లమల అడవులు పులలకు స్థావరం. ఇక్కడ కనిపించే జంతువులు : ఏనుగులు, చిరుత, ఎలుగుబంటి, నక్కలు, జింకలు, ఉడుము, మొసలి, దుప్పి, కోతి, కొండముచ్చు కోతి, కొండచిలువ మొదలుగునవి.

చిత్ర కృప : Paul Bayfield

గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం

గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం

గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం పురాతమైనది. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్ధామ ఇక్కడి ఆలయంలో పవిత్ర శివలింగాన్ని ప్రతిష్టించినాడు. అశ్వత్ధామ ఈ ఆలయ పరిసరాల్లోనే తిరుగుతుంటాడని చూసినవాళ్ళు, చూడనివాళ్ళు అందరూ చెబుతుంటారు.

చిత్ర కృప : our nandyal

అశ్వత్ధామ విగ్రహం

అశ్వత్ధామ విగ్రహం

గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయం వద్ద అశ్వత్ధామ విగ్రహాన్ని కూడా గమనించవచ్చు. శిధిలావస్థ దశలో ఉన్న ఆలయం బయట ప్రాచీన విగ్రహాలు సైతం తారసపడతాయి.

చిత్ర కృప : our nandyal

పండుగలు

పండుగలు

శివరాత్రి పర్వదినాన గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రం లో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మిగిలిన సమయాల్లో వెళ్ళాలంటే అటవీ అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది.

చిత్ర కృప : our nandyal

ఎలా వెళ్ళాలి ?

ఎలా వెళ్ళాలి ?

గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి చేరుకోవాలంటే ముందుగా మీరు కర్నూలు నగరానికి గాని లేదా నంద్యాల పట్టణానికి గాని చేరుకోవాలి. కర్నూలు రైల్వే స్టేషన్ నుండి 100 కి. మీ. దూరంలో, నంద్యాల రైల్వే స్టేషన్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రం కలదు. శివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Jagadeesh, Posni

వసతి

వసతి

నంద్యాల లోని ఇన్‌స్పెక్షన్ బంగ్లా లో బస చేయవచ్చు లేదా దిగువమెట్ట అటవీ విశ్రాంతి గృహాలలో బస చేయవచ్చు.

చిత్ర కృప : Jatin Adlakha

సందర్శించటానికి అనువైన సమయం

సందర్శించటానికి అనువైన సమయం

గుండ్ల మహేశ్వరం క్షేత్రాన్ని సందర్శించటానికి అనువైన సమయం అక్టోబర్ నుండి మే. ఈ సమయంలో ప్రకృతి అంతా విచ్చుకొని మరింత అందంగా కనిపిస్తుంది.

చిత్ర కృప :Joseph

జలపాతాలు

జలపాతాలు

అటవీ ప్రాంతం కనుక నీటి సవ్వడుల శబ్ధం చెవులకు వీనులవిందు చేస్తుంది. దారి పొడవునా చిన్న చిన్న జలపాతాలు, ఉడుతలు, జింకలు మొదలుగునవి కనిపిస్తాయి.

చిత్ర కృప : Kalidasu Vamsidhar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X