Search
  • Follow NativePlanet
Share
» »హస్సన్ - కర్ణాటక కు శిల్ప రాజధాని !!

హస్సన్ - కర్ణాటక కు శిల్ప రాజధాని !!

హస్సన్ జిల్లా మల్నాడ్, మైదాన ప్రాంతం కిందకి వస్తుంది, జిల్లా మొత్తం అందమైన వాతావరణంతో ఆహ్లాదపరుస్తుంది. హస్సన్ నగరంలో ఉదయాలు వెచ్చగాను, సాయంకాలాలు చల్ల గానూ వుంటాయి.

By Mohammad

పర్యాటక ప్రదేశం : హస్సన్ (జిల్లా పేరు కూడా ఇదే !!)
రాష్ట్రం : కర్నాటక
సమీప చారిత్రక ప్రదేశాలు : హళేబీడు, బేలూర్, సకలేష్ పూర్, శ్రావణబెళగొళ

కర్ణాటక లోని హస్సన్ నగరం, హస్సన్ జిల్లా ప్రధాన కేంద్రం. ఇది 11 వ శతాబ్దంలో చన్న కృష్ణప్ప నాయక్ అనే సామంత రాజుచేత ఏర్పాటుచేయబడింది. స్థానిక దేవత అయిన హస్సనంబ పేరిట ఏర్పడ్డ ఈ జిల్లా కర్నాటకకు శిల్ప రాజధాని అయింది. హోయసల వంశీయుల గొప్ప సంస్కృతి జిల్లా అంతటా కనిపిస్తుంది.

11 వ శతాబ్దం నించి 14వ శతాబ్దం వరకు, అప్పటి రాజధాని నగరమైన ద్వార సముద్ర౦ నుంచి, హోయసల వంశీకులు పరిపాలించారు. హస్సన్ జిల్లాలోని హలేబిడ్ చుట్టూ శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ రాజులు జైన మతానికి చెందినవారయినప్పటికీ, ఆ ప్రాంతం మొత్తం శివాలయాలతో నిండి ఉంటుంది.

<strong>బెంగళూరు నుండి సకలేశ్ పూర్ రోడ్ ట్రిప్ జర్నీ !</strong>బెంగళూరు నుండి సకలేశ్ పూర్ రోడ్ ట్రిప్ జర్నీ !

హస్సన్ జిల్లా మల్నాడ్, మైదాన ప్రాంతం కిందకి వస్తుంది, జిల్లా మొత్తం అందమైన వాతావరణంతో ఆహ్లాదపరుస్తుంది. హస్సన్ నగరంలో ఉదయాలు వెచ్చగాను, సాయంకాలాలు చల్ల గానూ వుంటాయి.

హస్సన్ చుట్టు పక్కల ఆకర్షణలు:

స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే హస్సనాంబ దేవాలయానికి భక్తులు, యాత్రికులు విరివిగా వస్తారు. బేలూర్, హాలేబీడు, శ్రావణ బెలగోళ, గోరూర్ డామ్, ఇక్కడి ప్రసిద్ధ ఆకర్షణలు.

నుగ్గేహళ్ళి

నుగ్గేహళ్ళి

సబ్బు రాయి (సోప్ స్టోన్)తో లేక క్లోరిటిక్ స్కిస్ట్ తో నిర్మించిన లక్ష్మీ నరసింహ స్వామి గుడి, సదాసశివాలయం వల్ల ప్రసిద్ది చెందిన హస్సన్ జిల్లా నుగ్గేహళ్లి పట్టణం యాత్రికులు తప్పక చూడాల్సిందే. ఇది హస్సన్ కు 50 కి. మీ ల దూరంలో ఉన్నది.

చిత్రకృప : Dineshkannambadi

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

త్రికూట (అంటే మూడు గోపురాలు), గోడలపై చెక్కిన అనేక శిల్పాలు, ఒక విమానం (అంటే ప్రార్ధన మందిరం) తో సహా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం 1246 లో నిర్మించబడింది.

చిత్రకృప : Dineshkannambadi

పార్వతీ దేవి విగ్రహం

పార్వతీ దేవి విగ్రహం

ఈ మంటపానికి మూడు పుణ్యక్షేత్రాలు, తొమ్మిది బాహ్య మంటపాలు వున్నాయి. నిలబడి వున్న పార్వతీ దేవి విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప : VikasHegde

సదాశివాలయం

సదాశివాలయం

నాగారం శైలి లో వుండే గోపురం తో సదాశివాలయాన్ని ఏకకూట నిర్మాణ శైలి లో నిర్మించారు. ఈ పుణ్య క్షేత్రం లోని గర్భ గుడిలో పెద్ద శివలింగం వుంది. రాతి గవాక్షాలతో కూడుకున్న ఒక పెద్ద గడిలో అందంగా చెక్కిన నంది విగ్రహం ఉంచారు. ఇక్కడికి చేరుకోగానే - అమ్మవారి గుడి వద్ద, శివాలయం బయట రెండు వినాయకుడి విగ్రహాలు వుండడం గమని౦చవచ్చు.

చిత్రకృప : Dineshkannambadi

యాగాచి

యాగాచి

హాసన్ జిల్లా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగాచి డ్యాం బేలూర్ లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. యగాచి నది మీద (కావేరీ నదికి ఉపనది) సముద్రమట్టానికి 965 అడుగుల ఎత్తులో భారీ జలాశయం నిర్మి౦చారు.

చిత్రకృప : Harijibhv

నీటి క్రీడలు

నీటి క్రీడలు

పర్యాటకులను ఆకర్షించేందుకు ఇటీవలే ఇక్కడి జలాశయంలో జల సాహస క్రీడల కేంద్రం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ప్రయాణీకులు బనానా బోట్ రైడ్, క్రూఇస్ బోట్, స్పీడ్ బోట్, కాయాకింగ్, జెట్ స్కింగ్, బంపర్ రైడ్స్ లాంటి జల క్రీడల్లో పాల్గొనవచ్చు. వీటితో పాటు, ప్రశాంత పరిసరాల నడుమ సమయ౦ గడపాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం.

చిత్రకృప : Harijibhv

ఓంబట్టు

ఓంబట్టు

పర్వతారోహణ లో ఆసక్తి వున్న ప్రయాణీకులు ఓంబట్టు గుడ్డ కొండను చూడటానికి ఆసక్తి పడతారు. దీనికి ఆంగ్లంలో ‘నైన్ హిల్స్ ' అని అర్థం (కన్నడలో ఓంబట్టు అంటే తొమ్మిది అని, గుడ్డ అంటే కొండ అని అర్ధం) అంటారు. ఆ పర్వతపు కొనకి తొమ్మిది వరస గుబ్బలు ఉండటంవల్ల ఆ స్థలానికి ఆ పేరు వచ్చింది.

చిత్రకృప : Ravi S. Ghosh

అటవీ ప్రాంతం

అటవీ ప్రాంతం

ఇది సముద్ర మట్టానికి సుమారు 971 మీటర్ల ఎత్తులో ఉండి, పశ్చిమ కనుమల పరిధిలో ఎత్తైన శిఖరాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ స్థలం కబ్బినలే అటవీ ప్రాంతం తోనూ, షిరాది శ్రిస్ల అటవీ ప్రాంతం తోనూ, బాలూర్ అటవీ ప్రాంతం తోనూ చుట్టుముట్టబడి ఉంది.

చిత్రకృప : Samson Joseph

జీప్ సాయంతో

జీప్ సాయంతో

ఇక్కడ స్థానికులను దారి అడిగేటప్పుడు ప్రయాణీకులు ముర్కల్ గుడ్డ అనే స్థానిక పేరుతో అడగాలి. ఈ స్థలం కబ్బినలే రిసర్వ్ ఫారెస్ట్ లోపల గుండియ చెక్ పోస్ట్ నించి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా ప్రయాణీకులను ఓంబట్టు గుడ్డ స్థావరానికి జీప్ సాయంతో చేరుస్తారు.

చిత్రకృప : Nishanth Jois

ఆసక్తి వున్న వారు

ఆసక్తి వున్న వారు

జీప్ లో వెళ్ళేటప్పుడు పర్యాటకులు అడవిలో చిరుత, కొండ దుప్పి, ఎలుగుబంది, అడవి ఏనుగు, గౌర్ లాంటి క్రూర జంతువులను చూడడానికి అవకాశం ఉంది. ఈ దారి అంతా కబ్బి హోల్ నది వెంట నడుస్తుంది, కాబట్టి ఆసక్తి వున్న వారు ఇక్కడ డైవింగ్ చేయవచ్చు.

చిత్రకృప : Shravan Kamath94

మంజరాబాద్ ఫోర్ట్

మంజరాబాద్ ఫోర్ట్

ఈ ఫోర్ట్ జాతీయ రహదారి 48 పై, సకలేశ్పూర్ వెళ్ళే మార్గంలో ఉన్నది. హస్సన్ నుండి ఈ పార్ట్ కు మధ్య దూరంలో 46 కిలోమీటర్లు. ఇది ఒక కొండ సముద్ర మట్టానికి 3240 అడుగుల ఎత్తులో కలదు. టిప్పు సుల్తాన్ ముస్లిం శిల్పశైలిలో దీనిని నిర్మించాడు. శత్రువుల నుండి, బ్రిటీష్ వారి నుండి మంగళూరు ఓడరేవును రక్షించే క్రమంలో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. కోట పై నుండి పశ్చిమ కనుమల అందాలను తనివితీరా చూడవచ్చు.

చిత్రకృప : Aravind K G

వసతి

వసతి

మూడు నుంచి అయిదు నక్షత్రాల హోటళ్ళతో అసంఖ్యాకమైన యాత్రికులను ఆడరించేందుకు హస్సన్ సిద్ధంగా వుండడం వల్ల ఈ వూళ్ళో వసతికి ఇబ్బందేమీ లేదు. కర్ణాటక లోని చరిత్ర, సంస్కృతి పట్ల అవగాహన పెంచుకోవాలని మీరనుకుంటే, మీరు తప్పక హస్సన్ వెళ్లాల్సిందే.

చిత్రకృప : HoysalaPhotos

హస్సన్ ఎలా చేరుకోవాలి ?

హస్సన్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 117 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : హస్సన్ లో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు, మంగళూరు, మైసూర్ నుండి వచ్చే రైళ్ళన్నీ ఇక్కడ ఆగుతాయి.

రోడ్డు మార్గం : బెంగళూరు, మంగళూరు. మైసూర్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి హస్సన్ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : Tukaram Hanumegowda

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X