Search
  • Follow NativePlanet
Share
» »పడమటి కొండల్లో వెలసిన మూకాంబికా దివ్య క్షేత్రం !

పడమటి కొండల్లో వెలసిన మూకాంబికా దివ్య క్షేత్రం !

By Mohammad

కొల్లూరు కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో గల కుందాపూర్ తాలూకా కు చెందిన ఒక గ్రామం. గ్రామమే కదా అని తీసిపాడేయకండి ... ఈ క్షేత్రానికి ఉన్న మహిమలు అన్ని ఇన్ని కావు. ఈ ప్రదేశం యాత్రికులకు ఎంతో పవిత్రమైనది. చుట్టూ పడమటి కనుమలు, అడవులు మరియు చక్కటి ప్రకృతి అందాలతో అలరించే ప్రదేశం కొల్లూరు.

కొల్లూరు ... బెంగళూరు మహానగరానికి 428 కిలోమీటర్ల దూరంలో, ఉడిపి పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో మరియు మురుడేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండల మధ్య ప్రకృతి అందాలు విందు చేస్తుండగా కొడచాద్రి శిఖరం పై ఉన్న మూకాంబికా ఆలయం భక్తులకు కనువిందు చేస్తుంది.

ఇది కూడా చదవండి : ఉత్తమ తీరులో ఉడిపి పర్యటన !

పడమటి కొండల్లో వెలసిన మూకాంబికా దివ్య క్షేత్రం మహిమలు

పురాణాల్లో పేర్కొన్న ప్రకారం, మూకాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా పీడిస్తుంటే అందరు పార్వతీ దేవిని వేడుకొంటారు. ఆ రాక్షసుడు ఒక మహిళ చేతులలోనే చస్తాడని గ్రహించిన దేవి అతన్ని సులువుగా చంపేసింది. దేవి ధైర్యానికి మెచ్చిన శివుడు ఈ ప్రదేశంలో తన కాలి మడమతో శ్రీ చక్రాన్ని సృష్టించి ప్రతిష్టించాడని ప్రతీతి.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మహిమలు ఈ క్షేత్రం పుట్టుకను చెబుతాయి. ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి పంచ లోహ విగ్రహాన్ని ప్రతిష్టించాడని, పరుశురాముడు ఈ ఆలయాన్ని సృష్టించాడని ఒక్కోరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఏది ఏమైనా మూకాంబికా దేవాలయం మహిమ కలది మరియు పురాతనమైనది. ఆలయం తో పాటుగా ఇక్కడ సందర్శించే మరికొన్ని ప్రధాన ఆకర్షణలు ...

మూకాంబికా దేవాలయం

మూకాంబికా దేవాలయం

కొల్లూరు సందర్శనలో ప్రధానమైనది మూకాంబికా ఆలయం. మన అదిలాబాద్ బాసర లో అక్షరాభ్యాసం చేయటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అంతే ప్రాధాన్యత ఇక్కడ కూడా ఇస్తారు. బాలబాలికలకు ఆలయ సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు అధిరోహిస్తారని, జ్ఞాన సంపన్నులు అవుతారని ప్రతీతి.

చిత్ర కృప : Sreeram R

మూకాంబికా దేవాలయం

మూకాంబికా దేవాలయం

మూకాంబికా ఆలయ నిర్మాణం హిందూ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ... శిల్పకళా సౌందర్యంతో విలసిల్లుతూ ఉంటుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఎదురుగా జ్యోతిర్మయ లింగం, సింహ ద్వారం ప్రవేశంలో కాలభైరవుని విగ్రహం దర్శనమిస్తాయి.

చిత్ర కృప : Gilbert George

పండుగలు, ఉత్సవాలు

పండుగలు, ఉత్సవాలు

నవరాత్రి లేదా దసరా సమయంలో కొల్లూరు లోని మూకాంబికా ఆలయానికి వేలసంఖ్యలో భక్తులు వస్తారు . సౌపర్నికా నది ఒడ్డున పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీ. ఆ సమయంలో ఆలయాన్ని అందమైన పూలతో ముస్తాబుచేస్తారు.

చిత్ర కృప : Anulal

దేవాలయ పూజా క్రమము

దేవాలయ పూజా క్రమము

మూకాంబికా ఆలయంలో రోజుకు మూడు సార్లు హారతి ఇస్తారు. హారతి ఇచ్చే సమయాలు : ఉదయం 7 : 30 కు, మధ్యాహ్నం 12 : 30 కు మరియు రాత్రి 7 : 00 కు. హారతిని దర్శించటం ఆలయంలో ప్రధాన ఘట్టం. ఈ ఆలయానికి ఎక్కువగా కేరళీయులు వస్తూ వుంటారు . అమ్మవారి ఆలయ ప్రాకారం లోపల ఉన్న శ్రీ చక్రంలో కూర్చొని ధ్యానం చేసుకుని వెళ్తూ వుంటారు.

చిత్ర కృప : Anulal

ప్రసాదం

ప్రసాదం

మూకాంబికా ఆలయంలో - తేనే మరియు ఇంకొన్ని తియ్యని పదార్థాలతో కలిపి తయారుచేసిన 'పంచకజ్జాయం' అనే ప్రసాదం ఇస్తారు. అమ్మవారి ఆలయంలో లోపల పెద్ద భోజన శాల కూడా ఉన్నది. ఇక్కడ రోజుకు రెండు పూటలా భక్తులకు ఉచితంగా భోజనం పెడతారు.

చిత్ర కృప : indian recipies

ఆలయంలో ఇతర దేవతలు

ఆలయంలో ఇతర దేవతలు

మూకాంబికా గుడి లోని ఇతర దేవతామూర్తులు - శ్రీ సుబ్రమణ్య, శ్రీ పార్థేశ్వర, శ్రీ పంచముఖ గణపతి, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ ప్రాణలింగేశ్వర, శ్రీ నంజుండేశ్వర, శ్రీ ఆంజనేయ, శ్రీ వెంకటరమణ, శ్రీ తులసి గోపాలకృష్ణలు.

చిత్ర కృప : Shantanu Nagarkatti

గరుడ గుహ

గరుడ గుహ

గరుడ గుహ కొల్లూరు లో చూడవలసిన పర్యాటక ప్రదేశం. పరుశురాముని ఆలయానికి, ఇస్కాన్ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ స్థలంలో గరుడ దేవుణ్ణి భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం, గరుడ దేవుడు ఇక్కడ తపస్సు చేశారని కథనం.

చిత్ర కృప : ababh

మరణ కట్టే

మరణ కట్టే

మరణ కట్టే కుందాపురా - కొల్లూరు మార్గాన కలదు. మాతా మూకాంబికా మూకాసురుడిని ఈ ప్రదేశంలోని కొడచాద్రి కొండపై సంహరించిందని స్థానికులు చెబుతారు. ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ చూడవలసినది మాత్రం బ్రహ్మలింగేశ్వర ఆలయం.

చిత్ర కృప : రామ ShastriX

బ్రహ్మ లింగేశ్వర ఆలయం

బ్రహ్మ లింగేశ్వర ఆలయం

బ్రహ్మ లింగేశ్వర ఆలయం తూర్పు వైపుగా ఉండి, గర్భగుడి ఉత్తర దిశగా ఉంటుంది. వాత యక్షి, మళయాళ యక్షి ద్వారపాలకుల విగ్రహాలు ఆలయంలో ఉంటాయి. యాత్రికులు ఈ ఆలయాన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు.

చిత్ర కృప : wikicommons

మస్తి కట్టే

మస్తి కట్టే

మస్తి కట్టే లో అడవి దేవతలు ఉంటారు. స్థానిక పూజారులే నిత్య పూజలు చేస్తుంటారు. ఇక్కడి దేవతలకు వ్యాధులను నివారించే మహిమలుంటాయని చెబుతారు. ఊయల, గాజులు, పూలు, గంటలు వంటివి దేవతలకు సమర్పిస్తారు.

చిత్ర కృప : vprekshya

మూకాంబికా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

మూకాంబికా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

మూకాంబికా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ 247 చ. కి. మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా, తేమగా ఉంటుంది. వివిధ రకాల జంతువులకు నివాసంగా ఉండి, పక్షి వీక్షకులను కనువిందు చేస్తుంది. ఈ స్యాంక్చురీ లో ట్రెక్కింగ్ ఆనందించగలరు. సందర్శించటానికి అనువైన సమయం నవంబర్ నుండి మార్చి.

చిత్ర కృప : Anulal

బెలకల్లు తీర్థ

బెలకల్లు తీర్థ

బెలకల్లు తీర్థ ఒక అందమైన జలపాతం. చుట్టూ ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. సాహస పర్యాటకులకు ట్రెక్కింగ్ ఇక్కడ సూచించదగినది.

చిత్ర కృప : Vishnu Menon M

అరిశెనగుండి జలపాతాలు

అరిశెనగుండి జలపాతాలు

అరిశెనగుండి జలపాతాలు తప్పక సందర్శించవలసినవి. ఇవి మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో భాగంగా ఉన్నాయి. ట్రెక్కింగ్ లో చేస్తూ ఇక్కడకు చేరాలి. పర్యాటకులు ట్రెక్కింగ్ కొరకు స్యాంక్చురీ అధికారుల అనుమతి ముందుగా తీసుకోవాలి. పర్యాటకులు ఏ కాలంలో నైనా సరే ఈ ప్రదేశం చూడవచ్చు.

చిత్ర కృప : Prashanth D

ఎంజీ రామచంద్రన్

ఎంజీ రామచంద్రన్

పరమ నాస్తికుడైన తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి ఎంజీ రామచంద్రన్ సైతం , తన చివరి రోజులలో, బాగా జబ్బుపడి, మాటలు కూడా రాణి స్థితిలో ఉండగా, ఇక్కడికి స్వయముగా వచ్చి మూకంబికా అమ్మ వారికి కానుకలు సమర్పించుకున్నారంటే, ఈ క్షేత్రం ఎంత ప్రసిద్ది పొందిందో అర్ధం చేసుకోవచ్చు.

చిత్ర కృప : aravind srinivasan

జీవితంలో ఒక్కసారైనా ...

జీవితంలో ఒక్కసారైనా ...

రకరకాల వ్యాధులకు గురైనవారు, మూగవారు, ఈ మూకాంబిక తల్లి దర్శనం చేసుకుంటే మాటలు వస్తాయని భక్తుల విశ్వాసం . అందువల్ల ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం ఈ "కొల్లూరు ".

చిత్ర కృప : Gilbert George

వసతి

వసతి

కొల్లూరు లో బస చేయటానికై లాడ్జీ లు, ఆలయ వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్సవాలు, నవరాత్రి సమయాల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు కాబట్టి ఒక నెల ముందరగానే బుక్ చేయటం మంచింది. యాత్రికులందరికీ సరసమైన ధరకే రూములు అద్దెకు లభిస్తాయి.

చిత్ర కృప : Jayanth Sridhar

కొల్లూరు ఎలా చేరుకోవాలి ??

కొల్లూరు ఎలా చేరుకోవాలి ??

కొల్లూరు చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి

వాయు మార్గం

కొల్లూరుకు సమీపంలో అంటే 128 కి.మీ. ల దూరంలో మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుండివివిధ దేశాలకు, దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు విమాన రాకపోకలు కలవు. క్యాబ్ లేదా ఏదేని ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని కొల్లూరు చేరుకోవచ్చు.

రైలు మార్గం

కొల్లూరు కు కుందాపుర రైలు స్టేషన్ దగ్గరిదిగా షుమారు 40 కి.మీ. ల దూరంలో ఉంటుంది. కుందాపుర రైలు స్టేషన్ నుండి సమీప నగరాలకు, పట్టణాలకు రైళ్ళు కలవు. పర్యాటకులు టాక్సీలు లేదా బస్సులలో కొల్లూరు చేరవచ్చు.

బస్సు మార్గం

కొల్లూరు క్షేత్రానికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ వివిధ పట్టణాల నుండి, నగరాల నుండి బస్సులు నడుపుతుంది. మంగుళూరు, ఉడుపి, మరియు కుందాపూర్ నుండి నేరుగా ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు ఉన్నాయి.

చిత్ర కృప : Diljeet Nair

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X