Search
  • Follow NativePlanet
Share
» »నిండు గోదావరిలా ... గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణం !

నిండు గోదావరిలా ... గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణం !

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్. ఈ రైలు విశాఖపట్టణం నుండి హైదరాబాద్ మధ్యలో నడుస్తుంది. ఈ రైలుకు ఉభయగోదావరి జిల్లా ప్రజలకు ప్రత్యేకమైన అనుభంధం ఉంది. ఉభయ గోదావరి జిల్లా వాసులు ఎక్కువగా ఎక్కి ప్రయాణించేది ఈ రైలు లోనే. ఒక్కసారి ప్రయాణిస్తే చాలు మళ్లీ మళ్లీ ప్రయాణించాలి అనేంతగా ఉంటుంది.

నిండు గోదావరి ప్రవాహం ఎలా ఉంటుందో, అలాగే ఈ రైలు ప్రయాణీకులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఖాళీ అనేదే ఉండదు, రిజర్వేషన్ రెండు నెలల ముందుగానే అయిపోతుంది. ఎందరిని తీసుకొని వెళుతుంది ... మరెందరినో తీసుకువస్తుంది ... ఎందుకంటే ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది .. ఒకటి వెళుతుంటే మరొకటి ఎదురువస్తుంది. హైదరాబాద్ నుండి విశాఖపట్టణం మధ్య నడిచే ఈ రైలు 41 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ గురించి కొద్ది మాటల్లో ...

గోదావరి రైలు పుట్టుక

గోదావరి రైలు పుట్టుక

గోదావరి రైలు 1974 వ సంవత్సరం లో ఫిబ్రవరి ఒకటో తారీఖున స్టీమ్ ఇంజన్ తో మొట్టమొదటిసారి పట్టాలు ఎక్కింది. ఈ రైలు మొదటి సారి వాల్తేరు - హైదరాబాద్ మధ్య నడిచింది.

Photo Courtesy: Lakshman Thodla

ఆదరణ తగ్గలేదు

ఆదరణ తగ్గలేదు

గరీబ్ రథ్ ఏసీ రైలు మరియు దురంతో నాన్ స్టాప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెట్టినా కూడా గోదావరి రైలు మీద వారు(ఉభయగోదావరి ప్రజలు) చూపే అభిమానం, ఆదరణ ఎంతమాత్రం తగ్గలేదు.

Photo Courtesy: Railoholics IR

టైమింగ్

టైమింగ్

శుభ్రతలోనూ, టైమింగ్ లోను ఏమాత్రం రాజీపడకుండా ఉంటుంది ఈ రైలు అందుకే ప్రయాణీకులు గోదావరి రైలు ఇష్టపడేది. విఐపీ లు, వివిఐపీ సైతం ఈ రైలు లో ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

Photo Courtesy: M V S Murthy

పొడవైన రైలు

పొడవైన రైలు

24 బోగీలతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అతి పొడవైన రైలుగా ఖ్యాతి గడించింది. 1300 మంది వరకు ప్రయాణించే ఈ రైలులో రెండు లగేజ్ కమ్ స్లీపర్ వ్యాన్ లు, రెండు రిజర్వేషన్ లు లేని బోగీలు, 12 స్లీపర్ తరగతి బోగీలు, 3 థర్డ్ క్లాస్ బోగీలు, రెండు సెకెండ్ క్లాస్ బోగీలు మరియు ఒకటి ఫస్ట్ క్లాస్ బోగీలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైలులో 6 ఏసీ బోజీలతో నడిచిన మొదటి రైలు ఇదే..!

Photo Courtesy: rburra

ప్రయాణం

ప్రయాణం

గోదావరి రైలు లో హైదరాబాద్ నుండి వైజాగ్ కి ప్రయాణించడానికి మొత్తం 13 గంటలు తీసుకుంటుంది. హైదరాబాద్ నుండి వైజాగ్ మధ్య దూరం 708 కి. మీ. ఉంటుంది. గంట కు 110 కి. మీ. వేగంతో దూసుకెళ్తుంది.

Photo Courtesy: Jattin Bhavsar

ఎప్పుడెప్పుడు ?

ఎప్పుడెప్పుడు ?

నాంపల్లి స్టేషన్ లో ప్రతిరోజూ సాయంత్రం 5గంటల 15 నిమిషాలకి బయలుదేరి, ఉదయం 5 గంటల 50 నిమిషాలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. అలాగే విశాఖ పట్టణం జంక్షన్ నుండి సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకి బయలుదేరి, ఉదయం 6 గంటల 15 నిమిషాలకి హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ చేరుకుంటుంది.

Photo Courtesy: Railoholics IR

స్టాప్ లు

స్టాప్ లు

గోదావరి రైలు లో హైదరాబాద్ లో నాంపల్లి స్టేషన్ నుండి ప్రయాణం మొదలు పెడితే విశాఖ పట్టణం 21 వ స్టాప్ అవుతుంది. సికింద్రాబాద్ ఎలాగో హైదరాబాద్ లో నే ఉంది కనక మొత్తం 20 స్టాప్ లతో కలిగి ఉంది.

Photo Courtesy: Chandu Nelaturi

హైదరాబాద్

హైదరాబాద్

హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని. ఇక్కడ మనం చార్మినార్, గోల్కొండ కోట, బిర్లా మందిరం వంటి వాటితో పాటుగా అనేక చారిత్రక, వినోదాత్మక, ఆధ్యాత్మిక కేంద్రాలను చూడవచ్చు. షాపింగ్ చేసేటప్పుడు సందడి ఇష్టపడేవారైతే చార్మినార్ సందుల్లో, అబిడ్స్, కోఠి వంటి ప్రదేశాలలో షాపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మాల్స్ లలో షాపింగ్ చేసే వారైతే హైదరాబాద్ సెంట్రల్, జివికె వన్, ఇన్ ఆర్బిట్ మాల్ , సిటీ క్యాపిటల్ మాల్ మొదలైన వాటిలో షాపింగ్ చేసుకోవచ్చు.

Photo Courtesy: Ben Sutherland

కాజీపేట జంక్షన్

కాజీపేట జంక్షన్

వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ కు 2 కి. మీ. దూరంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హజరాత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా ఒకటి ఉంది. ప్రపంచంలో ఉన్న మూడు ప్రముఖ దర్గాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉర్స్ ఉత్సవాలకు ముస్లీములు, హిందువులు, క్రైస్తవులు ఇలా ఏ మతం వారైన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి సందర్శిస్తుంటారు.

Photo Courtesy: Nikhilb239

వరంగల్

వరంగల్

తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ తరువాత అతి పెద్ద నగరం వరంగల్. ఈ ప్రదేశాన్ని కాకతీయ రాజులు రాజధాని చేసుకొని పరిపాలించారు. వరంగల్ లో ప్రముఖంగా చూడవలసినది వరంగల్ కోట, వేయి స్థంబాల గుడి, రామప్ప దేవాలయం, పాకాల సరస్సు. ఇక్కడనే పేరు పొందిన ఒక జాతర జరుగుతుంది. అదే సమ్మక్క - సారక్క జాతర. ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సుమారు 10 మిలియన్ల భక్తులు హాజరయ్యే ఈ జాతర ఆసియా ఖండం లోనే కుంభమేళా తరువాత రెండవ అతి పెద్ద జాతర.

Photo Courtesy: Sekhar ۞

మహబూబాబాద్

మహబూబాబాద్

మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని ఒక మండలం. ఎన్నో విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులున్న ఈ పట్టణం వరంగల్ జిల్లాలో వరంగల్ తరువాత అతి పెద్ద పట్టణం. ఈ మండలం లోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అనంతాద్రి ఆలయం తప్పక చూడాలి.

Photo Courtesy: Rcbutcher

ఖమ్మం

ఖమ్మం

ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం లో కోటల నగరం గా ముద్ర పడింది. ఇక్కడ సుప్రసిద్ధ ఖమ్మం కోటనే కాదు, ఎన్నో ఆలయాలు ప్రముఖ పర్యాటక ఆకర్షణలుగా నిలిచాయి. ఈ జిల్లా లోనే కాక దేశం మొత్తం లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం భద్రాచలం ఉంది. ఇక్కడ రాముల వారి గుడి చాలా ప్రశస్తి కలది. ఈ ఆలయం జీవనది అయిన గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఆలయం లో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

Photo Courtesy: Pranayraj1985

విజయవాడ

విజయవాడ

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ నగరం. ఈ నగరం కృష్ణా నది ఒడ్డున ఉన్నది. దీనిని బెజవాడ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఇంద్రకీలాద్రి ఆలయం ఒక కొండమీద ఉంది. ఈ ఆలయం దసరా పండుగ నాడు లక్షల భక్త జనంతో కిటకిటలాడుతుంది. రుచికరమైన వివిధ రకాల మామిడి పండ్లకు, తియ్యని మిఠాయిలకు మరియు అందమైన పర్యాటక ప్రదేశాలకు ఈ నగరం ఆకర్షణగా ఉన్నది. సమీపంలోనే అమరావతి, ఉండవల్లి గుహలు, భవాని ద్వీపం మొదలగునవి చూడవచ్చు.

Photo Courtesy: Sridhar1000

ఏలూరు

ఏలూరు

ఏలూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణంగా ఉంది. ఈ నగరం విజయవాడ నగరానికి 63 కి. మీ. దూరంలో మరియు రాజమండ్రి నగరానికి 98 కి. మీ. దూరంలో ఉన్నది. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ఏలూరు నుండిఉత్పత్తి అయి, ప్రసిద్ధ బ్రాండ్ గా నిలిచింది. ఆలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు గల ఈ ప్రదేశం ప్రముఖ పర్యాటక ప్రదేశం గా నిలిచింది.

Photo Courtesy: Rajkarak

తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం. ఈ పట్టణం విజయవాడకు 100 కి. మీ. దూరంలో ఉన్నది మరియు రాజమండ్రి కి 45 కి. మీ. దూరంలో ఉన్నది. బెల్లం, పప్పు దినుసుల వ్యాపారానికి మిక్కిలి ప్రసిద్ధి చెందినది. వేసవి కాలం వచ్చిందంటే తాడేపల్లిగూడెం మామిడి కాయలతో కలకళలాడుతుంది. చాక్ పీసులు, కొవ్వొత్తీలు, బెల్లం తయారీ పరిశ్రమలతో పాటు రైస్ మిల్లులు అధికంగానే ఉన్నాయి.

Photo Courtesy: KATTAMURI VENKATA SUBRAHMANYAM

నిడదవోలు

నిడదవోలు

నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రముఖ పట్టణం. నిడదవోలు ఒక చారిత్రక ప్రసిద్ధి గల నగరం. దీనిని కేంద్రంగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఇక్కడ గోళింగేశ్వర స్వామి ఆలయం, సోమేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రముఖమైనవి.

Photo Courtesy: Milan Chatterjee

రాజమండ్రి

రాజమండ్రి

రాజమండ్రి నగరం తూర్పు గోదావరి జిల్లా లో గోదావరి నది ఒడ్డున ఉన్న పెద్ద నగరం. దీనిని ఆంధ్ర ప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని పిలుస్తారు. రాజమహేంద్రి అని పిలువబడే ఈ నగరం లో గోదావరి పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ చూడవలసిన ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి.

Photo Courtesy: Roopesh Kohad

అనపర్తి

అనపర్తి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కి 23 కి. మీ. దూరంలో ఉన్న అనపర్తి ఒక మండలము. పచ్చని పొలాలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశం వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్రసిద్ధి చెందినది. ప్రస్తుతం విద్యా కేంద్రంగా సేవలందిస్తుంది. ఇక్కడ వీరుళ్ళమ్మ జాతర మరియు బాపనమ్మ జాతర లను వైభవంగా నిర్వహిస్తారు.

Photo Courtesy: Goutham Sudalagunta

సామర్లకోట

సామర్లకోట

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి నుంచి 47 కి. మీ. దూరంలో ఉన్న సామర్లకోట ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇక్కడ పంచరామాలలో ఒకటైన భీమేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివలింగం ఏటేటా పెరిగిపోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. మాండవ నారాయణస్వామి మరియు ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయాలు కూడా ఇక్కడ చూడవచ్చు.

Photo Courtesy: Aditya Gopal

పిఠాపురం

పిఠాపురం

తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి కి 59 కి. మీ. దూరంలో ఉన్న పిఠాపురం ప్రముఖ పర్యాటక కేంద్రం. పిఠాపురం లో కుంతీ మాధవస్వామి ఆలయం, కుక్కుటేశ్వర స్వామి ఆలయం చెప్పుకోదగ్గవి. వీటితో పాటుగా పురుహూతికా దేవి ఆలయం, కాలభైరవుణి ఆలయం, సాయిబాబా మందిరం కూడా చూడవచ్చు.

Photo Courtesy: KATTAMURI VENKATA SUBRAHMANYAM

అన్నవరం

అన్నవరం

అన్నవరం రాజమండ్రి నగరానికి 70 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ ప్రదేశంలో శ్రీ సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నాడు. కనుకనే ఈ ప్రదేశం హిందువుల దివ్య క్షేత్రంగా విరజిల్లుతుంది. ఇక్కడ సామూహికంగా వందలాది మంది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై నిర్మించినారు. కార్తీక మాసంలో ఇక్కడికి కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు.

Photo Courtesy: Adityamadhav83

తుని

తుని

తుని తూర్పు గోదావరి జిల్లాలో, విశాఖపట్టణం జిల్లా సరిహద్దులో తాండవ నది ఒడ్డున ఉన్నది. ఈ ప్రదేశం గుండా జాతీయ రహదారి 5 వెళుతుంది. విశాఖ నగరానికి 98 కి. మీ. దూరంలో, రాజమండ్రి నగరానికి 105 కి. మీ. దూరంలో ఉన్నది. తుని మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ 250 రకాల పళ్ళు దొరుకుతాయి. వీటితో పాటు చేనేత బట్టలు, బెల్లం, తమలపాకులు కూడా ఎగుమతి చేస్తుంటారు. తుని లోనే అల్లూరి సీతారామరాజు చదువుకున్నాడు.

Photo Courtesy: Srichakra Pranav

నర్సీపట్నం

నర్సీపట్నం

నర్సీపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాలు చెందిన ఒక మండలం. ఇక్కడి నుండి ఎటువైపు వెళ్ళినా ఏజెన్సీ వస్తుంది కనుక దీనిని గేట్ వే ఆఫ్ ఏజెన్సీ అని పిలుస్తారు. ఇక్కడ ప్రముఖ చారిత్రక కట్టడాలుగా బ్రిటీష్ కాలం నాటి తాలూకా ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి.

Photo Courtesy: India Photos

ఎలమంచిలి

ఎలమంచిలి

ఎలమంచిలి సముద్ర మట్టం నుండి 7 మీటర్ల ఎత్తులో, విశాఖ పట్టణం నగరం నుంచి 64 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ వరి, చెరకు ప్రధానంగా పండిస్తారు. ఎలమంచిలి లో పంచాదార్ల ధర్మాలింగేశ్వర ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఉపమాన వెంకన్న ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం ప్రముఖమైనవి.

Photo Courtesy: nvasireddy

అనకాపల్లి

అనకాపల్లి

విశాఖ పట్టణం నుండి 30 కి. మీ. దూరంలో ఉన్న అనకాపల్లి వ్యాపార పరంగా అభివృద్ధి చెందినది. బెల్లం మరియు కొబ్బరి ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులు. ఇక్కడికి దగ్గరలో బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధరామం ఉంది. బొజ్జన్న అంటే ఇక్కడ బుద్ధుడు అని అర్థం. కాకతాంబిక ఆలయం, గౌరమ్మ గుడి ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలుగా చెప్పుకోవచ్చు.

Photo Courtesy: KATTAMURI VENKATA SUBRAHMANYAM

దువ్వాడ

దువ్వాడ

విశాఖ పట్టణానికి 12 కి. మీ. దూరంలో దువ్వాడ గ్రామం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి దగ్గరలో దువ్వాడ ఉన్నందున ఈ ప్రదేశ పరిసరాలన్ని పరిశ్రమలతో అభివృద్ధి చెందుతుంది.

Photo Courtesy:Raam Krrish

విశాఖపట్నం

విశాఖపట్నం

వైజాగ్ దీనినే విశాఖ పట్టణం అని పిలుస్తారు. ఈ నగరం బంగాళాఖాతం నది ఒడ్డున ఉన్నది. విశాఖ పట్టణం పోర్ట్ టౌన్ గా ప్రాచూర్యం పొందింది. వైజాగ్ నగరం పర్యాటకులకు స్వర్గ ధామంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అందమైన బీచ్ లు, సుందరమైన తిప్పలతో కావలసినంత వినోదం లభిస్తుంది. వైజాగ్ నగరం చుట్టూ వెంకటేశ్వర కొండ, రాస్ కొండ మరియు దర్గా కొండ ఉన్నాయి. ఈ మూడు కొండల్లో మూడు భిన్న మతాలకు చెందిన విగ్రహాలు ఉన్నాయి.

Photo Courtesy: Venkat Yarabati

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X