Search
  • Follow NativePlanet
Share
» »ఏప్రిల్ లో ఉత్తర భారతదేశ ప్రయాణం!!

ఏప్రిల్ లో ఉత్తర భారతదేశ ప్రయాణం!!

వేసవి కాలం రానే వచ్చింది...ఇక రేపోమాపో పిల్లలకి కూడా సెలవులు వస్తున్నాయి. ఏమీ చేయాలి అని అనుకుంటున్నారా?? పిల్లలతో కలసి ఎక్కడికైనా వెళ్ళాలానుకుంటున్నారా?? అయితే మీరు ఉత్తర భారతదేశ ప్రయాణాలు చేస్తే మేలు!!
నార్త్ ఇండియా( ఉత్తర భారతదేశం)లో మీరు విశ్రాంతి, ఆనందం పొందేందుకై చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రాంతం జమ్మూ & కాశ్మీర్. ఎందుకంటే ఈ భూమి స్వర్గం మాదిరి అవుపిస్తుంది, అంతే కాదు కలుషితం కాని స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. మరొక చెప్పుకోదగ్గ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. ఈ ప్రాంతం గురించి చెప్పాల్సిన పనేలేడు ఎందుకంటే దాని చరిత్రనే చెబుతుంది ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి!!వీటితో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్ మరియు హర్యానా ప్రాంతాలలో కూడా చెప్పుకోదగ్గ ప్రదేశాలు ఉన్నాయి.ఈ ప్రదేశాలన్నీ కూడా ఏప్రిల్ నెలలో విహారాలుగా ప్రశస్తి చెందినవే!! ఇప్పుడు మనం ఇక్కడున్న ప్రాంతాల సౌందర్యాలను, విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను మరియు ఎందుకంత గుర్తింపు లభించిందో తెలుసుకుందాం!!

ధార్చుల

ధార్చుల

ధార్చుల ఉత్తరాఖండ్ లో పిథొరగర్హ్ జిల్లాలో ఇండో-నేపాల్ బార్డర్ మీద ఉన్న ఒక అందమైన పట్టణం. ఈ ప్రదేశం యొక్క పేరు రెండు మాటలు 'ధార్' మరియు 'చుల', నుండి ఏర్పడింది. 'దార్' అంటే శిఖరం మరియు 'చుల' అంటే స్టవ్ అని హిందీలో అంటారు. ఈ హిల్ పట్టణం స్టవ్ ఆకారంలో ఉండటం వలన దీనికి ఈ పేరు వొచ్చింది. ఈ పట్టణంలో మానస సరోవర్ మరియు మానస సరస్సు వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.ఈ సరస్సు హిందూమతం మరియు బౌద్ధమతం యొక్క గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ప్రయాణికులు ధార్చులను సందర్శించటానికి వొచ్చినప్పుడు, సమీపంలో ఉన్న ఓం పర్వత్, ఆది కైలాష్, ఇండియా-నేపాల్ మరియు ఇండియా-సైనో బార్డర్ మరియు నారాయణ్ ఆశ్రమం మొదలైన వాటిని కూడా చూడవొచ్చు.

Photo Courtesy: rajkumar1220

సిర్సా

సిర్సా

జిల్లా ప్రధాన కేంద్రం అయిన సిర్సా పేరే జిల్లాకు కూడా పెట్టారు. ఈ జిల్లా ఉత్తర భారతంలోని చాలా పురాతన ప్రదేశాల్లో ఒకటిగా భావిస్తారు. సిర్సా గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన వుంది, అయితే దాన్ని అప్పట్లో సైరిశక అని పిలిచేవారు. మహాభారతంలో నకులుడు తన దండ యాత్రలో భాగంగా పశ్చిమాన వున్న సైరిశకను చేజిక్కించుకున్నట్టు వుంది. క్రీ.పూ.5 వ శతాబ్దం నాటికే సిర్సా సంపన్న నగరంగా ఉండేదని పేర్కొన్నాడు. సిర్సా నగరం, దాని పరిసరాలు మనకు ఘగ్గర్ లోయ ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వ౦ గురించి తెలియ చేస్తాయి. భారతీయ పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

Photo Courtesy: Native Planet

అర్కి

అర్కి

అర్కి హిమాచల్ ప్రదేశంలోని సోలన్ జిల్లా లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడున్న ఆందాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడున్న ఆందాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఆర్కి కోట, ఆర్కి ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలు చూస్తే అదిరిపొద్ది. ఎందుకంటే అక్కడున్న అద్భుత కళాఖండాలు ఇట్టే కట్టిపాడేస్తాయి. ఇక అక్కడున్న అద్భుత కళా ఖండాల నుంచి బయటికి వస్తే పురాతన ఆలయాలు దర్శనమిస్తాయి. వాటిలో లుటూరు మహాదేవ టెంపుల్, దుర్గ టెంపుల్, శకుని మహాదేవ టెంపుల్ ప్రధానమైనవి. లుతురు మహాదేవ టెంపుల్ లో హిందువుల దైవం శివుడు ఉంటాడు. దుర్గ టెంపుల్ తప్పక చూడదగినది దీని నిర్మాణం శిఖర తీరులో వుండగా, శకుని మహాదేవ టెంపుల్ అతి ఎత్తు లో వుంది.

Photo Courtesy: Kumar Chitrang

బరోగ్

బరోగ్

బరోగ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని సోలన్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. చూర్ చాందినీ పీక్ అనే ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షించే ప్రదేశము. బరోగ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు దగ్శై , విశాల్ శివ ఆలయం, దోలంజి బాన్ మొనాస్టరీ మరియు రేణుక సరస్సు ఉన్నాయి. వీటితో పాటు షోలోని దేవి ఆలయం, పిల్లల పార్కు మరియు జవహర్ పార్క్ ను కూడా పర్యాటకులు తరచుగా సందర్శిస్తూ ఉంటారు.

Photo Courtesy: Fred Hsu

అవన్తిపూర్

అవన్తిపూర్

జమ్మూ & కాశ్మీర్ లో అవన్తిపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం లో రెండు పురాతన దేవాలయాలు అంటే శివ అవన్తీశ్వర మరియు అవన్తిస్వామి విష్ణు లవి కలవు. ఈ రెండు దేవాలయాలాను 9 వ శతాబ్దం లో రాజు అవంతి వర్మ నిర్మించాడు. వీటిలో శివ అవన్తీశ్వర -లయకారుడు శివుడికి, అవన్తిస్వామి విష్ణు -విష్ణువు కు నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం లో అనుసరించిన శిల్ప శైలి గ్రీకుల శిల్ప శైలి ని పోలి వుంటుంది. ఈ దేవాలయాలు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, వీటిని మనం చూడవచ్చు.

Photo Courtesy: Varun Shiv Kapur

బారాముల్లా

బారాముల్లా

జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో గల జిల్లాలో ఒక జిల్లాగా బారాముల్లా ఉన్నది. ఈ పట్టణ చరిత్రను ఒకసారి చూసినట్లయితే, ఈ పురాతన నగరం క్రీ.పూ.2306 లో భీంసీన రాజా వారిచే స్థాపించబడినది. ఈ ప్రదేశాన్ని మొఘలు చక్రవర్తి అక్బర్ క్రీ.శ. 1508 లో దర్శించాడు. కాశ్మీరుకి వెళుతూ మార్గమధ్యలో దీని అందానికి ముగ్ధుడైన జహంగీరు ఇక్కడే కొంతకాలం నివసించాలని నిర్ణయించుకున్నాడట!!. సుప్రసిద్ధ చైనా టూరిస్ట్ యాత్రికుడు హ్యూయాన్ త్స్సాంగ్ కూడా ఒకసారి బారాముల్లాని సందర్శించాడు.

Photo Courtesy: Aehsaan

లుధియానా

లుధియానా

సట్లేజ్ నది ఒడ్డుపై ఉన్న లుధియానా, భారతీయ రాష్ట్రమైన పంజాబ్ లోని అతిపెద్ద నగరం. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న ఈ నగరం న్యూ సిటీ, ఓల్డ్ సిటీ గా విభజించబడింది. లోధి వంశ పేరుమీద ఈ నగరం 1480 లో స్థాపించబడింది. లుధియానాలో ఉండే స్థానికులు, మర్యాదకు పేరుగాంచారు.ఈ నగరం సందర్శకులకు వినోదాన్ని అందించే అనేక పర్యాటక ఆకర్షణలకు నిలయం. గురుద్వారా మంజీ సాహిబ్, గురు నానక్ భవన్, ఫిల్లార్ ఫోర్ట్, మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం, గురు నానక్ స్టేడియం, రాఖ్ బాగ్ పార్కు, మొదలైనవి కొన్ని లుధ్ధియానాలోని పర్యటకంలో ప్రసిద్ధమైనవి.

Photo Courtesy: aadhunik

బితూర్

బితూర్

కాన్పూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో గంగా నది ఒడ్డున సుందర ప్రకృతి దృశ్యాల పట్టణం బితూర్ ఉంది. వేర్రెత్తించే కాన్పూర్ సమూహాల నుండి దూరంగా చైతన్యం నింపి, విశ్రాంతితో అవసరమైన ఉపశమనాన్ని బితూర్ కల్గిస్తుంది. బితూర్ ఒక ప్రధాన హిందూ తీర్థయాత్ర కేంద్రమే కాక గొప్ప చారిత్రిక ప్రాధాన్యతను కూడా కల్గి ఉంది.బితూర్ పర్యటించడం కేవలం చారిత్రిక ప్రాంతాలకు ఒక ప్రయాణం మాత్రమే కాదు - ఈ పట్టణం అందమైనది, సహజమైన దృశ్యాలతో కూడినది. ఇక్కడి నుండి మీరు ధార్మిక ఆలయాల మధ్య ప్రశాంతంగా తిరగడ౦ లేదా నదిలో బోటు షికారు చేయడం వంటి వాటి ద్వారా ప్రకృతిలోని వివిధ అందాలను ఆస్వాదించవచ్చు.

Photo Courtesy: Mukerjee

అల్మోర

అల్మోర

అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. పర్యాటకులు హిమాలయాల యొక్క మంచు తో నిండిన శిఖరాలను అల్మోర కొండలనుండి చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం ప్రపచంత వ్యాప్తంగా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటకులు ఇక్కడ అందమైన సూర్యోదయ మరియు సూర్యాస్తమయ దృశ్యాలు బ్రైట్ ఎండ్ కార్నర్ నుండి చూడవచ్చు. సిమ్టోల మరియు మర్టోల ప్రదేశాలు పిక్నిక్ కు బాగుంటాయి. అల్మోర టవున్ నుండి ౩ కి. మీ.ల దూరం లో కల జింకల పార్క్ ప్రసిద్ధి. దీనిలో అనేక లేళ్ళు, చిరుతలు హిమాలయ బ్లాకు బేర్ వంటివి కలవు. ఈ ప్రదేశం లో కల గోవింద్ వల్లభ పంత్ మ్యూజియం, బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి తప్పక చూడాలి. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ తప్పక ఆచరిస్తారు.

Photo Courtesy: solarshakti

చంబ

చంబ

చంబ ప్రదేశం ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది ఉత్తరాఖండ్ లోని తెహ్రి గర్హ్వాల్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1524 మీటర్ల ఎత్తున కలదు. ఇక్కడ కల అందమైన దృశ్యాలకు నిర్మల వాతావరణానికి ఈ ప్రదేశం పేరు గాంచినది. చంబా ప్రాంతం దేవదారు మరియు పైన్ చెట్ల తో నిండి, ప్రకృతి ప్రియులకు ఒక స్వప్న సౌధంలా వుంటుంది. ఈ హిల్ స్టేషన్ లో ఆపిల్ మరియు అప్రికాట్ తోటలు అధికం. తెహ్రి డాం పర్యటనకు వెళ్లేవారికి చంబ హిల్ స్టేషన్ ఒక పూట బసకు అనుకూలంగా వుంటుంది.

Photo Courtesy: Vjdchauhan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X