Search
  • Follow NativePlanet
Share
» » సిటీ అఫ్ గేట్స్ - ఔరంగాబాద్ !

సిటీ అఫ్ గేట్స్ - ఔరంగాబాద్ !

మహారాష్ట్ర కు టూరిజం కేపిటల్ అఫ్ చెప్పబడే ఔరంగాబాద్ ను సిటీ అఫ్ గేట్స్ అని కూడా అంటారు. ఔరంగాబాద్ కు ఆ పేరు ప్రసిద్ధ మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ పేరు మీదుగా పెట్టారు. ఒక్కసారి నగరంలో తిరిగితే, ఈ నగర చరిత్ర అంతా ఎంత ఉన్నతమైనదో తెలిసిపోతుంది.

ఇక్కడ కల చారిత్రక స్మారకాల గొప్పతనం అటువంటిది. ఆసక్తి కల పర్యాటకుడు మహారాష్ట్ర లోని ఆకర్షణీయ ఔరంగా బాద్ పట్టణ పర్యటన చేయకుండా ఉండలేడు.

బిబి కా మక్ బారా

బిబి కా మక్ బారా

బిబి కా మాక్ బారాను దక్షిణ భారత దేశపు " మినీ తాజ్ మహల్ " గా కూడా చెపుతారు. దీనికి కారణం, ఈ చారిత్రక కట్టడం కొంత మేరకు తాజ్ మహల్ ను పోలి ఉండటమే. ఒక అందమైన మొఘల్ గార్డెన్ మధ్య కల ఈ చారిత్రక భవనం ఔరంగా జేబ్ సతీమణి రాబియా ఉద్ దుర్రాని యొక్క సమాధి స్థలం. ఈ కట్టడాన్ని తాజ్ మహల్ వలే కట్టాలని నిర్ణయించి నప్పటికి దాని రూపానికి పూర్తిగా రాలేక పోయింది.

Photo Courtesy: Danial Chitnis
పం

పంచాక్కి

పంచాక్కి

ఈ ప్రదేశానికి ఈ పేరు అక్కడ కల ఒక మిల్లు వలన వచ్చింది. ఈ మిల్లు పర్యాటకులకు పూర్వ కాలంలో ధాన్యాలు దంచి ఇచ్చేది. ఈ వాటర్ మిల్ ను ఒక నీటి బుగ్గ నుండి ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు నిర్మించారు. పంచాక్కి చూడ దగిన అందమైన ప్రదేశం.

Photo Courtesy: Arun Sagar (cool_spark)

సలీం అలీ లేక్ మరియు బర్డ్ సాన్క్చుఅరి

సలీం అలీ లేక్ మరియు బర్డ్ సాన్క్చుఅరి

సలీం అలీ లేక్ ను సలీం అలీ తలాబ్ అని కూడా అంటారు. ఇది సరిగ్గా హిమాయత్ బాగ్ కు ఎదురుగా కలదు. ఢిల్లీ గేటు సమీపంలో వుంటుంది. పర్యాటకులకు ఇక్కడ బోటింగ్ సౌకర్యాలు కలవు. వర్షాకాలం, చలి కాలం లలో ఈ సరస్సు పూర్తి గా నిండి, అందంగా కనపడుతుంది.

Photo Courtesy: Shujashakir

ఖుల్దాబాద్

ఖుల్దాబాద్

ఖుల్దాబాద్ , ఔరంగాబాద్ లో ఒక యాత్రా స్థలం. దీనిని వాలీ అఫ్ సెయింట్స్ లేదా ఋషుల లోయ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో ఇరువురు మహమ్మదీయ ప్రవక్తలు నివాసం వుండేవారు. ఈ సమాధులను పర్యాటకులు, యాత్రికులు పూజిస్తారు.

Photo Courtesy: Tervlugt

దౌలతాబాద్

దౌలతాబాద్

దౌలతాబాద్ పట్టణం, ఔరంగాబాద్ కు 16 కి. మీ. ల దూరంలో వుంటుంది. దీనిని ఐశ్వర్యం కల నగరంగా అర్ధం చెపుతారు. దౌలతాబాద్ ఒకప్పుడు తుగ్లక్ వంశ పాలకులకు రాజధానిగా వుండేది. ఇపుడు ఈ నగరం శిధిలమై ఒక విలేజ్ సమీపంలో మనుష్య నివాసం లేక, అపుడు అపుడు వచ్చే, దౌలతాబాద్ కోటను దర్శించే పర్యాటకులకు ఒక పర్యాటక స్థలంగా మాత్రమే కలదు.

అజంతా & ఎల్లోరా గుహలు

అజంతా & ఎల్లోరా గుహలు

అజంతా మరియు ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ కు అధిక దూరంలో లేవు. ఈ గుహలకు మీరు తేలికగా చేరుకునేటందుకు ఒక వివరవంతమైన గైడ్ ప్లాన్ అందిస్తున్నాము.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X