Search
  • Follow NativePlanet
Share
» » సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!అస‌లే వ‌ర్షాకాలం.. పైగా సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ప్రయాణం చేయడం అంటే ఆషామాషీ కాదు. వారితో సాగే ప్ర‌తి క్ష‌ణం చాలా జాగ్రత్తలు అవసరం. కొందరు వీల్ చెయిర్ లేకుండా కదల్లేరు. ఇంకొందరు కర్ర సాయం లేకుండా నిల్చోలేరు. మతిమరుపు, గుండెపోటు ఇలాంటి చాలా సమస్యలు వాళ్లను వెంటాడుతుంటాయి. అందుకే వృద్దాప్యంలో ఉన్న‌వారిని చిన్న‌పిల్ల‌ల్లా చూసుకోవాలి అంటారు. మ‌రి అలాంటి వాళ్లతో ప్రయాణం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.

-సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ప్రయాణం చేసేటప్పుడు ముందు ప్రణాళిక వేసుకొని బయలుదేరడం ఉత్తమం. వెళ్తున్న ప్రదేశం గురించి కొంత అధ్యయనం చేసి అక్కడ ఉన్న ఏర్పాట్లు, వసతుల గురించి ముందే తెలుసుకుంటే మంచిది. అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కూ బ‌య‌టి ప్ర‌దేశాల్లో కాకుండా తెలిసిన వాళ్ల ద‌గ్గ‌ర విడిదికి ఏర్పాటు చేసుకోవ‌డం ఉత్త‌మం.

- మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి గురించి ముందే ఆరా తీయండి. అవసరం అయితే ముందే చిన్న చిన్న మెడికల్ టెస్టులు చేయిస్తే మంచిది. ఆరోగ్య పరిస్థితుల వల్ల ప్రయాణంలో ఇబ్బందులు రావొచ్చు. ముందు డాక్టర్‌ను సంప్రదించి చిన్న చిన్న.

 సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగుతుంది. ముఖ్యంగా విమాన ప్రయాణం చేయాల్సి వస్తే హెల్త్ సర్టిఫికెట్ దగ్గర పెట్టుకోండి.

-తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అస్సలు ప్రయాణం చేయలేరు. కారణం వారికి నిద్ర అవసరం. ఒకప్పుడు ఉన్న శక్తి వృద్ధాప్యంలో ఉండదు. వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అందుకే అనవసరపు అలసటకు గురిచేయకుండా మధ్యాహ్న వేళల్లో ప్రయాణం చేయించండి. అలసిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

వయసు పైబడిన వారికి జీర్ణశక్తి అంతంత మాత్రంగానే ఉంటుంది

వయసు పైబడిన వారికి జీర్ణశక్తి అంతంత మాత్రంగానే ఉంటుంది

వయసు పైబడిన వారికి జీర్ణశక్తి అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువ‌ల్ల ఏదిపడితే అది తింటే కొందరికి పడదు. వాంతులు, విరేచనాలు అవొచ్చు. కొత్త కొత్త అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు. అంచేత‌ ఆహారం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. మీరు వెళ్లే ప్రాంతంలో దొరికే ఆహారం గురించి ముందే తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఇంటి నుంచి తీసుకెళ్లడం ఇంకా మంచిది.

- వారి మెడిక‌ల్ డిస్క్రెప్స‌న్ తోపాటు మెడిక‌ల్ కిట్ నిత్యం వారి ద‌గ్గ‌రే ఉంచుకునేలా చూసుకోవాలి. అనుకోని ప‌రిస్థితుల్లో వారు త‌ప్పిపోయినా స‌మ‌యానుగుణంగా ఎవ‌రైనా స‌హాయం చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ విష‌యంలో అస్స‌లు అజాగ్ర‌త్త‌గా ఉండ‌కూడ‌దు.

పైన చెప్పిన‌వి చిన్నవే అయినా చాలా ముఖ్యమైనవి. ఇలాంటివి పాటిస్తే అందమైన ప్రయాణం ఆనందాన్ని, అనుభూతినిస్తుంది. వృద్ధాప్యం అంటే అనుభ‌వాల స‌మ్మేళనం అనే విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

అస‌లే వ‌ర్షాకాలం.. పైగా సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ప్రయాణం చేయడం అంటే ఆషామాషీ కాదు. వారితో సాగే ప్ర‌తి క్ష‌ణం చాలా జాగ్రత్తలు అవసరం. కొందరు వీల్ చెయిర్ లేకుండా కదల్లేరు. ఇంకొందరు కర్ర సాయం లేకుండా నిల్చోలేరు. మతిమరుపు, గుండెపోటు ఇలాంటి చాలా సమస్యలు వాళ్లను వెంటాడుతుంటాయి. అందుకే వృద్దాప్యంలో ఉన్న‌వారిని చిన్న‌పిల్ల‌ల్లా చూసుకోవాలి అంటారు. మ‌రి అలాంటి వాళ్లతో ప్రయాణం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

- మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి గురించి ముందే ఆరా తీయండి. అవసరం అయితే ముందే చిన్న చిన్న మెడికల్ టెస్టులు చేయిస్తే మంచిది. ఆరోగ్య పరిస్థితుల వల్ల ప్రయాణంలో ఇబ్బందులు రావొచ్చు. ముందు డాక్టర్‌ను సంప్రదించి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగుతుంది. ముఖ్యంగా విమాన ప్రయాణం చేయాల్సి వస్తే హెల్త్ సర్టిఫికెట్ దగ్గర పెట్టుకోండి.

Read more about: andhrapradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X