Search
  • Follow NativePlanet
Share
» »ట్రెక్కింగ్ చిట్కాలు !

ట్రెక్కింగ్ చిట్కాలు !

ఎక్కడికో వెళ్లి టెంట్ వేయటం, ట్రెక్కింగ్ అంటూ అడవి దారులలో తిరుగుతూ చెమటలు కక్కటం వంటి చర్యలు మిమ్మల్ని ప్రకృతికి సన్నిహితం చేస్తాయి. వ్యక్తిత్వానికి ఒక సవాలుగా నిలుస్తాయి. ట్రెక్కింగ్ అనేది మీరు కొత్త సన్నివేశాలకు ఎంత వరకు తట్టుకొని నిలబడగలరనేది కూడా సూచింస్తుంది. ట్రెక్కింగ్ యాత్ర తర్వాత, మీరు ఎదో సాధించామని, ఎంతో గంభీరమైన, అధిగమించ లేని ఎత్తులు ఎక్కామని భావిస్తారు. మీ శరీర సామర్ధ్యత, మరియు సౌకర్యం అనుసరించి, ప్రకృతి ని ఛాలెంజ్ చేస్తూ మీ ట్రెక్కింగ్ మార్గాన్ని ఎంచుకొనవచ్చు.

మీ మొట్ట మొదటి ట్రెక్కింగ్ ప్రారంభించేముందు, మొట్ట మొదటి ట్రెక్కింగ్ చక్కని అనుభవంగా ఉండాలంటే, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ ట్రెక్కింగ్ మొదలు పెట్టె ముందు, మీ మైండ్ లో కనుక ఏదేని ఒక ప్రదేశం లో ట్రెక్ చేయాలని వుంటే, అక్కడ కల ప్రస్తుత వాతావరణం గురించి తప్పక తెలుసుకోవాలి. కొన్ని ట్రెక్ రూట్లకు ముందస్తు పర్మిషన్ కావాలి, కనుక ఆ అనుమతులను మీరు ముందుగా తగిన అధికారులనుండి తీసుకొనండి.

ట్రెక్కింగ్ చిట్కాలు !

మీ ట్రెక్కింగ్ కనుక, ఒక కొత్త ప్రదేశంలో అయితే, మీరు అక్కడ కల లోకల్ టూరిస్ట్ సెంటర్ కు మీ ట్రిప్ గురించిన సమాచారం ఇవ్వండి. ఆ ప్రదేశ గైడ్ బుక్ లను చదవండి. ఆ ప్రదేశపు వాతావరణం అనుసరించి ఏ రకమైన దుస్తులు ధరించాలనేది ఆచరిచండి. వర్షం పడితే, మార్చడానికి అదనపు సౌకర్యంగా మరొక జత దుస్తులు పెట్టుకోండి. జంతువులను ఆకర్షించే ముదురు రంగు దుస్తులు విడనాడండి. ఘాటైన సెంట్లు వంటివి కూడా జంతువులకు మీ ఉనికిని తెలియ చేస్తాయి. కనుక రాసుకోనకండి. మీ బ్యాక్ ప్యాక్ లో అవసరమైన కొన్ని మెడిసిన్ లు, ఒక కంపాస్ , ఒక మ్యాప్, కెమెరా, గ్లోవ్స్, సన్ గ్లాసెస్, ఒక టోపీ , సాక్స్, ట్రెక్కింగ్ షూస్, ఎనర్జీ డ్రింక్స్ మరియు ఆహార పదార్ధాలు ఉంచుకోండి. మీరు ట్రెక్కింగ్ మధ్యలో అలసిపోకుండా, మీ బ్యాక్ ప్యాక్ ఎక్కువ బరువు లేకుండా చూసుకోండి.

స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి మీ శక్తిని క్షీణింప చేస్తాయి. కనుక వాటిని వదలండి. నిదానంగా ట్రెక్ చేయండి. మీరు చేసేది ట్రెక్ అని, ఏ రకమైన పోటీ కాదని గుర్తించండి. ట్రెక్కింగ్ మీకు ఆనందంగా ఉండేలా చేయండి. మీతో పాటు కనుక కొంచెం తొందరపాటు చర్యల వారు వుంటే, వారికి దూరంగా వుండండి. మీ సమయం, ట్రావెల్ మీకు తగినవారితో పంచుకోనండి. వీలైనంతవరకు మీ ట్రెక్కింగ్ గ్రూప్ నుండి విడివడి దూరంగా పోకండి.

ట్రెక్కింగ్ లో సమయం గడిచే కొలది, ప్రమాదకరంగా వుంటుంది. గ్రూప్ వారిని వదలకండి. జారి పడే ప్రదేశాలలో మీరు బాలన్స్ తప్పే ప్రమాదముంది. దానిని ముందుగా గుర్తించండి. జారుడుప్రదేశాలు లో వేగవంతమైన అడుగులు వేయటం లేదా చిన్న చిన్నగా అడుగులు వేస్తూ పోవటం చేయాలి. ఈ అంశాలను మీరు మొదటి ట్రెక్ లోనే తప్పక గ్రహించాలి. ఆత్మ విశ్వాసం కలిగి వుండాలి. ట్రెక్కింగ్ ను ఒక ఫన్ గాను ప్రకృతి లో ఒక ఆనందిం చ గల ఒక చక్కని అనుభవంగాను ఉండేలా చేసుకొనండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X