Search
  • Follow NativePlanet
Share
» » శ్రావణ మాసం...పాపం చేసినవారందరికీ ఈ ‘తీర్థం’లో పరిహారం, అందుకే సాధువులతో సహా...

శ్రావణ మాసం...పాపం చేసినవారందరికీ ఈ ‘తీర్థం’లో పరిహారం, అందుకే సాధువులతో సహా...

త్రయంబకేశ్వరాలయం గురించి కథనం.

హిందూలులు అత్యంత భక్తితో కొలిచే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వరాలయం కూడా ఒకటి. ఈ త్రయంబకేశ్వరాలయంలోని శివలింగం పురాణాలకు పూర్వమే ఉద్భవించిందని చెబుతారు. ఇక ఇక్కడ భారత దేశంలో ఎక్కడా లేనటువంటి మూడు ముఖాలతో కూడిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు.

ఈ మూడు ముఖాలు త్రిమూర్తులకు చిహ్నాలుగా హిందూ భక్తులు భావిస్తారు. అదే విధంగా ఇక్కడ పరమేశ్వరుడికి రత్నఖచిత కిరీటాన్ని అలంకరించడం గమనార్హం. ఇక ఇక్కడ ఉన్నటు వంటి తీర్థంలో శివుడికి ఇష్టమైన శ్రావణ మాసంలో స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ తొలిగిపోతాయని చెబుతారు.

అందువల్లే దేశంలోని వివిధ ప్రాంతల నుంచి సాధువులు సైతం ఇక్కడికి వచ్చి పవిత్రస్నానాలు చేస్తుంటారు. అయితే ఆ తీర్థం పేరేమిటి? ఈ దేవాలయానికి ఎంత దూరంలో ఉంది? తదితర వివరాలు మీ కోసం...

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube
ఈ త్రయంబకేశ్వరాయం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబక్ అనే పట్టణంలో ఉంది. భారత దేశంలోని హిందువులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువలు పవిత్రంగా భావించే 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube
ఇది భారత దేశంలోని అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. ఇది నాసిక్ నగరం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ త్రయంబేకేశ్వరాలయాన్ని క్రీస్తు శకం 1755 నుంచి 1786 మధ్య నానా సాహేబ్ పేష్వా నిర్మించారు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

నల్లటి గ్రానైట్ రాయిని వినియోగించి ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. పంచ లోహాల తో తయారు చేసిన ధ్వజస్తంభ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలో ఒకటి.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

దేవాలయం ముందు ఉన్న మహా ఆకారపు నందిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ ధ్వజస్తంభాన్ని దాటుకొని గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే మనకు జ్యోతిర్లింగం కనిపిస్తుంది.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

ఇక్కడ ఉన్నటు వంటి లింగంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కనిపిస్తారు. ఇలా ఒక లింగంలో త్రిముర్తులను భారత దేశంలో ఒక్క త్రయంబకేశ్వరాలయంలో మాత్రమే చూడగలం.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube
ఇక్కడ శివలింగానికి బంగారంతో తాపడం చేసిన ముఖాలు వాటి పై స్వచ్ఛమైన బంగారంతో చేసిన కిరీటంతో అలంకారం చేస్తారు. ఇక ఈ కిరీటం బంగారంతో తయారు చేయబడిన అక్కడక్కడ వజ్రాలు, వైడూర్యాలు పొదగబడి ఉంటాయి.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

ఈ కిరీటం పాండవుల కాలం నాటిదని చెబుతారు. మహాశివరాత్రి, కార్మిక పౌర్ణమి, ప్రతి సోమవారం మాత్రమే ఈ కిరీటంతో స్వామివారిని అలంకరిస్తారు. అత్యంత విలువైన నాసిక్ మణి ఈ కిరీటంలో ఉండేదని
అటు పై దాని జాడ తెలియకుండా పోయిందని చెబుతారు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

ఈ విషయమై ఒక కథనం తరుచుగా వినిపిస్తుంది. మరాఠ, ఆంగ్లేయుల మధ్య యుద్ధం జరిగే సమయంలో ఈ నీలమణి తస్కరించబడిందని చెబుతారు. ఈ త్రయంబకేశ్వరాయం నుంచి 5 నిమిషాల కాలం నడిస్తే కుశావర్త తీర్థం ఉంది.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

దీనిని క్రీస్తుశకం 1699లో ఓల్ ఓకర్ రావాజీ సాహేబ్ పాట్నేకర్ నిర్మించాడు. ఈ కుశావర్థ తీర్థంలో 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళ కూడా జరుగుతుంది. ఈ మేళతో పాటు శ్రావణ మాసంలో కూడా ఇక్కడ పవిత్రస్నానాలు చేస్తారు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

ఈ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ తీర్థంలో స్నానం చేయడానికి వేల సంఖ్యలో సాధువులు వస్తారు. అప్పుడు ఈ తీర్థం పరిసర ప్రాంతాలు హరనామ స్మరణతో మార్మోగిపోతాయి.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

సాధువులు స్నానం చేసిన తర్వాత మాత్రమే సామాన్యులకు ఇక్కడ స్నానం చేయడానికి అనుమతిస్తారు. మిగిలిన సమయంలో మాత్రం ఎవరైనా ఎప్పుడైనా ఈ కుశావర్త తీర్థంలో స్నానం చేయవచ్చు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

ఇక్కడ కుశావర్త తీర్థం ఏర్పడటానికి వెనుక ఒక ఆసక్తికర కథనం ఉంది. గౌతమ మహర్షి తపస్సు చేసుకునే చోట ఒకచోట కరువు ఏర్పడింది. దీంతో తన తప:శక్తిని వినియోగించి అక్కడ ఉన్నటువంటి సాధువులు, ప్రజలకు తిండి గింజలు ఇచ్చేవాడు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

అంతేకాకుండా ఆశ్రమంలోనే నిత్యం అన్నదానం చేసేవారు. ఈ విషయం నచ్చని తోటి సాధువులు ఒక మాయ ఆవును స`ష్టించి గౌతవముని ఆశ్రమం లోకి వదులుతారు. దానిని అదిలించడానికి వీలుగా ఒక చిన్న దర్భను ఆవు పై విసురుతాడు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

దీంతో ఆవు అక్కడికక్కడే చనిపోతుంది. గోహత్యాపతకం నుంచి ముక్తి పొందడానికి వీలుగా ఆ గౌతమ మహర్షి శివుడి గురించి తపససు చేసి గంగను భూమి పైకి వదలమని కోరుతాడు. ఇందుకు సమ్మతించిన ఈశ్వరుడు గంగను భూమి పైకి వదులుతాడు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

అయితే ఈశ్వరుడిని వదిలి భూమి పైకి రావడానికి ఇష్టంలోని గంగమ్మ బ్రహ్మగిరి, గంగాద్వార, త్రయంబక, వరమా, రామలక్ష్మణ, గంగాసాగర, ఇలా అనేక చోట్ల కనిపించి మాయవుతూ ఉంటుంది.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

దీంతో గౌతమ మహర్షి ఒక దర్భను తీసుకుని ప్రస్తుతం కుశావర్తనం ఉన్న చోట ఒక వ`త్తాన్ని గీస్తాడు. అక్కడ గంగమ్మ గోదావరిగా మారి నిలిచిందని చెబుతారు. అందువల్లే త్రయంబకేశ్వరం గోదావరి జన్మస్థలంగా భావిస్తారు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

ఈ త్రయంబకేశ్వర దేవాలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అంజనేరి పర్వతం ఉంది. ఈ ప్రాంతమే హనుమంతుని జన్మస్థలమని చెబుతారు. ఈ విషయమై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

ఇక్కడకు దగ్గర్లో నీల పర్వతం మీద నీలాంబ, మన్నాంబ, రేణుకాదేవి తదితర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ వేదపాఠశాలతో పాటు గురుకులం కూడా ఉంది.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

ఈ త్రయంబకేశ్వరాలయం సమీపంలో ముంబై విమానాశ్రయం ఉంది. ఈ రెండింటి మధ్య దూరం 166 కిలోమీటర్లు. అంతే కాకుండా ఔరంగాబాద్ విమానాశ్రయం కూడా ఇక్కడకు 204 కిలోమీటర్లు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

త్రయంబకేశ్వరాలయం దగ్గర్లో నాసిక్ రైల్వేస్టేషన్ ఉంది. వీటి మధ్య దూరం 36 కిలోమీటర్లు మాత్రమే. ప్రైవేటు బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు నిత్యం వెలుతూ ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X