Search
  • Follow NativePlanet
Share
» »వేదంతంగల్ ఒక పురాతన పక్షి అభయారణ్యం !

వేదంతంగల్ ఒక పురాతన పక్షి అభయారణ్యం !

By Mohammad

వేదంతంగల్, తమిళనాడులోని కాంచీపురం పట్టణానికి 45 కి.మీ. దూరంలో ఉన్న చిన్న గ్రామం. ఇది ఒక పక్షుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. వేదంతంగల్ పక్షుల కేంద్రాన్ని అధికారికంగా 'వేదంతంకల్ లేక్ బర్డ్ స్యాంక్చురీ' అని పిలుస్తారు. దేశంలో ఉన్న పక్షుల కేంద్రాలలో వేదంతంగల్ ఒక పురాతన పక్షి అభయారణ్యం గా ప్రత్యేకతను కలిగి ఉంది.

వేదంతంగల్ : పురాతన పక్షి అభయారణ్యం

వేదంతంగల్ బర్డ్ స్యాంక్చురీ ప్రవేశ ద్వారం

చిత్ర కృప : Balajijagadesh

వేదంతంగల్ చెన్నై మహానగారానికి 80 కి. మీ. దూరంలో 74 ఎకరాల్లో విస్తరించి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఈ ప్రాంతాన్ని అక్కడి స్థానిక రాజులు, జమీందార్లు 'వేట' కై ఉపయోగించేవారని చరిత్ర చెబుతున్నది. వేదంతంగల్ అంటే తమిళంలో అర్థం 'ది హామ్లెట్ ఆఫ్ ది హంటర్'.

వేదంతంగల్ : పురాతన పక్షి అభయారణ్యం

పక్షుల కోలాహాలం

చిత్ర కృప : Vinoth Chandar

వేదంతంగల్ బర్డ్ స్యాంక్చురీ దేశ వ్యాప్తంగా ఉన్న పక్షి ప్రేమికులను, పక్షుల మీద పరిశోధనలు చేసే వారిని ఆకర్షిస్తున్నది. బ్రిటీష్ వారి హయాంలో భారతదేశంలో స్థాపించబడిన తొలి బర్డ్ స్యాంక్చురీ ఈ వేదంతంగల్ స్యాంక్చురీ. ఈ స్యాంక్చురీ లో చిత్రమైన చిన్న చిన్న సరస్సులు అనేకం ఉంటాయి మరియు అవి 74 ఎకరాల్లో అక్కడక్కడ వ్యాపించి ఉంటాయి.

వేదంతంగల్ : పురాతన పక్షి అభయారణ్యం

అభయారణ్యంలోని సరస్సులు

చిత్ర కృప : Phoenix bangalore

వేదంతంగల్ పక్షి అభయారణ్యం లో కొన్ని కొన్ని సీజన్ లలో అరుదైన పక్షులు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా విదేశాల నుండి వలసవస్తుంటాయి. వాటిలో చెప్పుకోదగ్గవి గర్గానే అడవి బాతులు, ఆస్ట్రేలియా గ్రే పెలికాన్, శ్రీలంక స్నెక్ బర్డ్, బూడిద రంగు కొంగ, ఇబిస్, స్పాట్ బిల్ లు కొన్ని. ఇవే కాక 20 కి పైగా అరుదైన పక్షి జాతులను వివిధ కాలాల్లో చూడవచ్చు. ఈ బర్డ్ స్యాంక్చురీ కి దగ్గర్లోనే 9 కి.మీ. దూరంలో కరికిలి బర్డ్ స్యాంక్చురీ కూడా ఉన్నది. సమయం ఉంటే ఒకేరోజులో రెండింటినీ చూడవచ్చు.

వేదంతంగల్ : పురాతన పక్షి అభయారణ్యం

కెమెరా కు చిక్కిన అరుదైన పక్షి

చిత్ర కృప : Dr. Raj Kumar Jayapal

వేదంతంగల్ చేరుకొనే మార్గాలు

వాయు మార్గం / విమాన మార్గం

వేదం తంగల్ కు సమీపాన 80 కి. మీ. దూరంలో ఉన్న ఏర్ పోర్ట్ చెన్నై ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు సులభంగా ప్రయాణించవచ్చు. క్యాబ్ లేదా ట్యాక్సీ అద్దెకు తీసుకొని వేదం తంగల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

వేదం తంగల్ కు 26 కి. మీ. దూరంలో ఉన్న చెంగాల్పెట్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. తమిళనాడు లో లోకల్ రైళ్ళన్ని ఈ స్టేషన్ గుండా వెళతాయి. అన్ని రకాల రైళ్లకు చెన్నై రైల్వే స్టేషన్ కేంద్రం గా ఉన్నది. ట్యాక్సీ లేదా బస్సుల్లో ఈ రైల్వే స్టేషన్ ల నుండి సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం /బస్సు మార్గం

చెన్నై కోయంబెడ్ బస్ స్టాండ్ నుండి వేదం తంగల్ కు అనేక రోడ్డు రవాణా సంస్థల బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్క చెన్నై మాత్రమే కాదు మహాబలిపురం, కాంచీపురం, తిరుత్తని వంటి సమీప ప్రదేశాల నుండి కూడా బస్సులు లభ్యమవుతాయి.

వేదంతంగల్ : పురాతన పక్షి అభయారణ్యం

పక్షి అభయారణ్యం పాత్ వే

చిత్ర కృప : suresh kumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X