Search
  • Follow NativePlanet
Share
» »ఈ మహత్తర త్రిపుర సుందరి శక్తి పీఠంను సందర్శించారా?

ఈ మహత్తర త్రిపుర సుందరి శక్తి పీఠంను సందర్శించారా?

త్రిపురలోని అగర్తలాకు 55 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. దేశంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో ఈ త్రిపుర సుందరీదేవి ఆలయం కూడా ఒకటి.

మధ్యప్రదేశ్ లో ని జబల్పూర్ నగరం నుండి 13 కిలో మీటర్ల దూరం లో ఉన్న భేదాఘాట్ రోడ్డు పై తేవర్ గ్రామం లో ఈ ఆలయం ఉంది. జబల్పూర్ యొక్క ప్రధాన ఆకర్షణలలో ఈ ఆలయం పవిత్రమైన ప్రసిద్ద క్షేత్రం. 11 వ శతాబ్దం లో నిర్మితమైన ఈ ఆలయం లో ఉన్న విగ్రహం భూమి నుండి ఉద్భవించినదని అంటారు. త్రిపుర అంటే మూడు నగరాలూ అని అర్ధం సుందరి అంటే అందమైన అతివ అని అర్ధం.

అందువల్ల ఈ ఆలయానికి మూడు నగరాలకి చెందిన దేవతల ఆలయం అని అర్ధం వచ్చేటట్లు పేరు వచ్చింది. అందువల్ల, అమ్మవారి మూడు రూపాలు గురించి వివరణ శక్తి మతస్తుల సిద్దాంతం ప్రకారం సామర్ధ్యం మరియు శక్తిని ఈ దేవతకి ప్రతిరూపంగా సూచిస్తుంది. ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు ప్రత్యేకించి దసరా పర్వదినాలలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆధ్యాత్మిక సాధువులు మరియు గురువులు ఈ దేవాలయాన్ని అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ప్రదేశం గా భావిస్తారు.

సాక్ష్యాత్ ఆదిపరాశక్తి.

సాక్ష్యాత్ ఆదిపరాశక్తి.

త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి )రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు.

త్రిపుర అనగా ముల్లోకములు.

త్రిపుర అనగా ముల్లోకములు.

పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు.

పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరి.

పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరి.

* స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.
* సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.
* పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. కదంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ, ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది, పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరి.

సకల ఐశ్వర్య ప్రధాయిని

సకల ఐశ్వర్య ప్రధాయిని

త్రిపుర సుందరి పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ!

పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవత

పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవత

పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో ,కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది .

దారిద్రయ దుఖాలను తొలగించి

దారిద్రయ దుఖాలను తొలగించి

దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది.

ఈమే శ్రీ విద్యా స్వరూపిణి

ఈమే శ్రీ విద్యా స్వరూపిణి

ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీచక్ర ఆరాధన

శ్రీచక్ర ఆరాధన

శ్రీచక్ర ఆరాధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X