Search
  • Follow NativePlanet
Share
» » మూడు యుగాల నుంచి వెలుగుతున్న ఈ ‘శివజ్యోతి’ని ఈ శ్రావణ మాసంలో చూస్తే

మూడు యుగాల నుంచి వెలుగుతున్న ఈ ‘శివజ్యోతి’ని ఈ శ్రావణ మాసంలో చూస్తే

త్రియుగి నారాయణ దేవాలయాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశం విశిష్ట దేవాలయాల నిలయం. కొన్ని దేవాలయాల్లో జరుగుతున్న విషయాల మర్మాన్ని శాస్త్ర సాంకేతికత ఇంతగా అందుబాటులోకి వచ్చినా కూడా ఛేదించలేకపోతున్నాం. అటువంటి కోవకు చెందినదే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఓ ఆలయం.

అదే ఆది దంపతులైన శివపార్వతుల వివాహం జరిగిన ప్రాంతంలో మూడు యుగాల నుంచి హోమగుండం ఆరిపోలేదని పురాణ కథనం. అందులోని జ్యోతి మూడు యుగాల నుంచి వెలుగొందుతూనే ఉంది.

ఇక శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ దేవాలయాన్ని ముఖ్యంగా ఆ హోమగుండం నుంచి వెలువడే జ్యోతిని సందర్శించడం వల్ల సకల పాపాలు తొలిగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు భావిస్తారు. అందువల్లే కేవలం భారత దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

త్రియుగి నారాయణ దేవాయం త్రియుగి నారాయణ గ్రామంలో ఉంది. ఈ త్రియుగి నారాయణ గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలైన కేదర్నాథ్ కు 27 కిలోమీటర్లు, గౌరికుండ్ కు 13 కిలోమీటర్లు, సోన్ ప్రయాగ్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఈ త్రియుగి నారాయణ దేవాలయం ఉంది.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

ఈ త్రియుగీ నారాయణ దేవాలయం అటు వైష్ణవులకు, ఇటు శైవులకు కూడా పరమ పవిత్రమైన పర్యాటక స్థలం. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ త్రియుగీ నారాయణ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

మూడు యుగాల నుంచి జ్వలిస్తున్న హోమగుండమే ఇందుకు ప్రత్యక్షనిదర్శనం. ఇక్కడ ఉన్న హోమగుండం వల్ల ఎల్లప్పుడూ ఒక వ్యక్తి కుర్చొని హొమగుండంలోకి కర్రలను వేస్తూ ఉంటాడు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

దీనితోపాటు నెయ్యి, పుష్పాలు తదితర వస్తువులను వేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ మూడు యుగాల నుంచి నిరంతరాయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉంది.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube
ఇందుకు ఈ దేవాలయంలోని నారాయణుడే సాక్షి. అందువల్లే ఈ దేవాలయాన్ని త్రియుగీ నారాయణ దేవాలయం అని అంటారు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

ఇక పురాణ కథనాన్ని అనుసరించి తారాకాసురుడు అపార తపస్సుతో బ్రహ్మను మెప్పించి శివపుత్రుడి చేతిలో తప్పా తనకు మరెవ్వరి చేతిలోనూ మరణం సంభవించకూడదనే వరం పొందుతాడు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

తనకు లభించిన వరంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతూ రాక్షసానందం పొందుతూ ఉంటాడు. దీంతో దక్షాయణిని పోగొట్టుకొని దు:ఖంలో ఉన్న శివుడికి పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు భావిస్తారు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

తద్వారా ద్వారా కుమారస్వామిని జనింపచేయాలని దేవతల ఆలోచన. ఇందుకు త్రియుగీ నారాయణ ప్రాంతం సరైన ప్రాంతమని భావించిన దేవతలు ఆ శివపార్వతుల వివాహం త్రియుగీ నారాయణ ప్రాంతంలో జరిపిస్తారు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆలయం బయట ఒక చిన్న దేవాలయం ఉంది. నాలుగు మూలలా నాలుగు రాతి స్తంభాలు, రాతి పై కప్పు మాత్రం ఉంటుంది.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

మధ్యలో నేల మీద కొద్దిగా ఎత్తులో ఒక రాతి పలక పానపట్టలాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంటుంది. శివపార్వతుల వివాహం ఈ పీఠం మీదనే జరిగిందని చెబుతారు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

ఇక ఆలయం బయట ప్రాంగణంలో మూడు తీర్థాలు వరుసగా ఒకదాని పక్కన పరొకటి ఉన్నాయి. వీటికే బ్రహ్మకుండం, విష్ణుకుండం, సరస్వతీ కుండం అని పేరు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

ఇక శివపార్వతుల వివాహానికి సంబంధించిన అనేక వస్తువులు ఈ దేవలయం చుట్టు పక్కల కనిపిస్తాయి. ఈ ఆదిదంపతులైన శివపార్వతుల వివాహం జరిగే సమయంలో విష్ణువు అన్నస్థానంలో ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు స్థానిక కథనం.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

ఇక్కడ ఉన్న ఒక తీర్థంలో విష్ణుమూర్తి స్నానం చేసిన తర్వాత వివాహ సమయంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో ఆ కత్రువు అన్నీ నిర్వహించినట్లు చెబుతారు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

అందువల్లే ఇక్కడ ఉన్న ఒక కుండానికి విష్ణుకుండమని పేరు. ఇందులో స్నానం చేయడాన్ని భక్తులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివపార్వతుల వివాహానికి బ్రహ్మదేవుడే పురోహితుడు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

పౌరోహిత్యం అంగీకరించడానికి ముందు ఇక్కడి తీర్థంలో స్నానం చేసి శుచిగా ఈ కార్యం నిర్వహించాడు. అందుకే ఇక్కడ ఉన్న తీర్థాన్ని బ్రహ్మ కుండం అని అంటారు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

ఆ వివాహ సమయంలో జ్వలింపజేసిన హోమగుండమే ఇక్కడ ఉన్న హోమగుండమని చెబతారు. అది మూడు యుగాల నుంచి అలాగే మండుతూ ఉందని చెబుతారు.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో ఈ హోమగుండాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్మకం.

త్రియుగీ నారాయణ

త్రియుగీ నారాయణ

P.C: You Tube

అందువల్లే ఈ శ్రావణ మాసంలో వేల సంఖ్యలో ఈ ధార్మిక క్షేత్రానికి భక్తులు వస్తుంటారు. రుద్రప్రయాగ్ నేషనల్ హైవే 58 మార్గంలో ఈ గ్రామం ఉండటం వల్ల బస్సు సౌకర్యాలు బాగున్నాయి. రుద్రప్రయాగ్ కు రుషికేష్ రైల్వేస్టేషన్ చాలా దగ్గరగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X