Search
  • Follow NativePlanet
Share
» »శివ పార్వతుల వివాహం జరిగిన చోటు...మూడు యుగాల నుంచి హోమగుండం వెలుగుతున్న ప్రాంతం...సందర్శిస్తే వెంటనే

శివ పార్వతుల వివాహం జరిగిన చోటు...మూడు యుగాల నుంచి హోమగుండం వెలుగుతున్న ప్రాంతం...సందర్శిస్తే వెంటనే

శివ పార్వతుల వివాహం జరిగిన ప్రాంతంగా చెప్పబడే త్రియుగీ నారాయణ్ ఆలయానికి సంబంధించిన కథనం

By Beldaru sajjendrakishore

ఆది దంపతులైన శివపార్వతుల వివాహం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రుద్రప్రయాగ జిల్లాలోని త్రియుగీ నారాయణ్ గ్రామంలో జరిగిందని తెలుస్తోంది. ఈ శివ పార్వతుల వివాహం జరిగిన చోటు ప్రస్తుతం త్రియుగీ నారాయణ ఆలయం ఉంది. విష్ణుమూర్తికి చెందిన ఈ ఆలయం అత్యంత ప్రాచీనాలయం. పౌరాణికంగానూ ఆలయానికి ప్రశస్తి ఉంది.

బ్రహ్మదేవుడే జ్ఞానం పొందిన చోటు...సందర్శిస్తే అపరజ్ఞానంమన సొంతంబ్రహ్మదేవుడే జ్ఞానం పొందిన చోటు...సందర్శిస్తే అపరజ్ఞానంమన సొంతం

ఇక్కడ శివ పార్వతుల వివాహం జరిగిందనడానికి సంబంధించి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఆలయం ముందు ఉన్న మూడు సరస్సుల్లో స్నానం చేయడాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే వివాహం జరగని వారికి త్వరగా వివాహం అవుతుందనేది స్థానిక కథనం. త్రియుగీ నారాయణ స్వామి క్షేత్ర పర్యటన అటు వైష్ణవులకు ఇటు శైవులకు కూడా పరమ ప్రవిత్రమైనది కావడం ఇక్కడ గమనార్హం. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి అటు రోడ్డు, రైలుతో పాటు విమాన సర్వీసులు కూడా ఉంటాయి. ఈ పర్యటక క్షేత్రం.

1. త్రియుగీ నారాయణ్ ఆలయం

1. త్రియుగీ నారాయణ్ ఆలయం

Image source:


ఉత్తరాఖండ్ రాష్ర్టానికి చెందిన రుద్రప్రయాగ జిల్లాలోని త్రియుగీ నారాయణ్ గ్రామంలో నెలకొన్ని హిందూ దేవాలయం. ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీనాలయం. పౌరాణికంగానూ ఆలయానికి ప్రశస్తి ఉంది. రా౦పూరు ను౦డి 5 కిలోమీటర్ల దూర౦లో త్రియుగి నారాయణ్ క్షేత్రం ఉంది. ఇది చాల చిన్న గ్రామం. ఇది చాల పురాతనమయిన పవిత్ర స్థలము. పార్వతి పరమేశ్వరుల వివాహస్దలం .

2. మూడు యుగాల నుంచి వెలుగుతూనే ఉంది

2. మూడు యుగాల నుంచి వెలుగుతూనే ఉంది

Image source:


ఈ ఆలయంలోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీలక్ష్మినారాయణుల మూర్తులు ఉన్నాయి. అక్కడ హోమగుండం ఉ౦ది. అది మూడు యుగాల నుండి అలావెలుగుతూనే ఉన్నదని చెబుతారు. దీని పక్కన ఒక మనిషి కూర్చుని ఒక దుంగ కాలిన తరువాత మరొక దుంగను వేస్తూ మంటను ఆరకుండా చూస్తుంటారు. అక్కడికి వచ్చే భక్తులు ఆ హోమకుండంలో తలొక కట్టే వేస్తారు. ఆ హోమకుండము లోని విభూతి అతి పవిత్రమైనదిగా భావిస్తారు.

3. అందుకే త్రియుగీ నారాయణ

3. అందుకే త్రియుగీ నారాయణ

Image source:


మూడు యుగముల నుండి ఈ మంట మండుతూనే ఉన్నది కనుక దీనికి ఈ ఆలయంలో ఉన్న నారాయణుడే సాక్షి కనుక, ఈ స్వామికి త్రియుగి నారాయణ్ అనే పేరు వచ్చిందనేది స్థలపురాణము. ఆలయం బయట ఒక చిన్నమందిరం ఉంది .నాలుగు మూలలా రాతి స్తంభాలు, రాతి పైకప్పుమాత్రం ఉండి, మందిరం మధ్యలో నేలమీద నుండి కొద్దిగా ఎత్తులో ఒక రాతిపలక పానవట్టంలాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంది.

4. ఈ పీఠం మీదే వివాహం

4. ఈ పీఠం మీదే వివాహం

Image source:


సత్య యుగములో శివపార్వతుల వివాహం ఈ పీఠం మీదనే జరిగింది అని స్దలపురాణం. ఆలయం బయట ప్రాంగణములో 3కుండములు వరసగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. వీటిని బ్రహ్మకుండము, విష్ణుకుడము, సరస్వతీ కుండం పేరు. ఇక శివపార్వతుల వివాహానికి సంబంధించిన వస్తువులగా చెప్పబడే అనేక వస్తువులు ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని కూడా భక్తులు ఆసక్తిగా గమనిస్తారు.

5. విష్ణువు అన్న స్థానంలో

5. విష్ణువు అన్న స్థానంలో

Image source:


శివ పార్వతుల వివాహం సమయంలో విష్ణువు అన్న స్థానంలో ఉండి అన్ని కార్యాలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ ఉన్న ఒక చిన్న సరస్సులో విష్ణుమూర్తి స్నానం చేసిన తర్వాత వివాహ సమయంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో ఆ కత్రువులు అన్నీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఇక్కడ ఉన్న ఒక సరస్సుకు విష్ణు కుండమని పేరు. ఇందులో స్నానం చేయడాన్ని భక్తులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

6. బ్రహ్మపురోహితుడయ్యాడు

6. బ్రహ్మపురోహితుడయ్యాడు

Image source:


ఇక శివ పార్వతుల వివాహ సమయంలో బ్రహ్మదేవుడు పురోహితుడిగా మారాడని కథనం. ఇక్కడ ఉన్న మరో సరస్స లో బ్రహ్మదేవుడు స్నానం చేసి వివాహం జరిపించాడని చెబుతారు. అందువల్ల ఈ సరస్సును బ్రహ్మ కుండమని పిలుస్తారు. భక్తులు ఇక్కడ కూడా స్నానం చేస్తుంటారు. ఇక్కడ స్నానం చేయడాన్ని కూడా భక్తులు చాలా పరమ పవిత్రంగా భావిస్తుంటారు.

7. మరో కథనం ప్రకారం...

7. మరో కథనం ప్రకారం...

మరో కథనం ప్రకారం...

Image source:


తారకాసురుడు అపార తపస్సుతో బ్రహ్మను మెప్పించి, శివపుత్రుని తప్ప మరెవ్వరితోనూ తన మరణం సంభవించకూడదని వరం పొంది ముల్లోకాలను తిప్పలు పెట్టాడు. కామదహనం, పార్వతీదేవి కఠోర తపస్సు వంటివి పూర్తిచేశాకా, పుత్రప్రాప్తికై పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నది త్రియుగీ నారాయణ్ వద్దనేనని ఐతిహ్యస్యం. ఆది దంపతుల వివాహం ఇక్కడి ధర్మశిలలోనే జరిగిందని భావిస్తారు.

8. అగ్ని రూపంలో జ్వలిస్తున్నాడు...

8. అగ్ని రూపంలో జ్వలిస్తున్నాడు...

Image source:


వివాహంలో భాగంగా శివపార్వతులు యజ్ఞం చేసి ప్రదక్షిణ చేసిన యజ్ఞగుండంలో విష్ణుమూర్తి అగ్నిరూపంలో జ్వలిస్తున్నాడని పౌరాణిక కథనం. యజ్ఞకుండంలో వేసే హవిస్సును అగ్నిదేవుడు, స్వాహాదేవి స్వీకరించి భగవంతుడికి అందిస్తారని సనాతన విధానం తెలుపుతుండగా, ఇక్కడ మాత్రం హవిస్సును నేరుగా విష్ణుమూర్తే స్వీకరిస్తున్నాడని చెప్తారు. వైష్ణవుల ప్రకారం త్రియుగీ నారాయణ్ విష్ణువు ఆదిస్థానం, నిత్య నివాసస్థానం, శైవులు దీన్ని శివపార్వతుల వివాహం జరిగినందుకు పుణ్యస్థలిగా భావిస్తారు.

9. రోడ్డు, రైలు ప్రయాణం

9. రోడ్డు, రైలు ప్రయాణం

Image source:


రుద్రప్రయాగ్ నేషనల్ హై వే 58 మార్గంలో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గంలో ఉంది. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవిలో న్యూ ఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సులు రుద్రప్రయాగ్ మీదుగానే వెళతాయి. కేశ్ నుండి రుద్రప్రయాగ్ కు రెగ్యులర్ బస్సులు ఉన్నాయి. రుద్రప్రయాగ్ కు ఋషి కేష్ రైలు స్టేషను సమీపం. కొన్ని రైళ్ళతో ఇది ఒక చిన్న రైలు స్టేషను. అయితే 24 కి. మీ. ల దూరంలో కల హరిద్వార్ రైలు జంక్షస్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి.

10. వాయుమార్గం

10. వాయుమార్గం

Image source:


రుద్రప్రయాగ్ కు సమీప ఎయిర్ బేస్ సుమారు 183 కి. మీ. ల దూరం లోని దేహ్రా దూస్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి రుద్రా ప్రయగ్ కు టాక్సీలు లభిస్తాయి. త్రియుగీ నారాయణ స్వామి క్షేత్ర పర్యటన అటు వైష్ణవులకు ఇటు శైవులకు కూడా పరమ ప్రవిత్రమైనది కావడం ఇక్కడ గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X