Search
  • Follow NativePlanet
Share
» »ఉదయపూర్ - భారతదేశపు వెనిస్ నగరం !!

ఉదయపూర్ - భారతదేశపు వెనిస్ నగరం !!

క్రీ.పూ. 600 నుండి ప్రస్తుత కాలం వరకు ఈ ప్రదేశం పరాకాంతం కాలేదు. రాజపుత్రుల చరిత్ర, సంస్కృతి మరియు విజ్ఞాన ప్రదేశాలు ఉదయపూర్ ఇప్పటికీ విశదీకరిస్తుంది.

By Mohammad

ఉదయపూర్ అంటే సిటీ ఆఫ్ సన్ రైజ్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. స్థానికులు దీనిని 'శ్వేత నగరం' అని కూడా అంటారు. ఇది ఉదయపూర్ జిల్లా ప్రధానకేంద్రము. ఉదయపూర్ జిల్లా పశ్చిమ భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. రాజపుత్రులు ఏలిన మేవార రాజ్యానికి ఉదయపూర్ రాజధానిగా ఉండేది. ఉదయపూర్ అతి దీర్ఘకాలం పరిపాలించిన సంస్థానంగా ఉదయపూర్‌ ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి : రాజస్థాన్ లోని అల్వార్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

క్రీ.పూ 600 నుండి ప్రస్తుత కాలం వరకు ఈ ప్రదేశం పరాకాంతం కాలేదు. రాజపుత్రుల సంతతివారు ఇప్పటికీ వారి హోదాలో కొనసాగుతున్నారు. రాజపుత్రుల చరిత్ర, సంస్కృతి మరియు విజ్ఞాన ప్రదేశాలు ఉదయపూర్ ఇప్పటికీ విశదీకరిస్తుంది. అనేక రాజమందిరాలు విలాసవంతమైన వసతిగృహాలుగా మార్చబడ్డాయి. ఈ నగరాన్ని 'తూర్పు వెనిస్ నగరం', 'ప్రేమ నగరం' మరియు 'సరస్సుల నగరం', 'కాష్మీర్ ఆఫ్ ది రాజస్థాన్' అని ఉపనామాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : హల్దీరాం ఆలూ భుజియా ఎక్కడ పుట్టిందో తెలుసా ?

భారతదేశంలో ఉదయపూర్ ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ కలిగిన నగరం. ఊదపూర్ నగరం సరస్సులు, రాజభవనాలు, సంస్కృతి మరియు ప్రజా జీవన విధానం వంటి వాటితో స్వదేశీ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది పలు చలనచిత్ర నటీ నటులకు, ప్రముఖ వ్యారులకు, రాజకీయనాయకులకు ప్రముఖ చెందిన వివాహ వేదికగా ఉంది. వీరు ఇక్కడ వివాహ వేడుకలు, విందులు జరుపుకుంటారు.

ఇది కూడా చదవండి : అజ్మీర్ - ఆరావళి పర్వత శ్రేణులలో ఒక ఆణిముత్యం !

ఇక్కడ షూట్ చేసిన కొన్నిప్రసిద్ధి చెందిన చలనచిత్రాలు/ టెలివిజన్ ప్రసారాలు: జేమ్స్ బాండ్, జువెల్ ఇన్ ది క్రౌన్,డిస్ని చానల్ చిత్రం చిఠాహ్ గర్ల్స్ ఒన్ వరల్డ్, డార్జిలింగ్ లిమిటెడ్, ఓపెనింగ్ లైట్, హీట్ అండ్ డస్ట్, ఇన్డిస్క్ రింగ్, ఇన్‌సైడ్ ఆక్టోబసీ, జేమ్స్ బాండ్ ఇండియా, గాంధి మరియు ఫాల్.

ఇది కూడా చదవండి : ఎడారిలో ఒయాసిస్సు - మౌంట్ అబూ !

ఉదయపూర్‌లో చిత్రీకరించబడిన హిందీ చిత్రాలు గైడ్, మేరాసాయా, ఫూల్ బనే అంగారే, కచ్చే ధాగే, మెర గ్యాన్ మేరా దేష్, జల్‌మహల్, యాదిన్, రిటర్న్ ఆఫ్ ది బాగ్దాద్, ఏకలవ్య, ది యాయల్ గార్డ్, ధమ్మాల్, జిస్ దేస్ మే గంగా రహతా హై, చలో ఇషాక్ లడాయే, ఫిజా, గద్దార్, హమ్ హై రహి ప్యార్ కే, కుదా గవాహ్, కుందన్, నందిని, సాజన్ కా ఘర్ అదనంగా అనేక బాలీ వుడ్ చిత్రాల పాటలు ఉదయపూర్‌లో చిత్రీకరించబడ్డాయి.

ఇది కూడా చదవండి : జైపూర్ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

ఉదయపూర్ సిటీ ప్యాలెస్

ఉదయపూర్ సిటీ ప్యాలెస్

1559లో పిచోల సరస్సు తీరంలో గంభీరంగా ఈ ఉదయపూర్ సిటీ ప్యాలెస్ సముదాయం ఉంది. మూడు ఆర్చులు కలిగిన త్రిపోలియా అనే ద్వారం 1725లో నిర్మించబడింది. ఈ ద్వారం వరుసగా బహిరంగ ప్రదేశాలు, తోటలు, భవన గోపురాలు, మందిరాలు వసారాలు చేరుకోవచ్చు. ఇక్కడ అనేక పురాతన కళాత్మకమైన వస్తువులు, చిత్రాలు, అలంకరించిన గృహోపయోగ వస్తువులు వేల కొలది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్రకృప : Dennis Jarvis

జల్ మందిరం

జల్ మందిరం

1743-1746లో పిచోలా సరసు మధ్యలో ఉన్న జాగ్ నివాస్ ద్వీపంలో పాలరాతి రాజభవనం ఇది. ఇది రాజకుంటుంబం వేసవి విడిదిగా ఉపయోగించడానికి నిర్మించబడిది. ఇప్పుడది ది తాజ్ హోటెల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ సంస్థ క్రింద 5 నక్షత్రాల హోటల్‌గా మార్చబడింది.

చిత్రకృప : Philbrest

వేసవి విడిది

వేసవి విడిది

మహారాజుకు ఇది మరొక వేసవి విడిది. కొండ శిఖరం మీద నిర్మించబడిన ఈ భవనం నుండి చుట్టూ ఉన్న సరసుల సుందర దృశ్యం కనిపిస్తుంది. ఈ రాజభవనంలో వర్షపు నీటిని సేకరించి సంవత్సరమంతా అవసరాలకు వాడడానికి అనువైన నిర్మాణం చేయబడి ఉంది.

చిత్రకృప : gags9999

జగదీష్ ఆలయం

జగదీష్ ఆలయం

ఉదయపూర్ నగర మధ్యలో ఉన్న పెద్ద ఆలయం జగదీష్ మందిర్. ఈ అలయం క్రీ.శ 1651 లో మొదటి మహారాణా జగత్ సింగ్ చేత నిర్మించబడింది. సింధు-ఆర్యన్ శిల్పకళతో నిర్మించబడిన నిర్మాణాలకు ఇది ఒక ఉదాహరణ. ఈ ఆలయం గొప్ప శిల్పకళావైభవానికి, చిత్రాలకు ప్రసిద్ధి చెందినది.

చిత్రకృప : Puneet Sharma

ఫతే సాగర్ సరస్సు

ఫతే సాగర్ సరస్సు

ఫతే సాగర్ సరసు పిచోలా సరసుకు ఉత్తరంగా ఉంటుంది. క్రీ.శ 1678లో దీనిని మహారాణా జైసింగ్ నిర్మించాడు.

చిత్రకృప : Koen

పిచోలా సరస్సు

పిచోలా సరస్సు

పిచోలా సరసులో రెండు ద్వీపములు ఉన్నాయి. ఒకటి జగ్ నివాస్ మరియు జగ్ మందిర్. ఈ సరసు 4 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుయంది. ముందుగా దీనిని రెండవ మహారాణా ఉదయ సింగ్ నిర్మించాడు. సరస్సు కేంద్రములో లేక్ ప్యాలెస్ ఉంటుంది.

చిత్రకృప : Arnie Papp

సహేలియోంకి బారి

సహేలియోంకి బారి

సహేలియోకి బారి అనేది రాజోద్యానవనము. దీనిని మహారాణితో పంపబడిన 48 మంది చెలికత్తెలు కొరకు ఉదయపూర్ రాజుల చేత నిర్మించబడింది. ఫతే సాగర్ సరసు తీరంలో ఈ ఉయానవనం నిర్మించబడింది. ఈ సరసులో తామర కొలనులు, ఏనుగు ఆకార ఫౌంటెన్లు (జలయంత్రాలు) ఉన్నాయి.

చిత్రకృప : Ankur P

గులాబీ తోట మరియు జంతుప్రదర్శనశాల

గులాబీ తోట మరియు జంతుప్రదర్శనశాల

రాజభవనం సమీపంలో పిచోలా సరసు తూర్పు దిక్కున మహారాణా సాజన్ సింగ్ చేత ఒక ఉద్యాన వనం నిర్మించబడింది. ఈ ఉద్యానవనంలో సత్యార్ధ్ ప్రకాష్ స్థూపం ఒకటి ఉంది. ఉద్యానవనంలో ఉన్న జంతుప్రదర్శనశాలలో పులులు, చిరుతపులులు, పక్షులు, కృష్ణ జింక మరియు ఇతర కృరమృగాలు ఉన్నాయి.

చిత్రకృప : Sanjitchohan

దూద్ తాలై

దూద్ తాలై

ఎ రాక్ అండ్ ఫౌంటెన్ ఉద్యానవనం మరియు సూర్యాస్తమయ దృశ్యం పిచోలా సరసు నుండి చూసి ఆనందించవచ్చు. కార్ని మాతా ఆలయం నుండి ఇక్కడికి చేరుకోవడానికి రోప్‌వే కూడా ఉంది.

చిత్రకృప : Henrik Bennetsen

భారతీయ లోక్ కళా మందిరం

భారతీయ లోక్ కళా మందిరం

జానపదకళల ప్రదర్శన శాలలో పప్పెట్ షో కూడా నిర్వహించబడుతుంది.

చిత్రకృప : KaranKapoor1314

మహారాణా ప్రతాప్ మెమోరియాల్ లేక మోతీ మాగ్రి

మహారాణా ప్రతాప్ మెమోరియాల్ లేక మోతీ మాగ్రి

ఫతే సాగర్ నుండి కనిపించే మోతీమా గిరి శిఖరం మీద రాజపుత్ ప్రియత నాయకుడు మహారాణా ప్రతాప్ సింగ్ తన అభిమాన ఆశ్వం అయిన చేతక్‌తో కలసి నడుస్తునడుస్తున్నట్లు ఉన్న కంచు విహ్రహం ప్రతిష్ఠించబడి ఉంది.

చిత్రకృప : Venkatarangan

బొహరా గణేశ్ జీ

బొహరా గణేశ్ జీ

పురాతనమైన గణేష్ ఆలయంలో నిలబడి ఉన్న వినాయకుడు దర్శనమిస్తాడు. అత్యంత శక్తివంతుడైన దైవంగా భావించి భక్తులు ఇక్కడకు ప్రతి బుధవారం వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

చిత్రకృప : Nagarjun Kandukuru

నెహ్రూ ఉద్యానవనం

నెహ్రూ ఉద్యానవనం

ఫతే సాగర్ సరసు మధ్యలో ఉపస్థితమై ఉన్న ఈ పార్క్ 41 చదరపు ఎకరాలు. ఈ ఉద్యానవనంలో సంపెగ కొలను మరియు పూల తోటలు ఉన్నాయి. ఈ ఉద్యానవనం నుండి మహారాణా ప్రతాప్ మోతీ మహల్ మరియు ఆరావళి పర్వతాలు దర్శనం ఇస్తాయి.

చిత్రకృప : Lokesh Dhakar

బగోర్ కి హవేలి

బగోర్ కి హవేలి

ఈ భవనం పిచోలీ సరసు ఒడ్డున గంగోరీ ఘాట్ వద్ద నిర్మించబడింది. ఈ భవనంలో ప్రస్తుతం రాజస్థానీ సాంస్కృతిక సంగీతం మరియు నృత్యాలు ప్రదర్శించబడుతున్నాయి.

చిత్రకృప : Apoorvapal

అహర్ మ్యూజియమ్

అహర్ మ్యూజియమ్

ఉదయపూర్ నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో మేవార్ రాణాల సమాధుల సమూహం ఉంది. ఇక్కడ 19 రాణాల సమాధులు ఉన్నాయి. దీనికి సమీపంలో అహర్ మ్యూజియం ఉంది. ఇక్కడ కొన్ని అతి అపురూపమైన మట్టి పాత్రలు ఉన్నాయి అలాగే కొన్ని శిల్పాలు ఇతర వాస్తు నిర్మాణాలు ఉన్నాయి. 10వ శతాబ్ధపు బుద్ధుడి కంచు శిల్పం ప్రత్యేక ఆకర్షణ.

చిత్రకృప : Schwiki

శిల్ప్ గ్రామ్

శిల్ప్ గ్రామ్

ఉదయపూర్ వాయవ్యంలో హస్తకళల గ్రామం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ హస్థకళా వస్తు సంత జరుగుతుంటుంది. ఇది భారతదేశంలో అతి పెద్ద హస్థకళా సంతగా భావించబడుతుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ తాత్కాలిక దుకాణాలు ఏర్పరచుకుని తమ హస్థకళా ఖండాలను విక్రయిస్తుంటారు.

చిత్రకృప : Nilesh2 str

నీమాచ్ మాతా ఆలయం

నీమాచ్ మాతా ఆలయం

ఉదయపూర్ లోని పచ్చని కొండల మీద దీవాలీ ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చేరడానికి మెట్లదారి, 800 మీటర్ల పొడవున ఏటవాలు దారి కూడా ఉన్నాయి. ఈ ప్రదేశానికి దిగువగా భురానీ నగర్ పేరిట ఒక భోరా కాలనీ, భురానీ మసీదు పేరిట ఒక కొత్త మసీదు ఉన్నాయి.

చిత్రకృప : TeshTesh

ఉదయపూర్ సోలార్ అబ్జర్వేటరీ

ఉదయపూర్ సోలార్ అబ్జర్వేటరీ

ఆసియా ఒకే ఒక సోలార్ అబ్జర్వేటరీ అయిన ఊదయపూరు సోలార్ అబ్జర్వేటరీ ఫతే సాగర్ సరసు లోని ద్వీపములో ఉంది.

చిత్రకృప : Schwiki

సుఖాడియా సర్కిల్

సుఖాడియా సర్కిల్

ఉదయపూర్ ఉత్తర సరిహద్దులలో ఉన్న పంచవటి నుండి రాణాకపూర్ మరియు మౌంట్ అబూ పర్వత మార్గంలో ఈ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ వినోద కార్యక్రమాలు మరియు సభలు నిర్వహణకు పేరు పొందినది.

చిత్రకృప : Emailmn

జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్

జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్

ఆసియా లోనే అతి పెద్దది అని భావించబడుతున్న భారతీయ రైల్వే శిక్షణా కేంద్రం అతి పెద్ద పచ్చని మైదానంలో ఉంది. నిరాడంబరంగా అలాగే చూపరులను ప్రభావితులని చేసే ఆర్చ్ ఆకార భవనం మరియు ప్రశాంతమైన ప్రహరీలతో ఈ ప్రదేశం సరసుల నగరమైన ఊదయపూర్‌కు మరింత శోభను కూరుస్తున్నది.

చిత్రకృప : Zrti

స్టేటస్ ఆఫ్ శివ

స్టేటస్ ఆఫ్ శివ

ఉదయపూర్ మరియు చొత్తోర్ మార్గమధ్యంలో ఉన్న సుందరమైన మెనార్ గ్రామం వద్ద బ్రమ్ సాగర్ సరసు తీరంలో ఉన్న శివుడి విగ్రహం ఈ గ్రామస్తులకు ఆశీర్వాదాలు అందిస్తూ ఉంది.

చిత్రకృప : Shakti

ఉదయపూర్ చేరుకోవటం ఎలా ?

ఉదయపూర్ చేరుకోవటం ఎలా ?

వాయుమార్గం : ఉదయపూర్ లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయం ఉన్నది. ఇక్కడకు కోల్కతా, ఢిల్లీ, జైపూర్, ముంబై ప్రాంతాల నుండి తరచూ విమానాలు వస్తుంటాయి. విమానాశ్రయం వెలుపల క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని ఉదయపూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : ఉదయపూర్ లో విమానాశ్రయం కలదు. ఇక్కడికి ఆగ్రా, న్యూఢిల్లీ, జైపూర్, జైసల్మేర్, గాంధీనగర్, ముంబై తదితర ప్రాంతాల నుండి రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం : రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల నుండి ఉదయపూర్ కు రాష్ట్ర రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఉన్నాయి. న్యూ ఢిల్లీ, జైపూర్ నుండి కూడా ఉదయపూర్ కు ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్రకృప : Aswin Krishna Poyil

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X