Search
  • Follow NativePlanet
Share
» »అమ్మవారి ఏ శరీర భాగాన్ని పూజిస్తారో తెలుసా?

అమ్మవారి ఏ శరీర భాగాన్ని పూజిస్తారో తెలుసా?

గౌహతిలోని ఉగ్రతారా దేవాలయానికి సంబంధించిన కథనం

హిందూధర్మంలో శక్తిపీఠాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మహిళలను పూజించే భారత దేశంలో ఈ శక్తి పీఠాల ఆరాధాన మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తిపీఠాల్లోని అమ్మవారిని పూజిస్తే కోరుకొన్న కోర్కెలన్నీ నెరవేరుతాయని భక్తులునమ్మకం. దీంతో మంగళ, శుక్రవారాలతో పాటు పర్వదినాల్లో శక్తిపీఠాలు ఉన్న ప్రదేశానికి భక్తులు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఆ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని చూస్తూ పాటలు పాడుతారు. అయితే అమ్మవారి విగ్రహమే లేని ఓ శక్తి పీఠం భారత దేశంలో ఉంది. ఈ శక్తిపీఠానికి సంబంధించిన కథనం మీ కోసం...

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

శివుడు స్మశానవాసి అని, నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడని ఇలా వివిధ కారణాలతో దక్షప్రజాపతి ఆ పరమశివుడిని అసహించుకొంటుంటాడు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

అయితే ఆపరమశివుడిని దక్షప్రజాపతి కుమార్తే అయిన సతీదేవి వివాహం చేసుకొంటుంది. దీంతో దక్షప్రజాపతి ఆ సతీదేవిని కూడా అసహించుకొంటూ ఉంటాడు. ఒకరోజు దక్షప్రజాపతి ఒక గొప్పయాగం చేస్తాడు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

ఇందుకు సమస్త దేవతలతో పాటు తన మిగిలిన కుమార్తెలను అల్లుళ్లను కూడా ఆహ్వానిస్తాడు. అయితే ఆ యాగానికి పరమశివుడితో పాటు తన కుమార్తె సతీదేవిని ఆహ్వానించడు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

అయినా పుట్టింటి పై మమకారం చంపుకోలేక భర్త పరమశివుడు వారిస్తున్నా సతీదేవి పిలవని ఆ యాగానికి వెలుతుంది. అయితే అక్కడ ఆమెను సోదరీమణులతో పాటు తండ్రి కూడా అవమానిస్తాడు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

దీంతో అవమాన భారం భరించలేక ఆత్మాహుతికి పాల్పడుతుంది. విషయం తెలుసుకొన్న పరమశివుడు రుద్రడైపోతాడు. తన జఠాజూటం నుంచి వీరభద్రుడిని స`ష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేయమని ఆదేశిస్తాడు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

అంతేకాకుండా తన భార్య సతీదేవి పార్థీవ దేహాన్ని భుజం పై వేసుకొని వైరాగ్యంతో లోక సంచారం చేస్తూ ఉంటాడు. దీంతో స`ష్టికార్యం నిలిచిపోతుంది.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

దీంతో సమస్యను పరిష్కరించాలాని కోరుతూ మిగిలిన దేవతలు, బుుషులు ఆ మహావిష్ణువును కోరుతారు. ఆ విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరిస్తాడు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

అలా కత్తిరించిన శరీర భాగాలు భూమి పై 108 ప్రాంతాల్లో పడి శక్తిపీఠాలుగా మారుతాయి. ఆ శక్తిపీఠాల్లో చాలా వరకూ భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ శక్తిపీఠాలకు దేవాలయాలు నిర్మించి పూజిస్తున్నారు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

ఆ 108 శక్తిపీఠాల్లో తారా మాత దేవాలయం కూడా ఒకటి. దీనిని ఉగ్రతారా దేవాలయం అని అంటారు. ఈ దేవాలయం గౌహతి తూర్పు భాగంలో ఉంది. ఇది అస్సోంలోనే కాకుండా భారత దేశంలోనే అత్యంత ప్రాచూర్యం పొందిన దేవాలయం.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

ఇక్కడ పార్వతీ దేవి ఉదర భాగం పడిందని చెబుతారు. అయితే ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మాత్రం ఉండదు. ఈ ఉగ్రతార దేవాలయాన్ని క్రీస్తుశకం 1725లో రాజ అహోమ్ శివ సింగా నిర్మించాడు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

ఇక్కడ అమ్మావారి దేవాలయానిక దగ్గర్లో ఒక తటాకం ఉంది. దీనికి జోర్ పుకురి అని పిలుస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ భూకంపం వచ్చి దేవాలయం శిఖరం పడిపోయినా కూడా ఈ తటాకం చెక్కు చెదరలేదు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

ఈ దేవాలయం లో అమ్మవారి విగ్రహం ఉండదు. కేవలం అమ్మవారి ఉదర భాగం (బొడ్డు) వలే చిన్న రంద్రం ఉంటుంది. ఈ రంద్రం నుంచి ఏ సమయంలోనైనా నీరు వస్తూనే ఉంటుంది.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

దీనినే సతీదేవి బొడ్డు అని పిలుస్తారు. ఈ చిన్న రంద్రానికే పూజలు కూడా చేస్తారు. ఈ దేవాలయం క్షుద్రపూజలకు చాలా ప్రాచూర్యం చెందినది. ముఖ్యంగా అఘోరాలు ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

ఈ దేవాలయంలోని అమ్మవారికి మాంసం, మద్యం, గంజాయి వంటి పదార్థాలను నైవేద్యంగా అర్పిస్తారు. ఈ దేవతను పూజించడం వల్ల ఇంటికి గ్రహదోష నివారణ జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

ఉగ్ర తారా దేవాలయం, అస్సోం

P.C: You Tube

అందువల్లే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇక్కడ ఎక్కువ మంది భక్తులు అమ్మవారికి పూజలు జరిపించడానికి వస్తుంటారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి అఘోరాలు ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X