Search
  • Follow NativePlanet
Share
» »మీ పెళ్లి ఇక్కడ వేరుగా జరుగుతుంది

మీ పెళ్లి ఇక్కడ వేరుగా జరుగుతుంది

విభిన్న పెళ్లి మంటపాలకు సంబంధించిన కథనం.

By Kishore

బుర్రకో బుద్ధి, జివ్వకో రుచి అంటారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆలోచన. కొందరికి నలుగురితో పాటు నారాయణ అనడం కంఫర్ట్ గా ఉంటే మరికొందరికి నలుగరు నడిచిన దారిలో నేనుందుకు నడవాలి అన్న ప్రశ్నతోనే వారికి తెల్లారుతుంది. ఇటువంటి వారు ఎంత కష్టమైనా నష్టమైనా తాము అనుకొన్నదే చేస్తారు. అటువంటి వారి కోసమే ఈ కథనం. సాధారణంగా పెళ్లి అనగానే బంధుమిత్రులతో హడావుడిగా ఉండే ఓ కళ్యాణ మంటపం, అక్కడ ఉన్న ఓ వేదిక పై అర్థం కాకపోయినా పంతులు చెదివే మంత్రాలకు తలాడించే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇలా ఒక ఇమాజినేషన్ మన కళ్లముందు మెదులుతుంది. అయితే గజిబిజి తంతు నుంచి కాస్త దూరంగా ఉండాలని భావించే వారి కోసం కొన్ని ప్రత్యేక మైన వెడ్డింగ్ డెస్టినేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ వివరాలతో కూడిన కథనం మీ కోసం...

గడ్డి మోపులెత్తుకొని నడిచే పల్లెపడుచుల నడుమోంపువలే....ఎంత సక్కగున్నాయోగడ్డి మోపులెత్తుకొని నడిచే పల్లెపడుచుల నడుమోంపువలే....ఎంత సక్కగున్నాయో

1. గూడు పడవల్లో...

1. గూడు పడవల్లో...

Image Source:

నదీ, లేదా సముద్ర జాలాల పై ప్రయాణించడం ప్రతి ఒక్కరికీ ఇష్టమై. కొన్ని చోట్ల ఈ బోట్ లను హౌస్ రూపంలోకి మార్చివేసి వాటిని హనీమూన్ జంటల కోసం కేటాయిస్తారు. చాలా వరకూ పెళ్లిళ్లను పెళ్లి మంటపాల్లోనే చేసుకుని హనిమూన్ మాత్రం ఈ బోట్ హౌస్ లలో చేసుకుంటారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ బోట్ హౌస్ లు పెళ్లి మంటపాలుగా మారుతున్నాయి. ఇందులో వందల సంఖ్యలో అతిథులు ఉండరు. కేవలం పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో పాటు ఓ నలుగురు అతిథులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇటు వంటి గూడు పడవలు కేరళ, జమ్ము కాశ్మీర్ లో చూడవచ్చు.

2. గ్రంథాలయాలు కూడా

2. గ్రంథాలయాలు కూడా

Image Source:

సాధారణంగా గ్రంథాలయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి. వీటిలో ఎటువంటి ఆర్భాట కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వరు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. చిన్న వయస్సులోనే సాహితీ వేత్తలుగా పేరు తెచ్చుకున్నవారికి గ్రంథాలయంలో పెళ్లిల్లు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. పుస్తకాలు ఎవరికైతో ఇష్టమో వారు గ్రంథాల మధ్య పెళ్లి చేసుకోవాలని భావించడంలో తప్పులేదుకదా. అయితే ఇక్కడ కూడా అతిథులను తక్కువ సంఖ్యలోనే అనుమతిస్తారు. కలకత్తాలో ఇటువంటి వాటికి అవకాశం ఉంది.

3. ఉద్యానవనాలు

3. ఉద్యానవనాలు

Image Source:

ప్రక`తిని బాగా ఇష్టపడే వారికి ఉద్యానవనాలు బెస్ట్ ఆప్షన్. చుట్టూ పచ్చగా ఉండే పరిసరాల మధ్య జీవితంలోకి ఒక తోడును తెచ్చుకోవడం మరిచిపోలేని అనుభూతి. అన్నట్టు ఇక్కడ ఖర్చు తక్కువగానే ఉంటుంది. అతిథుల ఆహ్వానానికి ఎటువంటి నిర్భందం కూడా ఉండదు.

4. ట్రీ హౌస్

4. ట్రీ హౌస్

Image Source:

అడవుల్లో పెద్ద పెద్ద చెట్ల పై భాగంలో చిన్న చిన్న గుడిసెలను నిర్మించి ఉంటారు. ఈ గుడిసెలనే ట్రీ హౌస్ అని అంటారు. ప్రక`తిని ఇష్టపడే వారు ఈ ట్రీ హౌస్ లలో వివాహం చేసుకోవచ్చు. ఇది కొంత సాహసంతో కూడుకున్నది. అయితే ముందే చెప్పినట్లు నలుగురితో పాటు నడవడం ఇష్టం లేని వారికి ఈ ట్రీ హౌస్ వెడ్డింగ్ బెస్ట్ ఆప్షన్.

5. ధూం, ధాంగా

5. ధూం, ధాంగా

Image Source:

సాధారణంగా కళ్యాణ మంటపంలో పెళ్లిళ్లు జరుగుతాయి. ఇందుకు భిన్నంగా రాజప్రసాదాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలని భావించే వారికి ప్యాలెస్ లు బెస్ట్ ఆఫ్షన్. బెంగళూరు, జైపూర్ తదితర చోట్ల ప్యాలెస్ లను పెళ్లిళ్లకు అద్దెకు ఇచ్చే విధానం ఇప్పుడిప్పుడే ట్రెండీగా మారుతోంది. ఇక్కడ కూడా అతిథుల సంఖ్యలకు ఎటువంటి నిర్భందం ఉండదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X