• Follow NativePlanet
Share
» »రాత్రి అయితే భైరవకోనలో ఏం జరుగుతుంది ?

రాత్రి అయితే భైరవకోనలో ఏం జరుగుతుంది ?

Written By: Venkatakarunasri

శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవ కోనలో ఉంది. కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు ప్రహ్లాదుడు పరమపదించిన తరువాత పట్టించుకొనే వారులేక క్షుద్బాధ భరించలేక దారిదోపిడీలకు పాల్బడేవాడు అందుకు ఆగ్రహించిన నృసింహాస్వామి రాక్షసుడవుకమ్మని శపించాడు.

నెల్లూరులో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !

తెలిసి చేసినతప్పు కాదని ఆకలి భరించలేక చేసానని పరిహారం శూచించమని భైరవుడు ప్రాదేయ పడటంతొ కలియుగాంతం వరకు తనకంటికి కనిపించకుండా తనభక్తులు తెచ్చినది ఏదైనా తనప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉండమనీ కలియుగనంతరం మళ్లీ తన సేవకు వినియెగించుకుంటానని వరమిచ్చాడు నాటినుంచి భైరవుడు భైరవకోనలో పూజలందుకుంటున్నాడు.

సెలబ్రెటీలు - దత్తత గ్రామాలు !

ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు.

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. .

ఒకే రాయిలో అష్టశివాలయాలు

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. పవిత్రమైన హిందూ క్షేత్రం

1. పవిత్రమైన హిందూ క్షేత్రం

దక్షిణభారతదేశంలోని పవిత్రమైన హిందూ క్షేత్రాలలో భైరవకోన ఒకటి.

భైరవకోన - అద్భుత గుహాలయాలు !

pc:youtube

2. 3 ముఖాలు కలిగిన దుర్గాదేవి

2. 3 ముఖాలు కలిగిన దుర్గాదేవి

క్షేత్రంలోని ఆలయాన్ని 9 వ దశాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్టు తెలుస్తున్నది.ఈ క్షేత్రంలో 3 ముఖాలు కలిగిన దుర్గాదేవి ఒక రాయిపై చెక్కబడివున్నది.

భైరవకోన గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు !

pc:youtube

3. కొత్తపల్లి గ్రామం

3. కొత్తపల్లి గ్రామం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో వున్న ఒంగోలు పట్టణానికి 120కి.మీల దూరంలో అంబవరం కొత్తపల్లి గ్రామంలో భైరవకోన శైవ క్షేత్రమున్నది.

ప్రకాశంలో అద్భుత జల 'కోన' !!

pc:youtube

4. రవాణా సౌకర్యాలు

4. రవాణా సౌకర్యాలు

ఈ క్షేత్రాన్ని చేరుకోటానికి రవాణా సౌకర్యాలు బాగానే వున్నాయి. 3 కొండల మధ్య వున్న ఒక అటవీ ప్రాంతమే భైరవకోన.

pc:youtube

5. బస్సు సౌకర్యం

5. బస్సు సౌకర్యం

ఉదయం 5:30ల నుండి రాత్రి 10:00ల వరకు అంబవరం కొత్తపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం వుంది.

నెమలిగుండ్ల రంగనాయక ఆలయం కేరాఫ్ నల్లమల అడవి !

pc:youtube

6. క్షేత్రపాలకుడు

6. క్షేత్రపాలకుడు

ఈ క్షేత్రానికి బాలభైరవుడు క్షేత్రపాలకుడుగా వున్నాడు. బాలభైరవుడు బాలుడుగా వుంటాడు. ఈ క్షేత్రంలో దుర్గాదేవి స్వయంభూగా అవతరించింది.

కమనీయ దృశ్యం ... కనిగిరి దుర్గం !

pc:youtube

భార్గవేశ్వరుడు

భార్గవేశ్వరుడు

భార్గావముని ఈ క్షేత్రంలో శివుని గురించి తపస్సు చేయటం వలన శివుడుస్వయంభూగా అవతరించాడు. ఈ క్షేత్రంలో వెలసిన శివుడిని భార్గవేశ్వరుడు అని పిలుస్తారు.

శ్రీ ప్రసన్నంజనేయస్వామి దేవాలయం, సింగరకొండ !

pc:youtube

8. శశి నాగలింగం

8. శశి నాగలింగం

ఈ క్షేత్రంలో వున్న శశి నాగలింగం దర్శించినట్లయితే నాగదోషం తొలగిపోతుంది. ఈ క్షేత్రంలో వున్న ఆలయం చుట్టూ 16నుండి 128వరకు ప్రదక్షిణాలు చేస్తే సమస్త పాపాలు హరిస్తాయి.

హాయి.. హాయిగా.. చల్ల.. చల్లగా.. నెల్లూర్ బీచ్ లో సందడి చేద్దాం రండి

pc:youtube

9. విషసర్పాలు మరియు క్రూరజంతువులు

9. విషసర్పాలు మరియు క్రూరజంతువులు

ఈ క్షేత్ర పాలకునిగా వున్న బాలభైరవుని కారణంగా ఈ అటవీ ప్రాంతంలో వుండే విషసర్పాలు మరియు క్రూరజంతువులు ఇక్కడకు వచ్చే భక్తుల్ని ఏమీ చేయకుండా వుంటాయి.

మతసామరస్యానికి ప్రతీక .. రొట్టెల పండగ !

pc:youtube

10 . అద్భుతవిశేషం

10 . అద్భుతవిశేషం

ఈ క్షేత్రంలో వున్న ఒక అద్భుతవిశేషం ఏంటంటే కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి చంద్రకిరణాలు ఈ క్షేత్రంలో వెలసిన దుర్గాదేవి విగ్రహంపై నేరుగా పడతాయి.

పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !

pc:youtube

11. ఒకే రాయిలో తొలచిన 8 ఆలయాలు

11. ఒకే రాయిలో తొలచిన 8 ఆలయాలు

ఈ క్షేత్రంలో ఒకే రాయిలో తొలచిన 8 ఆలయాలున్నాయి.ఈ అష్ట ఆలయాలలో శివుడు అష్ట విభిన్నరూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు.

ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం - శ్రీకాళహస్తి !

pc:youtube

12. పౌర్ణమి

12. పౌర్ణమి

ఆ రూపాలేంటంటే కసి నాగలింగం, రుద్ర, విశ్వేశ్వర, నాగరికేశ్వర,భాగ్యేశ్వర,మల్లికార్జున, పక్ష మాలిక లింగం భక్తులు కార్తీకమాసంలో వచ్చే ప్రతి బుధవారం నాడు మరియు పౌర్ణమినాడు ఈ క్షేత్రంలో వెలసిన స్వామిని సందర్శిస్తారు.

భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !

13. అద్భుతమైన జలపాతం

13. అద్భుతమైన జలపాతం

ఈ క్షేత్రానికి దగ్గరలో ఒక అద్భుతమైన జలపాతం కూడా వుంది. భైరవకోనలోని ఒక కొండలో తొలచబడ్డదే ఈ శివాలయం.

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాలు !!

14. వేలాదిమంది భక్తులు

14. వేలాదిమంది భక్తులు

ముఖ్యంగా కార్తీకపౌర్ణమి మరియు శివరాత్రి పర్వదినాలలో మరియు బుధవారాలలో వేలాదిమంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు.

నేలపట్టు పక్షి అభయారణ్యం, నెల్లూరు !!

pc:youtube

15. గ్రామానికి సరిహద్దు

15. గ్రామానికి సరిహద్దు

నెల్లూరు పట్టణానికి 130 కి.మీ ల దూరంలో ఈ క్షేత్రం వుంది. ఇది ప్రకాశం,నెల్లూరు జిల్లాలమధ్యనున్న కొత్తపల్లి అనే గ్రామానికి సరిహద్దుగా వుంది.

భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామి ఆలయం, నెల్లూరు !!

pc:youtube

16. విస్తారంగా బస్సు సౌకర్యం

16. విస్తారంగా బస్సు సౌకర్యం

నెల్లూరులోనే ఆత్మకూరు బస్టాండ్ నుండి పీఠాపురం లేదా ఉదయగిరి విస్తారంగా బస్సు సౌకర్యం వుంది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాలు !!

pc:youtube

17. సులువుగా చేరుకోవచ్చు

17. సులువుగా చేరుకోవచ్చు

నెల్లూరు బస్టాండ్ నుండి మధ్యాహ్నం 12గంటల 30ని.కు కొత్తపల్లికి నేరుగా బస్సు వుంది. కొత్తపల్లి నుండి ప్రైవేట్ వాహనాలలో భైరవకొన శివాలయానికి సులువుగా చేరుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి బీచ్ లు కూడా ఉన్నాయా?

pc:google maps

18. నేరుగా బస్సు సౌకర్యం

18. నేరుగా బస్సు సౌకర్యం

ఇక విజయవాడ నుండి ఒంగోలు, కందుకూరు మరియు కనిగిరి పట్టణాలకు బస్సుసౌకర్యం వుంది. అక్కడ నుండి సిఎస్ పురానికి నేరుగా బస్సు సౌకర్యం వుంది.

భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !

pc:google maps

19. హోటల్ సౌకర్యం

19. హోటల్ సౌకర్యం

ఈ క్షేత్రంలో హోటల్ సౌకర్యం లేదు. రెండు సత్రాలు మాత్రమే నివాసం కోసం ఉపయోగపడుతున్నాయి.

నెల్లూరులో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !

pc:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more