Search
  • Follow NativePlanet
Share
» »కలియుగాంతాన్ని సూచిస్తున్న యాగంటి ఆలయం

కలియుగాంతాన్ని సూచిస్తున్న యాగంటి ఆలయం

ఈ సకలచరాచర సృష్టికి ఆది,అంతం ఆయనే. అందుకే ఆయన లయకారుడైనాడు. ఇప్పుడు పరమేశ్వరుడే ఈ యుగాంతానికి సాక్షిఅవుతుంటే ఆయన వాహనమైన నందే ఈ యుగానికి శుభంకార్డు వెయ్యబోతోంది.

By Venkatakarunasri

ఆది,అంతం ఈ సూత్రానికి సృష్టిలోని చిన్న ప్రాణినుంచి కాలాన్ని గణించే యుగాల వరకూ అన్ని అతీతులని హైందవ ధర్మాలు చెబుతున్నాయి.

మొదలైన ప్రతి యుగం ఏదో ఒక సమయంలో అంతమొందక తప్పదు.

అంతమైన ప్రతీసారి మరో నూతన యుగం మొదలవకాతప్పదు.

ఇదే సృష్టి ధర్మమని మన వేదాలు వివరిస్తున్నాయి.

ఈ సృష్టిలో ఏ కార్యం జరగాలన్నా ఆ కార్యానికి ఒక కారణం కావాలి.

అలాగే ఈ కలియుగం అంతమవడానికి కొన్ని ప్రత్యేక కారణాలను ఎప్పుడో ఆ విధాత ఏర్పరచిపెట్టినట్టు పురాణాలు పలుకుతున్నాయి.

ఆ పురాణాలు పలికిన పలుకులనే కాలజ్ఞాంగా అందించిన ఒక మహావ్యక్తి శ్రీపోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి.

ఆయన లిఖించిన కాలజ్ఞానంలో కలియుగాంతానికి కారణమయ్యే ఎన్నో విషయాలను పొందుపరచినాడు.

వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది యాగంటి పరమేశ్వరుడి ఆలయం.

కలియుగాంతానికి మరో సూచన - బ్రహ్మంగారు చెప్పిన యాగంటి రహస్యం

ఆలయం ఎక్కడ వుంది?

ఆలయం ఎక్కడ వుంది?

కర్నూలుజిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లికి సుమారు 12కి.మీ ల దూరంలో చుట్టూ అత్యంత అందమైన నల్లమల అడవుల మధ్య అత్యంత శోభాయమానంగా భాసిల్లుతున్న పరమపుణ్యక్షేత్రమే యాగంటి.

PC:youtube

ఆలయంలోని మరో విశేషం

ఆలయంలోని మరో విశేషం

ఈ ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరస్వామి లింగాకారంలో కాకుండా విగ్రహంగా వుండటం ఈ ఆలయంలోని మరో విశేషం.

PC:youtube

స్థలపురాణం ప్రకారం

స్థలపురాణం ప్రకారం

స్థలపురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో అగస్త్యమహాముని నివసించేవారట.

PC:youtube

 శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం

శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం

ఆయన నివసించిన ఆ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం కట్టదలచి అక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభించారట.

PC:youtube

 స్వామివారి విగ్రహాన్ని చెక్కటం

స్వామివారి విగ్రహాన్ని చెక్కటం

ఆ ఆలయంలో ప్రతిష్టించే స్వామి వారి మూలవిరాట్టుని తన చేతులతో స్వయంగా చెక్కాలని భావించి స్వామివారి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో తన చేతి బొటన వ్రేలుకి గాయమయిందట.

PC:youtube

 సంకల్పంలో లోపం

సంకల్పంలో లోపం

తన సంకల్పంలో లోపముందని భావించి తన సంకల్పంలో లోపమున్నదని భావించి విగ్రహాన్ని చెక్కడం ఆపెసారట.

PC:youtube

స్వయంభూగా వెలసిన ఉమామహేశ్వరస్వామివారి విగ్రహం

స్వయంభూగా వెలసిన ఉమామహేశ్వరస్వామివారి విగ్రహం

అప్పటికే ఆలయ నిర్మాణం పూర్తయిపోవడంతో ఆ వూరిలో మరో దేవతామూర్తిని ప్రతిష్టించదలచగా ఈ ఆలయానికి కొంతదూరంలో స్వయంభూగా వెలసిన ఉమామహేశ్వరస్వామివారి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించారట.

PC:youtube

వేంకటేశ్వర స్వామి విగ్రహం

వేంకటేశ్వర స్వామి విగ్రహం

వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ ఆలయంలో వున్న కొండగుహలో ప్రతిష్టించారట.

PC:youtube

కొండ గుహ

కొండ గుహ

ఇప్పటికీ ఈ కొండ గుహలో మనం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించవచ్చును.

PC:youtube

పుష్కరిణి

పుష్కరిణి

ఈ ఆలయానికి ముందు ఒక పుష్కరిణి వుంది.

PC:youtube

అగస్త్యపుష్కరిణి

అగస్త్యపుష్కరిణి

ఆ పుష్కరిణిలో నీరు అక్కడున్న నంది నోట్లోనుంచి వస్తుంది. పూర్వం ఈ పుష్కరిణిలో అగస్త్యమహాముని స్నానమాచరించటం వల్ల దీనికి అగస్త్యపుష్కరిణి అనే పేరు వచ్చింది.

PC:youtube

విశేషం

విశేషం

ఇందులో వుండే విశేషం ఏమిటంటే ఏ కాలంలోనైనా ఈ పుష్కరిణిలోని నీటిమట్టం ఒకే విధంగా వుంటుందట.

PC:youtube

ఔషదగుణాలు

ఔషదగుణాలు

ఈ నీటిలో ఔషదగుణాలు ఎక్కువగా వుంటాయనిఅందువల్ల ఇందులో స్నానంచేస్తే సర్వరోగాలూ పోతాయని భక్తుల విశ్వాసం.

PC:youtube

స్వయంభూగా వెలసిన బసవన్నవిగ్రహం

స్వయంభూగా వెలసిన బసవన్నవిగ్రహం

ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ స్వయంభూగా వెలసిన బసవన్నవిగ్రహం.ఈ గుడి కట్టిన కొన్ని రోజులకే ప్రధాన ఆలయం ముఖ మండపంన ఈశాన్యదిశ యందు నందీశ్వరుడు స్వయంభూగా వెలిసాడు. ఈ బసవన్నే కలియుగాంతమున లేచి రంకె వేస్తాడట.

PC:youtube

పిట్టలు రాలినట్లు రాలిపోతారు

పిట్టలు రాలినట్లు రాలిపోతారు

ఆ శబ్దం దాదాపు యావత్ప్రపంచం వినపడుతుందని,ఆ శబ్దం విన్న వారందరూ పిట్టలు రాలినట్లు రాలిపోతారని,ఆయన రంకె వేసే సమయానికి దాదాపు భూమందలంమొత్తం పాపులతో నిండివుంతుందని,చాలా కొద్దిశాతం మాత్రమే మిగులుతారని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో వివరించారు.

PC:youtube

బసవన్న రంకె

బసవన్న రంకె

ఈ బసవన్న రంకె వేసేసమయానికి దాదాపు ఒక పర్వతం ఎత్తు అంత ఎదుగుతాడని కూడా బ్రహ్మంగారు చెప్పారు.ఆయన చెప్పినట్లే యాగంటి నందీశ్వరుడు కొద్దికొద్దిగా పెరుగుతున్నాడని భారత పురావస్తుశాఖ వారు స్వయంగా పరీక్షించి చెప్పారు.

PC:youtube

మిస్టరీ

మిస్టరీ

90సంల క్రితం నందీశ్వరుడున్న 4స్తంభాల ప్రకారం ఆయనచుట్టూ ప్రదక్షిణ చేసేటంత స్థలం వుండేదట.ఇప్పుడు ప్రదక్షిణం చేయటానికి ఏ మాత్రం ఖాళీలేనంతగా నందీశ్వరుడు ఎదిగిపోయాడు.ఈ వింత ఎలా జరుగుతుందనేదిఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

PC:youtube

ఇక్కడి మరో విశేషం

ఇక్కడి మరో విశేషం

యాగంటిలోని మరో విశేషం ఈ ప్రాంతంలో ఒక్క కాకికూడా వుండకపోవడం.దీనికి ఒక కథ అక్కడ ప్రాచుర్యంలో వుంది.

PC:youtube

సంకల్పంలో లోపం

సంకల్పంలో లోపం

యాగంటి ఆలయ నిర్మాణాన్ని మొదలెట్టిన అగస్త్యమహాముని ఆలయ మూలవిరాట్టుగా వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని మలచే సమయంలో తలెత్తే లోపంవల్ల బాధ చెందిన మునీశ్వరులు తన సంకల్పంలో లోపం ఎక్కడుందో తెలుసుకోవటానికి ఆ వెంకటేశ్వర స్వామికై తపస్సు ప్రారంభించాడట.

PC:youtube

తపస్సుకి భంగం

తపస్సుకి భంగం

ఆ సమయంలో అక్కడ ఎక్కువగా వున్న కాకులు తపస్సుకి భంగం కలిగించటంతో ఆయనకు కోపంవచ్చి ఈ ప్రాంతంలో ఒక్కకాకి కూడా వుండకూడదని శపించాడట.

PC:youtube

యాగంటిలో మనకు కాకులు కనపడదు

యాగంటిలో మనకు కాకులు కనపడదు

అందుకే అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్క కాకి కూడా యాగంటిలో మనకి కనపడదని అక్కడివారు చెబుతున్నారు.

PC:youtube

సమీపంలో చూడవలసిన ప్రదేశాలు

సమీపంలో చూడవలసిన ప్రదేశాలు

కర్నూలు కోట లేదా కొండ రెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజుగా కూడా పిలిచే కర్నూల్ కోట కర్నూల్ నగరంలోఎంతో ముఖ్యమైన ప్రాంతం. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ఈ కోట నగర౦ నడిబొడ్డున ఉంది. ఈ అద్భుతమైన కట్టడం లో మిగిలిన భాగం కొండ రెడ్డి బురుజు మాత్రమే. ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండ రెడ్డి తుది శ్వాస వదలడం వలన ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు.

PC:youtube

 బాల సాయిబాబా ఆలయం, కర్నూల్

బాల సాయిబాబా ఆలయం, కర్నూల్

బాల సాయిబాబా ఆలయం, షిర్డీ సాయిబాబా ఆలయానికి దగ్గరలో ఉంది. ఇది కర్నూలు నగర౦లోని అవతార పురుషుడు శ్రీ బాల సాయిబాబాకు చెందినది. ఈ మధ్య కాలంలో బాగా పేరుగాంచిన బాల సాయిబాబా మందిరం పెద్ద ప్రాంగణంలో ఉంది. మీరు అవతారపురుషులను, వారి ఆధ్యాత్మిక శక్తులను విశ్వసిస్తే ఈ ప్రదేశాన్ని సందర్శించండి.

PC:youtube

జగన్నాధ గట్టు ఆలయం, కర్నూల్

జగన్నాధ గట్టు ఆలయం, కర్నూల్

జగన్నాధ గట్టు ఆలయం, కర్నూలులో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. శివునికి ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కర్నూలు లోని బి.తాండ్రపాడు లో ఉంది. ఈ లింగానికి ఉన్న చరిత్రవల్ల ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవ రాజైన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కధనం. ఈ శివలింగాన్ని గ్రానైట్ రాయితో చేశారు. ఈ శివలింగం ఎత్తు 6 అడుగులు, వెడల్పు 2 అడుగులు.

PC:youtube

 కర్నూలు మ్యూజియం, కర్నూల్

కర్నూలు మ్యూజియం, కర్నూల్

భారత పురావస్తు శాఖ వారు కర్నూలు మ్యూజియాన్ని స్థాపించారు. కర్నూల్ ప్రాంతం నుండి త్రవ్విన ఎన్నో కళాఖండాలతో కర్నూలు ప్రాంతం చారిత్రక పురావస్తు ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యూజియాన్ని నిర్మించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ పక్కనే, హంద్రి నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది. సంగమేశ్వరం, ఆలంపూర్, శ్రీశైలం వంటి సమీప ఆలయాల విరిగిన శిల్పాల వంటి కళాఖండాలు, సామంత రాజులు ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియం కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకానికి సమీపంలో ఉంది.

PC:youtube

నల్లమల అడవి, కర్నూల్

నల్లమల అడవి, కర్నూల్

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నిరంతర అటవీ ప్రాంతాల్లో నల్లమల అడవి ఒకటి. ఇది తూర్పు కనుమలలో ఒక భాగమైన నల్లమల కొండలలో ఉంది. ఇది కర్నూలు, గుంటూరు, కడప, మహబూబ్ నగర్, ప్రకాశం ఈ ఐదు జిల్లాలలో విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం ఈ అడవి క్రీడలకు పేరుగాంచింది. ప్రసిద్ధ వన్యప్రాణుల రచయిత కెన్నెత్ ఆండర్సన్ ఈ అడవిలోని సాహసాల గురించి రాసారు.
ఈ అడవిలో పులులు ఎక్కువగా ఉండేవి, నాగార్జునసాగర్-శ్రీశైలం కు చెందిన పులులు ఈ అడవిలో ఒక భాగం. ఈ అడవులలో చిరుతలు తరచుగా కనిపిస్తాయి.

PC:youtube

యాగంటి క్షేత్రం - వసతి

యాగంటి క్షేత్రం - వసతి

యాగంటి లో ఆలయం దిగువ భాగాన ఉచిత అన్నదాన సత్రం ఉంది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 :30 వరకు, తిరిగి రాత్రి 8 గంటల నుండి 9 : 30 వరకు భోజనం వడ్డిస్తారు. వెజ్ ఫుడ్ మాత్రమే లభిస్తుంది. కాస్త సమీపంలోనే ఆశ్రమాలు, సత్రాలు కూడా ఉన్నాయి. రెడ్డి సత్రం, రైతు సత్రం లు వసతి సౌకర్యాలను అందిస్తాయి.

PC:youtube

వసతి సౌకర్యాలు

వసతి సౌకర్యాలు

దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన పల్లిలో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.

PC:youtube

యాగంటి క్షేత్రం - ఆలయ సందర్శన వేళలు

యాగంటి క్షేత్రం - ఆలయ సందర్శన వేళలు

ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు , తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు

PC:youtube

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.

హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్,కర్నూలు మీదుగా 5 గంటలు ప్రయాణం వుంటుంది.

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X