• Follow NativePlanet
Share
» »ఈ విలక్షణ క్షేత్రాలు విస్మయ పుణ్యక్షేత్రాల నిలయాలు

ఈ విలక్షణ క్షేత్రాలు విస్మయ పుణ్యక్షేత్రాల నిలయాలు

Written By:

భారత దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందుల్లో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అక్కడ దైవానికి నివేదించే నైవేద్యంతో పాటు ఆచార వ్యవహారాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అందుకు గల సరైన కారణాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో వేలాది సంవత్సరాలుగా ఆ విషయలు రహస్యంగానే ఉండిపోతున్నాయి. ఇందులో సముద్రంలో మునిగి తేలే శివాలయం, వేల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉన్న జ్వాల, మద్యాన్ని, నూడుల్స్ ను నైవేద్యంగా సమర్పించే దేవాలయాలు, ఒక రాక్షసిని, బులెట్ ను దేవతగా కొలిచే పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో విలక్షణమైన 10 పుణ్యక్షేత్రాల వివరాలు మీ కోసం.

 చైనీస్ కాళీ దేవాలయం, కొలకత్తా

చైనీస్ కాళీ దేవాలయం, కొలకత్తా

P.C: You Tube

కాళీ మాత హిందువులకు ఆరాధ్యదైవం. అయితే కొలకత్తాల్లోని థాంగ్రా ప్రాంతంలో ఉన్న కాళీమాతను అక్కడ ఉన్న చైనీయులు తమ కులదైవంగా భావిస్తారు. ముఖ్యంగా వారు అనారోగ్యం పాలవకుండా కాపాడుతుండటం వల్ల అక్కడి చైనీయులు ఈ కాళీమాతను నిత్యం కొలుస్తుంటారు. నైవేద్యంగా నూడుల్స్, ఫ్రైడ్ రైస్ ను మాతకు సమర్పించి వాటినే ప్రసాదంగా అందజేస్తారు.

స్తంభేశ్వర్ మహాదేవ్, గుజరాత్

స్తంభేశ్వర్ మహాదేవ్, గుజరాత్

P.C: You Tube

ఇక్కడ ఉన్న శైవక్షేత్రంలోని శివుడిని స్తంభేశ్వర్ గా భక్తులు పూజిస్తారు. ఈ దేవాలయం అరేబియా సముద్రంలో ఉంటుంది. సముద్ర అలల ఆటుపోట్లు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ దేవాలయం నీటిలో మునిగి పోతుంది. అందువల్ల కేవలం సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే సందర్శించుకోవడానికి వీలవుతుంది.

కాలభైరనాథ్ దేవాలయం, వారణాసి

కాలభైరనాథ్ దేవాలయం, వారణాసి

P.C: You Tube

వారణాసిలోని కాలభైరవ దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఈ దేవాలయంలో అఘోరాలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ దేవుడికి మద్యాన్ని నైవేద్యంగా మద్యాన్ని అందజేస్తారు. అదే మద్యాన్ని తిరిగి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.

నీట మునిగిన మూలవిరాట్ లేని దేవాలయం, వారణాసి

నీట మునిగిన మూలవిరాట్ లేని దేవాలయం, వారణాసి

P.C: You Tube

వారణాసిలోని సింధియాఘాట్ వద్ద ఉన్న శివాలయంలో గంగానదిలో సగం మునిగిపోయి ఉంటుంది. ఇందులో విగ్రహమే ఉండదు. అయినా భక్తులు ఈ దేవాలయం వద్దకు వెళ్లి అక్కడ దైవం ఉందని భావిస్తూ పూజలు చేస్తుంటారు.

జ్వాలా దేవి దేవాలయం, హిమాచాల్ ప్రదేశ్

జ్వాలా దేవి దేవాలయం, హిమాచాల్ ప్రదేశ్

P.C: You Tube

హిందూ పురాణాల ప్రకారం జ్వాలా దేవి దేవాలయం శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ సతీదేవి నాలుక పడినట్లు చెబుతారు. ఈ గుహాలయంలో తొమ్మిది జ్యోతులు నిత్యం వెలుగుతుంటాయి. ఇందుకు కారణం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. వేల ఏళ్ల నుంచి ఈ జ్యోతులు నిత్యం వెలుగుతున్నాయని స్థలపురాణం చెబుతుంది.

తత్వాని దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

తత్వాని దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

ధర్మశాలకు 25 కిలోమీటర్ల దూరంలో తత్వాని దేవాలయం ఉంటుంది. చుట్టు ఎముకలు గడ్డకట్టేంత చలి ఉన్నా కూడా దేవాలయం లోపల సహజ సిద్దంగా ఏర్పడిన నీటి బుగ్గలో నీరు వేడిగా ఉంటుంది. ఇందులో స్నానం చేస్తే చాలా రకాల వ్యాధులు నయమవుతాయని చెబుతారు.

బులెట్ బాబా

బులెట్ బాబా

P.C: You Tube

రాజస్థాన్ లోని బులెట్ బాబా దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది ఒక బులెట్. దీనినే ఓం బన్నా దేవాలయం అని కూడా అంటారు. ఈ బైక్ ను పూజిస్తే తమకు ఎటువంటి ప్రమాదాలు జరగవని వాహనదారుల నమ్మకం.

హిడంబ దేవాలయం, హిమాచల్ ప్రదేశ్.

హిడంబ దేవాలయం, హిమాచల్ ప్రదేశ్.

P.C: You Tube

భారత దేశంలో ఒక రాక్షస జాతికి చెందిన స్త్రీకి దేవాలయం ఉండటం హిమాచల్ ప్రదేశ్ లోనే చూస్తాం. పాండవుల్లో ఒకరైన భీముడి భార్య హిడంబి ఒక రాక్షస స్త్రీ. అయితే ఆమె మంచి గుణం వల్ల పాండవులు ఒకసారి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటారు. అందుకే ఆమెకు ఇక్కడ దేవాలయం నిర్మించి పూజలు చేస్తున్నారు.

 కర్ణిమా దేవాలయం, రాజస్థాన్.

కర్ణిమా దేవాలయం, రాజస్థాన్.

P.C: You Tube

రాజస్థాన్ లోని బికనూర్ కు దగ్గర్లో ఈ దేవాలయం ఉంది. దుర్గాదేవి ప్రతి రూపంగా చెప్పబడే కర్ణిమా ఇక్కడ ప్రధానంగా పూజలు అందుకొంటుంది. ముఖ్యంగా ఇక్కడ వందల కొద్ది ఎలుకలు ఉంటాయి. అవితిని, తాగి వదిలిన పదార్థాలు, పాలను భక్తులు ప్రసాదంగా తీసుకొంటారు.

శునక దేవాలయం.

శునక దేవాలయం.

P.C: You Tube

కర్నాటకలోని చెన్నపట్టణ శివారులో శునక దేవాలయం ఉంది. రెండు విభిన్న రంగుంలో ఉన్న శునకపు బొమ్మలను ఇక్కడ ప్రధానంగా పూజిస్తారు. ఈ శునకాలు తమను, తమ గ్రామాన్ని కాపాడుతాయని స్థానికులు విశ్వాసం.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more