Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా..సాంప్రదాయాల శిల్పాలతో అబ్బుర పరిచే ఉత్సవ్ రాక్ గార్డెన్

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా..సాంప్రదాయాల శిల్పాలతో అబ్బుర పరిచే ఉత్సవ్ రాక్ గార్డెన్

నిశ్చల స్థితిలో ఉండే రాతితో ఊసులు చెప్పిస్తూ...ఆ ఊసుల ద్వారా మౌనాన్ని దూరం చేసే ఎన్నో శిల్పాలు మనల్ని పలకరిస్తంటే...అబ్బురమే కదా! ప్రకృతికి ఎన్నో అందాల్ని జోడించి అద్భుతాలను తీర్చి దిద్దుకోవడం గొప్ప కళాత్మకత. కృషి, కళ, నైపుణ్యం మూడు కలిసిపోయి నయన మనోహరంగా కనులవిందు చేసే శిల్ప సౌందర్య విన్యాసాలతో శిలా వనాలెన్నో మన దేశంలో ప్రసిద్ది చెంది ఉన్నాయి. సహజ సిద్ధంగానే రాతి విశేషాలతో అబ్బురపరిచేవి కొన్నైతే...ఉలి తాకిడికి ప్రాణం పోసుకున్నవి మరికొన్ని.

జూలై 13 రాక్ డే సందర్భంగా అలాంటి అనేక శిల్పవనాల్లో ఒకటి ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలో కలదు. హవేరి పట్టణానికి వాయువ్య దిశలో సుమారు 10 కి. మీ. ల దూరం ప్రయాణిస్తే చాలు గూతగూడి అనే గ్రామం వెలుపల పల్లెల జీవన విధానం ప్రతిబింబించే ప్రతిమలతో నిర్మించబడిన ఈ ఉత్సవ రాక్ గార్డెన్ మీరు చూడవచ్చు. హవేరీలో ఉన్న ఉత్సవ్ రాక్ గార్డెన్ లో మీ మనస్సుకు ఆహ్లాదాన్ని..ఆనందాన్ని కలిగించే ఉత్సవ్ రాక్ గార్డెన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

All Images Courtesy: http://www.utsavrock.com/

ఉత్తర కర్నాటక లోని ఉత్సవ్ రాక్ గార్డెన్

ఉత్తర కర్నాటక లోని ఉత్సవ్ రాక్ గార్డెన్

ప్రపంచం అంతా ఈ విధంగా ఆధునికతలవైపు పరుగు పెడుతున్న ఈ కాలంలో గత కాల విలువలు పల్లెల జీవన విధానాలు తెలిపేందుకుగాని తయారుచేయబడి వుంచినదే ఉత్తర కర్నాటక లోని ఉత్సవ్ రాక్ గార్డెన్ . దీనిని గురించి ఒక చిరు పరిచయం చేస్తున్నాము. చదివి, చిత్రాలు చూసి ఆనందించండి. గత కాలంలో పల్లెపట్టు జీవన విధానం ఎలా ఉండేదో ఒకింత అవగాహన ఏర్పరుచుకొనండి.

కర్ణాటకలోని గ్రామీణ వాతావరణాన్ని తలపించే గార్డెన్ ఉత్సవ్ రాక్ గార్డెన్

కర్ణాటకలోని గ్రామీణ వాతావరణాన్ని తలపించే గార్డెన్ ఉత్సవ్ రాక్ గార్డెన్

కర్ణాటకలోని గ్రామీణ వాతావరణాన్ని తలపించే గార్డెన్ ఉత్సవ్ రాక్ గార్డెన్ . ప్రపంచంలోనే ఇటువంటి రాక్ గార్డెన్ మరెక్కడా లేదు. ఇందులోని హస్తకళాకారులు, చేతివృత్తుల వారి శిల్పాలు, చిరు వ్యాపారులు, రైతు గ్రామీణ కుటుంబం, పాడి పశువులు వంటి ఆనాటి సాంప్రదాయాల శిల్పాలు అబ్బుర పరిస్తాయి. నేటి తరాన్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి.

ఇప్పటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఉత్సవ్ రాక్ గార్డెన్ కి సందర్శనకు తీసుకెళ్తుంటారు

ఇప్పటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఉత్సవ్ రాక్ గార్డెన్ కి సందర్శనకు తీసుకెళ్తుంటారు

ఇప్పటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఉత్సవ్ రాక్ గార్డెన్ కి సందర్శనకు తీసుకెళ్తుంటారు. కేవలం నిర్మాణాలే కాదు, కుంచె నుంచి జాలువారిన తైల వర్ణ చిత్రాల్ని చూడవచ్చు. పిల్లల ఆటపాటలూ, సరదా సందళ్ల శిల్పాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే దేశంలోనే ఈ ఉత్సవ్ రాక్ గార్డెన్ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది.

నిజం అయిన రైతు కాదు. నిజమైన ఎడ్లు కావు. ఇవి అందమైన శిల్పాలు

నిజం అయిన రైతు కాదు. నిజమైన ఎడ్లు కావు. ఇవి అందమైన శిల్పాలు

ఇక్కడ కనిపిస్తున్న దంపుతులు ప్రాణంలోని ఊసులు పలికించే శిల్పాలు.అతను నిజం అయిన రైతు కాదు. నిజమైన ఎడ్లు కావు. ఇవి అందమైన శిల్పాలు .

గ్రామీణ ప్రజలు వివిధ వృత్తులలో...

గ్రామీణ ప్రజలు వివిధ వృత్తులలో...

ఆనాటి కళలకు అద్దంపడుతూ గ్రామీణ ప్రజలు వివిధ వృత్తులలో...కొలువుదీరిన శిల్పాలు.

పొద్దు పొడవక ముందే శివ ఢముకరం మోగిస్తూ

పొద్దు పొడవక ముందే శివ ఢముకరం మోగిస్తూ

పొద్దు పొడవక ముందే శివ ఢముకరం మోగిస్తూ వచ్చే ఢంకా నాథుల విగ్రహాలు

ఉయ్యాలలో బిడ్డను ఊపే తల్లి..

ఉయ్యాలలో బిడ్డను ఊపే తల్లి..

ఇది ఒక సాంప్రదాయక ఇల్లు. ముచ్చటైన ఉమ్మడి కుంటుంబం. ఉయ్యాలలో బిడ్డను ఊపే తల్లి..

కుల వృత్తులను చూపే దృశ్యం

కుల వృత్తులను చూపే దృశ్యం

ఆనాటి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కుల వృత్తులు ఉండేవి. అలాంటిదే ఈ దృశ్యం .

 విశ్రాంతి సమయంలో

విశ్రాంతి సమయంలో

ఈ ఆధునిక యుగంలో కాస్త విశ్రాంతి దొరికితే చాలు..సినిమాలు, షికార్లు..టూర్లు, పిక్నిక్ లు అంటుంటారు. అయితే అప్పట్లో విశ్రాంతి సమయంలో వినోదం కొరకు గవ్వలాట. బారాకట్ట వంటి ఆటలు ఆడేవారు.

వెన్న చిలుకుతున్న గ్రామీణ మహిళ

వెన్న చిలుకుతున్న గ్రామీణ మహిళ

ఆనాటి కాలంలో పాడిపశువులకు కొదవ ఉండేది కాదు, ప్రతి ఇంట్లో పశువులతో లక్ష్మీ కళ ఉట్టిపడి. ఆనాటి కాలంలో వెన్న చిలుకుతున్న గ్రామీణ మహిళ శిల్పం చెక్కడం..కళ్ళకు మహదానందం.

పాట పాడుతూ పిండి విసిరే మహిళలు

పాట పాడుతూ పిండి విసిరే మహిళలు

ఈ కాలంలో ఆధుకతకు తగిన విధంగా అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పట్లో ఇలా ప్రతి ఒక్కటి చేత్తో సహజసిద్దంగా తయారుచేసుకునే వారు. ఈ ఫోటోలోని ద్రుశ్యం. పాట పాడుతూ పిండి విసిరే మహిళలు శిల్పాలు.

గ్రామాలలో కనపడే కిరాణా కొట్టు

గ్రామాలలో కనపడే కిరాణా కొట్టు

గ్రామాలలో కనపడే కిరాణా కొట్టు. కొట్టు నిండా పచారి వస్తువులు. కొనుగోలు చేస్తున్న గ్రామీణ స్త్రీ సహజ శిల్ప కళకు వందనం.

జమిందార్ భవనం

జమిందార్ భవనం

అప్పట్లో గ్రామాల్లో కాస్త డబ్బు పరిపతి ఉన్న వారి ఇండ్లు పెద్దగానే ఉండేవి. గ్రామల్లో కనపడే జమిందార్ భవనం ఇలానే ఉండేవి.

చిట్టాపద్దుల చిట్టియ్యా

చిట్టాపద్దుల చిట్టియ్యా

గ్రామాల్లో జమీదారు ఇండ్లలో ఆ ఇంటి ఆర్థిక వ్యవహారాలను చూసుకునే చిట్టాపద్దుల చిట్టియ్యా శిల్పాలు బహు ముచ్చటగా ఉంది.

ఆధ్యాత్మిక చింతనకు ఆలవాళం ఈ శిల్పాలు

ఆధ్యాత్మిక చింతనకు ఆలవాళం ఈ శిల్పాలు

ఆధ్యాత్మిక చింతనకు ఆలవాళం ఈ శిల్పాలు.ఆధ్యాత్మిక చింతనలు వింటూ సతీ సమేతంగా ఉన్న ఈ శిల్పం ముగ్ధమనోహరం.

ఆట..పాటలతో ..మేకల కాపారి

ఆట..పాటలతో ..మేకల కాపారి

మేకలను కాసే వృత్తిలో ఒక గ్రామీనుడు. మేకల రాతి శిల్పాలు ఔరౌరా అనిపిస్తుననాయి..

జీవం ఉట్టిపడే శిల్పాలు ఈ మయూరాలు

జీవం ఉట్టిపడే శిల్పాలు ఈ మయూరాలు

నిజమైన నెమలు కావు ఇవి.ఆశ్చర్యం కలిగించే.. జీవం ఉట్టిపడే శిల్పాలు ఈ మయూరాలు..

అద్భుత లేడి పిల్లల దృశ్యం

అద్భుత లేడి పిల్లల దృశ్యం

పచ్చటి వన విహారంలో అద్భుత లేడి పిల్లల దృశ్యం నయనాదకరం.

ఒక్క క్షణం నిజం అనిపించే ఈ పులి

ఒక్క క్షణం నిజం అనిపించే ఈ పులి

ఒక్క క్షణం నిజం అనిపించే ఈ పులి, నిజమైంది కాదు. సురక్షిత ప్రదేశంలో చిరుత బొమ్మ తన బిడ్డను అక్కున చేర్చుకుని నిల్చొన శిల్పం.

అడవిలో స్వేచ్చగా విహరించే ఏనుగు శిల్పం.

అడవిలో స్వేచ్చగా విహరించే ఏనుగు శిల్పం.

అడవిలో స్వేచ్చగా విహరించే ఏనుగు శిల్పం.

అందమైన ఖడ్గ మృగం

అందమైన ఖడ్గ మృగం

పచ్చటి ప్రక్రుతి మద్యన నీటిలో నిల్చొన్న అందమైన ఖడ్గ మృగం చూస్తే అక్కడ నిజంగా నిల్చొందని భ్రమపడే అవకాశం లేకపోలేదు. కానీ అది రాతి శిల్పం మాత్రమే.

ఈ ఆవుల కొట్టం.

ఈ ఆవుల కొట్టం.

గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఇటువంటి ద్రుశ్యం తప్పక కనబడుతుంది. ఆవులను కట్టి ఉంచే ప్రదేశం ఈ ఆవుల కొట్టం శిల్పకళకు దాసోహం అవ్వాల్సిందే.

ఆధునిక కళల ప్రతిమ గరుత్మంతుడు.

ఆధునిక కళల ప్రతిమ గరుత్మంతుడు.

ఆధునిక కళల ప్రతిమ గరుత్మంతుడు.

సమ్మోహక గాంధర్వ కన్య

సమ్మోహక గాంధర్వ కన్య

సమ్మోహక గాంధర్వ కన్య . ఇటు వంటి శిల్పాల గురించి వినడమే కానీ. చూడటం చాలా తక్కువ. అయితే అప్పట్లో ఇలాంటి వాటికి జీవం పోశారంటే ఆశ్చర్యం కదా!

ఒక ఆధునిక కళా శిల్పం

ఒక ఆధునిక కళా శిల్పం

నరమానవుడా...మనోహరుడా అని తలపించే.. ఒక ఆధునిక కళా శిల్పం

దర్జీ

దర్జీ

అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపించే బట్టలు కుట్ట వారి శిల్ప సౌందర్యం.

సాధకుడు

సాధకుడు

వాయిద్యం, సంగీతం కళల పట్ల అభిరుచి ఉన్న వ్యక్తి సాధణలో ముగ్ధుడైన చిత్రం అద్భుతం.

రాక్ గార్డెన్ లో స్కూల్ విద్యార్ధుల పిక్నిక్

రాక్ గార్డెన్ లో స్కూల్ విద్యార్ధుల పిక్నిక్

రాక్ గార్డెన్ లో స్కూల్ విద్యార్ధుల పిక్నిక్ లోభోజన ఏర్పాటు.రాక్ గార్డెన్ లో సహజసిద్దమైన సంప్రదాయల అందాలను తిలకించడానికి వచ్చిన విద్యార్థులు.

ప్రస్తుతం ఆధునీకరించిన

ప్రస్తుతం ఆధునీకరించిన

ప్రస్తుతం ఆధునీకరించిన రాక్ గార్డెన్ లో పచ్చటి స్థలం

అద్భుత ఆధునిక కళాత్మక చిత్రం

అద్భుత ఆధునిక కళాత్మక చిత్రం

రాళ్ళతోనే అద్భుత ఆధునిక కళాత్మక చిత్రం .

సమ్మోహక మోహనాంగి

సమ్మోహక మోహనాంగి

వావ్...మదిని పులకరింపచేసే.. సమ్మోహక మోహనాంగి...శిల్పం సుమా...!

సమయం

సమయం

వారంలో 7 రోజులో ఉదయం 9.30 నుండి సాయంత్రం 6.30వరకు ఈ గార్డెన్ లోకి అనుమతి ఇస్తారు. పెద్దలకు ఎంట్రీ ఫీజు 150 నుండి 200వరకు ఉంటుంది. పిల్లలకు రూ.70.

ఎలా చేరుకోవాలి:

ఎలా చేరుకోవాలి:

బెంగళూరు నుండి హుబ్లీకి NH4 మార్గంలో గటాగోడీ విలేజ్ కు 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హవేరీకి 40కి.మీ, బెంగళూరుకు 374కి.మీ, గోవాకు 190కి.మీ, పూణెకు 470కి.మీ ఈ ఉత్సవ్ గార్డెన్ ఉంది.

విమాన మార్గం ద్వారా చేసుకోవాలంటే హుబ్లీ (49)కి.మీ దూరంలో విమానశ్రయం ఉంది. అక్కడ నుండి ప్రైవేట్ లేదా ప్రభుత్వ వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

అలాగే హుబ్లీకి (38 KMS),హవేరీకి (40 KMS)దూరంలో ప్రధాన రైల్వే స్టేషన్ ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X