Search
  • Follow NativePlanet
Share
» »కేవలం 2,500 టికెట్ ఖర్చుతో వైష్ణోదేవి యాత్ర పూర్తి

కేవలం 2,500 టికెట్ ఖర్చుతో వైష్ణోదేవి యాత్ర పూర్తి

తక్కువ ఖర్చుతో వైష్ణోదేవి దేవాలయ దర్శనానికి సంబంధించిన కథనం.

By Kishore

మీలో 'వికృత'భావాలను పెంచే 'కీచక'వధ జరిగిన ప్రాంతంమీలో 'వికృత'భావాలను పెంచే 'కీచక'వధ జరిగిన ప్రాంతం

మీ లవర్ తో పెళ్లి వద్దనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం మీ కోరిక నెరవేరదుమీ లవర్ తో పెళ్లి వద్దనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం మీ కోరిక నెరవేరదు

భారత దేశంలోని హిందువులకే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న హిందువులకు కూడా వైష్ణోదేవి సందర్శన ఒక జీవిత కాలపు కల. ఈ దేవతను సందర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. జమ్ము కాశ్మీర్ లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని అత్యంత తక్కువ ఖర్చుతో చూడటానికి వీలుగా రైల్వే శాఖ వినూత్న ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలతో పాటు ఈ క్షేత్రం ప్రాధాన్యత మీ కోసం..

1. 4 పగలు, 3 రాత్రుల ప్యాకేజీ

1. 4 పగలు, 3 రాత్రుల ప్యాకేజీ

Image Source:

వైష్ణోదేవి సందర్శన కోసం రైల్వే శాఖ 4 రోజుల ప్యాకేజీని (4 పగలు, 3 రాత్రలు) కేవలం 2,500 లకు అందజేస్తుంది. మీకు ఈ ప్యాకేజీలో టికెట్ కన్ ఫర్మ్ అయి ఉంటే ఐఆర్సీటీసీ గెస్ట్ హౌస్ లో వసతి సదుపాయం కూడా కల్పించనుంది. రెండు రోజుల పాటు టిఫిన్ ను కూడా అందజేస్తారు. ఇక కుటుంబ సభ్యలతో పాటు అంటే భార్య, భర్త, ఒక పిల్లవాడికి అయితే ఒక్కరి నుంచి రూ.1907 లను మాత్రమే రైల్వే శాఖ వసూలు చేస్తుంది.

2. ఎక్కడి నుంచి ప్రారంభం

2. ఎక్కడి నుంచి ప్రారంభం

Image Source:

ఈ వైష్ణోదేవి ఆలయం జమ్ములోని కట్రా నుంచి ప్రారంభమవుతుంది. కట్రా జమ్ము నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చిన్న గ్రామం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణం చేస్తే మనకు వైష్ణోదేవి ఆలయం దొరుకుతుంది. అన్నట్టు కట్రాలో మీకు అందజేసే చీటిని గుహలో చూపిస్తేనే వైష్ణోదేవి దర్శనానికి అనుమతి ఇస్తారు.

3. 6 గంటల లోపు

3. 6 గంటల లోపు

Image Source:

ఇక్కడ మనం మరొక విషయం గుర్తుకు ఉంచుకోవాలి. కట్రాలో మనకు అందజేసే చీటిని ఆరు గంటల్లోపు గుహ ముందు ఉన్న చెకింగ్ పాయింట్ వద్ద అందజేయాలి. లేదంటే మనలను గుహలోపలికి అనుమతించరు. ఇక రాత్రి సమయాల్లో కూడా కొంత మంది భక్తులు కట్రా నుంచి వైష్ణో దేవి ఆలయానికి ప్రయాణం చేస్తూ ఉంటారు.

4. హెలీకాప్టర్ కూడా

4. హెలీకాప్టర్ కూడా

Image Source:

కట్రాలోని బైరోనాథ్ మందిరానికి కొద్ది దూరంలో గుహ సమీపం వరకూ హెలీకాఫ్టర్ ద్వారా చేరుకోవచ్చు. ఇందుకు సమయం, వాహనం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్కసారి కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.7000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

5. నడవ లేనివారికి

5. నడవ లేనివారికి

Image Source:

నడవలేని వారికి డోలీ, గుర్రం తదితర వ్యవస్థలు కూడా ఉంటాయి. వీటికి అదనపు రుసుం చెల్లించాలి. ఒకేసారి కట్రా నుంచి వైష్ణోదేవి ఆలయం వరకూ వెళ్లి మళ్లీ తిరిగి రావడానికి మనం అక్కడి కూలీలను మాట్లాడుకోవడం మంచిది.

6. ఆఫర్ ఢిల్లీ నుంచి మాత్రమే

6. ఆఫర్ ఢిల్లీ నుంచి మాత్రమే

Image Source:

ఈ ఆఫర్ ఢిల్లీ నుంచి వెళ్లే వారికి మాత్రమే. అప్పుడు మాత్రమే రూ.2,500 ప్యాకేజీని వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఇందు కోసం మీరు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ పేజీకి వెళ్లి ఆన్ లైన్ లో మీ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

7. పురాణ కథనం ప్రకారం

7. పురాణ కథనం ప్రకారం

Image Source:

వైష్ణోదేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది. కురుక్షేత్రం యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని ఆదేశాలను అనుసరించి అర్జునుడుతో సహా పాండవులు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నారని వ్యాసభారతం ప్రకారం తెలుస్తుంది.

8. వారే దేవాలయం నిర్మించారు.

8. వారే దేవాలయం నిర్మించారు.

Image Source:

పాండవులు ఇక్కడ మొదట అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. అమ్మవారి గుహ ఉన్న త్రికూట పర్వతము పక్కన ఐదు రాతి కట్టడాలు ఉన్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకలుగా స్థానిక ప్రజలు భావిస్తారు.

9. అమ్మవారి శరీరభాగం పడింది

9. అమ్మవారి శరీరభాగం పడింది

Image Source:

ఇక్కడ సతీదేవి (దాక్షాయణి) శిరస్సు పడిందని కొంతమంది చెబుతారు. మరి కొంతమంది ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు. ఈ చేతిని భక్తులు అమ్మవారి వరద హస్తంగా భావిస్తారు. కాగా, ఇప్పటికీ మనం వైష్ణోదేవి ఆలయంలో మనిషి కుడిచేతి రూపంలో ఉన్న కొన్ని శిల్పాలను మనం చూడవచ్చు.

10. 700 ఏళ్లకు పూర్వం

10. 700 ఏళ్లకు పూర్వం

Image Source:

మరో కథనం ప్రకారం 700 ఏళ్లకు పూర్వం జమ్మ కాశ్మీర్ కు చెందిన శ్రీధర పండితుడు ఇంటిలో ఒక రోజు అమ్మవారి విగ్రహం మాయమయ్యింది. అదే రోజు అమ్మవారు ఇతని కలలో కనబడి తాను ఉన్న గుహల గురించి తెలియజేసింది.

11. మూడు రూపాల్లో

11. మూడు రూపాల్లో

Image Source:

కలలో చెప్పిన వివరాల ప్రకారం అతను అమ్మవారిని వెదుక్కొంటూ వెళ్లగా అమ్మవారు మహాసరస్వతి, మహాలక్ష్మీ, మహాకాళీ అవతారాల్లో కనిపించింది. ఇప్పటికీ మనం గుహలో ఈ మూడు రుపాలను సందర్శించుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X