Search
  • Follow NativePlanet
Share
» »అటల్ బిహారీ వాజపేయి జన్మస్థలం ‘గ్వాలియర్’...పర్యాటకానికి వెళ్లారా?

అటల్ బిహారీ వాజపేయి జన్మస్థలం ‘గ్వాలియర్’...పర్యాటకానికి వెళ్లారా?

అటల్ బిహారీ వాజపేయి జన్మస్థలం గ్వాలియర్ పర్యాటకానికి సంబంధించిన కథనం.

అటల్ బిహారీ వాజపేయి జన్మస్థలం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్. ఈ గ్వాలియర్ చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత చెందినది. ముఖ్యంగా స్వతంత్ర సంగ్రామం సమయంలో ఈ గ్వాలియర్ పేరు దేశం నలుదిశలా వ్యాపించింది. ఇక పర్యాటకంగా కూడా ఈ గ్వాలియర్ ఎంతో ప్రాముఖ్యత చెందినది. ఇక్కడి కోటలు శత్రుదుర్భేద్యం.

అటల్ బిహారీ వాజపేయి జన్మస్థలమైన గ్వాలియర్ లోని కోటలను చూడటానికి విదేశీయులు సైతం ఎక్కువ సంఖ్యలో నిత్యం ఇక్కడికి వస్తుంటారు. ఇక మొఘలుల కాలం గుర్తులను కూడా ఇక్కడ పర్యాటకులు ఆస్వాధించవచ్చు.

ఇండో, పర్శియన్, మొఘల్, యూరప్ వాస్తు శైలితో నిర్మితమైన భవనాలు పర్యాటకులను నిత్యం ఆకర్షిస్తుంటాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ చేరుకోవడానికి రైలు, బస్సు, విమానసర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్వాలియర్ కు సంబంధించి పర్యాటకానికి సంబంధించిన వివిధ కేంద్రాల వివరాలు మీ కోసం....

గ్వాలియర్ కోట

గ్వాలియర్ కోట

P.C: You Tube

స్వాతంత్ర సంగ్రామంతో గ్వాలియర్ కోటకు అవినాభావ సంబంధం ఉంది. ఝాన్సీ బ్రిటీష్ పరం స్వాధీనం అయిన తర్వాత లక్ష్మీభాయ్ గ్వాలియర్ కోటలో ఆశ్రయం కోరారు. బ్రిటీష్ ప్రభుత్వానికి భయపడిన గ్వాలియర్ రాజు రాణికి ఆశ్రయం కల్పించడానికి నిరాకరించారు.

లక్ష్మీ భాయ్

లక్ష్మీ భాయ్

P.C: You Tube

అయితే సైనం లక్ష్మీ భాయ్ కు అండగా నిలబడటంతో ఆమె కోటలోకి ప్రవేశించింది. అయితే బ్రిటీష్ సైన్యం ఈ కోట పై దాడి చేసినప్పుడు అత్యంత సాహసోపేతంగా ఆమె బ్రిటీష్ సైనికులతో పోరాడి వీరస్వర్గం పొందారు. ఇక ఈ కోటలో చూడదగినవి ఎన్నో ఉన్నాయి.

గుజారి మహల్

గుజారి మహల్

P.C: You Tube

గుజారీ మహల్ ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. ఇది కూడా గ్వాలియర్ కోట లోపలే ఉంది. క్రీస్తు పూర్వానికి చెందిన వస్తువులను కూడా ఇక్కడ చూడవచ్చు. ఒకటో శతాబ్దానికి చెందిన రాతి పెయింటింగ్స్ ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చరిత్ర అంటే ఇష్టపడేవారికి ఈ గుజారి మహల్ ఖచ్చితంగా నచ్చుతుంది.

తేలికా మందిర్

తేలికా మందిర్

P.C: You Tube

తేలికా మందిర్ అత్యంత పురాతనమైన విష్ణుమందిరం. ఈ మందిరం శిఖరం పొడవు 100 అడుగులు ఉంటుంది. ఉత్తర, దక్షిణాది వాస్తుశైలి ఈ మందిరం నిర్మాణంలో కనిపిస్తుంది. ఉత్తరభారత దేశానికి చెందిన హిందువులు ఈ మందిరానికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

గ్వాలియర్ జూ

గ్వాలియర్ జూ

P.C: You Tube

వైల్డ్ లైఫ్ టూరిజం అంటే ఎక్కువగా ఇష్టపడేవారికి గ్వాలియర్ లోని జంతు ప్రదర్శనశాల నచ్చుతుంది. దీనిని గాంధీ జువలాజికల్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ అరుదైన తెల్లపులులను కూడా మనం చూడవచ్చు.

మోతీ మహల్

మోతీ మహల్

P.C: You Tube

గ్వాలియర్ లో మరో చూడదగిన ప్రాంతం మోతీ మహల్. ఉద్యానవనంలో చూడచక్కని వాస్తుశైలితో నిర్మితమైన మోతీమహల్ చూడటానికే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారని చెప్పడం అతిశయోక్తి కాదు. వివిధ రకాల పుష్పాలగుబాలింపుతో మోతీమల్ పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తోంది.

 జైవిలాస్ ప్యాలెస్

జైవిలాస్ ప్యాలెస్

P.C: You Tube

మోతీ మహల్ నుంచి కేవలం 650 మీటర్ల దూరంలోనే జైవిలాస్ ప్యాలెస్ ఉంది. అప్పటి రాజుల వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. విద్యా సంబంధ టూర్లకు వచ్చే విద్యార్థులతో పాటు పరిశోధకులు కూడా ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. యురోపియన్ శైలి వాస్తుశైలి ఈ భవనంలో మనం చూడవచ్చు.

మహారాజ కి ఛాత్రి

మహారాజ కి ఛాత్రి

P.C: You Tube

గ్వాలియర్ లోనే కాకుండా మధ్యప్రదేశ్ లోని అత్యంత అందమైన ఉద్యానవనాల్లో ఇది కూడా ఒకటి. మాధవరావ్ స్వారకం కూడా. గ్వాలియర్ మహారాజ వంశానికి చెందిన మాధవ్ రావ్ సచిన్ చనిపోయిన సమయంలో అటల్ బిహారీ వాజపేయి కూడా ఈ మహారాజ కి ఛాత్రిని సందర్శించినవారిలో ఉన్నారు.

మహ్మద్ గౌస్ సమాధి

మహ్మద్ గౌస్ సమాధి

P.C: You Tube

16వ శతాబ్దానికి చెందిన మహ్మద్ గౌస్ సమాధి కూడా ఇక్కడ చూడదగినది. ప్రముఖ వాగ్గేయకారుడు తాన్ సేన్ గురువే ఈ మహ్మద్ గౌస్. బాబర్ కు కొన్ని విషయాల్లో సలహాలు కూడా ఇచ్చేవారు. మొఘల్ వాస్తుశైలిని మనం ఇక్కడ చూడవచ్చు.

తాన్ సేన్ సమాధి

తాన్ సేన్ సమాధి

P.C: You Tube

అక్బర్ ఆస్థానంలోని వాగ్గేయకారుడు తాన్ సేన్ సమాధి మహ్మద్ గౌస్ సమాధికి కొన్ని అడుగుల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ చిన్న ఉద్యానవనం కూడా ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఇక్కడ చాలా అందంగా కనిపిస్తాయి. ఆదివారాలు ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడ కనిపిస్తుంటారు.

సూర్యదేవాలయం

సూర్యదేవాలయం

P.C: You Tube

ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయాన్ని పోలిసే సూర్యదేవాలయం గ్వాలియర్ కు దగ్గరగా మనకు కనిపిస్తుంది. దీనిని 1988లో నిర్మించారు. ఎర్రటి ఇసుక రాయితో దీనిని నిర్మించారు. తెల్లటి చలువరాయితో మలిచిన సూర్యుడి విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

సరోద్ ఘర్

సరోద్ ఘర్

P.C: You Tube

ఇది ఒక మ్యూజియం. ఇక్కడ మనం వివిధ రకాల సంగీత వాయిద్య పరికరాలను చూడవచ్చు. అతి ప్రాచీన సంగీత పరికరాల నుంచి అత్యాధునిక సంగీత వాయిద్యాల వరకూ ఇక్కడ అనేక వేల రకాల సంగీత పరికరాలను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. భారతీయ శాస్త్ర సంగీతాన్ని ముందు తరాలకు అందజేయడమే ఈ సరోద్ ఘర్ ముఖ్య ఉద్దేశ్యం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X