Search
  • Follow NativePlanet
Share
» » వావ్ ...వాలంటైన్స్ డే వచ్చేస్తోంది !

వావ్ ...వాలంటైన్స్ డే వచ్చేస్తోంది !

వాలంటైన్స్ రోజు అతి మధురమైన క్షణాలు లవర్ తో కలసి గడిపేయాలని అనిపిస్తుంది. మరి ఈ మధుక క్షణాలు గడపాలంటే, అందమైన ప్రదేశం కోడై కెనాల్ వంటివి అద్భుతం గా వుంటాయి. కోడై కెనాల్ లో ఎన్నో సరస్సులు, జలపాతాలు, విహరించేందుకు ఒక స్వర్గం వలే వుంటుంది. అందునా, ప్రియమైన వారు పక్కన వుంటే, ఆనందం రెట్టింపు. మరి కొడైలో ఎక్కడ తిరగాలి ? ఎలా తిరగాలి ? వంటివి పరిశీలించండి.

కోడై లేక్

కోడై లేక్

కోడై సరస్సు మానవ నిర్మితమైనది. దీని నిర్మాణం ఒక నక్షత్ర ఆకారం లో వుంటుంది. బస్సు స్టాండ్ కు సమీపంలో కల ఈ సరస్సుకు రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు. సరస్సు వద్ద కల సుందర ప్రదేశాలు తప్పక మిమ్మల్ని ఆనంద పరుస్తాయి. మీరు కనుక జంటగా వెళితే, విహారానికి అవసరమైన రో బోటు లు, పెడల్ బోటు లు, సైకిళ్ళు అందుబాటులో వుంటాయి. ఈ సరస్సు వద్డకల హార్స్ రైడ్స్ మరొక గొప్ప ఆకర్షణ.

బ్రియాంట్ పార్క్

బ్రియాంట్ పార్క్

వాలెంటైన్ రోజున మీ ప్రేయసితో కొంత సమయం గడిపేందుకు బ్రియాట్ పార్క్ గొప్ప ప్రదేశం. విశాలమైన ఈ పూల తోట, వివిధ రంగుల, వివిధ సువాసనల తో మిమ్ములను ప్రకృతి ఒడిలోకి స్వాగతిస్తుంది.

కోకర్స్ వాక్

కోకర్స్ వాక్

సుందరమైన ఈ ప్రదేశం కోడై సరస్సు కు ఒక కిలో మీటర్ దూరం లో వుంటుంది. సరస్సు వెంబడి కల పొడవైన రోడ్ పై పచ్చని చెట్లు, పూవులు పక్కగా నడక సాగించండి. మీ లవర్ చేతిలో చేయి వేసి నడుస్తున్నట్లు ఊహించుకోండి. శ్రమ తెలియకుండా కోకర్స్ వాక్ కు చేరి పోతారు.

Photo Courtesy: Shamseej

 బేర్ షోలా ఫాల్స్

బేర్ షోలా ఫాల్స్

బేర్ షోలా జలపాతాలు అందమైనవి, ప్రశాంతం గా ప్రవహిస్తూ సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ మీకు గొప్ప రిలాక్సేషన్ ఇస్తాయి. పొడవైన ఈ జలపాతాల వద్దకు గతంలో ఎలుగు బంట్లు లేదా బేర్ లు వచ్చి తమ దప్పిక తీర్చు కోనేవి అని, ఆ కారణంగా ఈ జలపాతాలకు బేర్ షోలా జలపాతాలని పేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశ సందర్శనకు వర్షాకాలం సరైనది అయినప్పటికీ, ఇతర కాలాల లో కూడా వీటి అందం ఏమీ తగ్గదు .
Photo Courtesy: Nijumania

గ్రీన్ వాలీ వ్యూ

గ్రీన్ వాలీ వ్యూ

గ్రీన్ వాలీ వ్యూ ప్రదేశాన్ని ఆత్మహత్యల ప్రదేశం అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో మీరు చూసే అద్భుత ప్రకృతి ద్రుస్యాలకూ ఈ పేరుకూ ఎత్తి సంబంధం లేదు. ఇంకా మీకు ఏదైనా సందేహం వుంటే, టూరిస్ట్ ల భద్రతకై ఈ ప్రదేశ పై భాగం అంతా మంచి ఫెన్సింగ్ అమర్చి వుండటం గమనించవచ్చు.
Photo Courtesy: Parthan

పిల్లర్ రాక్స్

పిల్లర్ రాక్స్

కోడై కెనాల్ లో పిల్లర్ రాక్స్ ఒక మంచి పర్యాటక ఆకర్షణ. మీ లవర్ తో కలసి మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే ఈ ప్రదేశ దృశ్యాలు చూసి ఆనందించండి. ఈ రాళ్ళ మధ్య కల ఖాళీలు డెవిల్స్ కిచెన్ అనేట్లు వుంటాయి.

Photo Courtesy: Aruna

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X