Search
  • Follow NativePlanet
Share
» »40 ఏళ్లకు ఒకసారి 40 రోజులు మాత్రమే దర్శనం...సందర్శనతో మోక్షం మీ సొంతం

40 ఏళ్లకు ఒకసారి 40 రోజులు మాత్రమే దర్శనం...సందర్శనతో మోక్షం మీ సొంతం

బంగారు, వెండి బల్లులు ఉన్న కాంచిపురంలోని వరదరాజ స్వామి దేవాలయం గురించి.

భారత దేశంలో ఒక్కొక్క దేవాలయాలనికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు అక్కడ జరిగే పూజలు, హోమాలకు ప్రఖ్యాతి చెందితే మరికొన్నింటిలో శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా కొన్ని దేవాలయాల్లో మూల విరాట్టు తీరు తెన్నులు కాని, ఆ విగ్రహాన్ని దర్శించుకునే తీరు కాని విభిన్నంగా ఉంటుంది. మరికొన్ని దేవాలయాల్లో పాటించే సంప్రదాయం విభిన్నంగా ఉంటుంది.

అయితే ఈ విషయాలన్నీ కలబోసిన ఒక ఆలయం మాత్రం తమిళనాడులో ఉంది. ముఖ్యంగా ఈ ఆలయంలోని అసలైన మూలవిరాట్టును 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే దర్శించుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ స్వామి దర్శానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆ దేవాలయంలో ఉన్న రెండు విగ్రహాలను తాకడానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ ఆలయంలోని శిల్ప సంపద అత్యంత మనోహరంగా ఉంటుంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం వివరాలు మీకోసం

 108 దివ్య క్షేత్రాల్లో ఒకటి

108 దివ్య క్షేత్రాల్లో ఒకటి

శ్రీ మహావిష్ణువునే వరదరాజ స్వామి పేరుతో కంచిలో కొలుస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో వరదరాజస్వామి దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రాంతాన్నే విష్ణు కంచి అని అంటారు. దాదాపు 23 ఎకరాల విశాల ప్రాంగణం ఈ ఆలయం సొంతం.

ఒక్కసారైనా వాటిని తాకాలి

ఒక్కసారైనా వాటిని తాకాలి

P.C: You Tube

ఈ దేవాలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయంలోని బంగారు, వెండి బల్లులను తాకితే బల్లి తమ పై పడిన దోషం పోతుందని హిందువులు బలంగా నమ్ముతారు నమ్ముతారు.

సుదూర ప్రాంతాల నుంచి

సుదూర ప్రాంతాల నుంచి

P.C: You Tube

కొంతమంది తమ పై బల్లి పడిన వెంటనే కంచిలోని ఈ వరదరాజ స్వామి దేవాలయాలనికి వచ్చి దోష పరిహారం కోసం ఆలయ పై కప్పు పై ఉన్న బంగారు వెండి బల్లులను తాకుతూ ఉంటారు. ఇందు కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు.

రెండు కథలు

రెండు కథలు

P.C: You Tube

అసలు ఈ దేవాలయంలో బంగారు, వెండి బల్లులు ఎలా వచ్చాయన్న విషయానికి సంబంధించి రెండు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా వినిపించేది గౌతమ మహర్షి కథనం.

గౌతమ మహర్షి

గౌతమ మహర్షి

P.C: You Tube

గౌతమ మహర్షి ఒకసారి పూజ కోసం నీళ్లు తీసుకురావడానికి ఇద్దరు శిష్యులను నదికి పంపించాడు. గురువు ఆదేశం మేరకు వారు నదికి వెళ్లి నీళ్లు తీసువస్తున్నారు. అయితే ఆటపాటల్లో మునిగి పోయిన వారికి ఆ నీటిలో బల్లి ఉండటం కనిపించలేదు.

శాపం

శాపం

P.C: You Tube

ఇక ఆశ్రమానికి వచ్చిన తర్వాత పూపజ కోసం తెచ్చిన నీటిలో బల్లి ఉండటాన్ని గమనించిన గౌతమ మహర్షి తీవ్ర ఆగ్రహం చెందుతాడు. అటు పై శిష్యులిద్దరినీ బల్లులుగా మారి పోయి వరదరాస్వామి దేవాలయంలో ఉండిపోవాల్సిందిగా శపిస్తాడు.

వరదరాజస్వామితో సమానంగా

వరదరాజస్వామితో సమానంగా

P.C: You Tube

దీంతో శిష్యులిద్దరూ మిక్కిలి బాధపడుతారు. కొంత సేపటి తర్వాత శాంతించిన గౌతమ మహర్షి నా శాపం వల్ల మీరు ఇక్కడి వరద రాజస్వామితో సమానంగా భక్తులతో ఆరాధించబడుతారని చెబుతారు.

దోష విముక్తి

దోష విముక్తి

P.C: You Tube

బల్లి పడిన దోషంతో బాధపడేవారు మీమ్ములను తాకితే వారికి దోష విముక్తి కలుగుతుందని కూడా చెబుతారు. అలా వరదరాజస్వామి దేవాలయంలో బంగారు వెండి బల్లలు ఉన్నాయి. ఈ విశ్వం ఉన్నంత వరకూ ఆ దేవాలయంలో ఈ బల్లలు ఉంటాయని చెబుతారు.

ఇంద్రడు ప్రతిష్టించాడు

ఇంద్రడు ప్రతిష్టించాడు

P.C: You Tube

అదే విధంగా మరో కథనం ప్రకారం ఇంద్రుడు సరస్వతి దేవి శాపం వల్ల తన కాంతిని కోల్పోతాడు. శాప విమోచనం కోసం కంచిలోని వరదరాజ స్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లలును ప్రతిష్టించి పూజించాడని చెబుతారు.

అత్తి చెక్కతో

అత్తి చెక్కతో

P.C: You Tube

ఇక ఆలయంలో ప్రస్తుతం వరదరాజ స్వామి విగ్రహం స్థానంలో దాదాపు 600 ఏళ్ల ముందు వరకూ అత్తి చెక్కతో తయారు చేసి విగ్రహం ఉండేది. దీనిని దేవ శిల్పి చెక్కినట్లు చెబుతారు. మొదట్లో దీనికే పూజలు జరిగేవి.

పుష్కరిణిలో

పుష్కరిణిలో

P.C: You Tube

అయితే విగ్రహంలో కొంత చీలిక వచ్చినందువల్ల ఆలయ ఆవరణంలోని పుష్కరిణిలో ఆ విగ్రహాన్ని దాచిపెట్టారు. ఈ విగ్రహాన్ని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి 40 రోజుల పాటు భక్తుల సందర్శనకు ఉంచుతారు.

మోక్షం

మోక్షం

P.C: You Tube

ఈ విగ్రహం దర్శనం వల్ల మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. అందువల్లే ఆ అత్తి చెక్కతో తయారు చేసిన విగ్రహ సందర్శన కోసం భక్తులు తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ వరదరాజు స్వామి ఆలయానికి వస్తుంటారు.

రానున్న 2019లో

రానున్న 2019లో

P.C: You Tube

గతంలో 1979 ఏడాదిలో ఈ అత్తి చెక్కతో రూపొందించబడిన వరద రాజస్వామి విగ్రహాన్ని నీటి నుంచి బయటకు తీసి ప్రజల సందర్శనార్థం ఉంచారు. మళ్లి వచ్చే ఏడాది అంటే 2019 జూన్ లో ఈ విగ్రహం ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానుంది.

వీరంతా పూజించారు

వీరంతా పూజించారు

P.C: You Tube

ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని క`త యుగంలో బ్రహ్మ, త్రేతా యుగంలో గజేంద్రుడు, ద్వాపర యుగం ప్రారంభంలో బ`హస్పతి, కలియుగంలో అనంతశేషుడు పూజించారని చెబుతారు.

శాసనాల వల్ల

శాసనాల వల్ల

P.C: You Tube

ఇక ప్రస్తుత వరదరాజ స్వామి దేవాలయంలోని గర్భగుడిలో ఉన్న విగ్రహం దేశంలోని ఎతైన విగ్రహాల్లో రెండవది. ఈ దేవాలయాలన్ని మొదట చోళ రాజైన మొదటి కుళుత్తోంగ చోళుడు నిర్మించగా అనంతరం విజయనగర రాజులు అభివ`ద్ధి చేసినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X