• Follow NativePlanet
Share
» »ఇక్కడ మరణిస్తే...నేరుగా స్వర్గానికే!

ఇక్కడ మరణిస్తే...నేరుగా స్వర్గానికే!

హిందూ సాంప్రదాయాలను ఆచరించేందుకు గాను ఇక్కడకు వచ్చి కొంత కాలం వుండి వాటిని నేర్చుకుంటారు. సనాతన హిందూ ధర్మంలో ఈ పట్టణం లో మరణం పొందితే నేరుగా స్వర్గానికి వేళతారనే పూర్తి నమ్మకం కూడా హిందువులకు కలదు. మరణించిన కుటుంబ సభ్యులకు, బంధువులకు గంగా నది ఒడ్డున కర్మలు ఆచరిస్తే వారి ఆత్మలకు శాంతి చేకూరు తుందని వారికి స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని కూడా హిందువులు భావిస్తారు. నేటికీ ఈ ప్రదేశంలో సనాతన హిందూ ధర్మ ఆచార వ్యవహారాలూ ప్రతి నిత్యం ఇక్కడ జరుగుతూ వుంటాయి.

కాశి లేదా బెనారస్ పట్టణం పరమశివుడు మెచ్చిన పవిత్ర ప్రదేశం. ప్రపంచంలో ఇది ఒక అతి ప్రాచీన నగరం. ఇక్కడ మానవాళి ఎన్నో యుగాల నుండి నివసిస్తోందని చెపుతారు. భారత దేశంలోని గొప్ప మరియు అతి పవిత్ర నది అయిన గంగా నది వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. ఈ కారణంగా కూడా ఈ పట్టణం ఎంతో ప్రసిద్ధి చెందినది. అయితే, హిందూ మతంలో ఏడు పవిత్ర నగరాలలో చెప్పబడే ఈ కాశీ పట్టణం అన్నిటి కంటే గొప్పదిగా కూడా చెపుతారు.

ఇంత ప్రఖ్యాతికల ఈ వారణాసి పట్టణంలో ప్రసిద్ధి చెందిన అనేక మంది ఆధ్యాత్మిక గురువులు, కవులు, వ్యాసకర్తలు,కళాకారులూ , తమ జీవన అంతిమ సమయంలో కాశీ లో నివాసం వుండేవారు. నేటికీ ఈ ఆచారం మేరకు అనేక మంది తమ చివరి జీవిత కాలం ఇక్కడ గడుపుతూనే వున్నారు. కాశి పట్టణంలో అనేక దేవాలయాలు కలవు. వాటిలో పరమ శివుడి విశ్వనాధ దేవాలయం అన్నిటికంటే మొదటి స్థానంలో భక్తులు సందర్శిస్తారు. ఆ తరువాత మాత్రమే, మాత అన్నపూర్ణా దేవి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. వాయు, రైలు, రోడ్డు మార్గాలలో వారణాసి చేరవచ్చు. ఈ పట్టణానికి సుమారు 26 కి. మీ. ల దూరంలో వారణాసి ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు విమానాలు నడుస్తాయి. దేశంలోని వివిధ పట్టణాలనుండి, రైలు మరియు రోడ్డు మార్గాలు కూడా తరచుగా ఈ ప్రదేశానికి చేరేలా వుంటాయి.

ఇక్కడ మరణిస్తే...నేరుగా స్వర్గానికే!

ఇక్కడ మరణిస్తే...నేరుగా స్వర్గానికే!

వారణాసి

పవిత్రమైన గంగా నదిని పూజించే దృశ్యం. దీనిని గంగా హారతి అంటారు. ఇది ప్రతి రోజూ సాయంత్రం వేళ కన్నుల విందుగా జరుగుతుంది.

ఫోటో క్రెడిట్ : Arian Zwegers

ఇక్కడ మరణిస్తే...నేరుగా స్వర్గానికే!

ఇక్కడ మరణిస్తే...నేరుగా స్వర్గానికే!

వారణాసి

గంగ లో స్నానం తుంగ పానం అన్ని పాపాలనూ పోగోడతాయనే నమ్మకంతో గంగా ఘాట్ కు వచ్చిన యాత్రికులు

ఫోటో క్రెడిట్ : Davi1974d

వారణాసి

వారణాసి

బహుశ...ఈ రకమైన దృశ్యం ఎక్కడా చూడబోము. దహన క్రియకు గాను ఘాట్ లో వేచి వున్న శవాలు.

ఫోటో క్రెడిట్ : Mandy

వారణాసి

వారణాసి

వారణాసి

అక్కడక్కడ ఇటువంటి ఘాట్ లలో మరణించిన వారి దహన క్రియలు జరుగుతూ నే వుంటాయి. కాని ప్రత్యేకించి మణి కర్ణికా ఘాట్ ఈ శవ దహనాలకు ప్రసిద్ధి.

ఫోటో క్రెడిట్: Arian Zwegers

వారణాసి

వారణాసి

ఇక్కడ జరిగేది అంతా పురాతన సాంప్రదాయక తీరు తేన్నులే అయినా...ఆధునిక సెల్ ఫోన్ లు సైతం అత్యవసరమే..

ఫోటో క్రెడిట్ : Yosarian

వారణాసి

వారణాసి

గంగ నది ఘాట్ లో కర్మలు ఆచరిస్తున్న ఒక కుటుంబ సభ్యలు

ఫోటో క్రెడిట్: Arian Zwegers

వారణాసి

వారణాసి

గంగా నదిలో తర్పణలు విడుస్తున్న దంపతులు

ఫోటో క్రెడిట్: Jorge Royan

వారణాసి

వారణాసి

శివాలా ఘాట్ లో పుణ్య స్నానాలు చేస్తున్న యాత్రికులు

ఫోటో క్రెడిట్ : Antoine Taveneaux

వారణాసి

వారణాసి

గంగా నదీ తీరం వెంబడి గల వివిధ ఘాట్ లు

ఫోటో క్రెడిట్: Ekabhishek

వారణాసి

వారణాసి

ఉదయం వేళలో వారణాసిలో కనపడే దృశ్యాలు

ఫోటో క్రెడిట్: Tomer T

వారణాసి

వారణాసి

వారణాసి లోని గంగా నదిలో గేదె లకూ (పుణ్య) స్నానాలు చేయిస్తున్న ఒక దృశ్యం

ఫోటో క్రెడిట్: Arian Zwegers

వారణాసి

వారణాసి

వారణాసిలోని దరభంగా పాలస్ ఘాట్ ప్రదేశం

ఫోటో క్రెడిట్: McKay Savage

వారణాసి

వారణాసి

పుణ్య స్నానాల కొరకు వారణాసి లోని మరొక ప్రదేశం అసి ఘాట్

ఫోటో క్రెడిట్: Nandanupadhyay

వారణాసి

వారణాసి

యాత్రికులు అధికంగా స్నానాలు, కర్మలూ ఆచరించే దశాశ్వమేద ఘాట్

ఫోటో క్రెడిట్: Ilya Mauter

వారణాసి

వారణాసి

వారణాసిలోని లలితా ఘాట్ లో ఒక దృశ్యం

ఫోటో క్రెడిట్: Ilya Mauter

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more