Search
  • Follow NativePlanet
Share
» »టూరిస్టులకు స్వర్గం వంటిది గోవాలోని వాస్కో డా గామా

టూరిస్టులకు స్వర్గం వంటిది గోవాలోని వాస్కో డా గామా

ప్రకృతి సౌందర్యం..సుందరతీరాలు..నిర్మలమైన సూర్యాస్తమయాలు..సాగర హోరులో సాగే సాహసాలు..ఇలా ఎన్నో..ఎన్నెన్నో! ఇవన్నీ ఏ కొందరికో పరిమితం కాదు. చిన్న పెద్ద తేడాలేకుండా అందరినీ అలరించేవే. ఇదివరకే గోవాలోని చాల

ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేయడానికి...కొత్త జంటలకు హనీమూన్ స్పాట్ గా..ఫ్యామిలీతో కలిసి విహరించడానికి...కుర్రకారుకు కూతవేటు దూరంలో ఉండే స్వర్గం ఐరోపాను మరిపించే అందాల తీరం..గోవా. సహజంగా గోవా అనగానే క్యాసినోలు..కార్నివాల్స్..పబ్బులు..పార్టీలు..కొంకణ తీరం కోణం ఇదే అనుకుంటారంతా. కానీ ఈ చిన్న రాష్ట్రంలో అంతకు మించిన విశేషాలున్నాయంటే అతిశయోక్తి కాదు.

ప్రకృతి సౌందర్యం..సుందరతీరాలు..నిర్మలమైన సూర్యాస్తమయాలు..సాగర హోరులో సాగే సాహసాలు..ఇలా ఎన్నో..ఎన్నెన్నో! ఇవన్నీ ఏ కొందరికో పరిమితం కాదు. చిన్న పెద్ద తేడాలేకుండా అందరినీ అలరించేవే. ఇదివరకే గోవాలోని చాలా ప్రదేశాల గురించి తెలుసుకున్నాం.. ఈరోజు గోవాలోని వాస్కో డా గామా గురించి తెలుసుకుందాం..

అందమైన బీచ్‌లు, కొబ్బరితోటలు

అందమైన బీచ్‌లు, కొబ్బరితోటలు

అందమైన బీచ్‌లు, కొబ్బరితోటలు, హాలిడే స్పాట్‌లు, జీడిపప్పు, డ్రింక్‌ ఫెన్నీలు, కొబ్బరితోటల నడుమ అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండే రంగురంగుల ఇళ్లు వీటన్నింటినీ కలగలిపి చూస్తే అదే సుందరమైన గోవా ప్రాంతం. 450 సంవత్సరాలు పోర్చుగీసు పాలనలో ఉన్న ప్రాంతం కాబట్టి గోవాలో ఆ సంస్కృతి ఇంకా అడుగడుగునా దర్శనమిస్తుంది. గోవాలో ఎక్కడ చూసినా బీచ్‌లే కనిపిస్తాయి.

PC: Desmond Lobo

125 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఉన్న గోవాలో

125 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఉన్న గోవాలో

125 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఉన్న గోవాలో అరంబల్‌ బీచ్‌, అంజున బీచ్‌, వాగటర్‌ బీచ్‌, మాండ్రెం బీచ్‌, బాగా బీచ్‌, మిరమార్‌ బీచ్‌, మోర్జిం బీచ్‌లు ఉత్తరం వైపున ఉంటాయి. దక్షిణం వైపున కోల్వా, కావలోసియం, మోబార్‌, డోనాపౌలా, పాలోలెం, వర్కా, మజోర్డా బీచ్‌లు పర్యాటకులను సేదతీరుస్తుంటాయి. అయితే ఉత్తర, దక్షిణ ప్రాంతాలు వేటికవే ప్రత్యేకతలను కలిగి ఉంటాయి.

 పేరుకు తగ్గట్టుగానే అక్కడి వాతావరణం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది

పేరుకు తగ్గట్టుగానే అక్కడి వాతావరణం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది

వాస్కో డా గామా అనే పోర్చుగీస్ నావికుడు 1498లో భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. అతని పేరు మీదనే గోవాలో అతని జ్ఞాపకార్థం ఒక ప్రాంతానికి వాస్కో డా గామా అన్న పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే అక్కడి వాతావరణం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. గోవా వచ్చి వాస్కో డా గామా సందర్శించకపోతే గోవా పర్యటనకు కిక్కు ఉండదు.

PC:: Pulin Pegu

వాస్కో డా గామా వాణిజ్య పరంగా

వాస్కో డా గామా వాణిజ్య పరంగా

వాస్కో డా గామా వాణిజ్య పరంగా ప్రసిద్ది చెందినది. బాలీవుడ్ సినిమాల షూటింగ్ స్పాట్ గా చెబుతుంటారు. ఎక్కువగా సినిమాలను చూసే వారిని ఎవ్వరి అడిగినా చెప్పేస్తారు. మరి సినిమాలు తీస్తున్నారంటే మరి ఆ ప్రదేశం, చుట్టు ప్రక్కల వాతావరణం ఎలా ఉంటుందో మీరో ఊహించుకోండి. ఊహించుకోవడం ఎందుకు ఒక్కసారి ఆ ప్రదేశాన్ని సందర్శించేదాం పదండి.

వాస్కో డా గామా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు

వాస్కో డా గామా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు

వాస్కో డా గామా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు బైనా, హన్సా, బోగ్మాలో, గ్రాండ్ మదర్స్ హోల్ అనే పేరుగల నాలుగు బీచ్ లు ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతుంటుంది.

గ్రాండ్ మదర్స్ హోల్స్ బీచ్:

గ్రాండ్ మదర్స్ హోల్స్ బీచ్:

పేరుకు తగ్గట్టే ఈ బీచ్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ బీచ్ కు వెళ్ళాలంటే పర్యాటకులు ఒక రంధ్రం ద్వారా వెళ్ళాలి. ఫోర్టలేజా శాంతా కేటరీనా ఫోర్ట్ వద్ద ఉన్న రంధ్రం ద్వారా ఈ ప్రదేశాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా చేరుకున్నాకా బీచ్ అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అంత అందంగా ఉంటుంది.

PC:Sylvester D'souza

బొగ్ మాలో బీచ్ :

బొగ్ మాలో బీచ్ :

బొగ్ మాలో బీచ్ కూడా వాస్కో డా గామా లో చూడవల్సిన వాటిలో మరో అందమైన ప్రదేశం. ఇక్కడ ఇసుక తిన్నెలపై కూర్చినే సాయంత్రాల్లో సూర్యాస్తమయాలను వీక్షించవచ్చు. ఇక్కడ సన్ బాతింగ్, ఈత, స్కూబా డైవింగ్ వంటి క్రీడలు అనువైన బీచ్ .

PC: Dinesh Bareja

నేవీ ఏవిఏషియన్ మ్యూజియం:

నేవీ ఏవిఏషియన్ మ్యూజియం:

బొగ్ మాలో బీచ్ కు దగ్గరలో ఉన్న నేవీ ఏవియేషన్ మ్యూజియం తప్పక సందర్శించాలి. ఈ మ్యూజియంలో గోవా నౌకా చరిత్ర పోర్చుగీసులు కాలం నుండి ఎలా ఉందనేది ప్రతి విషయం ఇక్కడ తెలుసుకోవచ్చు. నేవీ లో అనేక సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జరిగిన మార్పులు చేర్పులను భారతీయ నౌకాదళ విశేషాలను వింతలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

PC:Aaron C

 మార్ముగోవా ఫోర్ట్ :

మార్ముగోవా ఫోర్ట్ :

వర్కా బీచ్ కు దగ్గరలో ఉన్న ఈ ఫోర్ట్ ఎండ, బీచ్ , ఇసుక మొదలైన వాటి నుండి కొంత హాయినిస్తుంది. వాస్కో డా గామాలో క్రీ.శ 1624లో నిర్మించిన ఈ మార్ముగోవా ఫోర్ట్ అందమైన కోస్తా తీరంలో ఉంది.PC: Desmond Lobo

శివాజీ కోట :

శివాజీ కోట :

వాస్కో డా గామా లో ప్రసిద్ది చెందని మహారాజ్ శివాజీ కోట ఉంది. ఇది వాస్కో డా కు ఒక ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నుండి నగర పరిసర సౌందర్యాలను బీచ్ లను చూడవచ్చు.

PC: Desmond Lobo

దోణా పౌలా బీచ్:

దోణా పౌలా బీచ్:

గ్రాండ్ మదర్స్ హోల్ బీచ్ కు దగ్గరలో ఉన్న మరో అందమైన బీచ్ దోణా పౌలా బీచ్ . ఇక్కడికి లాంచీలు మరియు ఫెర్రీల ద్వారా చేరుకోవచ్చు. దోణాపౌలా బీచ్ పనాజీకి దగ్గరు. ఇక్కడ షాపింగ్ లకు వాటర్ స్పోర్ట్స్ కు ప్రసిద్ది.

PC: Henriette Welz

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం
గోవా మీదుగా జాతీయ రహదారి 17 వెళుతుంది. ముంబై, మంగళూరు, బెంగళూరు, హైదరాబాద్, పూణే, బెల్గాం పట్టణాల నుండి ప్రతిరోజు బస్సులు తిరుగుతాయి. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ప్రవేట్ బస్సులు సైతం ప్రధాన నగరాల నుండి రాత్రుళ్ళు నడుస్తాయి.

రైలు మార్గం
వాస్కో డా గామా లో రైల్వే స్టేషన్ ఉన్నది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్లు నడుస్తుంటాయి. ముంబై నుండి నిత్యం ఒక రైలు ఇక్కడికి తిరుగుతుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మంగళూరు, కొచ్చి ల నుండి ఒక్క రాత్రి ప్రయాణంలో చేరుకోవచ్చు.

వాయు మార్గం
గోవా మొత్తం మీద ఒకేఒక ఏర్‌పోర్ట్ ఉన్నది. దానిపేరు డబోలిం ఏర్‌పోర్ట్. ఇదొక అంతర్జాతీయ విమానాశ్రయం. దేశ, విదేశాల నుంచి ఇక్కడికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా పోర్చుగీస్ నుండి విమానాలు నిత్యం తిరుగుతుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నుండి కూడా ప్రతిరోజూ విమానాలు నడుస్తాయి. ఏర్ పోర్ట్ పక్కనే ఉన్న వాస్కో డా గామా కు కేవలం 2 -5 నిమిషాల్లో నడుచుకుంటూ చేరిపోవచ్చు.

PC: Joegoauk Goa

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X