Search
  • Follow NativePlanet
Share
» »సూర్య, చంద్ర గ్రహణాలకు అతీతంగా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర క్షేత్రం..!

సూర్య, చంద్ర గ్రహణాలకు అతీతంగా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర క్షేత్రం..!

పురాతన కాలం నుండి..పురాణాల నుండి వస్తున్న నమ్మకాల ప్రకారం గ్రహణ కిరణాలు అశుభం అని భావిస్తారు. సూర్య చంద్రులను రాహు కేతువులు మింగడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని, అది అరిష్టమని చాలా కాలం నుండి వస్తున్న నమ్మకం. అయితే, ఆ సమయంలోనే భూమిపై ప్రసరించే కిరణాలు చెడు సంకేతమని, అవి ఆలయాలపై పడితే అశుభమని భావించి, సూర్య, చంద్రగ్రహణాల సమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాలు మూసివేయడం జరుగుతుంది. గ్రహణ సమయంలో రాహు కేతుల ప్రభావంతో దేవతల శక్తి సన్నగిల్లుతుందని భావించి ఇలా చేస్తారు.ఆలయాల్లో ఉండే దేవతా ప్రతిమల్లో శక్తి క్షీణించకుండా ఉండటం కోసం మూసేస్తారు. గ్రహణం పాక్షికమైనా, సంపూర్ణ గ్రహణమైనా.. ఆలయాలను మూసేయడం ఆనవాయితీ.

దక్షిణ కాశీగా...గ్రహణం పట్టని దేవాలయంగా...

దక్షిణ కాశీగా...గ్రహణం పట్టని దేవాలయంగా...

అయితే శ్రీ కాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం మాత్రం అందుకు భిన్నం అనే చెప్పాలి. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. ఈ క్షేత్రం కూడా వాయువంతటి గొప్పది. దక్షిణ కాశీగా...గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పేరుపొందిన శ్రీకాళహస్తిలో మహాశివుడు వాయులింగేశ్వరుడిగా వెలిశాడు.

శివపురాణం ప్రకారం, ఈ క్ష్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు

శివపురాణం ప్రకారం, ఈ క్ష్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు

రాహు-కేతు దోష నివారణ పూజలకు ఈ ఆలయం ఖ్యాతి పొందింది. శివపురాణం ప్రకారం, ఈ క్ష్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు శివుడిని సేవించి ముక్తిని పొందాయి. వాటి పేరిట ఇది శ్రీకాళహస్తిగా ప్రాచుర్యం పొందింది. కన్నప్పను కరుణించిన కాళహస్తీశ్వరుడ్ని అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.

9గ్రహరాశులున్న కవచం..ఈ ఆలయంలో శివలింగపై ఏర్పాటు

9గ్రహరాశులున్న కవచం..ఈ ఆలయంలో శివలింగపై ఏర్పాటు

శ్రీకాళహస్తీశ్వరుడు సూర్య చంద్రులు, అగ్ని భట్టారకుడు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 9గ్రహరాశులున్న కవచం..ఈ ఆలయంలో శివలింగపై ఏర్పాటు చేయడం వలన సౌరవ్యవస్థ అంతా అక్కడే ఉంటుందని వాస్తవం. దాంతో రాహువు, కేతువులు ఈ ఆలయంలోనికి ప్రవేశించలేవు. కాబట్టి ఆలయంలో దేవుని అదుపాజ్ఝల్లోనే గ్రహణ కిరణాల కదలికలు కూడా ఆధారపడి ఉంటాయని, అందుకు ఆ ఆలయాన్ని గ్రహణాలు ఏమి చేయలేవని నమ్ముతారు.

గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు

గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు

శ్రీకాళహస్తి ఆలయంలో నవగ్రహ కవచం ఉంది. దీంతో గ్రహణం ఏర్పడినా ఆలయంలోని దైవశక్తి క్షీణించదని అంటారు. అందుకే గ్రహణం సమయంలోనూ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఇదొక్కటే కాదు.. గ్రహణం వేళ ఈ ఆలయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగానే గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేసేందుకు భక్తులు తరలి వస్తారు. అలా చేయించుకున్న వారికి శుభం జరుగుతుందని భావిస్తారు.

శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వర దేవాలయంతో పాటు జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత

శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వర దేవాలయంతో పాటు జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత

శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వర దేవాలయంతో పాటు జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. ఈ క్షేత్రంలో ఆ పరమేశ్వరుడే కైలాసగిరులుగా వెలిశాడు.

ఇక్కడ ఆలయ శిఖరాన్ని దర్శిస్తే కైలాసం చూసినట్లే...

ఇక్కడ ఆలయ శిఖరాన్ని దర్శిస్తే కైలాసం చూసినట్లే...

దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే కాబట్టి...దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటిగా ఉంది...అదే శ్రీకాళహిస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడ ఉండదు. ఇక్కడ ఆలయ శిఖరాన్ని దర్శిస్తే కైలాసం చూసినట్లే.

 భక్త కన్నప్ప గుర్తులతో స్వయంభుగా స్వామివారి లింగం

భక్త కన్నప్ప గుర్తులతో స్వయంభుగా స్వామివారి లింగం

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళహస్తీశ్వరస్వామి స్వయంభు. ధృవమూర్తిగా వెలిసిన శివలింగాకృతిపై సాలీడు, పాము, ఏనుగు, భక్త కన్నప్ప గుర్తులతో స్వయంభుగా స్వామివారి లింగం ఉద్భవించింది.

లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును

లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును

స్వయంభువు లింగము, లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. ఇక్కడ వెలిసిన వాయు లింగేశ్వరుని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు. గ్రహణం ఏ సమయంలో వచ్చినా.. ఆ సమయంలో ఇక్కడి ఆలయాన్ని తెరచి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి

శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి

ముఖ్యంగా ఈ క్షేత్రంలో సూర్య గ్రహణం అంటే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలోను, అదే చంద్రగ్రహణం అయితే గ్రహణం విడిచే సమయంలో ఇక్కడి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం.

పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను

పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను

పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని కధనం..

ఎలా వెళ్ళాలంటే...

ఎలా వెళ్ళాలంటే...

తిరుపతి నుంచి 37 కి.మీ. దూరంలో శ్రీకాళహస్తి ఆలయం ఉంది. కాళహస్తిలో రైల్వే స్టేషన్‌ ఉంది. రోడ్డు మార్గంలో కూడా చేరుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో చిత్తూర పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ సమయం 2 గంటలు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఈ పుణ్యక్షేత్రానికి 549 కిలోమీటర్లు. ఇక బెంగళూరు నుంచి 285 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి కాళహస్తికి దూరం 116 కిలోమీటర్లు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X