Search
  • Follow NativePlanet
Share
» »మహారాష్ట్ర లో విజయ దశమి విజయోత్సవాలు !

మహారాష్ట్ర లో విజయ దశమి విజయోత్సవాలు !

విజయదశమి సందర్భంగా జరిపే దసరా ఉత్సవాలు ఒక విశేషమైన హిందువుల పండుగ ఉత్సవాలు. వీటిని మన దేశం లోని అనేక రాష్ట్రాల లోనే కాక ఇండియా కు చుట్టూ పక్కల వున్న దేశాలలో కూడా జరుపుతారు. పొరుగునే కల నేపాల్, బంగ్లా దేశ్ దేశాలలో దసరా పండుగ పదవ రోజైన విజయ దశమి ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తారు. ఉత్తర భారత దేశంలో, కుల్లు పట్టణం దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి. అట్లే దక్షిణ భారత దేశంలో మైసూరు లోని కర్నాటక, కేరళ లోని ఎర్నాకులం, తమిళ్ నాడు లోని కులసేఖర పట్నం మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ లలో కూడా దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించి వేడుక చేసుకుంటారు. ఓడిషా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు కూడా దసరా ఉత్సవాలను ఘనంగా చేసుకుంటాయి. ఇండియా లోని పశ్చిమ భాగం అయిన మహారాష్ట్ర లో దసరా పండుగ అతి వైభవంగా జరుగుతుంది.

మహారాష్ట్ర లో విజయదశమి.
ఆంధ్ర ప్రదేశ్ కు పొరుగున కల మహారాష్ట్ర లో జరిగే దసరా ఉత్సవాలను తప్పక చూసి ఆనందించ వలసినదే. ఈ ప్రాంతంలో దసరా వేడుకలు ఒక ప్రత్యేకత కలిగి వుంటాయి. నవరాత్రి గా కూడా చెప్పబడే ఈ పండుగ చివరి రోజును విజయ దశమి అంటారు. ఈ పండుగను ఇక్కడ శ్రీరాముడు రావణుడి పై సాధించిన విజయానికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాక, మహిషాసుర రాక్షసుడి తో తొమ్మిది రోజుల పాటు యుద్దంచేసి విజయం పొందిన మాత దుర్గా దేవి అవతారమైన మహిషాసుర మర్దిని పేరుపై కూడా జరుపుకుంటారు. ఈ పండుగ ఉత్సవాన్ని హిందూ కేలండర్ మేరకు ఆశ్వీజ మాసం లో పదవ రోజున విజయదశమి నాడు జరుపుతారు.

మహారాష్ట్ర లో విజయ దశమి విజయోత్సవాలు !

నవరాత్రి పండుగలో పూజలు నిర్వహించిన మాత విగ్రహాలను పదవ రోజు నాడు నీటిలో నిమజ్జనం చేస్తారు. విజయోత్సవ చిహ్నంగా ఆనందోత్స వాలతో స్వీట్ లు పంచుకొంటారు. ఆంద్ర ప్రదేశ్ లోని జమ్మి చెట్టు వలెనె, మరాటీయులలో ఆప్త చెట్టు ఎంతో విశేషం సంతరించు కొంది. ఈ రోజున వీరు ఈ చెట్టుకు పూజలు చేసి, వాటి ఆకులను ఒకరి కొకరు ఇచ్చి పుచ్చు కుంటారు. ఒకరి నొకరు అభినందించు కొంటూ భవిష్యత్తు బాగుండాలని కోరు కుంటారు. ఈ ఆచారం ఇక్కడ అతి పురాతన కాలం అయిన రఘు రాజ్ పాలన నుండి వస్తోంది. రఘు రాజ మహారాజు, కుబేరుడు, శ్రీ రాముడు లకు పూర్వీకులని చెపుతారు. విజయ దశమి రోజున, ఇక్కడ ప్రజలు తమ తమ వివిధ దైనందిన పని ముట్లకు కూడా పూజలు నిర్వహిస్తారు. దీన్ని ఆయుధ పూజ అంటారు.

ఈ దసరా పూజలు లో భక్తులు వివిధ రంగుల బంతి పూవులను అధిక మొత్తాలలో విరివిగా వాడతారు. ఈ పూవులు ఈ సమయంలో అధికంగా అమ్ముతారు. మహారాష్ట్ర ప్రజలు ఈ పూవులను పూజలకే కాక, తమ ఇండ్లను, ఆఫీస్ లను అలంకరించేందుకు కూడా ఉపయోగిస్తారు.

ఈపండుగ లో సీమోల్లంఘన అనే వేడుక కూడా వీరు ఆచరిస్తారు. దీని మేరకు ప్రతి ఒక్కరూ తమ కుల ఆచారాలు ఉల్లఘించి, ఉమ్మడిగా జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొంటారు. విజయదశమి రోజును కొత్త పనులు లేదా ప్రాజెక్టి లు ప్రారంభించేందుకు ఒక శుభ దినంగా భావిస్తారు. పురాతన కాలంలో రాజులు లేదా పాలకులు ఈ విజయదశమి నాడు ఇతర రాజ్యాలతో యుద్ధ ప్రకటనలు చేసి పోరుకు దిగేవారు. ఈ రోజున తలపెట్టిన పనులు ఏవైనప్పటికీ విజయం పొందుతామని భావించేవారు. నేటికి ప్రజలు ఈ ఆచారాల పట్ల విశ్వాసం కలిగి వీటిని సాంప్రదాయకంగా పాటిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X