Search
  • Follow NativePlanet
Share
» »విజయవాడ కనకదుర్గమ్మ గురించి మీకు తెలియని నిజాలు !

విజయవాడ కనకదుర్గమ్మ గురించి మీకు తెలియని నిజాలు !

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం. కృష్ణా జిల్లా లో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు.

By Venkatakarunasri

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం. కృష్ణా జిల్లా లో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది.

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఇలా సాగుతుంది. పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేదవ్యాసుడు కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య (నాలుగు సృష్టించినవి ఐదవది సాక్షాత్తూ సూర్య భగవానుడు), ఘోరమయిన తపస్సు చేసాడు. శివుడు, అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసిరుతాడు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి, ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి, సాక్షాత్తూ శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ

కనకడుర్గమ్మ తల్లి దక్షిణభారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా అఖిలాంధ్రకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తులు కోరిందే తడవుగా వారి కోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, ఆదిపరాశక్తి, కనకదుర్గమ్మ తల్లి.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలసిందని చెబుతారు.స్త్రీ శక్తి పీఠాలలో ఇది ఒకటి.ఈ ఆలయం గురించి మనం కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.పూర్వం కీలుడనే యక్షుడు దుర్గమ్మ కోసం కృష్ణానదిలో ఘోర తపస్సు చేసాడు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

దానితో అమ్మవారు సంతోషించి వరం కోరుకోమని అడగ్గా నువ్వెప్పుడు నా హృదయస్థానంలో వుండేలా వరం ప్రసాదించు అన్నాడట.అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే కీలా ఎంతో పరమపవిత్రమైన కృష్ణానదితీరంలో పరమపవిత్రుడైవుండు.నేను కృత యుగంలో అసురసంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి మాయమైపోయిందట.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడ సాగాడు.తర్వాత లోకాన్ని కబళిస్తున్న మహిషారున్ని చంపి కీలుడికిచ్చిన వరం కోసం మహిషవర్ధినిరూపంలో కీలాద్రి పై అమ్మవారు వెలిసారు.
తర్వాత ఇంద్రాద్రి దేవతలు వచ్చి అమ్మవార్నిపూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పేరు మారిపోయింది.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

అమ్మవారు కనకదుర్గ శోభితురాలై వుండటం వలన అమ్మవారికి కనక దుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తరవాత ఇంద్ర కీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలనే వుద్దేశ్యంతో బ్రహ్మదేవుడు శతశ్వమేగయాగం చేసాడు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగస్వరూపంతో వెలిసాడు.అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి,కదంబ, పుష్పాలతో పూజించటం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందంట. మరో గాధ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఉగ్రతపస్సు చేసాడు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

తనని పరిరక్షించాటానికి కిరాతకునిగా వచ్చి అర్జునిడితో మల్లయుద్ధం చేసి అర్జునిడి భక్తిని మెచ్చి పాశుపశాస్త్రాన్ని అనుగ్రహించాడు.స్వామి మల్లయుద్ధం చేసాడు కాబట్టి ఇక్కడ మల్లికార్జునిడిగా పేరొచ్చింది.
ఈ ప్రదేశాన్ని దర్శించిన ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యమవడాన్ని గమనించి అమ్మ ఆలయ ఉత్తరభాగాన మల్లికార్జునున్నిపునఃప్రతిష్ట చేసారు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

మహారౌద్రంగా వున్న అమ్మవారి ఆలయంలో శ్రీచక్రయంత్రం ప్రతిష్టించి శాంతింపచేసారు. అప్పట్నుంచి అమ్మవారు పరమ శాంతస్వరూపిణిగా భక్తులను కనువిందు చేస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువైవున్నారు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

కనకదుర్గమ్మవారికి ప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు.ఆ రోజుల్లో గనక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దసరా 9రోజులువివిధ రకాల అలంకరణలతో మనకు దర్శనమిస్తారు.

PC: youtube

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

ఎలా వెళ్ళాలి

రైలు మార్గం

సబర్బన్ రైళ్ళు విజయవాడ నుండి గుంటూరు మరియు తెనాలి వరకు సేవలు అందిస్తునాయి. కొత్త సర్కులర్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇది రాజధాని అమరావతి వరకు ఉంటుంది.

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

రోడ్డు మార్గం

వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలొ, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు మరియు ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా మందికి తెలియని నిజాలు

విమాన మార్గం

విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) నుండి ఇతర ప్రధాన నగరాలకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై, జైపూర్, వైజాగ్, తిరుపతి మరియు ఢిల్లీ నగరములకు విమాన సౌకర్యము ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X