Search
  • Follow NativePlanet
Share
» »మీ భాగస్వామి కేరింతలు ఎవరికీ వినిపించకూదనుకొంటే

మీ భాగస్వామి కేరింతలు ఎవరికీ వినిపించకూదనుకొంటే

కేరళలోని వినిస్ ద్వీపానికి సంబంధించిన కథనం.

By Kishore

దేశంలో ఎన్నో ద్వీపాలు (ఐ ల్యాండ్) ఉన్నాయన్న విషయం మీకు తెలుసు. అయితే అందులో ఒకటి మాత్రం ప్రైవేట్ ఐ ల్యాండ్ ఉంది. దీని గురించి మీకు తెలుసా. ఆ ఐ ల్యాండ్ గాడ్స్ ఓన్ కంట్రి అని పేరు గాంచిన కేరళలో ఉంది. సాధారణంగా చుట్టూ నీరు, మధ్యలో మనకంటూ ఒక ఇల్లు అందులో మనకు నచ్చిన వారితో ఏకాంతంగా గడపడం వంటి ఆలోచనలు రాని వారెవరైనా ఉంటారా? అంటే దాదాపు లేదనే సమాధానం వస్తుంది. అయితే ప్రస్తుతం చిన్న సైట్ కొనడానికే లక్షల రుపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. అటువంటిది ఒక ద్వీపం మొత్తం మనకే కావాలంటే సాధ్యమా? అంటే లేదని సమాధానం వస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఇటువంటి కలను సాకారం చేసుకోవడం గగన కుసుమం. అయితే కేరళలో ఉన్న ఓ ఐలాండ్ మొత్తం మీకు సొంతమవుతుంది. అది కూడా కోట్లు, లక్షలు ఖర్చు చేయకుండానే. ఇలాంటి ఇక్కడ మీ భాగస్వామితో మీరు చుట్టూ ఉన్న ప్రకృతితో పాటు మీ భాగస్వామి అందాలను కూడా ఆస్వాధించవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు మొత్తం మీ కోసం...

రుషికేష్ లో ఇలా చేస్తే పాపపు కూపంలో పడుతారు...జాగ్రత్తరుషికేష్ లో ఇలా చేస్తే పాపపు కూపంలో పడుతారు...జాగ్రత్త

ఇక్కడి దేవత సర్పదోషం నివారించి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది....ఇక్కడి దేవత సర్పదోషం నివారించి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది....

1. అద్దెకే....

1. అద్దెకే....

Image Source:

కేరళలోని ఆ ఐలాండ్ పేరు వినిస్ ఐ ల్యాండ్. ఈ ద్వీపం ఒక రోజు మొత్తం మీకు అద్దెకు ఇస్తారు. ఆ అద్దె ఎంతో తెలుసా రూ.12వేలు మాత్రమే. మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా గడపడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తారు. చుట్టూ నీళ్లు మధ్యలో మనసుకు నచ్చిన వారితో మనం అన్న ఆలోచనే మనుసలో కొత్త కొత్త కోరికలను రేకెత్తిస్తోంది కాదా?

2.ఎక్కడ ఉంది

2.ఎక్కడ ఉంది

Image Source:

ఈ అద్భుత ద్వీపం కేరళోని కొల్లంకు దగ్గరగా ఉన్న మున్నార్ కు అత్యంత సమీపంగా ఉంటుంది. అయితే ఈ ద్వీపంలోకి నలుగురు కంటే ఎక్కువ మందికి ప్రవేశం నిషిద్ధం. అయినా కూడా ఈ ద్వీపంలో ఏకాంతంగా గడపడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు.

3. ఈ ఐడియా వచ్చింది ఎలా?

3. ఈ ఐడియా వచ్చింది ఎలా?

Image Source:

కేరళకు చెందిన అరమ్ పౌల్ అనే వ్యక్తి ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసి తన భార్య అయిన వినితకు పుట్టినరోజు కానుకగా అందజేస్తాడు. అయితే ఈ ద్వీపంలో ఇంటిని నిర్మించడానికి కొన్ని వందల మంది కష్టపడినట్టు సమాచారం. అటు పై ఈ ద్వీపాన్ని ఓ బిజినెస్ గా మలుచుకొని ఆ దంపతులు మన్నలను పొందుతున్నారు.

4. ఈ ద్వీపం లోపల ఏమేమున్నాయి.

4. ఈ ద్వీపం లోపల ఏమేమున్నాయి.

Image Source:

ఈ ద్వీపంలో ఒక ట్రీ హౌస్ ఉంటుంది. కనిష్టంగా ఒక జంట లేదా గరిష్టంగా నలుగురు వ్యక్తులకు ఈ ద్వీపంలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ఫిషింగ్, బోటింగ్ కు కూడా అవకాశం ఉంది. ఇక అతిథులుగా వచ్చిన వారికి అవసరమైన ఆహార పదార్థాలను వండి వడ్డించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు.

5. 2 ఎకరాల విస్తీర్ణంలో

5. 2 ఎకరాల విస్తీర్ణంలో

Image Source:

మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. ఇక్కడ రెండు పగలు, ఒక రాత్రికి ఈ ద్వీపాన్ని మనం అద్దెకు తీసుకోవచ్చు. అయితే మనకు రక్షణ ఇవ్వడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X