Search
  • Follow NativePlanet
Share
» »విశాఖపట్నం టు విజయవాడా వయా రాజమండ్రి, ఇవన్నీ మీకు ఆహ్వానం పలుకుతాయి.

విశాఖపట్నం టు విజయవాడా వయా రాజమండ్రి, ఇవన్నీ మీకు ఆహ్వానం పలుకుతాయి.

విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్యలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవాడ, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రం. గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని కలిగి ఉన్న ఈ నగరం, మహాభారత కాలం నాటి నుండి ఉన్నప్పటికీ, ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ యొక్క పట్టణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

ఏదేమైనప్పటికిని, అనేక పర్యాటక ప్రాంతాలు కలిగి ఉన్న ఈ నగరంలో, కొండల నుండి నది తీరాల వరకు, ద్వీపాల నుండి గుహలు, దేవాలయాలు మరియు తోటలు వరకు అన్నీ ఉన్నాయి. సందర్శకులను అలరించడానికి, వందలాది పర్యాటక ఆకర్షణలలో ఉన్న ఈ పట్టణ కేంద్రం గురించి మీకు కూడా తెలిసుకోవాలని ఉందా? విజయవాడలో ఒక నదికి సంబంధించిన మ్యూజియం ఉందని మీకు తెలుసా? దేశం మొత్తం మీద ఇటువంటి మ్యూజియం ఇదొక్కటే!

కనుక, ఈ వారాంతపు సెలవులో విశాఖపట్నం నుండి విజయవాడకు పయనమవ్వండి. విశాఖపట్నం నుండి విజయవాడకు ఎలా చేరుకోవాలో, అక్కడ ఏ ఏ ప్రదేశాలను చూడాలో తెలుసుకోవాలని అనుకుంటే, ఆలస్యం చేయకుండా చదివేయండి మరి! మార్గం: విశాఖపట్నం - రాజమండ్రి - విజయవాడ

రాజమండ్రి:

రాజమండ్రి:

P.C: You Tube

భారతదేశంలో ధార్మిక, చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన కొన్ని నగరాల్లో, రాజమండ్రి ఒకటి.అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర మరియు స్వభావంను తెలుసుకోదలచిన పర్యాటకులకు ఇది సరైన ప్రదేశం. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానిగా కూడా పిలవబడుతుంది. ఈ అందమైన మహానగరం యొక్క సరిహద్దులలో ప్రకృతి సహజ అందాల నుండి చారిత్రక స్మారక కట్టడాలు వరకు అన్నీ ఉన్నాయి. ధవళేశ్వరం బారేజ్, కాటన్ మ్యూజియం, గోదావరి నది తీరాలు మరియు కోటిలింగేశ్వర ఘాట్ దేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. రాజమండ్రి, విజయవాడ నుండి 160 కిలోమీటర్ల దూరంలో మరియు విశాఖపట్నం నుండి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తుది మజిలీ: విజయవాడ

తుది మజిలీ: విజయవాడ

P.C: You Tube

కృష్ణా నది తీరాన ప్రశాంత వాతావరణంలో నెలకొన్న విజయవాడ, విశాఖపట్నం నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి చేసే వారాంత విహారానికి ఇది సరైన మజిలీ. అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ,విజయవాడ మహానగరంలోని అందమైన ప్రధాన పర్యాటక ప్రాంతాల సమాచారం మీకోసం మేము అందివ్వబోతున్నాం. ఈ పర్యటన ద్వారా, మీరు భారతదేశం యొక్క చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ సౌందర్యం గురించి తెలుసుకునేందుకు మంచి అవకాశం ఉంది.

కనక దుర్గా ఆలయం:

కనక దుర్గా ఆలయం:

P.C: You Tube

కనక దుర్గ ఆలయం వేద కాలం నాటి నుండి ఉనికిలో ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే, ఈ ఆలయ చరిత్రకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం లేదు. ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇంద్రకీలద్రి పర్వతంపై కనక దుర్గ అమ్మవారు వెలసారు.ఈ కొండపై నుండి అందమైన విజయవాడను తనివితీరా చూడవచ్చు.ఇతిహాసాల ప్రకారం, ఆలయ ప్రాంగణ ప్రదేశంలోనే కనక దుర్గ అమ్మవారు, పట్టణ ప్రజలను కాదు ఇక్కట్ల పాలు చేస్తున్నందున, మహిషాసురుని సంహరించింది. ఈ ఆలయంలోనే అర్జునుడు శివుని పూజించాడని భక్తుల నమ్మకం. అందువల్ల, ఈ ఆలయం హిందువులకు ముఖ్యమైన పుణ్య స్థలం. ప్రతి సంవత్సరం కోట్ల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

ప్రకాశం బారేజ్:

ప్రకాశం బారేజ్:

P.C: You Tube

ప్రకాశం బారేజ్ కృష్ణ నదిపై 1957 వ సంవత్సరంలో నిర్మించబడింది. ఇక్కడ నదీ జలాల్లో బోటింగ్ చేయడంతో పాటుగా, ఎటువంటి కాలుష్యానికి లోనుకాని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రమించవచ్చు. దాని అందాలను మీ కెమెరాలో బంధించి, మీతో పాటు మోసుకువెళ్లవచ్చు. వనభోజనాలకు ప్రకాశం బారేజ్ సమీపంలోని ప్రదేశాలు అనువైనవి.

భవాని ద్వీపం:

భవాని ద్వీపం:

P.C: You Tube

133 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న భవాని ద్వీపం, భారతదేశంలోని అతిపెద్ద దీవులలో ఒకటి. ఇది కృష్ణ నదికి మధ్యలో ఉంది. మీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి ఇది తగిన ప్రదేశం. ఈ ద్వీపంలో రిసార్ట్ లు, పార్కులు మరియు మ్యూజియంలు ఉన్నాయి. విలక్షణంగా వారాంతం గడపడానికి ఈ ప్రదేశం తగినదా? కాదా?

గాంధీ హిల్:

గాంధీ హిల్:

P.C: You Tube

సుమారు 500 అడుగుల ఎత్తులో ఉన్న గాంధీ హిల్ పై జాతిపిత అయిన మహాత్మా గాంధీకి అంకితం చేసిన అందమైన స్మారక చిహ్నం ఉంది. ఇక్కడ ఉన్న లైబ్రరీ నుండి ప్లానెటోరియం వరకు, అన్నింటిలో ప్రతి దిక్కున, మహాత్మా గాంధీని మరియు అతని విజయాలను గురించిన సమాచారం పర్యాటకులకు లభిస్తుంది.

నది మ్యూజియం:

నది మ్యూజియం:

P.C: You Tube

దేశంలో ఈ రకమైన మ్యూజియం ఇదొక్కటే!కృష్ణవేణి మండపంగా పిలువబడే ఈ మ్యూజియంలో, మీరు కృష్ణ నది యొక్క చరిత్ర గురించి వివరంగా తెలుసుకోవచ్చు. దాని పుట్టుక నుండి మత ప్రాముఖ్యత వరకు అన్నింటికీ సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంటుంది. ఈ మ్యూజియం ద్వారా కృష్ణమ్మకు కృతజ్ఞతలు తెలిపితే ఎలా ఉంటుంది?

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

P.C: You Tube

7 వ శతాబ్దం నాటి ఉండవల్లి గుహలు, ఆంధ్రప్రదేశ్ లోని అతి పురాతన రాతి కట్టడాలు. బౌద్ధ సన్యాసులు వీటిని ధ్యాన కేంద్రాలుగా మరియు నివాసాలుగా ఉపయోగించుకునేవారు. మీరు చరిత్రను ప్రేమించేవారు అయితే కనుక, ఈ అద్భుతమైన పురాతన గుహలను సందర్శించడం మరువరాదు.

విశాఖపట్నం

విశాఖపట్నం

P.C: You Tube

ఆకాశ మార్గ ప్రయాణం: మహానగరం అవ్వటం చేత, భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతో వాయుమార్గం ద్వారా విజయవాడకు అనుసంధానం ఉన్నాయి. అందువల్ల విశాఖపట్నం నుండి విజయవాడకు నేరుగా విమానంలో చేరుకోవచ్చు. విశాఖపట్నం నుండి విజయవాడ విమానాశ్రయం చేరుకోవడానికి సుమారుగా 1 గంట సమయం పడుతుంది.

రైలు మార్గం ద్వారా ప్రయాణం: విజయవాడకు విశాఖపట్నం నుండి అనేక రైళ్లు నడుస్తున్నందున, పర్యాటకులకు రైలు ప్రయాణం అత్యుత్తమమైనది. మీరు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి విజయవాడ రైల్వే స్టేషన్ కు నేరుగా ఒకటే రైలులో ప్రయాణించవచ్చు.

రహదారి మార్గ ప్రయాణం: రహదారి మార్గం ద్వారా విజయవాడకు సులభంగా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X