Search
  • Follow NativePlanet
Share
» »విశాఖపట్నం - పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా !

విశాఖపట్నం - పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా !

విశాఖపట్నం - పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

విశాఖపట్నం ను వైజాగ్ అని కూడా అంటారు. ఈ పట్టణం పరిశ్రమల పట్టణంగా పేరు పడింది. అయితే, ఇక్కడ మీరు పరిశ్రమలే కాక ప్రసిద్ధి చెందినా పర్యాటక ఆకర్షణలు కూడా చూడవచ్చు. విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ లో రెండవ అతి పెద్ద నగరం. ఈ పట్టణంలో కల అందమైన బీచ్ లు, చుట్టుపట్ల కల హిల్ స్టేషన్ లు, ఆహ్లాదం కలిగించే కోస్తా తీరం వంటివి పర్యాటకులను ఆకర్షిస్తాయి. విశాఖపట్నం వచ్చేవారు బొర్రా గుహలు తప్పక చూడాలి. ఈ గుహలు దేశంలోనే అతి పొడవైన గుహలు గా చెప్పబడతాయి.

విశాఖపట్నం లో అందమైన బీచ్ లే కాక కొన్ని బౌద్ధ మత నిర్మాణాల శిధిలాలు కూడా కలవు. కైలాస గిరి లోని శివ భగవానుడు, మాత పార్వతి ల శిల్పాలు అద్భుత సౌందర్యాలను చూపిస్తాయి. స్థానికుల ఆహారాలు అద్భుత రుచులు కలిగి వుంటాయి. వీటిని తినే ముందు తప్పక ఒక బాటిల్ నీరు పక్కన వుంచుకోనండి.

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

అరకు వాలీ అరకు వాలీ తూర్పు కనుమలలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 600 నుండి 900 మీ. ల ఎత్తున కల ఈ పర్వత శ్రేణులు అనేక అందమైన లోయలు, జలపాతాలు కలిగి వున్నాయి. ఈ ప్రదేశ చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకు అనువైనది. ఈ ప్రాంతంలో సుమారు 17 స్థానిక తెగల సొసైటీ లు కలవు. ఇటిక పొంగల్ అనే పండుగను అతి వైభవంగా నిర్వహిస్తారు.

Photo Courtesy: roadconnoisseur

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

బొర్రా గుహలు
బొర్రా గుహలు అనంతగిరి పర్వత శ్రేణులలో కల అరకు లోయలో కలవు. ఈ గుహలు ఇండియా లోనే అతి పెద్దవైన గుహలుగా చెప్పబడతాయి. గుహలో ఒక చిన్న గుడి కలదు. ఈ గుహలు చాలావరకు గబ్బిలాలకు నిలయంగా వుంటాయి. Photo Courtesy: V.v

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

రిషికొండ బీచ్
రిషి కొండ బీచ్ లో కల స్వర్ణ రంగు ఇసుక, బలమైన అలల తాకిడి ఈ ప్రదేశాన్ని చక్కటి విశ్రాంతి ప్రదేశం గాను, ఇతర నీటి క్రీడలకు అనువైనదిగా చేసాయి. బీచ్ లో విశ్రాంతి లేదా స్విమ్మింగ్, వాటర్ స్క్యింగ్ , విండ్ సర్ఫింగ్ వంటివి ఆచరించవచ్చు. Photo Courtesy: Rajib Ghosh

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

బావికొండ
బావికొండ అనే బౌద్ధ వారసత్వ ప్రదేశం సంకరం గ్రామం లో కలదు. బౌద్ధుల మత ప్రభావాలు చూపే ఈ ప్రదేశం తవ్వకాలలో వెల్లడి అయింది. ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు వివిధ భంగిమలలో వుంటాయి. నేటికి ఇవి శిదిలమైనప్పటికి, ఆకర్షణ కలిగి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. Photo tesy: Adityamadhav83

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పావురాల కొండ
పావురాలకొండ నుండి అందమైన కోస్తా తీరం విహంగ వీక్షణం చేయవచ్చు. ఇక్కడ కల రాళ్ళపై అనేక బౌద్ధ శాసనాలు, ఇతర మట్టి కుండల చిత్రాలు వుంటాయి. పురాతన కాల జీవనం కు ఇవి సాక్ష్యాలుగా వుంటాయి. ఇక్కడ 16 పెద్ద గోతులు కలవు. ఇవి పురాతన కాలంలో వర్షపు నీటిని నిలువ చేసేందుకు వినియోగించే వారు. Photo Courtesy: Adityamadhav83

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

వార్ మెమోరియల్
ఈ వార్ మెమోరియల్ ను సముద్ర విజయం అని పిలుస్తారు. ఇది రామకృష్ణ పార్క్ వద్ద కలదు. దీనిని 1971 లో జరిగిన ఇండో - పాక్ యుద్ధ మృత వీరుల జ్ఞాపకార్ధం నిర్మించారు. ఇది ఇండియా గెట్ లోని అమర్ జవాన్ జ్యోతి ని పోలిన ఒక అందమైన టవర్. Photo Courtesy: Adityamadhav83

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

డాల్ఫిన్స్ నోస్
విశాఖపట్నంలో ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. డాల్ఫిన్స్ నోస్ అంటే డాల్ఫిన్ ముక్కు వాలే వుండే ఒక రాయి అక్కడ వున్నా కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ నుండి విశాఖ పతన నగర అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. సముద్రంలోని నౌకలకు దిశా మార్గం చూపుతూ ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా కలదు. Photo Courtesy: Thangaraj Kumaravel

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

కంబాలకొండ వైల్డ్ లైఫ్ సంక్చురి
కంబాల కొండ వైల్డ్ లైఫ్ సాన్క్చురి వివిధ రకాల మొక్కలు , జంతువులకు సహజ నివాసంగా కలదు. సమీపంలో కల ఎదే పేరు కల పర్వత శ్రేణుల పేరుతో ఈ అభాయారన్యానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ మీరు నాగు పాములు, నక్కలు, చిరుతలు మొదలైన జంతువులు చూడవచ్చు. Photo Courtesy: Adityamadhav83

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

పరిశ్రమలే కాదు పర్యాటక ప్రసిద్ధి కూడా!

కైలాస గిరి
కైలాస గిరి ఒక చిన్న హిల్ స్టేషన్. ఇక్కడ నుండి మీరు అందమైన బీచ్ మరియు , కొండ ప్రాంతాలు చూడవచ్చు. కైలాస అంటే శివ పార్వతుల నివాస పర్వతం. కనుక ఇక్కడ శివ పార్వతుల అందమైన శిల్పాలు కూడా కలవు. సందర్శకులు ఇక్కడ కల రోప్ వే మరియు టాయ్ ట్రైన్ ప్రయాణాలు ఆనందించవచ్చు. Photo Courtesy: Ph Basumata

వైజాగ్ ఇతర ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X