Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటకలో సర్వలోకైకనాధుడు శ్రీ మహావిష్ణువు ఆలయాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

కర్ణాటకలో సర్వలోకైకనాధుడు శ్రీ మహావిష్ణువు ఆలయాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

ప్రతీ హిందూ దేవాలయం తనకంటూ ఏదో ప్రత్యేకతను చాటుకుంటూ వున్నాయి.మనస్సుకు, ప్రశాంతతను, ఆధ్యాత్మికతను కలిగించే ఆలయాలు. మరిఅంతేనా ఎవ్వరికి అంతుపట్టని,అంతు చిక్కని ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి.

PC- Bikashrd

ప్రతీ హిందూ దేవాలయం తనకంటూ ఏదో ప్రత్యేకతను చాటుకుంటూ వున్నాయి.మనస్సుకు, ప్రశాంతతను, ఆధ్యాత్మికతను కలిగించే ఆలయాలు. మరిఅంతేనా ఎవ్వరికి అంతుపట్టని,అంతు చిక్కని ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి.నేటికీ వైజ్ఞానికశాస్త్రవేత్తలకుకూడా ఒక సవాల్ గా నిలుస్తున్నాయి.సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధిని సాధించామని గొప్పలుపోతున్న నేటి మానవుడికినాటి కాలం నాటి అద్భుతాలు చిక్కు వీడని ప్రశ్నలులాగే మిగిలిపోతున్నాయి. ఎన్నో వేల సంల క్రిందనిర్మించిన ఆలయాలు నేటికీ సైంటిఫిక్ గా తేల్చలేని ఎన్నో రహస్యాలను కలిగియున్నాయి. కొన్ని ఆలయాలలో విగ్రహనిర్మాణం, మరి కొన్ని ఆలయాలలో ఆ నిర్మాణమే అనేది ఎంతో అద్భుతంగా అందర్నీ ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయి.మరి అలాంటి ఆలయాలల్లో ఒకటి విష్ణు దేవాలయాలు.

హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకడు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాధుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు. యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.

భారతదేశంలోనే ఒక గొప్ప ' ఆలయాలనిలయంగా ' పేరుగాంచింది. ఎంతో ఆహ్లాద కరమైన ప్రకృతి, వాతావరణం , కలిగిన బెంగుళూరులోని దేవాలయాలను , ప్రకృతిలోని వింతలను , సుందర దృశ్యా లను వీక్షించను ప్రపంచంలోని ఎన్నోప్రదేశాలనుండి జనం వస్తుంటారు.బెంగుళూరు లోని ఆలయాల ,శిల్పసంపద పురాతన భారతీయ సంస్కృ తి ని , ఆధ్యాత్మికతను , ఆదర్శవంతమైన చరిత్రను చాటిచె ప్తుండటం విశేషం. ఈ పురా త న ఆలయాలలోని రాతిస్థంభాలలో చెక్కిన నగిషీలు , గోడలపైచెక్కిన అద్భుత దృశ్య ములు , సుందరమైన బొమ్మలు, మరెచ్చటనూ కాంచలేని శోభాయమానము లై న ద్వారములు , సందర్శకుల మనస్సులను దోచుకుంటాయి. బెంగుళూరులోని అత్యధిక దేవాలయాలు విష్ణుమూర్తి , ఈశ్వరునిఆలయాలే!మరి కర్ణాటకలో వెలసిన అద్భుతమైన విష్ణు దేవాలయాల గురించి తెలుసుకుందాం

చలువరాయస్వామి ఆలయం:మేల్కొటే

చలువరాయస్వామి ఆలయం:మేల్కొటే

మేల్కొటే, మండ్య నుండి 38 కి.మీ ల దూరంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడున్న చలువరాయస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. మైసూర్ పాలకులు ఇక్కడి దైవానికి ఎన్నో ఆభరణాలను సమర్పించారు. రామానుజాచార్యులు ఇక్కడ కొన్ని సంవత్సరాలు జీవించినట్లు చెబుతారు. టిప్పుసుల్తాన్ ఏనుగులను కానుకగా ఇచ్చాడని అంటారు.

PC-Prathyush Thomas

రంగనాథ స్వామి ఆలయం

రంగనాథ స్వామి ఆలయం

మండ్య నుండి 27 కి. మీ ల దూరంలో శ్రీరంగపట్నం కలదు. ఇక్కడ దేశంలోనే ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి ఆలయం కలదు. రంగనాథ స్వామిని విష్ణువు అవతారంగా భావించి కొలుస్తారు. ఆలయ నిర్మాణం విజయనగర శైలిని పోలి ఉంటుంది. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం ఓ గొప్ప సామ్రాజ్యానికి చెందిన చారిత్రక గత వైభవాన్నీ, వేలాది సంవత్సరాలనాటి ఓ నాగరికతనూ చాటి చెబుతుంది. పల్లవరాజుల పాలన మతపరమైన ఓ గట్టి పునాది ఏర్పరడానికి ప్రతీకగా నిలుస్తోంది, ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి కర్ణాట ప్రాంతంలో ఆర్య సంస్థల వృద్ధికి ఈ సామ్రాజ్యం గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్టు కనిపిస్తుంది. కోరమండల్ తీరాన్నీ, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్నీ మూడు వందల ఏళ్ళకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్థిల్లేందుకు దోహదపడ్డారు

PC-Adam Jones

చెన్నకేశవ ఆలయం:బేలూర్

చెన్నకేశవ ఆలయం:బేలూర్

బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశము. అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్ జిల్లా లో బెంగుళూర్ నుండి కేవలం 220 కి. మీ. ల దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు. దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయల వలన దీనిని అందరు 'దక్షిణ కాశి' అంటారు.
బేలూర్ లో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయం. విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎత్తు ఎంతొ ప్రసిద్ధి చెందినది . ఈ ఆలయం లోని రక రకాల శిల్పాలు ఎంతొ సజీవంగా ఉన్నాయా అన్నంత బాగుంటాయి. ఆలయం దక్షిణ భారత నిర్మాణ శైలి లోని అందానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సంక్లిష్టమైన కట్టడం నిర్మించడానికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలం పట్టింది.బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినది. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.
చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల విష్ణువర్ధనుడు కట్టించాడు. పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆలయం వరండ లోపల అనేక ఇతర ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి. ఈ దేవాలయలోని అనేక శిల్పాలలో అనేక రకాలైన ఆభరణాలు, పైకప్పులు, జంతువులు, పక్షులు, ద్వారాలు మరియు అనేక రకాలైన ఇతర చిత్రాలను చూడవచ్చును.

PC-Mashalti

విఠల దేవాలయం: హంపి

విఠల దేవాలయం: హంపి

హంపికి ఈశాన్య భాగంలో అనెగొంది గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. మహావిష్ణువును విఠల రూపంలో కొలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రాతి రథం భారతీయ శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. వారంలో అన్ని రోజులూ ఈ దేవాలయం అందుబాటులో ఉంటుంది. ఈ దేవాలయం చూడటానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు.ఈ దేవాలయంలోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి. భారతీయ వాస్తు, శిల్పకళకు ఈ దేవాలయం అద్దం పడుతోంది. తుంగభద్ర నది ఒడ్డునే కల ఈ దేవాలయంలో స్వప్తస్వరాలను అందించే మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న దైవాన్ని చూడటం కంటే ఈ మ్యూజికల్ పిల్లర్స్ ఉన్న దేవాలయాన్ని చూడటానికే ఎక్కువ మంది వస్తుంటారు.

అనంత శయన టెంపుల్: కర్కల

అనంత శయన టెంపుల్: కర్కల

కర్ణాటక లో ఉడిపి జిల్లాలోని కర్కల అనే చిన్న పట్టణం చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్య౦ వున్న ప్రదేశం. చూసి తీరవలసిన సాంస్కృతిక వైభవం గల ప్రదేశం కార్కల జైన రాజులు పరిపాలించిన 10 వ శతాబ్దపు చారిత్రిక మూలాలు కలిగిన ప్రదేశంగా గుర్తించబడింది. ఆ సమయంలో ఉన్న పాలకులు అనేక జైన బసదిలు, దేవాలయాలను నిర్మించారు. ఈ నిర్మాణాలు ఈరోజు పాత చరిత్ర తెలుసుకోవాలని వచ్చే యాత్రికులను ఆకర్షిస్తున్నాయి.

PC-Shivanayak

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X