Search
  • Follow NativePlanet
Share
» »ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.

ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.

అమరావతిలోని అమర లింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

హిందూ సంస్కృతిలో దైవారాదన ఒక భాగం. కొంతమంది విష్ణువును పూజించి వైష్ణవులుగా గుర్తించబడితే మరికొంతమంది తాము శైవులుగా పేర్కొంటూ ఈ శిదుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడు సాధారణంగా లింగ రూపంలో కొలువై ఉంటాడు. ఇటువింటి లింగరూపంలో కొలువై ఉన్న ఐదు పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. వాటిని పంచారామాలు అంటారు. అందులో అమరారామం ఒకటి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పట్టణంలో ఉన్న ఈ దేవాలయం అత్యంత విశిష్టమైనది. ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల సమస్త పాపాలు తొలిగిపోతాయని చెబుతారు. ఈ నేపథ్యంలో ఆ అమరారామం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?

వరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాంవరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాం

అమరావతి, ఆంధ్రప్రదేశ్

అమరావతి, ఆంధ్రప్రదేశ్

P.C: You Tube

మందరగిరిని వాసుకి సర్పంతో సముద్ర మధనం చేసిన తర్వాత అమృతం పుట్టుకువస్తుంది. విష్ణువు మోహినీ రూపం ధరించి ఆ అమృతాన్ని దేవతలకు, రాక్షసులకు పంచుతాడు.

కొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామికొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామి

అమృతం

అమృతం

P.C: You Tube

అయితే తమకు ఆ అమృతం సరిగా అందలేదని కొంతమంది రాక్షసులు కోపం తెచ్చుకొని ఆ పరమశివుడి గురించి ఘోర తపస్సుచేసి అనేక వరాలను పొందుతారు.

ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.

తారకాసురుడు

తారకాసురుడు

P.C: You Tube

అలా తపస్సు చేసిన రాక్షసుల్లో తారకాసుడు ఒకడు. తారకాసుడు శివుడి గురించి ఘెర తపస్సుచేసి ఒక అమృత లింగాన్ని పొందుతాడు.

అమృత లింగం

అమృత లింగం

P.C: You Tube

ఎల్లప్పుడూ ఆ లింగం తన మెడలోనే ఉండేలా జాగ్రత్తలు కూడా తీసుకొంటాడు. దీంతో ఎవరు కూడా ఆ తారకాసురుడిని జయించలేకపోతాడు.

పరమశివుడి వద్దకు

పరమశివుడి వద్దకు

P.C: You Tube

దీంతో తారకాసుడు మరింత రెచ్చిపోయి బుుషులను, యక్షులను హింసిస్తూ ఉంటాడు. దీంతో బుుషులు, దేవతలు ఆ పరమశివుడి వద్దకు వెళ్లి తమ బాధలను చెప్పుకొంగటాడు.

కుమారస్వామిని

కుమారస్వామిని

P.C: You Tube

దీంతో పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామిని ఆ తారకాసురుడిని సంహరించాల్సిందిగా సూచిస్తాడు. దీంతో తారకాసురుడికి కుమారస్వామికి మధ్య ఘెరమైన యుద్దం జరుగుతుంది.

ఐదు ముక్కలు

ఐదు ముక్కలు

P.C: You Tube

దీంతో కుమారస్వామి మొదట ఆ తారకాసుడి మెడలో ఉన్న అమృత లింగాన్ని తన ఆయుధంతో ఐదు ముక్కలు చేస్తాడు. ఆ ఐదు ముక్కలు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావరిల్లో ఐదు పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతాయి.

ఐదు చోట్ల

ఐదు చోట్ల

P.C: You Tube

అందులో ఒకటి పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి కాగా, రెండో క్షేత్రంఅమరలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది అమరావతిలో ఉంది.

అవే పంచరామాలు

అవే పంచరామాలు

P.C: You Tube

ఇక మూడో క్షేత్రం భీమవరంలోని సోమేశ్వర స్వామి దేవాలయం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరస్వామి ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం.

అంతకంతకూ పెరిగి పోతుంది

అంతకంతకూ పెరిగి పోతుంది

P.C: You Tube

ఇక అమరావతిలో పడిన అమృత లింగం ముక్క అంతకంతకు పెరిగిపోతూ ఉంది. దీంతో ఇంద్రుడు ఆ శివలింగం పెరగకుండా అగ్రభాగాన ఒక చిన్న మేకును కొట్టాడని చెబుతరు.

రక్తం మరకలు

రక్తం మరకలు

P.C: You Tube

అందుకు గుర్తుగా అప్పుడు కారిన రక్తం ధారను ఇప్పటికీ మనం లింగం పై చూడటానికి వీలవుతుంది. ఇక ఇక్కడ ఉన్న పరమేశ్వరుడిని అమరలింగేశ్వర స్వామి అని అంటారు.

ఇంద్రుడు ప్రతిష్టించినట్లు

ఇంద్రుడు ప్రతిష్టించినట్లు

P.C: You Tube

ఈ అమరావతి క్షేత్రం క`ష్ణానదీ తీరంలో ఉంది. పురాణాల్లో క్రౌంచ తీర్థంగా పేర్కొనబడింది. మరికొన్నిచోట్ల సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించినట్లు చెబుతారు.

దేవతల గురువు

దేవతల గురువు

P.C: You Tube

దేవతల గురువు బ`హస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్టించడం వల్ల అమరుల నివాస ప్రాంతంగా మరింది. అందువల్లే ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని చెబుతారు.

15 అడుగులు

15 అడుగులు

P.C: You Tube

ఇక్కడి గర్భగుడిలో 15 అడుగుల ఎత్తైన శివలింగాన్ని మనం చూడవచ్చు. ఇది దంతం రంగులో ఉంటుంది. ప్రతి ఏటా విజయదశమి రోజున, మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి వైభవంగా కళ్యాణోత్సవం జరుపుతారు.

అతీతుడు

అతీతుడు

P.C: You Tube

చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకొంటున్నాడు. ఇక్కడ స్వామివారు త్రిగుణాలకు అతీతుడనే భావాన్ని అవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంది.

మొదటి ప్రకారంలో

మొదటి ప్రకారంలో

P.C: You Tube

మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు కాలభైరవుడు, కుమారస్వామి, ఆంజనేయస్వామి ఉంటారు. ధ్వజస్తంభం దగ్గర సూర్య భగవానుడు ప్రతిష్టితమై ఉన్నాడు.

పునరుద్ధరణ పనులు

పునరుద్ధరణ పనులు

P.C: You Tube

ఇదిలా ఉండగా క్రీస్తుశకం 1980లో జరిగిన పుష్కరాల సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్న విశాలమైన ఆలయద్వారం ఎత్తైన గాలి గోపురం గతంలో చిన్న ద్వారం చిన్న గాలిగోపురంగా ఉండేవి.

నంది

నంది

P.C: You Tube

మొత్తం కూల్చివేసి కొత్త నిర్మాణం కొరకు పునాదులు తీయబడ్డాయి. ఆ తవ్వకాల్లో బౌద్ధ సంస్క`తికి చెందిన అనేక పాలరాతి శిల్పాలు కనిపించాయి. ప్రస్తుతం మ్యూజియంలో కనిపిస్తున్న నంది ఈ త్వకాల్లో లభించిందే.

ఇలా వెళ్లవచ్చు.

ఇలా వెళ్లవచ్చు.

P.C: You Tube

విజయవాడ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ అమరావతి క్షేత్రం ఉంది. అదే విధంగా 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుంచి కూడా ఇక్కడికి నేరుగా బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

విజయవాడలో

విజయవాడలో

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ విజయవాడ నుంచి అమరావతికి బోటు ప్రయణ సౌకర్యం కల్పించినా అది వర్షాకాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమరావతికి దగ్గర్లో అంటే విజయవాడలో విమానాశ్రయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X